Latest

కల్తీ మాంసం గుట్టురట్టు.. షాకింగ్ నిజాలు వెలుగులోకి
Crime· 17 Jul 2026

కల్తీ మాంసం గుట్టురట్టు.. షాకింగ్ నిజాలు వెలుగులోకి

TG: హైదరాబాద్‌లోని హబీబ్‌నగర్ PS పరిధిలో మల్లేపల్లి బడే మసీదు వద్ద మహ్మద్ ఉస్మాన్ ఖురేషి మీట్ షాప్‌పై పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. 50కిలోల కల్తీ మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన మాంసాన్ని చెంగిచర్లలోని నేషనల్ మీట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (NMRI) ల్యాబ్‌ తరలించి పరీక్షలు చేయగా.. షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. మేక మాంసంలో గెదే దూడ మాంసం కలిపినట్లుగా నిర్ధారించారు. కల్తీ మేక మాంసాన్ని విక్రయించిన వ్యక్తిపై పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

నకిలీ పత్రాలతో మోసం.. తండ్రీకొడుకుల అరెస్ట్
Crime· 17 Jul 2026

నకిలీ పత్రాలతో మోసం.. తండ్రీకొడుకుల అరెస్ట్

AP: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామానికి చెందిన శ్యామల నర్సారెడ్డి, అతని కుమారుడు శ్యామల గోపీచంద్ రెడ్డి కలిసి మంగళగిరి పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరకే ప్లాట్స్ ఇప్పిస్తామని నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు. నూతక్కి గ్రామానికి చెందిన సంజీవరెడ్డి నుంచి రూ.20 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకుని, వేరొకరి సంతకాలతో నకిలీ విక్రయ ఒప్పంద పత్రాలను సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు. ఇలా పలువురి నుంచి సుమారు రూ.75 లక్షలు మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. తండ్రీకొడుకులను అరెస్ట్ చేశారు.

రాజ్యాంగం గురించి చెప్పే అరుదైన ఈవెంట్‌
AP· 17 Jul 2026

రాజ్యాంగం గురించి చెప్పే అరుదైన ఈవెంట్‌

రాజ్యాంగం అంటే ఏంటి, అది మనకెందుకు ముఖ్యం అని తెలుసుకోవాలనుకునే యూత్ కోసం తిరుపతిలో ఓ స్పెషల్ మీట్ జరగనుంది. జులై 26న (ఆదివారం) రేణిగుంటలోని విష్ణు గ్రాండ్‌లో ఉదయం 11 నుంచి సాయంత్రం 5:30 వరకు "డిగ్నిఫైడ్ ఇండియా" ఈ ఈవెంట్‌ నిర్వహిస్తోంది. లాయర్ శ్రీకాంత్ చింతల, డాక్టర్ ఆరోగ్య నాదుడు, రాజు అరుముగం లాంటి స్పీకర్లు రాజ్యాంగం గురించి, ఈవీఎం-ఓటింగ్ గురించి సింపుల్‌గా వివరిస్తారు. క్వశ్చన్-ఆన్సర్ సెషన్ కూడా ఉంటుంది. తిరుపతి మూవ్‌మెంట్ 21 నిర్వహిస్తున్న ఈ ఫ్రీ ఈవెంట్‌కి యూత్ అందరూ రావొచ్చని నిర్వాహకులు చెప్పారు.

కల్మా హోంవర్క్ ఘటనపై NHRC సీరియస్
Education· 17 Jul 2026

కల్మా హోంవర్క్ ఘటనపై NHRC సీరియస్

TG: హైదరాబాద్ సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్‌లో విద్యార్థులతో కల్మా చదివిస్తున్నట్లు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై NHRC సీరియస్ అయింది. ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని తెలిపింది. మత బోధనలపై స్కూల్ వివరణ ఇవ్వాలని కోరింది. హైదరాబాద్ CP, కలెక్టర్, DEOలకు నోటీసులు ఇచ్చి రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 2వ తరగతి విద్యార్థి డైరీలో ఖురాన్ చదవాలంటూ టీచర్ హోంవర్క్ ఇవ్వడంతో అతడి పేరెంట్స్ స్కూల్‌ యాజమాన్యాన్ని నిలదీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రోహిత్ కెరీర్ ముగియనుందా?
Sports· 17 Jul 2026

రోహిత్ కెరీర్ ముగియనుందా?

