Latest

డేటింగ్ యాప్ లు ఉన్నా జెన్ జీ ని వేధిస్తున్న లోన్లీ నెస్ !
డేటింగ్ యాప్‌ల వాడకం విపరీతంగా పెరిగినప్పటికీ, యువతలో ఒంటరితనం వేధిస్తోందని ‘ది ఎకనామిక్ టైమ్స్’ కథనం పేర్కొంది. ఆన్‌లైన్‌లో వేలాది ప్రొఫైల్స్ అందు బాటు లో ఉండటం వల్ల ఒకరితో స్థిరమైన బంధాన్ని ఏర్పరచుకునే సామర్థ్యం దెబ్బ తింటోందని సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా ‘జెన్ జీ (Gen Z)’ యువత పార్ట్ నర్ ని ఎంచుకునే విషయంలో మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకుంటూ, చివరికి తీవ్ర నిరాశకు గురవుతున్నారని ఈ రిపోర్ట్ తెలిపింది.

వంద రోజులు దాటినా ఆగని ఇరాన్, యూఎస్ వార్ !
ఇరాన్, అమెరికా మధ్య మొదలైన చిచ్చు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇవాల్టితో వంద రోజులు గడచిపోయినా నేటికీ ఇంకా ఈ క్రైసిస్ కంటిన్యూ అవుతోంది. ఇరాన్ తమ నేత సుప్రీం లీడర్ ఆలీ ఖమైనీ ని కూడా ఈ యుద్ధం లో పోగొట్టుకుంది. ఇరాన్, లెబనాన్, ఇతర గల్ఫ్ దేశాల్లో ఇప్పటివరకు 7వేల మందికి పైగా మరణించారు. పశ్చిమాసియాలో ఆయిల్, గ్యాస్ ప్రొడక్షన్, సప్లైకి ఆటంకాలతో ఇండియా సహా ప్రపంచ దేశాలు చమురు కొరతతో అల్లాడుతున్నాయి. అయినా ఇప్పట్లో యుద్ధానికి తెరపడే పరిస్థితులు కనిపించడం లేదు.

జోజిలా టన్నెల్ తుది బ్రేక్ త్రూకు అంతా రెడీ
జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను నిత్యం అనుసంధానించే ప్రతిష్ఠాత్మక 'జోజిలా టన్నెల్' ప్రాజెక్ట్ తుది బ్రేక్ త్రూకు సిద్ధమైంది. జూన్ 9న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. మేఘా ఇంజనీరింగ్ నిర్మిస్తున్న ఈ 13.153 కిలోమీటర్ల టన్నెల్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మితమవుతున్న పొడవైన సింగిల్-ట్యూబ్ ద్విముఖ రహదారి సొరంగంగా చారిత్రాత్మక మైలురాయిని సృష్టించబోతోంది.

స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ మా అణుబాంబు - ఇరాన్
అమెరికాతో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ అలీ నిక్జాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘హార్ముజ్ జలసంధి’ ఇరాన్ పాలిట అణు బాంబు లాంటిదని అన్నారు. ప్రపంచ ముడి చమురు రవాణాలో అత్యంత కీలకమైన ఈ జలసంధిపై తమకున్న వ్యూహాత్మక పట్టును అమెరికా, దాని మిత్రదేశాలకు వ్యతిరేకంగా ఒక శక్తివంతమైన ఆర్థిక అస్త్రంగా (డిటెరెన్స్) ఉపయోగిస్తామని ఇరాన్ ఈ ప్రకటన తో హెచ్చరించింది.
తిరుమల రెండో కనుమదారిలో ఎలుగు బంటి హల్చల్
తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో కనుమదారిలో ఎలుగు బంటి హల్చల్ చేసింది. అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి కిలోమీటరు దూరంలో ఉండే వినాయక ఆలయం వద్ద సంచరించింది. తినుబండారాల కోసం చెత్తకుండీల వద్ద తిరుగుతున్న ఎలుగ బంటిని చూసిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న అటవీశాఖ, విజిలెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకొని ఎలుగు బంటిని అటవీ ప్రాంతంలోకి మళ్లించారు.

మధ్యప్రదేశ్ లో ఘోరం... రోగికి అంబులెన్స్ ఇవ్వని ఆస్పత్రి
మధ్యప్రదేశ్‌లోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి (MY) లో మానవత్వం మంటగలిసింది. ఇండోర్ లో వెన్నెముక సమస్యతో బాధపడుతున్న 12 ఏళ్ల ఆదర్శ్‌ను కిలోమీటర్ దూరంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి షిఫ్ట్ చేయడానికి స్టాఫ్ అంబులెన్స్ ను కానీ, సిబ్బందిని కానీ ఇవ్వలేదు. దీంతో ఎండలోనే స్ట్రెచర్ పై ఉన్న బాలుడిని తండ్రి లాగుతూ తీసుకెళ్లగా, తల్లి చున్నీని నీళ్లలో ముంచి కొడుకు బాడీని తడుపుతూ తీసుకెళ్లారు.. తీరా వెళ్లాక అవసరం లేదంటూ మళ్ళీ వెనక్కి పంపడంతో తల్లిదండ్రులు నరకం చూశారు.

అమెరికాలో దారుణం.. ఫేక్ పిజ్జా ఆర్డర్ తో తెలంగాణ యువకుడి దారుణ హత్య
తెలంగాణకు చెందిన 28 ఏళ్ల అన్షుల్ కుంచా అమెరికాలో దారుణ హత్యకు గురయ్యాడు. ఓ మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తూనే, అడిషనల్ ఇన్ కమ్ కోసం వీకెండ్స్‌లో పిజ్జా డెలివరీ చేసేవాడు. ఫిలడెల్ఫియాలో అర్ధరాత్రి వచ్చిన పిజ్జా ఆర్డర్‌ను డెలివరీ చేయడానికి వెళితే కొందరు అతనిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి చంపేశారు. పోలీసుల దర్యాప్తులో ఆ అడ్రస్ ఖాళీ ఇంటిదని పోలీసులు గుర్తించారు. సీసీటీవీలో ఇద్దరు అనుమానితులు అతడిని వెంబడించినట్లు కనిపించింది. డబ్బు, వస్తువులు ఏవీ దోచుకోకపోవడంతో ముందే పన్నిన ఉచ్చేనని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.

గూగుల్ మ్యాప్స్ ట్రాప్ టౌన్స్ గురించి మీకు తెలుసా ?
మీరు ఎప్పుడైనా గూగుల్ మ్యాప్స్‌లో చూపిస్తున్న ఒక ఊరికి వెళ్లి, అక్కడ అసలు ఏమీ లేకపోవడం గమనించారా? వీటిని ట్రాప్ టౌన్స్ లేదంటే ఘోస్ట్ సిటీస్ అంటారు. నిజానికి ఇవి మ్యాప్స్ తయారు చేసే కంపెనీలు కావాలనే సృష్టించే నకిలీ నగరాలు. వేరే కంపెనీలు తమ మ్యాప్ డేటాను కాపీ కొట్టకుండా పట్టుకోవడానికి ఈ ట్రిక్ ఉపయోగిస్తారు. ఒకవేళ వేరే మ్యాప్‌లో కూడా ఈ నకిలీ నగరం కనిపిస్తే వారు డేటా దొంగిలించారని కోర్టులో ఈజీగా నిరూపించవచ్చు. అయితే ఆ కంపెనీలు ఇలా చేస్తున్నాయని ఓపెన్ గా చెప్పవు. కేవలం ఒక కాపీరైట్ రక్షణ కోసం లేని ఊర్లను సృష్టించడం నిజంగా ఒక మైండ్ బ్లోయింగ్ క్రియేటివిటీ కదా!

సినీ ఇండస్ట్రీకి బిచ్చగాడు నటుడు గుడ్ బై !
బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటుడు విజయ్ ఆంటోనీ త్వరలో మూవీస్ గుడ్ బై కొట్టనున్నారు. ఈ నెల19న ఆయన కొత్త సినిమా నూరుసామి..తెలుగులో వంద దేవుళ్లు విడుదల కానుంది. ఈ మూవీ ప్రొమోషన్లలో ఆయన మాట్లాడుతూ మరో రెండు మూడేళ్లలో చెన్నై విడిచిపెట్టి గ్రామంలో సెటిల్ అవాలని అనుకుంటున్నట్టు చెప్పారు. పొల్లాచ్చి లాంటి ప్రాంతంలో భూమి కొనుక్కొని ఉంటే స్వచ్ఛమైన వాతావరణంలో ఉండవచ్చునని చెప్పారు. మూడేళ్ల క్రితం ఆయన కుమార్తె ఆత్మహత్య తర్వాత విజయ్ ఆంటోని సినిమాలు బాగా తగ్గించాడు.

ఎంపీ సీటుకోసం మమత గంగూలీని వాడుకున్నారా?
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్ సంక్షోభంలో పడింది. ఈ క్రమంలో మమతా బెనర్జీ లోక్‌సభ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు వీలుగా, ఎంపీ యూసుఫ్ పఠాన్‌తో రాజీనామా చేయించాలని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని కోరినట్లు వార్తలొచ్చాయి. అయితే, ఈ ప్రచారాన్ని గంగూలీ, పఠాన్ ఇద్దరూ తీవ్రంగా ఖండించారు. అవన్నీ కేవలం అవాస్తవాలని, నిరాధారమైన రూమర్స్ అని కొట్టిపారేశారు.

బెంగాల్ ఐకానిక్ బాపూజీ కేక్.. దీని క్రేజ్ వెనుక సీక్రెట్ ఇదే!
మోడ్రన్ పేస్ట్రీలు, బేకరీ ఫుడ్స్ ఎన్ని రకాలు వచ్చినా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఐకానిక్ బాపూజీ కేక్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. 1973లో కోల్‌కతాలో ప్రారంభమైన ఈ కేక్ బ్రాండ్ మిలీనియల్స్, GenZ యూత్‌ను ఒకేలా ఆకట్టుకుంటోంది. ఇదొక బడ్జెట్ ఫ్రెండ్లీ కేక్. దీని ధర రూ.5 లేదంటే రూ.6 అంతే. నాణ్యత, నోరూరించే టేస్ట్ విషయంలో దశాబ్దాలుగా ఒకేలా ఉండటమే దీని సక్సెస్ సీక్రెట్. స్కూల్ రోజుల్లో ఈ కేక్ తిన్న మిలీనియల్స్‌కు ఇది ఒక ఎమోషన్ అయితే, నేటి జెన్‌జీ జనరేషన్‌కు ఇదొక బడ్జెట్ ఫ్రెండ్లీ గో-టు స్నాక్‌గా మారింది. SMలో ఈ వింటేజ్ కేక్ ఎప్పుడూ ఒక ట్రెండింగ్ టాపికే

స్పేస్ లో డేటా సెంటర్స్ - ఎలన్ మస్క్ కొత్త ప్రయోగం..
ఎలోన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ (SpaceX) కేవలం రాకెట్లే కాకుండా, సాంకేతిక రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపింది. తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగం ద్వారా భూమిపైనే కాకుండా, అంతరిక్ష కక్ష్యలో "ఆర్బిటల్ డేటా సెంటర్లు" (Orbital Data Centers) నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం గూగుల్‌తో ఏకంగా నెలకు 920 మిలియన్ డాలర్ల క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ వినూత్న ప్రయోగం గ్లోబల్ డేటా నెట్‌వర్క్‌ను పూర్తిగా మార్చేయనుంది.

ఒకేసారి నలుగురు లేడీ సీజేలుగా ప్రమాణం -అయినా ఇంకా వివక్షే !
దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఒకేసారి నలుగురు మహిళా న్యాయమూర్తులు వివిధ హైకోర్టులకు చీఫ్ జస్టిస్‌లుగా బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ మీనాక్షి మదన్ రాయ్ (పాట్నా), జస్టిస్ సునీతా అగర్వాల్ (గుజరాత్), జస్టిస్ రేఖ బోరాలా (మేఘాలయ), జస్టిస్ లీలా సేథ్ (ఆంధ్రప్రదేశ్) ఈ ఘనత సాధించారు. అయితే, ఉన్నత న్యాయస్థానాల్లో ఇప్పటికీ పురుష జడ్జీల ఆధిపత్యమే కొనసాగుతుండటంతో లింగ వివక్ష ఇంకా కంటిన్యూ అవుతోందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

దళితుడిని బావిలో తల్ల కిందులుగా వేలాడదీసి....
హర్యానాలోని హిసార్ జిల్లాలో దొంగతనం నెపంతో 32 ఏళ్ల దళిత యువకుడిని గ్రామస్థులు బావిలో తలకిందులుగా వేలాడదీసి, కర్రలతో అమానుషంగా దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన అతడిని హాన్సి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘోరానికి సంబంధించి ఐదుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజికంగా తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

కొత్త ట్రెండ్… డిజిటల్ డిటాక్స్ హోటల్స్
ఫోన్ లేకుండా ఒక్క నిముషం కూడా మనం గడపలేం. దీంతో బుర్రంతా వేడెక్కిపోయి స్ట్రెస్ పెరిగిపోతోంది. అందుకే నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో డిజిటల్ డిటాక్స్ హోటల్స్ ట్రెండ్ ఊపేస్తోంది. ఈ హోటల్స్‌లోకి అడుగుపెట్టగానే మీ స్మార్ట్‌ఫోన్, లాప్‌టాప్‌లను రిసెప్షన్‌లో లాకర్లలో పెట్టేయాలి. అక్కడ వైఫై ఉండదు, టీవీలు కూడా ఉండవు. కేవలం పుస్తకాలు చదవడం, తోటపని చేయడం, ప్రకృతిని ఆస్వాదించడం మాత్రమే చేయాలి. మొదట్లో కాస్త కష్టంగా అనిపించినా, ఇక్కడికి వచ్చి వెళ్తున్న పర్యాటకులు మానసిక ఒత్తిడి తగ్గి, ప్రశాంతంగా ఉంటోందని చెబుతున్నారు.
పెద్దికి క్లీంకార సర్ ప్రైజ్
రామ్ చరణ్ నటించిన పెద్ది సూపర్ హిట్ కావడంతో కొణిదెల, కామినేని ఫ్యామిలీలు సంబరాల్లో మునిగిపోయాయి. చంద్రుడిలో చుక్క పాటకు చరణ్ కజిన్స్ అందరూ డ్యాన్స్ చేశారు. ఆ వీడియోలో కుమార్తె క్లీంకార ముద్దు ముద్దుగా This is for you naanna love you nanna అని ఆడియో ఇచ్చింది. ఉపాసన ఈ వీడియో షేర్ చేయడంతో ఒక్కసారిగా అది వైరల్ గా మారింది.

జీతం రూ. 6 వేలు.. ఇంట్లో నగదు రూ. 2 కోట్లు
ఒడిశాలో కేవలం ఆరు వేల రూపాయల స్వల్ప జీతంతో 1999లో కెరీర్ ప్రారంభించిన ఒక ప్రభుత్వ అసిస్టెంట్ ఇంజనీర్ ఆస్తుల విలువ చూసి విజిలెన్స్ అధికారులే విస్తుపోయారు. ఆదాయానికి మించి ఆస్తుల్ని కలిగి ఉన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బైకుంఠ నాథ్ బెహెరాపై విజిలెన్స్ అధికారులు జరిపిన దాడుల్లో ₹2.4 కోట్ల నగదు, 5 బహుళ అంతస్తుల భవనాలు, మొత్తం 14 స్థలాలు, 341 గ్రాముల బంగారం, ₹45 లక్షల బ్యాంక్ డిపాజిట్లు బయటపడ్డాయి. ఆయనపై విచారణ జరుగుతోంది.

రాజకీయాల్లోకి లారెన్స్... త్వరలో బిగ్ అనౌన్స్ మెంట్
సినీ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన ఇన్ డైరెక్ట్ గా చెప్పారు. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నికల్లో TVK తరఫున లారెన్స్ పోటీ చేయబోతున్నారనే ప్రచారంపై స్పందించారు. ప్రస్తుతం Benz సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నానని, షూటింగ్ పూర్తయ్యాక తన జీవితానికి సంబంధించిన ఓ కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. "అమ్మ ఆశీర్వాదంతో పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నా" అదేమిటో గురువారం ప్రకటిస్తానని SMలో పోస్టు పెట్టారు. సో ఆయన తిరుచ్చి నుంచి పోటీ పడడం దాదాపుగా ఖరారైనట్టే.

అర్హతకి మించి విద్యార్హత ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలకు పనికి రారు : సుప్రీం
ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో అర్హతగా ఏం చదవాలని చెప్పారో వారినే తీసుకోవాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అంతకంటే ఎక్కువ చదువుకుంటే వారు ఆ పోస్టుకి అర్హులు కారని తీర్పు చెప్పింది. తమిళనాడు బ్యాంకులో టెంపరరీ అటెండర్ పోస్టుకు ఉద్యోగం పొందిన డిగ్రీ హోల్డర్ వ్యక్తి కేసులో సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. ఉద్యోగం నుంచి అతడిని తొలగించడాన్ని జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ ఆర్. మహదేవన్‌ల బెంచ్ సమర్థించింది. కావాల్సిన దానికంటే అధిక విద్యార్హత ఉన్నవారికి ఉద్యోగాలిస్తే తక్కువ చదువుకున్నవారు, నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని సుప్రీం వ్యాఖ్యానించింది.

లిక్కర్ షాపులే పార్టీల ATMలా మారాయా? సీఎం విజయ్ సంచలన నిర్ణయం
తమిళనాడు సీఎం విజయం తన తొలి కేబినెట్ సమావేశంలోనే ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే TASMAC మద్యం దుకాణాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. TASMAC ద్వారా పొలిటికల్ పార్టీలకు అక్రమ మార్గాల్లో ఫండ్స్ వసూలు చేసే విధానానికి చెక్ పెట్టారు. ప్రభుత్వ అంచనా ప్రకారం, TASMAC వ్యవస్థలో నెలకు సుమారు ₹102 కోట్లు అనధికారికంగా పార్టీ ఫండ్ పేరుతో మళ్లుతోంది. గత 5 ఏళ్లలో దాదాపు ₹1,600 కోట్లు ప్రభుత్వ ఖజానాకు నష్టం వచ్చింది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడితే ఎలాంటి వారిని వదలవద్దని, వెంటనే అందరినీ అరెస్ట్ చేయాలని విజయ్ ఆదేశించారు.

మళ్లీ బండ పడింది… గ్యాస్ సిలండర్ పై రూ.29 పెంపు
సామాన్యుల నెత్తి మీద మళ్లీ గ్యాస్ ధరల బండ పడింది. డొమస్టిక్ LPG సిలిండర్ ధరపై రూ.29 పెరిగింది. కొత్త ధర ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది. అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి. ఈ పెంపుతో హైదరాబాద్ లో ధర దాదాపుగా వెయ్యికి చేరువలో ఉంది. ఇప్పటికే పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యు ప్రజలకి ఇది మరింత భారం కానుంది