Latest

నీటిమట్టం పెరుగుదలపై అప్రమత్తంగా ఉండాలి
AP: ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు ముంపు ప్రాంతమైన గొట్టిపడియ గ్రామాన్ని జిల్లా కలెక్టర్ విజయ సునీత పరిశీలించారు. గ్రామంలో ముంపు పరిస్థితులు, పెరుగుతున్న నీటిమట్టంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. నీటిమట్టం పెరుగుదలపై అప్రమత్తంగా ఉండి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ముంపు పరిస్థితుల్లో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఆయిల్ దొంగతనానికి వెళ్లి 37 మంది మృతి?
నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. పైప్‌లైన్ నుంచి క్రూడ్ ఆయిల్ దొంగిలించేందుకు ప్రయత్నించే టైమ్‌లో టాక్సిక్ గ్యాస్ లీక్ కావడంతో కొందరు చనిపోయారు. రివర్స్ రాష్ట్రంలోని ఒక్రికా ప్రాంతంలో నిన్న అర్ధరాత్రి ఈ ఇన్సిడెంట్ జరిగినట్లు అక్కడి అధికారులు తెలిపారు. YEAC-నైజీరియా ప్రకారం 37 మంది వరకు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరికొందరి ఆచూకీ కనిపించడం లేదని తెలిపింది. ఇంకా ఎంతమంది చనిపోయారన్నది పోలీసులు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఘటనపై ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది.

ప్రజా పాలన కాదు.. దగా పాలన: గండ్ర
TG: కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనకు నిరసనగా బీఆర్‌ఎస్ చేపట్టిన ఆందోళనల్లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చిట్యాల మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా దగా పాలన సాగిస్తోందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు అల్లం రవీందర్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి, ప్రధాన కూడలిలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం రోడ్డుపై వంటావార్పు చేపట్టారు.

పిల్లలతో కలిసి జాతీయ రెజ్లర్ సూసైడ్
‘మహారాష్ట్ర ఆడపులి’గా పేరు తెచ్చుకున్న జాతీయ రెజ్లర్ అశ్విని మనోహర్ పాల్ (30) తన ముగ్గురు పిల్లలతో ధారాశివ్ జిల్లా నల్దుర్గ్ కోటపై నుంచి లోయలోకి దూకారు. ఈ ఘటనలో అశ్విని, ఆమె కుమారుడు, ఒక కుమార్తె చనిపోయారు. మరో చిన్నారి ICUలో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. భర్త, అత్తమామల వేధింపుల వల్లే ఇది జరిగిందని ఆమె తండ్రి ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు.

స్మార్ట్ మీటర్లు బలవంతంగా బిగించొద్దు
AP: తిరుపతి జిల్లాలో స్మార్ట్ మీటర్ల బిగింపు విషయంలో ప్రజల ఇష్టాయిష్టాలను గౌరవించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్లను బలవంతంగా బిగించవద్దని విద్యుత్ శాఖ మంత్రి స్పష్టం చేసినప్పటికీ, ఎస్పీడీసీఎల్ సీఎండీ అందుకు విరుద్ధంగా వ్యవహరించడం సరికాదన్నారు. పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా అపార్ట్మెంట్లలో ప్రజల అంగీకారం లేకుండా మీటర్లు బిగించేందుకు ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. మంత్రి ఒక మాట, సీఎండీ మరో మాట చెప్పడంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.

పశువుల అక్రమ తరలింపుపై పోలీసుల దాడులు
TG: జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి మార్కెట్‌కు అక్రమంగా పశువులను తరలిస్తున్నారన్న సమాచారంతో రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. రెండు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో 57 పశువులు, 5 మహీంద్రా క్యాంపర్ వాహనాలు, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఘటనలకు సంబంధించి 11 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్రమ పశువుల తరలింపుపై సమాచారం అందడంతోనే తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించారు.

రాజ్యాంగ హక్కుల సాధన కమిటీ ఏర్పాటు
TG: మహబూబ్‌నగర్ జిల్లాలో రాజ్యాంగ హక్కుల సాధన నూతన జిల్లా కమిటీని ఏర్పాటు చేశారు. క్రైస్తవులు, ముఖ్యంగా దళిత క్రైస్తవులు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, రాజ్యాంగ హక్కుల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తామని నూతన జిల్లా అధ్యక్షుడు గట్టు డేవిడ్, ప్రధాన కార్యదర్శి జయరాజు తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో కాశపోగు ప్రసాద్, జి.జి. యోనా అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా, పట్టణ కమిటీలను ప్రకటించారు. జిల్లా సలహాదారుగా తిమ్మయ్య, పట్టణ అధ్యక్షుడిగా A. జగన్ తదితరులను ఎన్నుకున్నారు.

