Latest

వారణాసి పై జక్కన్న క్రేజీ అప్డేట్!
చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎవైటెడ్ కాంబినేషన్ అయిన ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబుల సినిమాపై ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్యారిస్‌లో జరిగిన ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్‌లో జక్కన్న స్వయంగా ఈ సినిమా స్టేటస్‌ను రివీల్ చేస్తూ, షూటింగ్ కేవలం 80 రోజులు మాత్రమే బాకీ ఉందని ప్రకటించారు! సినిమాలోని హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, భారీ షెడ్యూల్స్ అన్నీ ఇప్పటికే కంప్లీట్ అయిపోయాయని, కేవలం టాకీ పార్ట్ మాత్రమే మిగిలి ఉందని ఆయన క్లారిటీ ఇచ్చారు. దాంతో ఈ మోస్ట్ పవర్‌ఫుల్ టైమ్-ట్రావెల్ అడ్వెంచర్ మూవీ అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి.

ఇండియన్ ఐటీ సెక్టర్ లో భారీ నష్టాలు
ఒక కొత్త నివేదిక ప్రకారం, భారతదేశంలోని టాప్ 10 ఐటీ కంపెనీలు తమ గరిష్ట విలువల నుండి దాదాపు ₹19.28 లక్షల కోట్ల మార్కెట్ విలువను కోల్పోయాయి. జెనరేటివ్ ఏఐ (GenAI) వల్ల సాంప్రదాయ ఐటీ సేవలకు ముప్పు వాటిల్లుతుందనే భయాలు, బలహీనమైన అంతర్జాతీయ డిమాండ్ కారణంగా ఇన్వెస్టర్లు ఐటీ షేర్లను భారీగా అమ్మేశారు. కేవలం టిసిఎస్ (TCS) కంపెనీయే తన 2024 గరిష్టం నుండి 55% పడిపోయి, సుమారు ₹9 లక్షల కోట్లు నష్టపోయింది.

తెలంగాణ పోలీస్ శాఖ బిగ్ యాక్షన్!
తెలంగాణ పోలీస్ శాఖ సెక్యూరిటీ రివ్యూలో భాగంగా షాకింగ్ డెసిషన్ తీసుకుంది. 20 మంది మాజీ DGPలతో పాటు ప్రస్తుతం కీలక పోస్టుల్లో ఉన్న ఇంటెలిజెన్స్ చీఫ్, హైదరాబాద్ CP లాంటి ఉన్నతాధికారుల బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్, ఎస్కార్ట్‌లను పూర్తిగా తొలగించింది. కేవలం పోలీస్ అధికారులకే కాకుండా. రాష్ట్రంలోని పలువురు పొలిటికల్ లీడర్ల గన్‌మెన్ల సంఖ్యను కూడా భారీగా తగ్గించి కేవలం 'వన్ ప్లస్ వన్' కే పరిమితం చేసింది.

కస్టడీలోనే ప్రశ్న రావణ్ నిరాహారదీక్ష!
పోలీస్ కస్టడీలో ఉన్న ప్రశ్న రావణ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయన కస్టడీలోనే అమరణ నిరాహార దీక్ష ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది. అయితే ప్రశ్న రావణ్ ఎందుకు దీక్షకు దిగారు? అసలు అక్కడ ఏం జరిగింది? అనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇళయరాజా పాటలు బ్యాన్!
మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. 1976 నుండి వచ్చిన 134 సినిమాల పాటలను ఇకపై ఎక్కడా ప్లే చేయకుండా ఇళయరాజాపై కోర్టు తాత్కాలికంగా స్టే విధించింది. ఆ సినిమాల పాటల పూర్తి కాపీరైట్స్ అన్నీ ప్రొడ్యూసర్స్ కే చెందుతాయని, ఇళయరాజాకు కాదని కోర్టు స్పష్టం చేసింది. 'సరిగమ ఇండియా' కంపెనీ వేసిన కేసు వల్లే కోర్టు ఈ సంచలన తీర్పు ఇచ్చింది. దీంతో ఆ 134 సినిమాల సాంగ్స్ వివాదంలో పడ్డాయి.

