Latest

మహాధర్నాకు బయలుదేరిన ఉద్యోగులు
Local· 6d ago

మహాధర్నాకు బయలుదేరిన ఉద్యోగులు

TG: వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన పీఆర్‌టీయూ నాయకులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌లో మహాధర్నా నిర్వహించనున్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌)ను అమలు చేయాలని, ఉద్యోగులకు పీఆర్సీని వెంటనే అమలు చేయడంతో పాటు హెల్త్‌ కార్డులు అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో ఇవాళ మహాధర్నా జరగనుంది. నర్సంపేట నుంచి పీఆర్‌టీయూ సభ్యులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లి ఆందోళనలో పాల్గొననున్నారు.

చేపల వేట విషాదం.. మత్స్యకారుడు మృతి
Local· 6d ago

చేపల వేట విషాదం.. మత్స్యకారుడు మృతి

AP: శ్రీకాకుళం జిల్లా మందస మండలం దున్నూరు పంచాయతీ గడ్డ ఊరు సముద్ర తీరంలో చేపల వేట విషాదంగా మారింది. మంగళవారం చేపల వేటకు వెళ్లిన వంక యాదవరావు (55) ప్రయాణిస్తున్న తెప్ప ఒక్కసారిగా బోల్తా పడటంతో సముద్రంలో మునిగి మృతి చెందారు. ఆయనతో పాటు మరో ముగ్గురు మత్స్యకారులు కూడా సముద్రంలో పడిపోగా సురక్షితంగా బయటపడ్డారు. అయితే యాదవరావు తెప్ప కింద చిక్కుకోవడంతో స్థానికులు తీవ్రంగా శ్రమించి ఆయనను ఒడ్డుకు తీసుకొచ్చారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

కూతుళ్ల చదువు కోసం.. అమ్మ మారథాన్‌లో గెలిచింది!
Motivational· 6d ago

కూతుళ్ల చదువు కోసం.. అమ్మ మారథాన్‌లో గెలిచింది!

మహారాష్ట్ర బీడ్ జిల్లాలోని అంబాజోగైకి చెందిన రమాబాయి రణ్‌వీర్ (47) మారథాన్‌లో సత్తా చాటారు. చీరలో, ముందుగా చెప్పులతో రేసులో పాల్గొన్న ఆమె.. చెప్పులు జారిపోవడంతో చేతిలో పట్టుకుని బేర్‌ఫుట్‌గా పరుగెత్తారు. స్పోర్ట్స్ షూస్‌తో బరిలోకి దిగిన యూత్‌ను క్రాస్ చేసి ఫస్ట్ ప్లేస్ సాధించారు. ‘అమృత్ దౌడ్’లో గెలిచిన ఆమె రూ. 3వేల ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీ కూడా గెలుచుకున్నారు. ఈ మొత్తాన్ని తన ఇద్దరు కూతుళ్ళ చదువులకు ఖర్చు చేయనున్నారు. ఆర్థిక కష్టాలున్నా పిల్లలకు మంచి చదువు చెప్పాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు.

దాచేపల్లిలో టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలోకి కీలక నేత
Local· 6d ago

దాచేపల్లిలో టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలోకి కీలక నేత

AP: పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ 20వ వార్డులో టీడీపీ నాయకుడు ముశ్యాం శ్రీనివాసరావు వైసీపీలో చేరారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శ్రీనివాసరావుకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాబోయే 2029 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించేందుకు కృషి చేస్తానన్నారు. కాసు మహేష్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పనిచేస్తానని తెలిపారు.

కెరీర్ కోసమే మెన్ ఫ్రెండ్‌షిప్స్?!
Current Affairs· 6d ago

కెరీర్ కోసమే మెన్ ఫ్రెండ్‌షిప్స్?!

European, US అకాడెమిక్స్ నిర్వహించిన 'సోషల్ నెట్‌వర్క్స్' జర్నల్ స్టడీ ప్రకారం ఆఫీసుల్లో మెన్, విమెన్ ఫ్రెండ్‌షిప్స్ చేసుకునే విధానం వేరుగా ఉంటుంది. విమెన్ తమ కొలీగ్స్ ఫ్రెండ్స్‌తో కూడా ఈజీగా కనెక్ట్ అవుతూ డీప్ రిలేషన్స్ బిల్డ్ చేసుకుంటారు. కానీ మెన్ మాత్రం కెరీర్ గ్రోత్‌కి హెల్ప్ అయ్యే సెలెక్టివ్ వన్-టు-వన్ ఫ్రెండ్‌షిప్స్‌కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారట. ఆఫీసులో మంచి ఫ్రెండ్స్ ఉన్న ఎంప్లాయీస్ చాలా హ్యాపీగా, ప్రొడక్టివ్‌గా ఉంటారని, వాళ్లు జాబ్ మారే ఛాన్స్ కూడా తక్కువగా ఉంటుందని ఈ రీసెర్చ్ చెప్తోంది.

వరంగల్ కమిషనరేట్‌లో 22 మంది సీఐల బదిలీలు
Local· 6d ago

వరంగల్ కమిషనరేట్‌లో 22 మంది సీఐల బదిలీలు

TG: వరంగల్ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 22 మంది సీఐలకు బదిలీలు, కొత్త పోస్టింగ్లు కల్పిస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ జిల్లాతో పాటు కమిషనరేట్‌ పరిధిలోని పలు ప్రాంతాలకు అధికారులను కేటాయించారు. ఎస్. శ్రీనివాస్‌ను స్టేషన్‌ఘన్‌పూర్‌, జి. వేణును రఘునాథపల్లి, పి. దేవేందర్‌ను నర్మెట్ట, భరత్‌ సుమన్‌ను పాలకుర్తి, ఎ. ప్రవీణ్‌కుమార్‌ను పరకాల, అనుముల శ్రీనివాస్‌ను ధర్మసాగర్‌, జి. బాబులాల్‌ను ఆత్మకూర్‌, ఆర్. సంతోష్‌ను పర్వతగిరి, కె. శ్రీనును ఎల్కతుర్తి సీఐలుగా నియమించారు.

మహిళలు గడప దాటితే వినాశనమా?!
National· 6d ago

మహిళలు గడప దాటితే వినాశనమా?!

కేరళం ఇస్లామిక్ మతపెద్ద అబూబకర్ ముస్లియార్ మహిళలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. మహిళలు ఇళ్లకే పరిమితం కావాలని, వారు గడప దాటి బహిరంగ వేదికలు ఎక్కితే మహా వినాశనానికి దారితీస్తుందని కొచ్చి సదస్సులో అన్నారు. ఖురాన్ కూడా ఇదే చెబుతోందని, అందుకే ఇస్లాంలో పరదా సంస్కృతి ఉందంటూ సమస్త కేరళ జమియ్యతుల్ ఉలామా జనరల్ సెక్రటరీ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్‌పై కేరళం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి బిందు కృష్ణ, CPM లీడర్ పీకే శ్రీమతి తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఆ చీకటి రోజులు పోయాయని కౌంటర్ ఇచ్చారు.

గురజాలలో పత్తి పంటలకు నీటి కష్టం
Local· 6d ago

గురజాలలో పత్తి పంటలకు నీటి కష్టం

AP: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో వర్షాలు లేక, భూగర్భ జలాలు అడుగంటడంతో పత్తి పంటలు ఎండిపోతున్నాయి. లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతులు పంటలు చేతికందే పరిస్థితి లేక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వర్షపాత లోటుతో వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింటోందని రైతులు వాపోతున్నారు. పత్తి పంటలను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించి నాగార్జునసాగర్‌ నుంచి కొంతమేర సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

పల్లె నిద్రతో గ్రామ సమస్యలపై దృష్టి : SP
Local· 6d ago

పల్లె నిద్రతో గ్రామ సమస్యలపై దృష్టి : SP

AP: శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న “మెగా పల్లెనిద్ర” కార్యక్రమంలో భాగంగా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి కళింగపట్నం గ్రామాన్ని సందర్శించారు. సోమవారం రాత్రి గ్రామస్థులతో సమావేశమైన ఎస్పీ సీసీ కెమెరాల ఏర్పాటు, ట్రాఫిక్ సమస్యలు, మాదక ద్రవ్యాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణపై చర్చించారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకంగా పనిచేస్తాయని తెలిపారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

తుక్కుగూడలో నర్సు హత్య.. నిందితుడు అరెస్ట్
Local· 6d ago

తుక్కుగూడలో నర్సు హత్య.. నిందితుడు అరెస్ట్

TG: రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నర్సు హత్య కేసును పోలీసులు ఛేదించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన 21 ఏళ్ల యువతి తుక్కుగూడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తూ, ఆస్పత్రి సమీపంలోని క్వార్టర్స్‌లో నివసిస్తోంది. లైంగిక దాడికి ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించడంతో నిందితుడు దాడి చేసి గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం పరారైన బిహార్‌కు చెందిన మహ్మద్‌ సనావుల్లా ఖాన్‌ను అరెస్ట్‌ చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌, సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించినట్లు అధికారులు వెల్లడించారు.

ఓటర్ల జాబితాలో తప్పులుంటే వెంటనే చెప్పండి
Local· 6d ago

ఓటర్ల జాబితాలో తప్పులుంటే వెంటనే చెప్పండి

AP: పల్నాడు జిల్లా గురజాలలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియపై తహసీల్దార్ కుటుంబరావు ప్రజలకు కీలక సూచనలు చేశారు. ప్రతి ఓటరు బాధ్యతగా వ్యవహరించి బూత్‌ లెవెల్‌ అధికారులకు సహకరించాలని కోరారు. బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు, అవసరమైన పత్రాలను పరిశీలిస్తున్నందున ప్రజలు పూర్తి సహకారం అందించాలని సూచించారు. జాబితాలో పేరు, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలను పరిశీలించుకుని తప్పులు ఉంటే వెంటనే బీఎల్‌వోలకు తెలియజేయాలని తెలిపారు.

22 మంది మహిళల జీవితాలు మార్చిన RDT!
AP· 6d ago

22 మంది మహిళల జీవితాలు మార్చిన RDT!

అనంతపూర్ RDT ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్న ఆటో డ్రైవింగ్ ప్రోగ్రామ్ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు చెందిన 22 మంది మహిళలు విజయవంతంగా డ్రైవింగ్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని సొంతంగా ఆటోలు అందుకున్నారు. ఇప్పటివరకు 45 మంది సింగిల్ మదర్స్ కి ఈ ప్రోగ్రామ్ సపోర్ట్ ఇచ్చి వాళ్లలో కాన్ఫిడెన్స్ పెంచింది. మహిళలకు డ్రైవింగ్ తో పాటు సెల్ఫ్ డిఫెన్స్, రోడ్ సేఫ్టీ, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, కౌన్సెలింగ్ లో స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్లకి Financial Independence, కొత్త లైవ్లీహుడ్ అవకాశాలు కల్పించారు.

పోలీస్‌, విద్యుత్‌, పెన్షన్‌ సమస్యలపై ఫిర్యాదులు
Local· 6d ago

పోలీస్‌, విద్యుత్‌, పెన్షన్‌ సమస్యలపై ఫిర్యాదులు

TG: మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణికి నాలుగు దరఖాస్తులు అందాయి. ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి వివిధ గ్రామాల నుంచి ప్రజలు హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక ఎంపీడీవో ఉమర్‌ షరీఫ్‌ మాట్లాడుతూ.. ప్రజల నుంచి మొత్తం నాలుగు దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. పోలీస్‌, విద్యుత్‌, పెన్షన్‌ తదితర సమస్యలకు సంబంధించి ఒక్కో దరఖాస్తు అందినట్లు పేర్కొన్నారు.

మోదీ మరో Insta వీడియో, ఏం చెప్పారంటే..
National· 6d ago

మోదీ మరో Insta వీడియో, ఏం చెప్పారంటే..

భారత ఆర్థిక వ్యవస్థ 7.8% GDP గ్రోత్ సాధించడంపై PM మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, సప్లై చైన్ సమస్యలు, ఆర్థిక సంక్షోభాలు ఉన్నప్పటికీ భారత్ ఈ స్థాయిలో ప్రగతి సాధించడం మన కాన్ఫిడెన్స్‌కి నిదర్శనమని అన్నారు. 'ఆత్మనిర్భర్ భారత్', 'మేక్ ఇన్ ఇండియా', 'వోకల్ ఫర్ లోకల్' కాన్సెప్ట్‌లను ఫాలో అవుతూ స్వదేశీ ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అనవసర విదేశీ టూర్లు, బంగారం కొనుగోళ్లు తగ్గించి, 140 కోట్ల మంది ఐక్యతతో దేశాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు.

ఆసుపత్రికి వెళ్తుండగా అంబులెన్స్‌లోనే ప్రసవం
Local· 6d ago

ఆసుపత్రికి వెళ్తుండగా అంబులెన్స్‌లోనే ప్రసవం

TG: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని తండాకు చెందిన కొమురె అనసూయకు పురిటి నొప్పులు రావడంతో సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే అంబులెన్స్‌లో ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గమధ్యంలోనే పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో అంబులెన్స్‌లోనే అనసూయ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 108 ఈఎంటీ మునీందర్‌ గౌడ్‌, పైలెట్‌ మహేందర్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రసవాన్ని సురక్షితంగా నిర్వహించారు. అనంతరం తల్లి, బిడ్డను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు 108 సిబ్బంది తెలిపారు.

ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి
Local· 6d ago

ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి

TG: రాష్ట్రంలో రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ధర్మ సమాజ్‌ పార్టీ నాయకులు కోరారు. ఈ మేరకు మంచిర్యాల సబ్‌ కలెక్టర్‌ రాములుకు వినతిపత్రం అందజేశారు. ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన పేద విద్యార్థులు చదువులు కొనసాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు తెలిపారు. బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థుల చదువులకు ఆటంకం లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

కోడిపందేలు ఆడుతూ ఏడుగురు అరెస్ట్‌
Local· 6d ago

కోడిపందేలు ఆడుతూ ఏడుగురు అరెస్ట్‌

TG: మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ మండలం వెంకంపేట శివారులో కోడిపందేలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. కోడిపందేలు ఆడుతూ పట్టుబడిన ఏడుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు, ఏడాది పాటు సత్ప్రవర్తనతో ఉండాలని తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేశారు. రూ.2 లక్షల సొంత పూచీకత్తుపై బాండ్లు తీసుకున్నారు. ఘటనలో పరారీలో ఉన్న మరికొందరి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే రౌడీషీట్‌ నమోదు చేస్తామని హెచ్చరించారు.

మైనింగ్ బ్లాస్ట్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
Local· 6d ago

మైనింగ్ బ్లాస్ట్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

TG: జోగులాంబగద్వాల జిల్లా గట్టు మండలంలో భారత్‌మాల పథకంలో భాగంగా జరుగుతున్న రహదారి పనులకు సంబంధించిన క్రషర్‌ కార్యకలాపాలపై సీపీఎం నాయకులు ఆందోళన వ్యక్తంచేశారు. సల్కాపురం, జోగన్‌గట్టు గ్రామాల శివారులో మెగా కంపెనీకి సంబంధించిన సబ్‌కాంట్రాక్ట్‌ క్రషర్‌ ఐదేళ్లుగా కొనసాగుతోందని సీపీఎం నాయకుడు నర్సింహులు తెలిపారు. సల్కాపురం గ్రామానికి చెందిన రైతు ఏసన్నకు చెందిన రెండున్నర ఎకరాల పొలంలో బోరుబావి ఉందన్నారు. క్రషర్‌ నుంచి వెలువడుతున్న కంకర, దుమ్ము, బ్లాస్టింగ్‌ ప్రభావంతో బోరుబావి పూడిపోయిందని ఆరోపించారు.

నీతులు చెప్పిన కంగనా.. రివర్స్ లో పాత ఫోటోలతో ట్రోలింగ్!
National· 6d ago

నీతులు చెప్పిన కంగనా.. రివర్స్ లో పాత ఫోటోలతో ట్రోలింగ్!

నటి కృతి సనన్ నటించిన GIVA <a href="https://www.theclearcutnews.com/n/JMKPmWX">రక్షాబంధన్ యాడ్‌</a>లో ఆమె వేసుకున్న మోడరన్ ఇండో-వెస్ట్రన్ డ్రెస్ సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీసింది. పండుగకు ఇలాంటి గ్లామరస్ బట్టలు ఏంటంటూ కంగనా రనౌత్ విమర్శించగా, బ్రాండ్ ಆ యాడ్‌ను ఉపసంహరించుకుంది. దీనిపై కృతి స్పందిస్తూ.. సంస్కృతి అనేది వేసుకునే బట్టల నెక్-లైన్‌లో ఉండదని కౌంటర్ ఇచ్చారు. నెటిజన్లు మాత్రం గతంలో కంగనా వేసుకున్న డ్రెస్సుల ఫోటోలను షేర్ చేస్తూ ఆమె డబుల్ స్టాండర్డ్స్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

పేదల గుడిసెలకు పట్టాలివ్వాలి.. వరంగల్‌లో సీపీఎం ధర్నా
Local· 6d ago

పేదల గుడిసెలకు పట్టాలివ్వాలి.. వరంగల్‌లో సీపీఎం ధర్నా

TG: వరంగల్ జిల్లా కేంద్రంలో పేదల గుడిసెలకు ఇంటి పట్టాలు ఇచ్చి, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. వరంగల్ నగరంలోని ప్రభుత్వ, నిరుపయోగ స్థలాల్లో ఏళ్ల తరబడి గుడిసెలు వేసుకుని నివసిస్తున్న నిరుపేదలకు వెంటనే ఇంటి పట్టాలు ఇవ్వాలని సీపీఎం జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఎర్రజెండాలు చేతబూనిన పేదలు, మహిళలతో కలిసి నాయకులు కలెక్టరేట్‌ వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి తమ డిమాండ్లను వినిపించారు.

సెప్టెంబర్‌ 2 నుంచి బీఆర్‌ఎస్‌ పోరుబాట
Local· 6d ago

సెప్టెంబర్‌ 2 నుంచి బీఆర్‌ఎస్‌ పోరుబాట

TG: కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ తీవ్ర విమర్శలు చేశారు. వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని, ప్రజాసమస్యలను పట్టించుకోకుండా అసమర్థ పాలన సాగిస్తోందని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు సెప్టెంబర్‌ 2 నుంచి వారంరోజుల పాటు ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమలులో జాప్యం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్నిస్తామని తెలిపారు.