← Back to news

షాకింగ్ యాక్సిడెంట్.. మిరాకిల్ ఎస్కేప్

By డీకే· 2 Jul 2026· నిజామాబాద్ జిల్లా
షాకింగ్ యాక్సిడెంట్.. మిరాకిల్ ఎస్కేప్

TG: ​నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్నగుట్ట శివారులో ఒక కారు అదుపు తప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. అనంతరం పొలంలో బోల్తా పడింది. ప్రమాద ధాటికి కరెంట్ పోల్ పూర్తిగా విరిగిపోవడమే కాకుండా, విద్యుత్ మెయిన్ లైన్ తీగలు తెగి నేరుగా కారుపై పడ్డాయి. ఆ టైమ్‌లో కారులో ఉన్న వ్యక్తి కారు అద్దాలను పగులగొట్టుకుని సకాలంలో బయటకు దూకేశాడు. విద్యుత్ తీగలు కారుపై పడినప్పటికీ, సదరు వ్యక్తి కేవలం స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు.

More in TG