టీచర్స్ కి గుడ్ న్యూస్!
తెలంగాణ ప్రభుత్వం స్కూల్స్ అండ్ కాలేజ్ స్టాఫ్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పిల్లలతో పాటు ఇకపై ఉపాధ్యాయ సిబ్బందికీ బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని నిశ్చయించింది. ఈ మేరకు తెలంగాణ క్యాబినెట్ కీలక ఆమోదం తెలిపింది. కాగా, గత నెలలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 430 ప్రభుత్వ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం సక్సెస్‌ఫుల్‌గా అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.

జననాయగన్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే !
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తలపతి విజయ్ చివరి చిత్రం 'జననాయగన్' (Thalapathy 69) విడుదలకు సిద్ధమవుతోంది. సెన్సార్ వివాదాల వల్ల ఆలస్యమైన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌కు తాజాగా సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ మంజూరు చేసింది. హెచ్. వినోద్ దర్శకత్వంలో, అనిరుధ్ సంగీతంలో రూపొందిన ఈ చిత్రం జూలై (2026) చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ రిటైర్మెంట్ ప్రకటన!
బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు మహేష్ భట్ (77) చిత్ర దర్శకత్వానికి శాశ్వతంగా గుడ్ బై చెప్పారు. తన సుదీర్ఘ కెరీర్‌లో 'అర్థ్', 'సారాంశ్', 'సడక్', 'జఖ్మ్' వంటి 47 క్లాసిక్ చిత్రాలను ఆయన తెరకెక్కించారు. ఇకపై తాను సినిమాలకు దర్శకత్వం వహించబోనని స్పష్టం చేస్తూ, ప్రస్తుతం చిత్ర నిర్మాణ రంగం మరియు నాటకరంగం (థియేటర్) పైనే దృష్టి పెడతానని భట్ ప్రకటించారు.

తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ రెడీ టు లాంచ్
హైదరాబాద్ స్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ తమ 'విక్రమ్-1' రాకెట్ తొలి ఆర్బిటల్ ప్రయోగానికి సిద్ధమైంది. దీనికి ‘మిషన్ ఆగమన్’ అని పేరు పెట్టారు. జూలై 12 - ఆగస్టు 4, 2026 మధ్య శ్రీహరికోట (ISRO) నుండి దీనిని ప్రయోగిస్తారు. పూర్తిగా కార్బన్ బాడీ, 3D-ప్రింటెడ్ ఇంజన్లతో తయారైన ఈ రాకెట్, 350 కేజీల చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి చేరవేయగలదు. ఇది భారతదేశపు మొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ప్రయోగం.
బైక్ రైడర్స్‌కు అలర్ట్!
గుజరాత్‌లోని జునాగఢ్‌లో జరిగిన ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వర్షాల వల్ల రోడ్లపై ఎక్కడ గుంతలు ఉన్నాయో అస్సలు కనిపించవు కాబట్టి వాహనదారులు ఎప్పుడూ ఫుల్ ఫేస్ హెల్మెట్ ధరించాలి. బైక్ నడిపేటప్పుడు రోడ్డుపైనే పూర్తిగా దృష్టి పెట్టి చాలా జాగ్రత్తగా ప్రయాణించాలి. వర్షం పడేటప్పుడు హెల్మెట్ గ్లాస్ క్లియర్ గా ఉంచుకోవడం, స్పీడ్ కంట్రోల్ లో పెట్టుకోవడం వల్ల ప్రమాదాల నుండి సేఫ్ గా ఉండొచ్చు. వర్షాకాలం ముగిసేవరకు రోడ్లపై ఈ జాగ్రత్తలు తప్పనిసరి.

ఆక్రమణల నుంచి వికారాబాద్ అటవీ భూములకు రక్షణ !
వికారాబాద్ జిల్లా పరిగి పరిధిలో ఆక్రమణకు గురైన అటవీ భూములను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇక్కడ దాదాపు 200 ఎకరాల దట్టమైన అడవి ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. ఇప్పటివరకు 80 ఆక్రమణ ఉదంతాలను కనుగొని, 20 కేసులు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న స్థలాలను నేవీ రాడార్ (VLF) ప్రాజెక్టు పరిహార అటవీకరణ కోసం ఉపయోగించ నున్నారు. కొత్త డీఎఫ్ఓ విశాల్ బాతులా నియామకంతో ఈ చర్యలు మరింత వేగవంతమయ్యాయి.
చిన్నారి కోసం 6KM నడిచిన వార్డెన్
AP: పార్వతీపురం మన్యం జిల్లాలోని ఓ గిరిజన గ్రామానికి చెందిన 7వ తరగతి విద్యార్థిని భువనేశ్వరి ఫీవర్‌తో బాధపడుతోంది. బాలిక పరిస్థితి విషమంగా మారింది. ఆమెను తక్షణమే హాస్పిటల్‌కు తరలించాల్సి ఉండగా, ఆ గ్రామానికి కనీస రోడ్డు మార్గం లేకపోవడంతో అంబులెన్స్, బైక్ కూడా వెళ్లలేని పరిస్థితి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హాస్టల్ వార్డెన్ హేమ బాలికను తన భుజాలపై కూర్చొబెట్టుకుని కొండలు, గుట్టలు దాటి 6KM మేర భుజాలపై మోసుకుంటూ కాలినడకన ప్రధాన రహదారికి తీసుకువచ్చారు. అక్కడ నుంచి వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సకాలంలో వైద్యసేవలు అందేలా చూశారు.

ప్రభుత్వ ఉద్యోగులకు మళ్ళీ ఛాన్స్ ఇచ్చిన AP గవర్నమెంట్!
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల ఎంప్లాయిస్ రిటైర్మెంట్ ఏజ్ 60 నుండి 62 ఏళ్లకు పెంచుతూ ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంది. దీనికి సంబంధించి గవర్నమెంట్ జీవో కూడా రిలీజ్ చేసింది. ఈ కొత్త రూల్ జనవరి 1, 2022 నుండి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. అంతేకాదు, ఇప్పటికే 60 ఏళ్లకు రిటైర్ అయిన ఎలిజిబుల్ ఎంప్లాయ్స్‌ను మళ్ళీ డ్యూటీలోకి తీసుకునే ఛాన్స్ ఇచ్చింది.

RSP భార్య పోస్టింగ్ చేంజ్!
ప్రభుత్వాన్ని RS ప్రవీణ్ కుమార్ ప్రశ్నిస్తుండటంతో ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ప్రభుత్వం పెద్ద ప్లాన్ వేసింది. అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్‌లో మార్కెటింగ్ డైరెక్టర్‌గా ఉన్న RSP భార్య లక్ష్మీబాయిని. కో-ఆపరేషన్ డిపార్ట్‌మెంట్‌లోని లూప్ లైన్ పోస్టింగ్‌కు షిఫ్ట్ చేస్తూ ఆర్డర్స్ ఇచ్చింది. ఇప్పటికే రిటైర్డ్ అడిషనల్ DGP అయిన RSP కి సెక్యూరిటీ, వెహికల్ ఫెసిలిటీస్ తీసేసిన ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు ఇలా ఆయన భార్యపై బదిలీ వేటు వేసింది.
జర్నలిస్ట్ KVR అరెస్ట్ అప్డేట్!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన జర్నలిస్ట్ KVR అరెస్ట్ కేసులో కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయన్ని వెంటనే బొబ్బిలి సబ్ జైలుకు షిఫ్ట్ చేశారు. కాగా, కేవీ రెడ్డిని ఇంకో కేసులో అరెస్ట్ చేసేందుకు వందల కిలోమీటర్ల దూరం నుండి బొబ్బిలి వచ్చిన తుళ్లూరు పోలీసులకు గట్టి షాక్ తగిలింది. అసలు ఆయనకు బెయిల్ వస్తుందో రాదో, నెక్స్ట్ ఏం చేయాలో తెలియని కన్ఫ్యూజన్‌తో తుళ్లూరు పోలీసులు నిరాశగా వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది.
చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్.. కన్నీరు మున్నీరవుతున్న తల్లి!
కళ్లముందే ఆడుకుంటూ కనిపించకుండా పోయిన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ లభించి 26 రోజులు గడిచినా ఇంకా ఎలాంటి జాడ లేదు. బిడ్డ దూరమైన బాధ ఒక తల్లికే తెలుస్తుంది. నా బిడ్డను ఎవరైనా తీసుకెళ్లి ఉంటే దయచేసి తిరిగి ఇచ్చేయండి, మీపై ఎలాంటి కేసులు పెట్టం అంటూ ఆ తల్లి కన్నీటితో వేడుకుంటోంది. కాగా, పాప జాడ తెలిపిన వారికి పోలీసులు రూ.1 లక్ష బహుమతి ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మిస్సింగ్ పోస్టర్లు కలచివేస్తున్నాయి.
ప్రశ్న రావణ్ అరెస్ట్.. విధుల్లో ఉన్న పోలీసులపై దాడి!
ప్రశ్న రావణ్ అరెస్ట్ పిఠాపురంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రావణ్‌కు వెంటనే కఠిన శిక్ష పడాలంటూ జనసైనికులు పోలీస్ వాహనాన్ని అడ్డుకుని కోడిగుడ్లతో దాడికి దిగారు. అయితే, సరిగ్గా నిన్ననే డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ వ్యక్తిగత స్వేచ్ఛ, చట్టం గురించి క్లియర్‌గా మాట్లాడారు. ఈ నేపథ్యంలో, విధుల్లో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడిన జనసైనికులపై కూడా చట్టప్రకారం కేసులు పెడతారా? అసలు ఈ దాడులు ఏ చట్టం, ఏ స్వేచ్ఛ కిందకు వస్తాయంటూ ప్రజలు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.

