Latest

చెల్పూర్‌లో కంప్యూటర్ ల్యాబ్.! విద్యా నైపుణ్యాలకు ప్రాధాన్యం
కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ మండలం చెల్పూర్‌లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శుభవార్త. మంగళవారం ఆ పాఠశాలలో కొత్తగా కంప్యూటర్ ల్యాబ్‌ను MEO శ్రీనివాస్ ప్రారంభించారు. ఆధునిక సాంకేతిక విద్య అందించేందుకు ఇదొక మంచి అడుగు. అనంతరం ఆయన తరగతి గదులు పరిశీలించి, విద్యార్థుల ప్రగతిని తెలుసుకున్నారు. వారి చదవడం, రాయడం, సంఖ్యా పరిజ్ఞానాన్ని పరీక్షించి, ఉపాధ్యాయులతో చర్చించారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సమావేశంలో మాట్లాడుతూ, "ప్రాథమిక నైపుణ్యాలను చిన్నతనం నుంచే పెంపొందించాలి" అని సూచించారు.

ముద్ర యోజన పేరుతో.. 6 లక్షల మోసం!
హనుమకొండ జిల్లా, భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్ గ్రామంలో ఓ షాకింగ్ మోసం వెలుగులోకి వచ్చింది. వడ్డేపల్లి, జనార్ధన్ కు 'ప్రధానమంత్రి ముద్ర యోజన' పేరుతో ఫోన్ చేసి, లోన్ ఇప్పిస్తామని నమ్మించారు.
లోన్ ప్రాసెస్ కోసం డబ్బు కావాలంటూ దశలవారీగా 6 లక్షల రూపాయలు మాయం చేశారు. ఈ మోసం తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, ఎస్సై రాజు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇది ఎంత పెద్ద మోసమో ఊహించడం కష్టమే! మీకు కూడా ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తున్నాయా? Xలో @CyberCrimeCell కి ట్యాగ్ చేసి అప్రమత్తం చేయండి.

‘CPS వద్దు.. OPS ముద్దు’.. HYD లో ఉపాధ్యాయుల ధర్నా
HYD లోని ఇందిరాపార్క్ వద్ద రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల నుంచి తరలివచ్చిన ఉపాధ్యాయులు PRTUTS ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ‘CPS వద్దు.. OPS ముద్దు’ అంటూ నినాదాలు చేశారు. వెంటనే PRC అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ తదితర జిల్లాల నుంచి ఉపాధ్యాయులు భారీగా తరలివచ్చారు. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని MLC శ్రీపాల్ రెడ్డి కోరారు.

ANU స్వర్ణోత్సవ వేడుకలు- పూర్వ విద్యార్థులకు VC ఆహ్వానం
గుంటూరుజిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యా లయంలో బుధవారం నాడు పూర్వ విద్యార్థుల సమ్మేళ నం నిర్వహించనున్నారు. 1976-2026 బ్యాచ్‌లకు చెంది న 3వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, 1,500 మంది హాజరుకానున్నారు.వర్శిటీ పూర్వ విద్యార్థులకు వి.సి గంగాధర్ రావు మీడియా ముఖంగా ఆహ్వానించారు. ఈ స్వర్ణోత్సవ సంబరాలకు యూనివర్సిటీలో చదువు కుని ఒక హోదాలో ఉన్న ప్రముఖులు హాజరు కానున్నారని వి.సి తెలిపారు.కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు జరుగ తున్నాయని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.

ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు విలేజీ సెక్రటరీలకు గాయాలు
శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలం, ధనపురం గ్రామ సమీపంలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు తీవ్రంగా గాయపడ్డారు. బూరగాం పంచాయతీ కార్యదర్శి ఉదయశ్రీ, రొంపివలస కార్యదర్శి ప్రసన్న ఇందులో గాయపడ్డారు. ప్రమాదం తీవ్రతకు స్థానికులు షాక్ అయ్యారు. వెంటనే స్పందించి, క్షతగాత్రులను పాతపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం, వైద్యులు మెరుగైన వైద్యం కోసం ఇద్దరినీ శ్రీకాకుళం తరలించారు. ప్రమాద కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఛలో విజయవాడకు రెడీ..! UTF పోస్టర్ ఆవిష్కరణ
ఉపాధ్యాయులు చలో విజయవాడ పేరిట ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. మంగళవారం గాజువాక మండల విద్యాశాఖ కార్యాలయం వద్ద “ఛలో విజయవాడ” పోస్టర్‌ను UTF నాయకులు ఇమంది, ప్రసాద్, సబ్బారపు, నూకరాజు ఆవిష్కరించారు. స్పెషల్ టెట్‌లో ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు మినహాయింపులు లేవని, దీన్ని నిరసిస్తూ సెప్టెంబర్ 3న విజయవాడలో ధర్నా నిర్వహిస్తున్నారు. మాన్యువల్ పరీక్ష విధానం, అందరికీ 40% పాస్ మార్కులు, సబ్జెక్టు ప్రాధాన్యం, ప్రభుత్వ హామీల మేరకు టెట్ నోటిఫికేషన్‌లో మార్పులు కావాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇసుకతో పవన్ రూపం.. వినూత్న శుభాకాంక్షలు!
EG జిల్లా రంగంపేటలో ఓ వినూత్న కళారూపం ఆకట్టుకుంది. దేవిన శ్రీనివాస్ కుమార్తెలు సోహిత, ధన్యత ఇసుకతో పవన్ కళ్యాణ్ రూపాన్ని తీర్చిదిద్దారు. పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ అద్భుతం చేశారు. 'హ్యాపీ బర్త్ డే పవన్ సార్', 'ప్రజాసేవలో పవన్' అనే సందేశాలు ఇందులో ఉన్నాయి. ఇంత క్రియేటివిటీ చూసి స్థానికులు ఆశ్చర్యంగా నిలబడిపోయారు. ప్రజలతో ముడిపడిన అంశాలపై మీకు కూడా ఇలా పది మంది ముందు ప్రదర్శించే క్రియేటివిటీ ఉంటే మాకు షేర్ చేయండి. మేమూ షేర్ చేస్తాం. ఆల్ ది బెస్ట్

AI చేసిన ఆర్ట్‌కు కాపీరైట్ ఉంటుందా?
AIతో ఒక బొమ్మ తయారు చేయడం ఇప్పుడు పెద్ద విషయం కాదు.. కానీ ఆ బొమ్మ మీద కాపీరైట్ ఎవరిది? ఇదే ప్రశ్న భారత్‌లో ఓ కేసు ద్వారా ముందుకొచ్చింది. DABUS అనే AI సిస్టమ్ రూపొందించిన ‘A Recent Entrance to Paradise’ అనే ఆర్ట్‌వర్క్‌కు కాపీరైట్ కోరగా, భారత కాపీరైట్ కార్యాలయం AIని రచయితగా గుర్తించలేమని స్పష్టం చేసింది. ఆర్ట్ ఒరిజినల్‌గా ఉన్నా.. దాన్ని తయారు చేసిన AIకి చట్టపరమైన రచయిత హోదా ఉండదని తెలిపింది. AI ఆర్ట్ చేయగలదు.. కానీ దానికి చట్టపరమైన హక్కు దక్కాలంటే మనిషి పాత్ర ఎంత ఉండాలి? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న.

ప్లాస్టిక్ వేటలో NSS..! 150 మంది వాలంటీర్ల స్పందన
గుంటూరు జిల్లా ఆచార్య, నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్లాస్టిక్ నిర్మూలనకు భారీ స్పందన వచ్చింది. గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా ఇంజినీరింగ్ కాలేజ్ NSS యూనిట్ ఈ కార్యక్రమం చేపట్టింది. సుమారు 150 మంది వాలంటీర్లు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ, వినియోగాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు.
ప్రిన్సిపాల్ లింగరాజు, NSS కోఆర్డినేటర్ దివ్య తేజోమూర్తి మార్గదర్శకత్వంలో ఈ డ్రైవ్ జరిగింది.

తెరుచుకోని రేషన్ షాపు..
కాకినాడ నగరం, ద్వారక నగర్ లో రేషన్ షాపు మూసి ఉంది. ఉదయం నుంచి ఇంకా తెరవలేదు. నెల ఆరంభం కావడంతో ప్రజలు బియ్యం, పంచదార కోసం వచ్చారు. కానీ షాపు మూసి ఉండడంతో ఆగ్రహంగా మండిపడుతున్నారు. ఒక వృద్ధురాలు డీలర్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. సాయంత్రమైనా షాపు తెరవలేదు.
తక్షణమే అధికారులు స్పందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మీరు కూడా ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్నారా? అయితే కామెంట్ చేయండి.

వేముల్ నార్వలో హైమాస్ట్ లైట్లు..!
రంగారెడ్డి జిల్లా, కేశంపేట మండలం వేముల్ నార్వ, చౌదరి గూడలో ఎమ్మెల్సీ నవీన్, రెడ్డి తన సొంత నిధులతో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేశారు. మంగళవారం గ్రామస్తుల సమక్షంలో ఆయన వాటిని ప్రారంభించారు. ఈ లైట్ల వల్ల రాత్రిపూట గ్రామాలు వెలుగులతో నిండిపోతాయి. స్థానికులు సంతోషంగా, "ఎమ్మెల్సీ తన సొంత డబ్బుతో మా గ్రామాభివృద్ధి చేయడం గొప్ప విషయం" అంటూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేయాలని, ఆయన ఉన్నత పదవులు అధిరోహించాలని గ్రామస్తులు ఆకాంక్షించారు.