డ్రాగన్’లో షాహిద్, ఆలియా?
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘డ్రాగన్’లో బాలీవుడ్ స్టార్స్ షాహిద్ కపూర్, ఆలియా భట్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్‌కి పోటీగా షాహిద్ విలన్ రోల్ చేస్తుంటే, RRR తర్వాత ఆలియా మళ్లీ ఎన్టీఆర్‌తో ఒక పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనుందట. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ నుంచి త్వరలోనే అధికారిక అనౌన్స్‌మెంట్ రానుంది.

దిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో వాటర్ లాగింగ్.. నీటిలోనే ప్యాసింజర్లు
ఈరోజు దిల్లీలో భారీ వర్షాలకు IGI ఎయిర్‌పోర్ట్‌లో వాటర్ లాగింగ్ జరిగింది. టెర్మినల్-3 ఎంట్రీ గేట్ల దగ్గర నీరు భారీగా చేరడంతో ప్యాసింజర్లు ఇబ్బందులు పడ్డారు. కొందరు ప్యాంట్లు పైకి మడుచుకుని, లగేజ్ ట్రాలీలను నీటిలోనే తోసుకుంటూ గేట్ల దగ్గరకు వెళ్లారు. నీటి లెవల్ తగ్గే వరకు ప్యాసింజర్లు కొంతసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. దిల్లీకి IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలు, థండర్‌స్టార్మ్స్, బలమైన గాలులు ఉంటాయని హెచ్చరించింది.

మల్దకల్‌లో బీఆర్‌ఎస్ వంటావార్పు
TG: జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. బీఆర్‌ఎస్ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు నేతృత్వంలో పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించి, బస్‌స్టాండ్ వద్ద వంటావార్పు చేపట్టారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి 1000 రోజుల పాలన అంటూ సంబరాలు చేసుకోవడాన్ని బీఆర్‌ఎస్ నాయకులు తప్పుబట్టారు.

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.

సూరసముద్రం చెరువు పరిరక్షణకు చర్యలు
TG: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ పట్టణంలోని సూరసముద్రం చెరువును మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్, కమిషనర్ రాఘవేందర్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. చెరువులో పేరుకుపోయిన చెత్తాచెదారం, వ్యర్థాలను పరిశీలించి మున్సిపల్ సిబ్బందితో శుభ్రం చేయించారు. చెరువును పరిశుభ్రంగా, సుందరంగా కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పత్య నాయక్ అన్నారు. చికెన్, మటన్, చేపల వ్యర్థాలు, ఆసుపత్రుల సిరంజీలు, గాజు ముక్కలు తదితరాలను చెరువులో వేయొద్దని సూచించారు. ‘మన ఊరు–మన చెరువు’ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని కోరారు.

బెల్ట్ షాపుల నియంత్రణకు గ్రామపంచాయతీ తీర్మానం
TG: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మజీద్‌పూర్‌లో అక్రమ బెల్ట్ షాపుల నియంత్రణకు గ్రామపంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసింది. గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయించే కేంద్రాలపై నిఘా ఏర్పాటు చేసి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ తీర్మాన ప్రతిని ఎస్సై సైదులుకు అందజేశారు. బెల్ట్ షాపుల కారణంగా మహిళలు, యువత ఇబ్బందులు పడుతున్నారని, కుటుంబాల్లో సమస్యలు తలెత్తుతున్నాయని సర్పంచ్ మేడిపల్లి ప్రియా చంద్రశేఖర్ తెలిపారు. ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పారు.

70 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
TG: నాగర్ కర్నూల్ జిల్లాలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యారంగానికి విశిష్ట సేవలు అందిస్తున్న 70 మంది ఉత్తమ ఉపాధ్యాయులను జిల్లా స్థాయిలో ఘనంగా సన్మానించనున్నట్లు డీఈఓ రమేష్ కుమార్ తెలిపారు. బోధనా ప్రతిభ, విద్యార్థుల విద్యాభివృద్ధికి చేసిన కృషి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 5న మధ్యాహ్నం 3 గంటలకు ఐడీఓసీ మీటింగ్ హాల్‌లో జిల్లా స్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు డీఈఓ తెలిపారు.

రోజూ న్యూడుల్స్ తింటున్నారా?
తరచూ ఇంట్లోనే న్యూడుల్స్ తయారు చేసుకొని తినడం పిల్లలతోపాటు పెద్దలకూ అలవాటు. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదని పోషకాహార నిపుణులు అంటున్నారు. 75 గ్రాముల న్యూడుల్స్‌లో 750 మిల్లీగ్రామ్స్ సోడియం, 6.2 గ్రాముల స్యాచురేటెడ్ ఫ్యాట్ ఉన్నాయి. వీటిని తరచూ తింటే స్యాచురేటెడ్ ఫ్యాట్ పెరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. న్యూడుల్స్‌ని విడిగా తీసుకోకుండా, కూరగాయలు, గుడ్డు వంటి పోషకమైన పదార్థాలతో కలిపి తీసుకోవడం బెటర్ అని అంటున్నారు.

గద్వాలను కరువు జిల్లాగా ప్రకటించాలి: CPM
TG: జోగులాంబ గద్వాల జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులకు ప్రత్యామ్నాయ పరిరక్షణ చర్యలు చేపట్టాలని CPM రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్.శ్రీరామ్ నాయక్ డిమాండ్ చేశారు. గద్వాలలో జరిగిన CPM జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో నీటిని సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నామని విమర్శించారు. రైతుల భూసమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని, ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజులను నియంత్రించాలని కోరారు.
సంక్షేమమే మా టార్గెట్ : వినయ్‌రెడ్డి
TG : సంక్షేమం, అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి పొద్దుటూరి వినయ్‌రెడ్డి అన్నారు. నందిపేట్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు, ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ వంటివి అమలు చేస్తున్నామని చెప్పారు. 15 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చి సన్నబియ్యం అందిస్తున్నామని, రూ.21 వేల కోట్ల రుణమాఫీతో పాటు సన్నబియ్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు.

భారత్ 7.8 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తోందా?
భారత GDP(Gross Domestic Product) 7.8 శాతం వృద్ధి నమోదు చేసిందని లెక్కలు చెబుతున్నా, రియాలిటీ వేరేగా ఉందని ఆర్థిక విశ్లేషకుడు వివేక్ కౌల్ అన్నారు. దేశంలో 56.2 శాతం మంది తక్కువ ఆదాయాలతో కూడిన అసంఘటిత రంగంలో ‘Self-Employed’గా ఉన్నారని చెప్పారు. వ్యవసాయంపై ఆధారపడినవాళ్లు ఇంకా 43 శాతంగానే ఉన్నారని, Manufacutory రంగం ఉపాధి 12.1 శాతానికే పరిమితమైందని వివరించారు. కోట్లాది మంది యువత ఖాళీగా ఉండటం వల్ల హెడ్‌లైన్ వృద్ధి సంఖ్యలు సాధారణ ప్రజల వాస్తవ ఆర్థిక స్థితిని పూర్తిగా రిఫ్లెక్ట్ కాలేదని చెప్పారు.

కర్రెగుట్టల్లో IED బ్లాస్ట్.. గిరిజనుడు మృతి
TG: ములుగు జిల్లా కర్రెగుట్టల్లో మావోయిస్టులు పెట్టినట్లు అనుమానిస్తున్న IED (ప్రెషర్ బాంబు) పేలడంతో ఓ గిరిజనుడు మృతి చెందాడు. నూగూరు గ్రామానికి చెందిన నాగేశ్వరరావు మరో ఐదుగురితో కలిసి వెదురుబొంగుల కోసం అడవికి వెళ్లారు. తిరిగి వస్తుండగా IEDపై కాలు పడటంతో బ్లాస్ట్ జరిగింది. గాయపడిన నాగేశ్వరరావును తోటి వారు గ్రామానికి తీసుకెళ్తుండగా దారి మధ్యలోనే చనిపోయారు. సెప్టెంబర్ 2న ఈ ఇన్సిడెంట్ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

FCRA సవరణ బిల్లు పరిశీలనకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC)
The Foreign Contribution (Regulation) Act (FCRA) సవరణ బిల్లు 2026ను పరిశీలించేందుకు 31 మంది సభ్యులతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC) ఏర్పాటు చేశారు. బీజేపీ ఎంపీ డా.సంజయ్ జైస్వాల్ నేతృత్వంలోని ఈ కమిటీలో లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులున్నారు. విదేశీ నిధులపై పర్యవేక్షణను మరింత కఠినతరం చేయడం, సంస్థల రిజిస్ట్రేషన్ ముగిసిన తర్వాత వాటి ఆస్తుల నిర్వహణ వంటి అంశాలను కమిటీ పరిశీలిస్తుంది. వివిధ వర్గాల ఒపీనియన్స్ తీసుకుని శీతాకాల సమావేశాల తొలి వారంలో ఈ కమిటీ రిపోర్ట్ ఇవ్వనుంది.

షాద్‌నగర్‌లో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి
TG: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో బాలగోకుల సమితి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో సందడి చేసి ఆకట్టుకున్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ లక్ష్మీనారాయణ చిన్నారులను అభినందించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, అందె బాబయ్య, డాక్టర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు, వేడుకలతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.