Latest
హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకిన ఇంటర్ స్టూడెంట్!
వికారాబాద్ జిల్లా తాండూరు మండలం జిన్ గుర్తి వద్ద అర్ధరాత్రి ఒక సాడ్ ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడి ట్రైబల్ గర్ల్స్ హాస్టల్ బిల్డింగ్ పైనుంచి మహేశ్వరి అనే ఇంటర్ సెకండియర్ స్టూడెంట్ కిందకు దూకేసింది. ఈ ప్రమాదంలో ఆమె కాలు తీవ్రంగా ఫ్రాక్చర్ అవ్వడంతో, ఫస్ట్ తాండూరు గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌కి తరలించారు. ఆ తర్వాత బెటర్ ట్రీట్‌మెంట్ కోసం హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌కి షిఫ్ట్ చేశారు. అసలు ఆ స్టూడెంట్ బిల్డింగ్ పైనుంచి ఎందుకు దూకింది అనే రీజన్ ఇంకా తెలియాల్సి ఉంది.

అయోధ్య వివాదంలో చర్చలను సమర్థించిన నద్వీ కన్నుమూత!
ప్రముఖ ఇస్లామిక్ పండితుడు మౌలానా సల్మాన్ నద్వీ(72) లఖ్‌నవూలో అనారోగ్యంతో కన్నుమూశారు. అయోధ్య వివాదాన్ని కోర్టుల ద్వారా కాకుండా హిందూ-ముస్లింల మధ్య చర్చలతో సాల్వ్ చేయాలని ఆయన గట్టిగా నిలబడ్డారు. 2018లో వివాదాస్పద స్థలంలో రామమందిరం కట్టి, మసీదును వేరే ప్లేస్‌లో నిర్మించవచ్చని ఆయన ఇచ్చిన ఓపెన్ ప్రపోజల్ అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయ్యింది. ఈ డెసిషన్‌తో విభేదించిన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (AIMPLB) ఆయన్ని దూరం పెట్టడంతో, నద్వీ ఆ సంస్థ నుండి వైదొలిగారు. ఇస్లామిక్ న్యాయశాస్త్రం, మత సామరస్యంపై ఆయనకు మంచి పట్టుంది.

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్!
ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్ నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై ఒక టాటా టియాగో కారు రివర్స్ చేస్తుండగా, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన బొలెరో కారు బలంగా ఢీకొట్టింది. ఈ క్రాష్‌లో ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురికి సీరియస్ ఇంజూరీస్ అవ్వడంతో హాస్పిటల్ ఐసీయూలో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. బాధితులంతా హర్యానాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఓవర్‌స్పీడ్, కేర్‌లెస్ డ్రైవింగే ఈ యాక్సిడెంట్‌కి కారణం. దీనికి సంబంధించిన CCTV విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత తగ్గిన బంగారం ధరలు!
బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్! మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.1,43,020 కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,100 గా ఉంది. అయితే, గోల్డ్ రేట్స్ ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి, మీరు షాపింగ్‌కి వెళ్లే ముందు ఒకసారి కరెంట్ లైవ్ ప్రైస్ చెక్ చేసుకోవడం బెస్ట్.

బన్నీ, రష్మికా కాంబినేషన్లో మరో పాన్ ఇండియన్ మూవీ !
పుష్ప హీరోయిన్ రష్మికా మందన్నా విలన్ అవతారం ఎత్తుతోంది. డైరక్టర్ అట్లీ కుమార్ తీయబోతున్న రాకా అనే మూవీలో రష్మికా యాక్ట్ చేస్తోంది. టెంపరరీగా AA22 అని పేరు పెట్టిన ఈ మూవీ పాన్ ఇండియా అప్ కమింగ్ యాక్షన్ మూవీ కాబోతోంది. రాకా లో రష్మికా అల్లూ అర్జున్ తో క లిసి నటిస్తోంది. వీరిద్దరూ ఇప్పటికే హిట్ పెయిర్ టాక్ సొంతం చేసుకున్నారు. రష్మికా హీరోయిన్ రోల్స్ కి భిన్నంగా తొలిసారిగా విలన్ రోల్ పోషించడంతో ఫ్యాన్స్ లో ఆతృత పెరిగిపోతోంది.

పిల్లలు యాక్టివ్ గా, బలంగా ఎదగాలంటే !
పిల్లలు శారీరకంగా, మానసికంగా బలంగా ఎదగడానికి కేవలం మంచి ఆహారం మాత్రమే సరిపోదని తాజా హెల్త్ రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి. చిన్నతనం నుంచే వారిలో రోగనిరోధక శక్తి పెంచే పోషకాలు అందించడంతో పాటు, శారీరక శ్రమ (Physical activity) ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా స్క్రీన్ టైమ్‌ను తగ్గించి, అవుట్‌డోర్ గేమ్స్ ఆడేలా ప్రోత్సహించడం వల్ల వారి ఎముకలు, కండరాలు దృఢంగా తయారవుతాయి. దీంతో పాటు పిల్లలకు కనీసం 8-10 గంటల గాఢ నిద్ర, మానసిక ప్రశాంతత లభించినప్పుడే వారు యాక్టివ్‌గా, బలంగా ఎదుగుతారని నిపుణులు సూచిస్తున్నారు.

మష్రూమ్స్ మ్యాజిక్ - డిప్రెషన్‌కు సరికొత్త చికిత్స!
మ్యాజిక్ మష్రూమ్స్ (పుట్టగొడుగులు) మానసిక ఆరోగ్య చికిత్సలో అద్భుతంగా పనిచేస్తున్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడించాయి. తీవ్రమైన డిప్రెషన్, యాంగ్జైటీతో బాధపడేవారికి ఈ పుట్టగొడుగులలోని ‘సిలోసిబిన్’ అనే రసాయనం ఒక వరంలా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా దీనిపై మెడికల్ ట్రయల్స్ సక్సెస్ కావడంతో.. వీటిని లీగలైజ్ చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. కేవలం మూడ్ మార్చడమే కాకుండా, బ్రెయిన్ సెల్స్ రీ-కనెక్ట్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుందని సైంటిస్టులు కనుగొన్నారు. సరైన మెడికల్ గైడెన్స్‌తో వాడితే.. మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్‌కు ఇది బెస్ట్ సొల్యూషన్ కానుంది.

టాలెంట్ ఉంటేనే ఇండస్ట్రీలో రాణించేది- మధుబాల
టాలీవుడ్ సీనియర్ నటి మధు బాల (రోజా ఫేమ్) తన లేటెస్ట్ ప్రాజెక్ట్స్‌పై ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.. ప్రస్తుతం డిఫరెంట్ క్యారెక్టర్స్, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్నట్లు తెలిపారు. నటిగా సెకండ్ ఇన్నింగ్స్‌లో వస్తున్న రోల్స్ తనకు ఎంతో తృప్తినిస్తు న్నాయని, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వల్ల నటీనటులకు అద్భుతమైన అవకాశాలు దొరుకుతున్నాయని చెప్పారు.అలాగే లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ కెమెరా ముందుకు రావడం ఒక ఛాలెంజ్‌గా అనిపించిందని, కానీ ప్రేక్షకుల ప్రేమే తనను ముందుకు నడిపిస్తోందని మధు చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో నెపోటిజం పై స్పందిస్తూ టాలెంట్ ఉంటేనే ఎవరైనా రాణిస్తారని అన్నారు.

గ్లోబల్ పవర్ ప్లే గా మారిన ఫిఫా ఫీవర్
ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఇష్టపడే ఫుట్‌బాల్ గేమ్ కేవలం ఒక ఆట మాత్రమే కాదు.. దాని వెనుక భారీ బిజినెస్, గ్లోబల్ పాలిటిక్స్ ఉన్నాయని ‘ది షార్టెస్ట్ హిస్టరీ ఆఫ్ ఫుట్‌బాల్’ బుక్ విశ్లేషించింది. పూర్వకాలం నుండి నేటి మెస్సి జనరేషన్ వరకు ఈ ఆట ఎలా ఎదిగిందో ఇందులో వివరించారు. హిట్లర్, ముస్సోలిని కాలం నుండి మొన్నటి ఖతార్, రాబోయే సౌదీ వరల్డ్ కప్స్ వరకు.. లీడర్స్ తమ పొలిటికల్ మైలేజ్ కోసం, ఇమేజ్ బిల్డింగ్ కోసం ఫుట్‌బాల్‌ను ఎలా వాడుకుంటున్నారో ఈ బుక్ రివ్యూ కళ్ళకు కట్టింది. బుక్ లవర్స్, సాకర్ లవర్స్ కి బాగా నచ్చే బుక్ ఇది..