భారత క్రికెట్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. 2027 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని BCCI సెలక్టర్లు జట్టులో మార్పులపై చర్చించినట్లు సమాచారం. ఈ క్రమంలో హిట్ మ్యాన్‌ను ఇకపై వన్డేలకు ఎంపిక చేయకూడదనే అభిప్రాయం వ్యక్తమైనట్లు ప్రచారం జరుగుతోంది. బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రోహిత్ శర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ అంశంపై సెలక్టర్లు, కోచ్ గౌతమ్ గంభీర్‌తో సమావేశం జరిగినట్లు వార్తలు వస్తుండగా, అధికారికంగా BCCI నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో NHRC కీలక ఆదేశాలు
AP· 17 Jul 2026

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో NHRC కీలక ఆదేశాలు

AP: సంచలనం సృష్టించిన విజయవాడ గాదె సాయికృష్ణ అనుమానాస్పద కస్టడీ మరణం కేసులో NHRC కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ్మనేని ఫిర్యాదు మేరకు విచారణ కొనసాగిస్తున్న కమిషన్, పోలీసుల నుంచి నాలుగు వారాల్లో రెండో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కస్టడీలో చిత్రహింసలు, అక్రమ నిర్బంధం, CCTV, హార్డ్‌డిస్క్‌లు మార్చి ఆధారాలు ధ్వంసం చేసిన ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయని పేర్కొంది. SIT దర్యాప్తులో కస్టడీ మరణానికి సంబంధించిన అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపింది.

ఆస్తి కోసం అత్తను చంపింది
Crime· 17 Jul 2026

ఆస్తి కోసం అత్తను చంపింది

TG: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం తూర్పుగూడెంలో కొణతం భాగ్యమ్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో మృతురాలి కోడలు మధురనే హత్య చేసినట్లు తేలింది. భాగ్యమ్మకు 6ఎకరాల భూమి ఉంది. భూమిలో వాటా కావాలని కుమార్తె శోభారాణి కోర్టులో కేసు వేసింది. దీంతో అత్తా, కోడళ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అత్తను చంపాలని డిసైడ్ అయిన మధుర, ఆమెను గట్టిగా నెట్టివేసింది. మళ్లీ లేవగా, వెనుక నుంచి చేతులతో మెలివేసి మంచంపైకి నెట్టి చంపినట్లు DSP ప్రసన్నకుమార్ తెలిపారు. మధురను అరెస్ట్ చేశామన్నారు.

రోహిత్ వేముల చట్టాన్ని అమల్లోకి తెస్తాం
TG· 17 Jul 2026

రోహిత్ వేముల చట్టాన్ని అమల్లోకి తెస్తాం

TG: రాష్ట్రంలో రోహిత్ వేముల బిల్లు అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు డిప్యూటీ CM మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ బిల్లుపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయిందని, డిగ్రీ కాలేజెస్, యూనిర్సిటీల్లో వివక్ష రూపుమాపేందుకు రోహిత్ వేముల చట్టాన్ని అమల్లోకి తీసుకు వస్తామని ప్రకటించారు. ముసాయిదా బిల్లుపై ప్రజాభిప్రాయ సేకరణ చేసి తుది రూపమిస్తామని పేర్కొన్నారు. ముసాయిదా బిల్లును త్వరగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు భట్టి తెలిపారు. త్వరలోనే రోహిత్ వేముల బిల్లును అసెంబ్లీలో పెట్టి చర్చిస్తామన్నారు.

