Latest

DMHO వేధిస్తున్నారని కలెక్టరేట్ వద్ద నిరసన
TG· 2 Jul 2026

DMHO వేధిస్తున్నారని కలెక్టరేట్ వద్ద నిరసన

TG: హన్మకొండ DMHO తమను మానసికంగా వేధిస్తున్నారని వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులతో డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. DMHOపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌తో పాటు వరంగల్ పశ్చిమ MLA నాయిని రాజేందర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రితో ఫోన్‌లో మాట్లాడారు. DMHOపై శాఖాపరంగా సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరినట్లు తెలిపారు.

కేంద్రం కొత్త స్కీమ్... AP నుంచే శ్రీకారం
Business· 2 Jul 2026

కేంద్రం కొత్త స్కీమ్... AP నుంచే శ్రీకారం

AP: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన VBG రాంజీ పథకం తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లెలో గురువారం ప్రారంభం కానుంది. ముక్కవారిపల్లెలో రూ.4.55 లక్షలతో ప్రతిపాదించిన మూడు పనులను కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, CM చంద్రబాబు, DCM పవన్ కల్యాణ్ ప్రారంభించనున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రప్రభుత్వం అప్పట్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రారంభించింది. వీబీ జీరాం జీని ఇప్పుడు తిరుపతి జిల్లాలో ప్రారంభిస్తుంది.

రిజిస్ట్రేషన్ సేవలకు తాత్కాలిక బ్రేక్
Politics· 2 Jul 2026

రిజిస్ట్రేషన్ సేవలకు తాత్కాలిక బ్రేక్

TG: టెక్నికల్ ఇష్యూస్‌తో తెలంగాణలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. సర్వర్లు పనిచేయలేదు. స్లాట్‌ బుకింగ్‌, చలాన్ల చెల్లింపులు మొత్తం ఆగిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌ సేవలు ఇవాళ కూడా అందుబాటులో ఉండవు. సర్వర్ల అప్‌గ్రెడేషన్‌, కొత్త సాంకేతికత పనులు కొనసాగుతున్నాయి. ఈ విషయమై తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో కార్డ్‌ (CARD) విభాగం DIG సుభాషిణి స్పందిస్తూ డేటా మైగ్రేషన్‌ ప్రక్రియ కారణంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సమస్యలు ఉత్పన్నమయ్యాయని చెప్పారు. గురువారం సాయంత్రం పనులన్నీ పూర్తవుతాయని తెలిపారు.

AP మహిళలు కష్టపడి పనిచేస్తారు
AP· 2 Jul 2026

AP మహిళలు కష్టపడి పనిచేస్తారు

AP: తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మదనపాలెంలో హీరో మోటోకార్ప్ సంస్థ రూ.750 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న 'గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0' కు CM చంద్రబాబు శంకుస్థాపన చేశారు. హీరో మోటోకార్ప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పవన్ ముంజాల్‌తో కలిసి ఆయన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సీఎం మాట్లాడుతూ.. '2018లో హీరో మోటార్స్ సంస్థ వేరే రాష్ట్రంలో ప్లాంట్ పెట్టాలనుకున్నప్పుడు, వారితో చర్చించి ఇక్కడే రూ.1,600 కోట్లతో ప్లాంట్ ఏర్పాటుచేసేలా ఒప్పించామన్నారు. AP మహిళలు కష్టపడి పనిచేస్తారు, త్వరగా నైపుణ్యాలు నేర్చుకుంటారు. హీరో ప్లాంట్లో 40% మంది మహిళలే పనిచేస్తుండటం గర్వకారణం అని అన్నారు.

