Latest

అరెస్టులు ఆపకపోతే ఊరుకోం: CJP ఆగ్రహం!
అస్సాం, వెస్ట్ బెంగాల్, బిహార్‌లలో ప్రొటెస్టర్లను అరెస్ట్ చేయడంపై CJP స్పోక్స్ పర్సన్ సౌరవ్ దాస్ తీవ్రంగా స్పందించారు. నిరసనకారులపై ఎలాంటి యాక్షన్ తీసుకోమని కేంద్రం హామీ ఇచ్చాకే ప్రొటెస్ట్ ఆపామని, ఇప్పుడు మాట తప్పడం నమ్మకద్రోహమని ఫైర్ అయ్యారు. డిటైన్ చేసిన వారిని మంగళవారంలోగా రిలీజ్ చేసి, ఫైల్ చేసిన FIRలను వెంటనే విత్‌డ్రా చేసుకోవాలని, లేదంటే నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. CJP లీగల్ టీమ్ ప్రొటెస్టర్లకు సపోర్ట్‌గా ఉందని స్పష్టం చేశారు.
ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ తర్వాత తొలిసారి పార్లమెంట్‌కు!
రాజీనామా చేసిన తర్వాత కేంద్ర మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారి పార్లమెంట్‌కు వచ్చారు. సంసద్ గేట్ వద్దే వెయిట్ చేస్తున్న NDA MPలు ఆయనకు ఘనంగా వెల్‌కమ్ చెప్పి మోరల్ సపోర్ట్ ఇచ్చారు. అయితే అదే టైమ్‌లో ఆపోజిషన్ MPలు ఆయనను చూసి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంట్‌కు ఎంట్రీ ఇవ్వగానే, NDA లీడర్లు మాత్రం మద్దతుగా తమ యూనిటీని చూపించారు.
NEET ఉద్యమం.. ఇంకా ఆగలేదు!
NEET ఉద్యమం ముగిసిందనుకునేలోపే మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. బీహార్‌లో నిరసనల్లో పాల్గొన్న దాదాపు 200 మంది విద్యార్థులు ఇంకా పోలీస్ కస్టడీలోనే ఉన్నారని లాయర్లు చెబుతున్నారు. వీరిలో మైనర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఇదే సమయంలో బంద్ సందర్భంగా AK-47తో కాల్పులు జరిపిన ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. దీంతో "విద్యార్థులపై ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు?" అన్న ప్రశ్నలు ఇప్పుడు మరింత గట్టిగా వినిపిస్తున్నాయి.
సొనమ్ వాంగ్‌చుక్ స్పెషల్ మెసేజ్!
సొనమ్ వాంగ్‌చుక్ గుర్గావ్‌లోని వేదాంత హాస్పిటల్ నుంచి ఈ రోజు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం హెల్త్ బెటర్‌గా ఉందన్న ఆయన, సపోర్ట్ చేసిన అందరికీ అండ్ డాక్టర్స్ టీమ్‌కి థ్యాంక్స్ చెప్పారు. లదాఖ్ వెళ్లేముందు ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వెళ్ళి మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తానని, గతంలోనూ ఉద్యమం ముందు రాజ్‌ఘాట్ వెళ్లానని వీడియోలో చెప్పారు. సపోర్ట్ చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.

యూనియన్ బ్యాంకులో 395 ఉద్యోగాల నోటిఫికేషన్
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 395 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. పోస్టు ప్రకారం డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, సీఏ, సీఎంఏ, ఎంటెక్ పాసై, బ్యాంకింగ్ రంగంలో అనుభవం ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. వయసు 22 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు రూ.64,820 నుంచి రూ.1,56,500 వరకు జీతం. ఆసక్తి ఉన్నవాళ్లు ఆగస్టు 10వ తేదీలోపు <a href="https://www.unionbankofindia.bank.in/en/common/recruitment">ఆన్‌లైన్</a>లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ
TG: తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేషన్ డీలర్ల పిటిషన్‌ను కొట్టివేయడంతో పౌరసరఫరాల శాఖ 64.80 లక్షల క్వింటాళ్ల బియ్యాన్ని విడుదల చేసింది. ఆగస్టు 1 నుంచి 15 వరకు రేషన్ పంపిణీ జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
షాకింగ్ వీడియో: బ్రిడ్జి పైనుంచి కిందపడ్డ లారీ!
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా సిన్నార్ వద్ద ఘోర యాక్సిడెంట్ జరిగింది. MIDC బైపాస్ రోడ్డుపై వెళ్తున్న ఓ లారీ సడన్‌గా కంట్రోల్ తప్పి బ్రిడ్జి పైనుంచి కింద పడిపోయింది. ఈ రోడ్ యాక్సిడెంట్‌కి సంబంధించిన విజువల్స్ అక్కడే ఉన్న CCTV కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విజయ్ బాటలోనే ధనుష్?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పాలిటిక్స్‌లోకి వస్తున్నారనే టాక్ తమిళనాడులో గట్టిగా వినిపిస్తోంది. రీసెంట్‌గా చెన్నైలో జరిగిన బ్లడ్ డొనేషన్ క్యాంప్‌లో ధనుష్ ఫ్యాన్స్‌తో మాట్లాడారు. మన యూనిటీని కేవలం ఆడియో ఫంక్షన్లకే పరిమితం చేయకుండా చుట్టుపక్కల ప్రజలకు హెల్ప్ చేస్తూ వెల్ఫేర్ యాక్టివిటీస్ పెంచాలని పిలుపునిచ్చారు. విజయ్ ఆల్రెడీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంతో, ధనుష్ కామెంట్స్ చూస్తుంటే ఆయన కూడా త్వరలోనే రాబోతున్నారని చర్చ నడుస్తోంది.
బీహార్ నిరసనల్లో పోలీసు సస్పెండ్
నీట్ పేపర్ లీక్ పై జూలై 25న సివాన్ జిల్లాలో 'బీహార్ బంద్' జరిగింది. ఆ సమయంలో స్టూడెంట్స్ పై ఓ పోలీసు ఏకే-47 తో ఫైరింగ్ చేసిన వీడియో వైరల్ అయింది. వెంటనే ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు. ఈ గొడవల్లో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో ఆరిఫ్ అనే 15ఏళ్ల కుర్రాడి మెడకి బుల్లెట్ తాకింది. డాక్టర్లు ఆపరేషన్ చేసి దాన్ని బయటకు తీశారు. ప్రస్తుతం గాయపడిన వాళ్లంతా సేఫ్ గానే ఉన్నారు. ఈ ఘటనపై ఎంక్వయిరీ చేస్తున్నామని, రూల్స్ పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.

యునెస్కో (UNESCO) జాబితాలో 'సారనాథ్'కు స్థానం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి సమీపంలోని ప్రాచీన బౌద్ధ క్షేత్రం 'సారనాథ్' యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకుంది. దక్షిణ కొరియాలోని బుసాన్‌లో జరిగిన యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 48వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సారనాథ్ భారతదేశపు 45వ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఈ గుర్తింపు దేశ సాంస్కృతిక వారసత్వానికి అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకువస్తుందని అధికారులు తెలిపారు.

కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన
AP: నారా భువనేశ్వరి కుప్పంలో తన నాలుగు రోజుల పర్యటనను ఈ రోజు మొదలుపెట్టారు. ఇందులో మొదటి రోజు రామకుప్పం మండలం విజిలాపురం జిల్లా పరిషత్ హైస్కూల్ కు వెళ్లి అక్కడి స్టూడెంట్స్ తో కాసేపు గడిపారు. స్కూల్లో చదువులు ఎలా సాగుతున్నాయి, మధ్యాహ్న భోజనం టేస్ట్ ఎలా ఉందో పిల్లలను అడిగి తెలుసుకున్నారు. కష్టపడి బాగా చదువుకుని ఫ్యూచర్ లో గొప్ప స్థాయికి ఎదగాలని ఆమె స్టూడెంట్స్ తో అన్నారు.

గ్రామీణ ఉపాధిలో మహిళల వాటానే ఎక్కువ
దేశంలో అమలు చేస్తున్న విక్షత్ భారత్–గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ (VB-GRAM G) పథకంలో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరిగింది. ఈ పథకం ప్రారంభమైన తొలి 20 రోజుల్లో 63 శాతానికి పైగా మహిళలే పని చేసినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. విస్తృతమైన, సమ్మళిత (Inclusive ) విధానాల వల్ల శారీరక శ్రమకు మించి కొత్త ఉపాధి అవకాశాలు అందుబాటులోకొచ్చాయి. దీంతో మహిళల భాగస్వామ్యం పెరిగిందని అధికారులు తెలిపారు.

మాట తప్పిన కేంద్రం- ప్రొటెస్టుల్లో పాల్గొన్న వారిపై కేసులు
స్టూడెంట్స్ దీక్ష విరమించి 24 గంటలు గడవక ముందే కేంద్రం తన నైజాన్ని బయటపెట్టింది. బీహార్ లో నీట్ పరీక్షల లీకేజీకి వ్యతిరేకంగా బంద్ లాఠీ చార్జికి దారి తీసింది. ర్యాలీ తీస్తున్న స్టూడెంట్స్ ను పోలీసులు చావబాదారు. పలు జిల్లాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సివాన్ లో ఏకంగా స్టూడెంట్స్ పై ఏకే 47 లతో విరుచుకు పడ్డారు. పరిస్థితిని సీజేపి లీడర్ అభిజిత్ దీప్కేకు వివరిస్తూ ఇన్ స్టాలో కంప్లయింట్లు పెరుగుతున్నాయి. నిరసనల్లో పాల్గొన్న వారిపై FIR లు కూడా నమోదవుతున్నాయి.

తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?
ఇప్పుడు IVF అంటే కామన్ అయిపోయింది. కానీ ఒకప్పుడు అదే ప్రపంచానికి పెద్ద మిరాకిల్. 1978 జూలై 25న ప్రపంచంలోనే తొలి టెస్ట్ ట్యూబ్ బేబీగా జన్మించిన లూయిస్ జాయ్ బ్రౌన్ ఇప్పుడు 48 ఏళ్లు పూర్తి చేసుకుంది. అప్పట్లో ఆమె పుట్టుకపై ఎన్నో సందేహాలు, విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఆమె పూర్తిగా ఆరోగ్యంగా ఉండటమే కాదు.. సహజంగానే ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయ్యింది. నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది దంపతులకు పేరెంట్ అయ్యే అవకాశం కల్పిస్తున్న IVF టెక్నాలజీకి లూయిస్ పుట్టుకే అసలు బిగినింగ్ అని చెప్పొచ్చు.

నీట్ ధర్నాలో మంత్రి కూతురు
నీట్ పరీక్షపై జరిగిన ప్రొటెస్ట్ లో మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని స్టూడెంట్స్ ఆందోళన చేశారు. ఈ ధర్నాలో అస్సాం రెవెన్యూ శాఖ మంత్రి కేశబ్ మహంత కూతురు 'దిబిసా' కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేశబ్ మహంత పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ స్పందిస్తూ. ఎదిగిన పిల్లల పనులకు తల్లిదండ్రులను తప్పుపట్టడం కరెక్ట్ కాదని చెప్పారు. నేటి తరానికి సొంత ఆలోచనలు ఉంటాయని, ఆమెను కలిసినప్పుడు దీని గురించి మాట్లాడుతానని సీఎం తెలిపారు.

AIకి మీ గురించి ఎంత తెలుసో తెలుసా..?
ChatGPT, Gemini లాంటి AI chatbots మనం టైప్ చేసే ప్రతి ప్రశ్నను మాత్రమే కాదు.. మన లైక్స్, ఇంట్రెస్ట్స్, పర్సనాలిటీ, అలవాట్లు లాంటి విషయాలను కూడా అంచనా వేయగలవని The New York Times కథనం చెబుతోంది. టెక్ జర్నలిస్ట్ బ్రియన్ ఎక్స్. చెన్.. కేవలం నాలుగు promptsతో AI తన గురించి ఎంత తెలుసుకుందో టెస్ట్ చేయగా, తాను ఎప్పుడూ చెప్పని కొన్ని విషయాలను కూడా AI గుర్తించిందని వెల్లడించారు. AIతో ఎక్కువగా చాట్ చేసే యూజర్లు.. అది తమ గురించి ఎంత సమాచారం అర్థం చేసుకుంటుందో చెక్ చేసుకోవాలని ఎక్సపెర్ట్స్ చెబుతున్నారు.

మళ్ళీ పడిపోయిన గోల్డ్ రేట్స్!
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ప్రైసెస్ కాస్త తగ్గాయి. సోమవారం ఉదయం హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ 10 గ్రామ్స్ గోల్డ్ రేట్ రూ.1,44,920 కి వచ్చింది. అలాగే 22 క్యారెట్ ధర రూ.1,32,840గా ఉంది. మరోవైపు, సిల్వర్ ప్రైస్ Kgకి వంద రూపాయలు తగ్గి రూ.2,39,900 కి చేరింది. అయితే ఈ రేట్స్ ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి కొనేముందు ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.

పోలీస్‌పైకే కారెక్కిచ్చాడు!
హైదరాబాద్ ఆబిడ్స్‌లో డ్రగ్స్ సప్లై చేస్తున్న సాయిఫ్ అనే పెడ్లర్‌ను నార్కోటిక్ పోలీసులు పట్టుకునేందుకు యత్నించగా, కారుతో వారిపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ మహేందర్ కాలు విరగగా, ఇన్స్‌పెక్టర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ వంశీధర్‌లకు గాయాలయ్యాయి. పారిపోతున్న నిందితుడిని అఫ్జల్‌గంజ్ వద్ద పోలీసులు ఛేజ్ చేసి అరెస్ట్ చేశారు. గాయపడిన మహేందర్‌ను యశోద హాస్పిటల్‌కు తరలించి, నిందితుడిపై అటెంప్ట్ టు మర్డర్ కేస్ ఫైల్ చేశారు.
రోడ్డుపై TGPSC OMR షీట్లు!
PVNR ఎక్స్‌ప్రెస్‌వే పై 2018 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ ఒరిజినల్ OMR షీట్లు రోడ్డుపై కుప్పలుగా పడిపోవడం TGPSC నిర్లక్ష్యాన్ని బయటపెట్టింది. అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లు ఉన్న పేపర్లను ముక్కలు చేయకుండానే రీసైక్లింగ్ కోసం విజయవాడకు తీసుకెళ్తుండగా కిందపడిపోయాయి. పోలీసులు పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. పత్రాలను ఇలా రోడ్డుపై పడేయడంపై నిరుద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఘటనపై 3 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని SIని ఆదేశించిన TGPSC బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపింది.

కొమురవెల్లికి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్
TG: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయం తెలంగాణలోని ప్రసిద్ధ శైవక్షేత్రాల్లో ఒకటి. ఈ రైల్వే స్టేషన్‌ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. రూ.6 కోట్ల వ్యయంతో ఈ స్టేషన్‌ను నిర్మించినట్లు ఆయన తెలిపారు. ఈ స్టేషన్ ద్వారా స్వామివారి ఆలయానికొచ్చే భక్తులకు మెరుగైన రైలు రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని అన్నారు.

తిరుపతిలో మొదటి కరోనా కేసు
AP: తిరుపతిలో ఫస్ట్ కరోనా కేసునమోదయ్యింది. ఎస్టీవీ నగర్‌కు చెందిన 65 ఏళ్ల మహిళకు ఆరోగ్య సమస్యలు ఉండటంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లారు. అక్కడ డాక్టర్లు టెస్ట్ చేస్తే కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని డీఎంహెచ్‌వో చెప్పారు.