సెల్‌ఫోన్ గొడవ.. బాలిక సూసైడ్
Crime· 17 Jul 2026

సెల్‌ఫోన్ గొడవ.. బాలిక సూసైడ్

AP: కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం గ్రామానికి చెందిన జేమ్స్ కుమార్తె లావణ్య (15) స్థానిక ZPHSలో 9వ తరగతి చదువుతోంది. ఆమె అన్న చరణ్ కూడా అదే స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. పాఠశాల ముగిసిన తర్వాత ఇద్దరూ ఇంటికి వచ్చి సెల్ ఫోన్ వాడుకునే విషయంలో గొడవ పడ్డారు. తల్లిదండ్రులు లావణ్యను మందలించారు. తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక క్షణికావేశంలో పక్కనే ఉన్న తన అవ్వ ఇంటికి వెళ్లింది. అక్కడ చిన్నపిల్లల కోసం కట్టిన చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

NOC కోసం లంచం డిమాండ్.. చివరికీ
Crime· 17 Jul 2026

NOC కోసం లంచం డిమాండ్.. చివరికీ

TG: ఆదిలాబాద్‌ పట్టణంలోని నీటి పారుదల శాఖ కార్యాలయంలో లంచం తీసుకుంటున్న ఇద్దరు అధికారులను ACB అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సొనాల ప్రాంతానికి చెందిన చౌహన్‌ విక్రమ్‌ సింగ్‌ పౌల్ట్రీ‌ఫామ్‌ ఏర్పాటు కోసం NOC కావాలని దరఖాస్తు చేసుకున్నాడు. నీరుపారుదల EE రాథోడ్‌ విఠల్‌, AE రమేష్‌ రూ. 1 లక్ష లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఫైనల్‌గా రూ.60 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. బాధితుడు ఇంజనీర్లకు డబ్బులు ఇస్తుండగా ఇద్దరినీ పట్టుకున్నట్లు ఏసీబీ DSP మధు తెలిపారు.

ఫ్యూచర్ సిటీలో క్రికెట్ స్టేడియం
Sports· 17 Jul 2026

ఫ్యూచర్ సిటీలో క్రికెట్ స్టేడియం

TG: గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగిన క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకురావడానికి TG20 లీగ్ మంచి వేదిక అని CM రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. TG20 మొదటి సీజన్‌లో విజేతగా నిలిచిన హైదరాబాద్ ఛాంపియన్స్‌ను ఆయన అభినందించారు. తెలంగాణలో తొలిసారిగా క్రికెట్ లీగ్ జరిగిందని, రాష్ట్రంలోని యువ ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు రంగారెడ్డి జిల్లాలోని ఫ్యూచర్ సిటీలో లక్షమంది సామర్థ్యంతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని నిర్మిస్తామన్నారు. దీని కోసం BCCI, హైదరాబాద్ క్రికెట్ సంఘం(HCA) తో చర్చిస్తున్నట్లు తెలిపారు.

ప్రజాసమస్యలపై పార్లమెంట్‌లో గళమెత్తండి
Politics· 17 Jul 2026

ప్రజాసమస్యలపై పార్లమెంట్‌లో గళమెత్తండి

AP: రాష్ట్ర ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా పార్లమెంట్‌లో మన గళం వినిపించాలని పార్టీ MPలకు YSR CP అధ్యక్షుడు YS జగన్ సూచించారు. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ MPలతో చర్చించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు YSR CP ఇదివరకే మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేస్తోందని, రెండేళ్లలో రూ.3.6 లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు. ఈ ప్రభుత్వ అవినీతిని ఎండగట్టాలని, ప్రజాసమస్యలపై పోరాడాలన్నారు.

పంట భూములను CM బీడు భూములుగా మారుస్తున్నారు
Politics· 17 Jul 2026

పంట భూములను CM బీడు భూములుగా మారుస్తున్నారు

TG: రాష్ట్రంలోని పంట భూములను బీడు భూములుగా మార్చడానికి CM రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మాజీ MLA సుంకర శంకర్ ఫైరయ్యారు. పంటలకు నీళ్లు ఇవ్వాలని కోరితే BRS నాయకుల రక్తాన్ని పంటపొలాల్లో చల్లాలని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే రవిశంకర్, పార్టీ నాయకులు రక్తదానం చేశారు. KCRను బదనాం చేయడానికి కన్నెపల్లి ప్రాజెక్ట్ నుంచి నీటి ఎత్తిపోయకుండా CM కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నీటి చుక్క కోసం అన్నదాత ఆరాటం
TG· 17 Jul 2026

నీటి చుక్క కోసం అన్నదాత ఆరాటం

TG: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఖరీఫ్ సాగు సంక్షోభంలో చిక్కుకుంది. రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు ఖాళీగా ఉండడంతో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో తొలకరి వర్షాల ఆధారంగా వేసిన వరి, పత్తి తదితర పంటలు ప్రస్తుతం నీళ్లు లేక ఎండిపోయే స్థితికి చేరుకుంటున్నాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని దాదాపు అన్ని మండలాలు సాధారణ వర్షపాతం కంటే 33 శాతానికి పైగా లోటులోకి వెళ్లిపోయాయి. హన్మకొండ జిల్లాలో అత్యధికంగా 67 శాతం లోటు నమోదు కాగా, మేడ్చల్ జిల్లాలో 60 శాతం మైనస్ వర్షపాతం నమోదైంది.

అమరావతిని ఎవరూ కదిలించలేరు
AP· 17 Jul 2026

అమరావతిని ఎవరూ కదిలించలేరు

AP: అమరావతి రాష్ట్ర ఖ్యాతిని పెంచేలా, యువతకు ఉపాధినిచ్చే కల్పవల్లిగా వర్ధిల్లుతుందని CM చంద్రబాబు అన్నారు. రాజధాని పరిధి వెంకటపాలెంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో పూరీ జగన్నాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. హిందూ ధర్మానికి సాక్ష్యంగా నిర్మిస్తున్న అమరావతిని ఈ స్థల మహాత్మ్యంతో ఎవరూ కదిలించలేరు అన్నారు. సమాజంలో విలువలు, మానవ సంబంధాలు పడిపోతున్న టైంలో చాలా సమస్యలకు ఆధ్యాత్మికతే పరిష్కారం అని CM చంద్రబాబు అన్నారు.

USలో కత్తి పోట్లకు గురైన హైదరాబాదీ!
Crime· 16 Jul 2026

USలో కత్తి పోట్లకు గురైన హైదరాబాదీ!

అమెరికాలోని ఉటా రాష్ట్రంలో వెస్ట్ వ్యాలీలోని ఒక షాపింగ్ మాల్‌లో దుండగుడి కత్తి పోట్లకు గాయపడిన బాధితుడు హైదరాబాద్ టోలీ చౌకీ ప్రాంతానికి చెందిన సోహైల్ అని తేలింది. నిన్న ఆర్ యు ఏ ముస్లిం? అని అడుగుతూ ఓ దుండగుడు కత్తితో 13 సార్లు పొడవడంతో సోహైల్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆతడిని ఆస్పత్రికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. సొహైల్ వివాహితుడు. ఇతనికి ఇద్దరు పిల్లలున్నారు. మైనారిటీలపై దాడుల పట్ల MIM నేత అసదుద్దీన్ ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై భారత కాన్సులేట్ కూడా విచారం వ్యక్తం చేసింది.

'ది ఒడిస్సీ' మూవీకి అరగంట ముందే వెళ్లాలి.. ఎందుకంటే?
Cinema· 16 Jul 2026

'ది ఒడిస్సీ' మూవీకి అరగంట ముందే వెళ్లాలి.. ఎందుకంటే?

క్రిస్టోఫర్ నోలన్ కొత్త సినిమా 'ది ఒడిస్సీ' శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది. ఫ్యాన్స్ దీనిని ఒక గ్రాండ్ సినిమాటిక్ ఈవెంట్‌గా చూస్తున్నారు. హోమర్ రాసిన 3,000 ఏళ్ల నాటి పురాతన ఇతిహాసం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సినిమా ప్రారంభం కావడానికి కంటే ముందే థియేటర్‌కు చేరుకోవడం వల్ల, కథా నేపథ్యాన్ని ,ఆ అద్భుతమైన వాతావరణాన్ని ప్రేక్షకులు పూర్తిగా అర్థం చేసుకుని ఆస్వాదించడానికి వీలవుతుంది. దాదాపు రూ. రెండు వేల కోట్లతో రూపొందిన భారీ బడ్జెట్ సినిమా ఇది

USలో  ఇకపై విదేశీ స్టూడెంట్లకు 4 ఏళ్ల ఫిక్స్‌డ్ వీసా
World· 16 Jul 2026

USలో ఇకపై విదేశీ స్టూడెంట్లకు 4 ఏళ్ల ఫిక్స్‌డ్ వీసా

అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, ఎక్స్ఛేంజ్ విజిటర్స్ , ఫారిన్ మీడియా వీసాల కోసం ఒక కొత్త రూల్‌ను ఫైనలైజ్ చేసింది. ఇప్పటివరకు ఉన్న ‘డ్యూరేషన్ ఆఫ్ స్టే’ (కోర్సు అయిపోయే వరకు ఉండే అవకాశం) స్థానంలో ఇకపై 4 ఏళ్ల ఫిక్స్‌డ్ వీసా కాలాన్ని తీసుకురానున్నారు. దీనివల్ల లాంగ్ టర్మ్ కోర్సులు చేసే చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్ మళ్లీ వీసా ఎక్స్‌టెన్షన్ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ప్రాసెస్‌లో ఏవైనా ఆలస్యాలు జరిగితే, వారు చట్టవిరుద్ధంగా అక్కడ ఉన్నట్లు పరిగణించే ప్రమాదం ఉంది.

విశాఖలో కోవిడ్ పాజిటివ్ కేసు నమోదు !
AP· 16 Jul 2026

విశాఖలో కోవిడ్ పాజిటివ్ కేసు నమోదు !

విశాఖలో కోవిడ్ పాజిటివ్ కేసు నమోదు కలకలం రేపుతోంది. బాధితుడు జ్వరం, ఒళ్లు నొప్పులతో జనరల్ ఫిజీషియన్ దగ్గరకు రాగా అనుమానం వచ్చి ప్రైవేట్ ల్యాబ్ కు టెస్టుకు పంపారు. అయితే ప్రైవేటు ల్యాబ్ లో అతగాడికి కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారించారు. ఆ తర్వాత వైద్యాధికారి ద్వారా అదే శాంపిల్ ను కోవిడ్ టెస్ట్ నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. కేజీహెచ్ లో కూడా కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారించడంతో ఆ వ్యక్తిని ఐసోలేషన్ లోకి పంపారు. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ కోవిడ్ కేసు కనిపించడంతో వైద్య వర్గాలు కలవరం చెందుతున్నాయి. అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.

AI జాబ్స్ బోలెడు.. టాలెంట్ మాత్రం షార్ట్!
Technology· 16 Jul 2026

AI జాబ్స్ బోలెడు.. టాలెంట్ మాత్రం షార్ట్!

భారత్‌లో రోబోటిక్స్, ఇండస్ట్రియల్ AI రంగాల్లో 9,000+ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా, వాటికి సరిపోయే స్కిల్స్ ఉన్న నిపుణులు దొరకడం కంపెనీలకు పెద్ద సవాల్‌గా మారింది. దేశంలో 3.7 లక్షల AI టాలెంట్ పూల్ ఉన్నా, AIతో పాటు రోబోటిక్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, IoT, క్లౌడ్ స్కిల్స్ కలిగిన వారే ఎక్కువ డిమాండ్‌లో ఉన్నారు. ముఖ్యంగా తయారీ, ఆటోమొబైల్, లాజిస్టిక్స్ రంగాల్లో అవకాశాలు భారీగా పెరుగుతున్నాయి.

మహిళలకు జాబ్స్ షాక్.. 15 నెలల్లో నిరుద్యోగం టాప్!
Jobs· 16 Jul 2026

మహిళలకు జాబ్స్ షాక్.. 15 నెలల్లో నిరుద్యోగం టాప్!

భారత్‌లో మహిళల నిరుద్యోగం జూన్‌లో 5.9% చేరి 15 నెలల గరిష్ఠానికి ఎగిసింది. మేలో ఇది 5.6%గా ఉంది. గ్రామీణ మహిళల నిరుద్యోగం 5%, పట్టణాల్లో 6.4%కు పెరిగింది. మహిళల లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ 32.7% వద్ద దాదాపు స్థిరంగా ఉండగా, మొత్తం నిరుద్యోగం 5.5%గానే ఉంది. మహిళలు ఉద్యోగ మార్కెట్‌లోకి వస్తున్నా, అవకాశాలు అదే వేగంతో పెరగకపోవడం ఆందోళన కలిగిస్తోంది.