ఉస్మానియా డాక్టర్ల అద్భుతం.. దేశంలోనే తొలిసారి
TG· 2 Jul 2026

ఉస్మానియా డాక్టర్ల అద్భుతం.. దేశంలోనే తొలిసారి

TG: సాధారణంగా ఒక రోగి శరీరంలోని ఒక అవయవాన్ని మార్చి చికిత్సలు చేస్తుంటారు. కానీ, ఒకేసారి ఐదు అవయవాలు విజయవంతంగా మార్చి హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రి డాక్టర్స్ రికార్డ్ సృష్టించారు. అత్యంత క్లిష్టమైన, అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఒకే రోగికి ఓకేసారి ఐదు అవయవ మార్పిడిలు చేయడం దేశంలో ఇదే మొదటిసారి అని వైద్యులు తెలిపారు. జాతీయ అవయవాలు, కణజాల మార్పిడి సంస్థ (NOTTO) తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఉస్మానియా వైద్య బృందాన్ని అభినందించింది.

పారిస్ థియేటర్లను ఊపు ఊపేసిన ఈగ▶
Cinema· 1 Jul 2026

పారిస్ థియేటర్లను ఊపు ఊపేసిన ఈగ

దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి 14 ఏళ్ల క్రితం తీసిన ఈగ మూవీకి పారిస్ లో బ్రహ్మరథం పడుతున్నారు ఫ్రెంచ్ ఆడియన్స్.. విలన్ సుదీప్‌కు ఈగ వార్నింగ్ ఇచ్చే ఐకానిక్ సీన్ (నేను మళ్లీ వస్తా - "I will be back") స్క్రీన్‌పై రాగానే పారిస్ థియేటర్‌లోని ఫ్రెంచ్ ప్రేక్షకులు చప్పట్లు, ఈలలతో థియేటర్‌ను హోరెత్తిం చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. పారిస్ లోని ప్రముఖ ఫిలిం ఇనిస్టిట్యూట్ లో రాజమౌళికి శాశ్వత స్థానం ఇస్తూ ప్రత్యేక గౌరవం కల్పించారు. 14 ఏళ్ల క్రితం వచ్చిన 'ఈగ' సినిమాకు కూడా పారిస్ లో ఇంతటి అద్భుతమైన స్పందన రావడం తెలుగు సినిమా స్థాయిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.

సీమలో సిరుల పంట - మరో చోట పసిడి ...
News· 1 Jul 2026

సీమలో సిరుల పంట - మరో చోట పసిడి ...

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం నిక్షేపాలు ఒక్కొక్కటిగా బయటుకొస్తున్నాయి. ఇటీవల కర్నూలుజిల్లా జొన్నగిరిలో బంగారం గనులు ప్రారంభంకాగా.. చిత్తూరు జిల్లా కుప్పంలోనూ బంగారు గనులున్నాయని గుర్తించారు. తాజాగా సత్యసాయి జిల్లాలో బంగారం నిక్షేపాలు ఉన్నాయని తేలింది. రాష్ట్ర ప్రభుత్వం సత్యసాయి జిల్లాలోని ఎన్పీకుంట మండలం జౌకల ప్రాంతంలో ఖనిజాన్వేషణ ప్రక్రియను వేగవంతం చేసింది. గతంలోనే ఇక్కడ భారీగా బంగారం నిక్షేపాలు ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. ఈ ప్రాంతంలో బంగారం ఎంతమేరకు ఉందో స్పష్టత కోసం రీసెర్చ్ చేసేందుకు సిద్ధమయ్యారు.

మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే పెళ్లి జరిగినట్లు కాదు: గుజరాత్ హైకోర్
Legal· 1 Jul 2026

మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే పెళ్లి జరిగినట్లు కాదు: గుజరాత్ హైకోర్

హిందూ వివాహ చట్టం ప్రకారం కేవలం వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మాత్రమే పెళ్లికి నిదర్శనం కాదని గుజరాత్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. శాస్త్రోక్తంగా సప్తపది (ఏడు అడుగులు), మంగళసూత్ర ధారణ వంటి సాంప్రదాయ ఆచారాలు జరిగితేనే ఆ వివాహం చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది. కేవలం సర్టిఫికేట్ ఆధారంగా భార్యాభర్తలుగా చట్టబద్ధమైన హక్కులను క్లెయిమ్ చేయలేరని కోర్టు తేల్చిచెప్పింది.