అమెరికా , ఇరాన్ మధ్య మళ్లీ డేంజరస్ వార్
యుద్ధం ముగిసిందంటూ యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అనౌన్స్ చేసి 48 గంటలు గడవకుండానే మళ్లీ అమెరికా, ఇరాన్ భీకర దాడులు చేసుకుంటు న్నాయి. రెండు దేశాలు పరస్పర దాడులతో విరుచుకుపడుతున్నాయి. అమెరికా దాడులకు ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. ఈసారి అమెరికా సైనిక స్థావరాలు ఇరాన్ టార్గెట్ చేసింది. అమెరికా మిత్రదేశాలైన కువైట్, బహ్రెయిన్ లను కూడా ఇరాన్ వదలడం లేదు. దీనికి కౌంటర్ గా అమెరికా ఇరాన్ మిసైల్స్ ని, డ్రోన్ స్టోరేజీ స్థావరాలను పేల్చేస్తోంది. అమెరికా ఎయిర్ అటాక్స్ కు మండిపడిన ఇరాన్ ఈ ప్రతిదాడి మొదలు పెట్టింది.

ఫ్రాన్స్‌లో ఎండదెబ్బకు 1,000 మంది మృతి
ఐరోపా ఖండాన్ని వణికిస్తున్న రికార్డు స్థాయి హీట్‌వేవ్ (ఎండతీవ్రత) కారణంగా ఫ్రాన్స్‌లో గత కొన్ని రోజులుగా ఏకంగా 1,000 మందికి పైగా అదనపు మరణాలు నమోదైనట్లు అక్కడి ప్రజారోగ్య సంస్థ నేడు (జూన్ 28న) వెల్లడించింది. దేశంలోని చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్ దాటడంతో ఈ దారుణ పరిస్థితి ఏర్పడింది. మరణించిన వారిలో 85 శాతం మంది 65 ఏళ్లు పైబడిన వృద్ధులే ఉన్నారని అధికారులు తెలిపారు. వాతావరణ మార్పుల వల్లే ఈ తీవ్రమైన పరిస్థితి తలెత్తిందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

పర్యావరణంలో మార్పులు -డేంజర్ లో చింకారాలు
వాతావరణంలో వస్తున్న వేగవంతమైన మార్పుల వల్ల దేశంలో అరుదైన 'చింకారా' (జింకల జాతి) జాతి అంతరించిపోయే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడం, వర్షపాతంలో మార్పుల వల్ల ఇవి నివసించే అటవీ, పొడి ప్రాంతాలు దెబ్బతింటున్నాయని పరిశోధకులు వెల్లడించారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఈ మూగజీవుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని, వీటి రక్షణకు తక్షణమే ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

జెండర్ పెయిన్ గ్యాపే మహిళల ఆరోగ్యానికి అసలు సమస్య !
వైద్య రంగంలో మగవారితో పోలిస్తే మహిళల శారీరక నొప్పులు, ఆరోగ్య సమస్యలను తక్కువగా అంచనా వేసే ధోరణి ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. దీన్నే 'జెండర్ పెయిన్ గ్యాప్' అంటారు. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న ప్పటికీ, మహిళల సమస్యలను కేవలం మానసిక ఆందోళనగా లేదా సాధారణ విషయంగా కొట్టిపారేయడం వల్ల వారికి సరైన సమయంలో సరైన వైద్యం అందడం లేదు. ముఖ్యంగా ఎండోమెట్రియాసిస్, పీరియడ్స్ నొప్పులు సమస్యల నిర్ధారణకు ఏళ్ల తరబడి సమయం పడుతోంది. వైద్య పరిశోధనల్లో కూడా మహిళల శరీరతత్వంపై తగినంత రీసెర్చ్ జరగకపోవడం ఈ వివక్షకు ప్రధాన కారణం.వైద్య రంగంలో జెండర్ గ్యాప్ తొలగించాల్సిన అవసరముంది.

రెండు ఎయిర్ యాక్సిడెంట్స్ లో 25 మంది మృతి
ఫ్రాన్స్, సౌదీ అరేబియా దేశాలలో జరిగిన రెండు వేర్వేరు విమాన ప్రమాదాల్లో మొత్తం 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈశాన్య ఫ్రాన్స్‌లో స్కైడైవింగ్ శిక్షణ విమానం కూలిపోయి 11 మంది మృతి చెందారు. అలాగే సౌదీ అరేబియాలోని రాస్ తనురా సమీపంలో అరామ్‌కో సంస్థకు చెందిన హెలికాప్టర్ కుప్పకూలడంతో 14 మంది మరణించారు. వాతావరణ పరిస్థితులు, సాంకేతిక లోపాలే ఈ ఘోర ప్రమాదాలకు కారణమని తెలుస్తోంది. ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.

ఇడుపు కాయితం అర్థం పవన్‌కళ్యాణ్ బాగా చెప్తాడు
TG: తెలంగాణ రాకుండా అడ్డుకున్న అనకొండలు, కార్పొరేట్ శక్తులకు పాలు పోసి పెంచుతున్నది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న గుంటనక్కేలేనని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఆదివారం మేడ్చల్ జిల్లా ఉప్పల్‌లో పార్టీ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతుంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు గప్ చుప్ అయ్యాయన్నారు. ఇడుపు కాయితం అర్థం పవన్ కళ్యాణ్‌ను అడిగితే బాగా చెబుతాడని ఎద్దేవా చేశారు. ఉద్యమంలో అవాకులు, చేవాకులు పేలిన వాళ్లే మళ్లీ తెలంగాణపై కుట్ర చేస్తున్నారన్నారు.

హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ కి ఈ ఐదుప్లాన్స్ కంపల్సరీ !
ప్రశాంతమైన రిటైర్మెంట్ కోసం ప్రతి ఒక్కరూ తెలుసు కోవాల్సిన ఆ 5 ముఖ్యమైన పాయింట్లు ఇవే: Retirement Corpus: మీ ప్రస్తుత వార్షిక ఖర్చులకు కనీసం 25 నుండి 30 రెట్లు ఎక్కువ పొదుపు మొత్తం ఉండాలి. Inflation Rate: మీ అంచనాల్లో ద్రవ్యోల్బణాన్ని (కనీసం 6-7%) లెక్కించడం మర్చిపోవద్దు. Withdrawal Rate : రిటైర్ అయ్యాక ఏటా మీ మొత్తం నిధి నుండి 4 శాతానికి మించి ఖర్చు చేయకూడదు. Life Expectancy: 85 నుండి 90 ఏళ్ల వయస్సు వరకు సరిపోయేలా ప్లాన్ చేసుకోవాలి. Health Insurance Cover: అత్యవసర వైద్య ఖర్చుల కోసం కనీసం రూ.10 నుండి 15 లక్షల హెల్త్ కవరేజ్ తప్పనిసరి. ఇలా చేస్తే రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా గడిచిపోతుంది.

డాక్టర్ నంటూ స్టాక్ ట్రేడర్‌కు ₹73 లక్షల నామం!
ఒక కిలాడీ లేడీ తాను పెద్ద డాక్టర్‌నంటూ నమ్మించి, ఓ స్టాక్ ట్రేడర్ (షేర్ మార్కెట్ వ్యాపారి) నుండి ఏకంగా ₹73 లక్షలు కాజేసింది. సోషల్ మీడియాలో పరిచయమైన ఆమె, హై-రిటర్న్స్ వస్తాయంటూ నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్‌తో అతడికి బురిడీ కొట్టించింది. ఆమె మాటలు నమ్మి విడతల వారీగా డబ్బులు పంపి మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదైంది.

‘ట్రామా’పై నోరు విప్పుతున్న జెన్ జీ..
దేశంలో మానసిక గాయాలు (ట్రామా) ఒక నిశ్శబ్ద ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా మారుతున్నాయని రచయిత్రి నిషితా లాంబా తన డెక్కన్ హెరాల్డ్ కథనంలో విశ్లేషించారు. చాలామంది తమ అంతర్గత బాధను లోపలే దాచుకుంటారని, కానీ అది మానసిక, శారీరక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని సైకాలజిస్ట్ పల్లవి మోహన్ అభిప్రాయపడ్డారు. "ట్రామా అనేది కేవలం ఒక చేదు సంఘటన కాదు.. అది మన మనసు లోపల సృష్టించే అలజడి" అని వివరించారు. పాత తరాల వారు ఈ బాధలను దాచడానికి ప్రయత్నిస్తే, నేటి తరం యువత (Gen Z) దీనిపై ఓపెన్‌గా మాట్లాడుతోందని స్పష్టం చేశారు. ఈ అంతర్గత గాయాల నుండి కోలుకోవడానికి స్వీయ అంగీకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.

‘ఖబర్ లహరియా’ నెం.1 రూరల్ మహిళల జర్నల్
గ్రామీణ, దళిత వెనుకబడిన వర్గాల మహిళల నేతృత్వంలోయూపీ బుందేల్ ఖండ్ నుంచి నడుస్తున్న ఏకైక వార్తా సంస్థ ‘ఖబర్ లహరియా’ తమ విజయ ప్రస్థానాన్ని, పుట్టుక కథను ఆసక్తికరంగా పంచుకుంది. కేవలం ఒక చిన్న ప్రింట్ పత్రికగా ప్రారంభమై, డిజిటల్ మీడియా రంగంలో ఒక సంచలనంగా ఎలా ఎదిగిందో వివరించింది. సమాజంలో అణచివేతకు గురైన మహిళలు జర్నలిజంలోకి అడుగుపెట్టి, స్థానిక సమస్యలపై ఎలా పోరాటం చేశారో ఇందులో పేర్కొన్నారు. ఎన్నో సవాళ్లు, అడ్డంకులను దాటుకుని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం స్ఫూర్తిదాయకంగా సాగింది. గ్రామీణ జర్నలిజానికి సరికొత్త అర్థం చెప్పిన వీరి ప్రయాణం ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.

ట్రంప్‌కు కూడా ఫిర్యాదు చేయి.. కేశినేని చిన్ని సెటైర్
AP: బెజవాడ బ్రదర్స్ మాజీ MP కేశినేని నాని వర్సెస్ MP కేశినేని చిన్ని మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. HYDలోని కూకట్‌పల్లి మండలం శంషీగూడలో ప్రభుత్వభూమిని MP చిన్ని కుటుంబానికి చెందిన బినామీ సంస్థ ఆక్రమిస్తోంని CM రేవంత్ రెడ్డికి మాజీ MP నాని ఫిర్యాదు చేశారు. దీనిపై చిన్ని స్పందిస్తూ కౌంటరిచ్చారు. ఈర్ష్య, ద్వేషం, కసి, పగతో నిత్యం రగిలిపోతున్న రెట్టల నాని.. ఇంతకుమించి దిగజారవు అనుకున్న ప్రతిసారి ఇంకా ఇంకా దిగజారుతూనే ఉన్నావని ఫైరయ్యారు. ప్రధానికి, రాష్ట్రపతికి ఇరువురు CMలకు ఫిర్యాదు చేశావ్.. ఇక మిగిలింది ట్రంప్, పుతిన్, కిమ్, KAపాల్ మాత్రమేనన్నారు.

ఆల్ వర్క్ నోప్లే -కంపెనీలపై హైదరాబాద్ టెకీ ఫైర్
హైదరాబాద్‌కు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఆవేదన ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. "అంతా పనే.. అసలు విరామమే లేదు"అంటూ కార్పొరేట్ కంపెనీల పని కల్చర్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. వీకెండ్స్‌లో కూడా రెస్ట్ లేకుండా ప్రాజెక్ట్ డెడ్‌లైన్స్‌తో జీవితం యాంత్రికంగా మారిపో యిందని, వ్యక్తిగత జీవితానికి సమయం దొరకడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ పోస్ట్‌కు వేలాది మంది ఐటీ ఉద్యోగులు మద్దతుగా , తమకు కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయని కామెంట్లు పెడుతున్నారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కరువైందంటూ సాగుతున్న ఈ చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.