లక్ష్మీపూర్ పాఠశాలకు FLN బృందం..!
మంచిర్యాల జిల్లా, లక్షెట్టిపేట మండలం లక్ష్మీపూర్ ప్రభుత్వ పాఠశాలను FLN జిల్లా ప్యానల్ బృందం సందర్శించింది. మంగళవారం వారు ఆ పాఠశాలకు వచ్చి, అక్కడి రికార్డులన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అంతేకాదు, ఉపాధ్యాయుల బోధనా పనితీరును, విద్యార్థుల నేర్చుకునే సామర్థ్యాన్ని కూడా పరిశీలించారు. పాఠశాల HM చంద్రయ్య మరియు టీం లీడర్ మధుకర్ ఈ సందర్శనలో పాల్గొన్నారు. ఈ తనిఖీలో విద్యార్థుల అభ్యసన స్థాయిలు ఎలా ఉన్నాయనేదే ప్రధాన దృష్టి. ఇలాంటి తనిఖీలు రెగ్యులర్ అయితే విద్యాభివృద్ధి ఆగకుండా ఉంటుందని స్థానికులు అంటున్నారు.

క్యాన్సర్ పట్ల అప్రమత్తం..! జడ్జి సూచన
జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో జూనియర్ సివిల్ జడ్జి వినుకొండ, మాధవి క్యాన్సర్ పై కీలక సూచనలు ఇచ్చారు. మంగళవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దివంగత న్యాయవాది చాప, కిషోర్ సంతాప సభలో ఆమె పాల్గొని, "క్యాన్సర్ రాకముందే జాగ్రత్తలు తీసుకోవాలి" అని సూచించారు. వ్యాధి వచ్చిన తర్వాత పోరాడే కంటే ముందస్తు పరీక్షలు, అప్రమత్తతే మేలని స్పష్టం చేశారు.క్యాన్సర్ తో తోటి న్యాయవాది మరణించడం తీవ్ర బాధాకరమని, అందుకే ఆమె న్యాయవాదులకు, ప్రజలకు ఈ సందేశం ఇచ్చారు.

రాహుల్ గాంధీపై కేసు.. సిగ్గుచేటు!
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నా నిర్వహించింది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్, గాంధీపై అక్రమంగా ఎఫ్ఐఆర్ పెట్టడాన్ని నిరసిస్తూ ఈ ఆందోళన జరిగింది. ఎంపీ బలరాం, నాయక్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాహుల్ గాంధీపై ఇలా కేసు పెట్టడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మురళి, నాయక్ ప్రజాస్వామ్య పద్ధతిలోనే పోరాడతామన్నారు. బీజేపీ కుట్రలను ఎండగడతామని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు భూక్య, ఉమా నాయక్ హెచ్చరించారు.

ఓటు మీ హక్కు.. ఈ అవకాశం వదలొద్దు..
నాగర్కర్నూల్ జిల్లా ఓటర్లకు గుడ్ న్యూస్.. కలెక్టర్ హేమంత, కేశవ్ పాటిల్ సెప్టెంబర్ 5,6,12,13 తేదీల్లో ప్రత్యేక ప్రచార రోజులు నిర్వహిస్తున్నారు. కొత్త ఓటర్ల నమోదు, పేరు మార్పులు, చేర్పులు, తొలగింపులు కావాల్సినవారు వెంటనే మీ BLO ను కలవండి. ఎస్‌ఐఆర్ నోటీసులు అందుకున్న ఓటర్లు మాత్రం ధ్రువపత్రాలతో హియరింగ్ కు హాజరు కావాలని కలెక్టర్ సూచించారు. ఇప్పటివరకు జిల్లాలో 1 లక్ష నోటీసులు జారీ అయ్యాయి. ఈ స్పెషల్ డేస్ మిస్ అయితే, మళ్ళీ అవకాశం కష్టమే! ఓటు మీ రాజ్యాంగ హక్కు, దాన్ని వినియోగించుకోవడం మీ బాధ్యత.

ఓ అబ్బ!.. కేపీ కిల్లి పాటకు ఘన ప్రారంభం..!
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో సీనియర్ జర్నలిస్ట్ కేపీ (ఖాజా పాషా) నటించిన 'ఓ అబ్బ వేసుకున్న కిల్లి' పాట ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. పాత జాతీయ రహదారిపై ఉన్న మొబైల్ అడ్డా షాపులో జరిగిన ఈ ఈవెంట్‌కు స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి, శంకర్ ముఖ్య అతిథిగా హాజరై పాటను లాంచ్ చేశారు. ఆనాటి సూపర్ స్టార్స్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ పాటలను స్ఫూర్తిగా తీసుకుని వాటిని నేటి తరానికి అందించడం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు.కష్టాలను ఎదుర్కొంటూ జర్నలిజంలో మంచి పేరు సంపాదించిన కేపీ.. ఇప్పుడు కళారంగంలోనూ అడుగుపెట్టారు.