'ఆల్ఫా' మూవీ రెమ్యూనరేషన్లో అందరినీ మించిపోయిన అలియా
Cinema· 1 Jul 2026

'ఆల్ఫా' మూవీ రెమ్యూనరేషన్లో అందరినీ మించిపోయిన అలియా

బాలీవుడ్ ప్రతిష్టాత్మక యాక్షన్ చిత్రం 'ఆల్ఫా' నటీనటుల పారితోషికాలు ఇప్పుడు పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఏకంగా ₹25 కోట్ల భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. కాగా, ఆమెతో కలిసి నటించిన కో-స్టార్ శర్వరీ వాగ్‌కు కేవలం ₹3 కోట్లు మాత్రమే దక్కాయి. దీంతో శర్వరీ కంటే ఆలియా దాదాపు 8 రెట్లు ఎక్కువ పారితోషికం అందుకున్నట్లయింది.

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింపు!
News· 1 Jul 2026

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింపు!

పశ్చిమాసియా సంక్షోభం సర్దుమణగడంతో చమురు సంస్థలు వాణిజ్య వినియోగదారులకు భారీ ఉపశమనం అందించాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ. 183.50 వరకు తగ్గించాయి. దీంతో ఢిల్లీలో దీని ధర రూ. 2,930కి చేరింది. హైదరాబాద్‌లో రూ. 176 తగ్గి రూ. 3,191గా నమోదైంది. ఈ తగ్గింపు హోటళ్లు, రెస్టారెంట్లకు పెద్ద ఊరట కానుంది. అయితే, 14.2 కేజీల గృహ వినియోగ (డొమెస్టిక్) సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డులో మెగాస్టార్ భార్యకు చోటు!
News· 1 Jul 2026

యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డులో మెగాస్టార్ భార్యకు చోటు!

యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డులో మెగాస్టార్ భార్యకు చోటు! తెలంగాణ ప్రభుత్వం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి సరికొత్తగా 18 మందితో కూడిన పాలక మండలిని ప్రకటించింది. ఎంఎస్ఎన్ గ్రూప్ చైర్మన్ ఎం.సత్యనారాయణను ఈ బోర్డుకు చైర్మన్‌గా నియమించింది. ఈ బోర్డులో మంత్రి జి. వినోద్ వెంకటస్వామితో పాటు మెగాస్టార్ చిరంజీవి భార్య కొణిదెల సురేఖకు కూడా సభ్యురాలిగా చోటు దక్కింది. ఈ బోర్డు రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనుంది.

బాలీవుడ్ కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్ కు అస్వస్థత
Cinema· 1 Jul 2026

బాలీవుడ్ కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్ కు అస్వస్థత

ఇటీవల 'తౌబా తౌబా', 'ఝూమే జో పఠాన్' వంటి సూపర్ హిట్ పాటలకు కొరియోగ్రఫీ చేసిన ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్ గుండెల్లో అసౌకర్యం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. బిజీ పని ఒత్తిడి వల్ల అస్వస్థతకు గురైన ఆయనను వైద్యులు పర్యవేక్షణలో ఉంచారు. ప్రస్తుతం పరీక్షల నివేదికలు సాధారణంగా రావడంతో, ఆయన కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

పాకిస్తాన్‌లో ఐసిస్ స్థావరాలపై తాలిబాన్ల దాడి!
News· 1 Jul 2026

పాకిస్తాన్‌లో ఐసిస్ స్థావరాలపై తాలిబాన్ల దాడి!

పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉగ్రవాద అణచివేత చర్యలు తీవ్రరూపం దాల్చాయి. పాక్ భూభాగంలో ఉన్న అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ (ISIS) స్థావరాలపై తాలిబాన్ దళాలు అనూహ్య దాడులు జరిపాయి. ఈ వ్యూహాత్మక దాడుల్లో దాదాపు 28 మంది ఐసిస్ ఉగ్రవాదులు హతమవ్వగా, మరో 49 మంది తీవ్రంగా గాయపడినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ పరిణామంతో సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

నొప్పి నివారణకు సరికొత్త డివైజ్ 'క్యూరాపాడ్'!
Politics· 1 Jul 2026

నొప్పి నివారణకు సరికొత్త డివైజ్ 'క్యూరాపాడ్'!

కండరాలు, కీళ్ల నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం అందించేందుకు 'క్యూరాపాడ్' అనే సరికొత్త వేరబుల్ పరికరం దేశంలో అందుబాటులోకి వచ్చింది. ఫిజియోథెరపీ, హీట్ ప్యాక్ కలయికతో పనిచేసే ఈ డివైజ్ కేవలం వెల్‌నెస్ గ్యాడ్జెట్ మాత్రమే కాదు; ఇది CDSCO ఆమోదం మరియు US FDA Class II రిజిస్ట్రేషన్ పొందిన సురక్షితమైన వైద్య పరికరం. ఫోటోబయోమాడ్యులేషన్ సాంకేతికత ద్వారా పనిచేసే ఈ పరికరంతో ఇప్పుడు ఇంట్లోనే క్లినికల్ తరహా థెరపీ పొందవచ్చు.

CM రేవంత్ రెడ్డికి RSP ఓపెన్ ఛాలెంజ్!
Politics· 1 Jul 2026

CM రేవంత్ రెడ్డికి RSP ఓపెన్ ఛాలెంజ్!

TG: తెలంగాణలో జరిగిన ₹2000 కోట్ల గురుకుల కుంభకోణం ఆరోపణలపై రేపు (జూలై 2) సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బహిరంగ చర్చకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిద్ధమయ్యారు. CM రేవంత్ రెడ్డి ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ తాము చర్చకు రెడీ అని ఆయన ప్రకటించారు. "మా తప్పు నిరూపిస్తే రాజీనామా చేస్తామన్న మంత్రులు సాక్ష్యాలతో చర్చకు రావాలి" అని ట్వీట్ చేశారు. మొదట ఉదయం 11 గంటలకు అనుకున్నా, ప్రెస్ క్లబ్ స్లాట్ బుకింగ్ ప్రాబ్లం వల్ల టైమింగ్‌ను మధ్యాహ్నం 12 గంటలకు మార్చారు.

జర్నలిస్ట్ KVR అరెస్ట్ అప్డేట్!▶
Viral· 1 Jul 2026

జర్నలిస్ట్ KVR అరెస్ట్ అప్డేట్!

హైదరాబాద్‌లో నిన్న రాత్రి అరెస్ట్ అయిన తెలంగాణ జర్నలిస్ట్ KVR కేస్‌లో లేటెస్ట్ అప్‌డేట్! పోలీసులు ఆయన్ని విజయనగరం జిల్లాలోని బొబ్బిలి రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ KVR స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన తర్వాత, బొబ్బిలి గవర్నమెంట్ హాస్పిటల్‌లో మెడికల్ ఎగ్జామినేషన్స్ పూర్తి చేశారు. ఈ ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయాక, పోలీసులు ఆయన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు. ఈ అరెస్ట్ ఇప్పుడు మీడియా సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

వర్షాకాలంలో ఈ తప్పులు చేయకండి!
Health· 1 Jul 2026

వర్షాకాలంలో ఈ తప్పులు చేయకండి!

వర్షాకాలం వచ్చేసింది కదా! ఈ సీజన్‌లో వాతావరణంలో తేమ వల్ల బ్యాక్టీరియా, వైరస్ చాలా ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవుతాయి. దీనివల్ల జీర్ణ సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. అందుకే రోడ్డు పక్కన అమ్మే చాట్, ముందే కట్ చేసిన ఫ్రూట్స్, పచ్చి సలాడ్స్, ఎక్కువ ఆయిల్ ఉన్న ఫుడ్స్‌ని అస్సలు ముట్టకండి. ఎప్పుడూ ఇంట్లో వండిన ఫ్రెష్ అండ్ హాట్ ఫుడ్ మాత్రమే తినండి. తినే ముందు హ్యాండ్ వాష్ మస్ట్! ఒకవేళ కడుపునొప్పి, వాంతులు, జ్వరం లాంటి సింప్టమ్స్ కనిపిస్తే అస్సలు లైట్ తీసుకోకుండా వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. నీళ్లు బాగా తాగుతూ పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయండి.

MPపై గుడ్లు, కూరగాయలతో BJP కార్యకర్తలు దాడి!▶
Politics· 1 Jul 2026

MPపై గుడ్లు, కూరగాయలతో BJP కార్యకర్తలు దాడి!

పశ్చిమ బెంగాల్ నదియా జిల్లాలో TMC వర్కర్స్ మీటింగ్‌కు వెళ్లిన MP మహువా మోయిత్రాపై కొందరు నిరసనకారులు గుడ్లు, కూరగాయలతో దాడి చేశారు. ఈ దాడి వెనుక BJP హస్తం ఉందని, పోలీసుల ముందే వాళ్లు గూండాల్లా ప్రవర్తించినా పోలీసులు చూస్తూ ఊరుకున్నారని ఆమె తీవ్రంగా ఆరోపించారు. ఈ ఇన్సిడెంట్ వీడియోను మోయిత్రా సోషల్ మీడియాలో షేర్ చేయగా. ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో ఇది హాట్ టాపిక్‌గా మారింది.

ప్రశ్న రావణ్, KVR అరెస్ట్ అప్డేట్!
Politics· 1 Jul 2026

ప్రశ్న రావణ్, KVR అరెస్ట్ అప్డేట్!

అరెస్ట్ అయిన యూట్యూబర్ 'ప్రశ్న రావణ్'ను ఇవాళ సాయంత్రం 6 గంటలకు మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. నిన్న అర్ధరాత్రి తన లైవ్ ముగించుకుని ఒంటరిగా ఇంటికి వెళ్తున్న టైంలో పోలీసులు అతన్ని చుట్టుముట్టి అరెస్ట్ చేశారు. అయితే ఇప్పటివరకు రావణ్‌కి సంబంధించిన ఎలాంటి ఫొటోస్, వీడియోస్ బయటకి రాలేదు. మరోవైపు జర్నలిస్ట్ KVR ఏ పోలీస్ స్టేషన్‌లో ఉన్నారనే దానిపై క్లారిటీ లేకపోవడంతో ఆయన ఫ్యామిలీ తీవ్ర భయాందోళనల్లో ఉంది.

కూటమి ప్రభుత్వంపై ప్రశ్న రావణ్ సీరియస్ కామెంట్స్▶
Viral· 1 Jul 2026

కూటమి ప్రభుత్వంపై ప్రశ్న రావణ్ సీరియస్ కామెంట్స్

యూట్యూబర్ 'ప్రశ్న రావణ్' అరెస్ట్‌కి ముందే చేసిన ఒక పవర్‌ఫుల్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆయన పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశారు. "పవన్ కళ్యాణ్ ఐ స్టాండ్ ఆన్ మై వర్డ్స్! నేను మాట్లాడిన దాంట్లో ఒక్క అక్షరం కూడా వెనక్కి తీసుకోను. నన్ను భయపెట్టాలని చూస్తున్నారా? అరెస్ట్ చేస్తారా. చేసుకోండి, నేను దేనికైనా రెడీ" అంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. కూటమి ప్రభుత్వంపై కూడా ఆయన ఫుల్ ఫైర్ అయ్యారు.

తెలంగాణ అస్తిత్వంపై సాంగ్!▶
Viral· 1 Jul 2026

తెలంగాణ అస్తిత్వంపై సాంగ్!

తెలంగాణ యాస, భాషపై జరుగుతున్న దాడిని తీవ్రంగా ఖండిస్తూ.. తెలంగాణ ఉద్యమ కవి, సింగర్ ముక్కపల్లి శ్రీనివాస్ ఒక పవర్‌ఫుల్ సాంగ్ పాడారు. "తెలంగాణ యాస మా ఆత్మగౌరవం. భాష మా అస్తిత్వం, దానిపై ఎలాంటి దాడినైనా సహించం" అంటూ ఆయన పాడిన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. తెలంగాణ లాంగ్వేజ్ లవర్స్ ఈ వీడియోని విపరీతంగా షేర్ చేస్తూ సపోర్ట్ ఇస్తున్నారు.