లోహగఢ్ కోట మర్డర్ మిస్టరీ.. పోలీసులకే షాక్!
లోనావాలా లోహగఢ్ కోటపై నుండి కేతన్ అగర్వాల్‌ను ఎవరు నెట్టేశారనే దానికి స్పష్టమైన ఆధారాలు లేవని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు సియా గోయల్‌కు పాలీగ్రాఫ్ (అబద్ధాలు కనిపెట్టే) టెస్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఎలాంటి పక్కా సాక్ష్యాలు దొరకకపోతే, సియా అండ్ ఆమె బాయ్‌ఫ్రెండ్ జైలు నుండి బయటకు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ కేసులో ఆసక్తి నెలకొంది.

హైవేపై యాక్షన్ సీన్.. దుండగులపై పోలీసుల ఫైరింగ్
AP: నంద్యాల జిల్లా డోన్ హైవేపై గురువారం తెల్లవారుజామున పోలీసులు కాల్పుల ఘటన కలకలం రేపింది. పందుల లోడ్‌తో వెళ్తున్న వాహనాన్ని ఆపేందుకు పోలీసులు ప్రయత్నించగా, దుండగులు ఎదురు దాడిచేశారు. వాహనాన్ని ఆపకుండా ఓవర్ స్పీడ్‌తో వెళ్లిపోయారు. పోలీసులు ఆ వాహనాన్ని వెంబడిస్తూనే హైవే పెట్రోలింగ్ పోలీసులకు సమాచారమిచ్చారు. వాహనాన్ని అడ్డుకునేందుకు పెట్రోలింగ్ పోలీసులు యత్నించగా, రాళ్లు, సీసాలు విసిరి దాడిచేశారు. దీంతో దొంగలపై కాల్పులు జరిపారు. దుండగులు పోలీసులకు చిక్కకుండా పరార్ అయ్యారు.

మూడో విడత రైతు భరోసా నిధులు విడుదల!
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా మూడో విడత నిధులను విడుదల చేసింది. 3 నుంచి 4 ఎకరాల భూమి ఉన్న 6.39 లక్షల మంది రైతుల అకౌంట్లలో రూ.1,330 కోట్లను డిపాజిట్ చేశారు. ఇప్పటివరకు మొత్తం 61.35 లక్షల మంది రైతులకు రూ.5,402.37 కోట్ల ఆర్థిక సహాయం నేరుగా బ్యాంక్ అకౌంట్లలోనే జమ అయింది.

షాకింగ్ యాక్సిడెంట్.. మిరాకిల్ ఎస్కేప్
TG: నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్నగుట్ట శివారులో ఒక కారు అదుపు తప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. అనంతరం పొలంలో బోల్తా పడింది. ప్రమాద ధాటికి కరెంట్ పోల్ పూర్తిగా విరిగిపోవడమే కాకుండా, విద్యుత్ మెయిన్ లైన్ తీగలు తెగి నేరుగా కారుపై పడ్డాయి. ఆ టైమ్‌లో కారులో ఉన్న వ్యక్తి కారు అద్దాలను పగులగొట్టుకుని సకాలంలో బయటకు దూకేశాడు. విద్యుత్ తీగలు కారుపై పడినప్పటికీ, సదరు వ్యక్తి కేవలం స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు.