Local· 2h ago
ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం వంచిస్తోంది
TG: జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల బీజేపీ మండల అధ్యక్షుడు గుర్రపు నాగరాజు గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు ఆరు గ్యారంటీల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటి అమలును విస్మరించిందని ఆరోపించారు. మహిళలకు రూ.2,500, వృద్ధులు, వితంతువులకు రూ.4,000 పెన్షన్, రైతు భరోసా, నిరుద్యోగ భృతి, రెండు లక్షల ఉద్యోగాలు, విద్యా భరోసా, BC, SC, STలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రజల సమస్యలను పరిష్కరించకుండా 1000 రోజుల పాలన అంటూ సంబరాలు చేసుకోవడం దుర్మార్గమన్నారు.