← Back to news

AI చేసిన ఆర్ట్‌కు కాపీరైట్ ఉంటుందా?

By Nani Garikina· 2d ago· Business-standard
AI చేసిన ఆర్ట్‌కు కాపీరైట్ ఉంటుందా?

AIతో ఒక బొమ్మ తయారు చేయడం ఇప్పుడు పెద్ద విషయం కాదు.. కానీ ఆ బొమ్మ మీద కాపీరైట్ ఎవరిది? ఇదే ప్రశ్న భారత్‌లో ఓ కేసు ద్వారా ముందుకొచ్చింది. DABUS అనే AI సిస్టమ్ రూపొందించిన ‘A Recent Entrance to Paradise’ అనే ఆర్ట్‌వర్క్‌కు కాపీరైట్ కోరగా, భారత కాపీరైట్ కార్యాలయం AIని రచయితగా గుర్తించలేమని స్పష్టం చేసింది. ఆర్ట్ ఒరిజినల్‌గా ఉన్నా.. దాన్ని తయారు చేసిన AIకి చట్టపరమైన రచయిత హోదా ఉండదని తెలిపింది. AI ఆర్ట్‌ చేయగలదు.. కానీ దానికి చట్టపరమైన హక్కు దక్కాలంటే మనిషి పాత్ర ఎంత ఉండాలి? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న.

More in Technology