సీఎం సర్.. మా డబ్బులు మాకివ్వండి! DPలతో ఉద్యమం
AP రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. పీ ఐకాస నేతలు బొప్పరాజు, వెంకటేశ్వర్లు, పలిశెట్టి, దామోదరరావు సోమవారం జిల్లా కలెక్టర్లకు నోటీసులు అందజేశారు. సెప్టెంబర్ 1 నుంచి 'సీఎం సర్.. మా డబ్బులు మాకు ఇవ్వండి' అనే నినాదాన్ని వాట్సాప్ డీపీగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. 5వ తేదీ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామని, 15వ తేదీ నుంచి వర్క్ టు రూల్ చేపడతామని ప్రకటించారు.
తమ సమస్యల పరిష్కారం కోసం ఇది తొలిదశ కార్యాచరణ అని స్పష్టం చేశారు.

దేగామా చెరువు.. ప్రకృతి సోయగాల పండుగ!
ఆదిలాబాద్ జిల్లా, బజార్‌హత్నూర్ మండలం దేగామా గ్రామంలో చెరువు కళకళలాడుతోంది. వర్షాలతో నీటిమట్టం పెరగడంతో ఆ చెరువు సరికొత్త శోభను సంతరించుకుంది. చుట్టూ పచ్చని ప్రకృతి, నీటిలో ఆకాశం ప్రతిబింబం.. ఎంత అద్భుతమో కదా! ఉదయం, సాయంత్రం వేళల్లో ఇక్కడి వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారుతుంది. గ్రామస్తులు ఎంజాయ్ చేస్తూ, చెరువు పరిసరాల్లో సమయం గడుపుతున్నారు. ప్రకృతి ప్రేమికులకు ఇది హెవెన్ లాంటిది! "చెరువులు మన బతుకుకు ఆధారం" అంటూ, వాటి పరిరక్షణే ప్రతి ఒక్కరి బాధ్యత అని స్థానికులు చెబుతున్నారు.

పరకాలలో DS పార్టీ ఆందోళన.. ₹14,000 కోట్లు కావాలి!
హన్మకొండ జిల్లా పరకాలలో ధర్మ సమాజ్ పార్టీ (DSP) నాయకులు ఆందోళనకు దిగారు. మంగళవారం తహసీల్దార్ విజయలక్ష్మి గారికి వినతిపత్రం అందజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ₹14,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా DSP నేత బొచ్చు, నాగరాజు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది విద్యార్థుల నిధులు పెండింగ్ లో ఉండటం బాధాకరమన్నారు.ప్రభుత్వం ఫీజులు సకాలంలో చెల్లించకపోవడంతో BC, SC, ST నిరుపేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మట్టపర్రు రోడ్డులో భారీ గొయ్యి..! డేంజర్ డేంజర్
డా.బి.ఆర్ అంబేడ్కర్, కోనసీమ జిల్లా, రాజోలు మండలంలోని చింతలపల్లి-మట్టపర్రు రోడ్డు ప్రమాదకరంగా మారింది. ఇటీవలే వేసిన ఈ రోడ్డు కృంగిపోయి, భారీ గొయ్యి ఏర్పడింది. దీంతో ఆ రోడ్డు మీదుగా వెళ్లే వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. "వెంటనే అధికారులు స్పందించి రోడ్డు మరమ్మత్తు చేయాలి" అని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది వాహనదారులు ఇక్కడ పడిపోయి గాయపడ్డారని, ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.అధికారులు నిర్లక్ష్యం చేస్తే, ఇక్కడ పెద్ద ప్రమాదం జరగడం ఖాయమంటున్నారు.

డ్రగ్స్‌కు ‘నో’ చెప్పే నేర్పు నేర్చుకోండి!
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ లోని విజ్ఞాన్ డిగ్రీ కళాశాలలో సెప్టెంబర్ 1న డ్రగ్స్ అవేర్‌నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. పాలమూరు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సామ, రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. "ఎవరైనా డ్రగ్స్ తీసుకోమని ఒత్తిడి చేస్తే మొహమాటానికి పోకుండా ధైర్యంగా నో చెప్పండి" అని సూచించారు."ఒక్కసారి తీసుకుంటే ఏమీ కాదు" అనే ఆలోచనే ప్రమాదమని, అది ఆర్థిక, సామాజిక, కుటుంబ సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించారు.