Latest

CJP మార్చ్‌ను ఆపలేం.. సుప్రీంకోర్ట్
Gen Z· 31 Aug 2026

CJP మార్చ్‌ను ఆపలేం.. సుప్రీంకోర్ట్

సెప్టెంబర్ 5న కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) ప్లాన్ చేసిన ప్రొటెస్ట్ మార్చ్‌ను ఆపలేమని సుప్రీంకోర్ట్ క్లారిటీ ఇచ్చింది. ప్రొటెస్ట్ టైమ్‌లో అందరూ పీస్‌ఫుల్‌గా, లీగల్‌గా ప్రవర్తిస్తారని ఆశిస్తున్నట్లు కోర్ట్ కామెంట్ చేసింది. ఎగ్జామ్ ఇష్యూస్‌పై ఇచ్చిన ప్రామిసెస్ నెరవేర్చలేదని సెంట్రల్ గవర్నమెంట్‌పై CJP ఈ ఢిల్లీ మార్చ్‌కు పిలుపునిచ్చింది. నీట్ ప్రొటెస్ట్స్ టైమ్‌లో జరిగిన పోలీస్ వైలెన్స్‌పై ఎంక్వైరీ చేస్తున్న కమిటీకి తమ పిటిషన్ సబ్మిట్ చేయాలని పిటిషనర్‌ను సుప్రీంకోర్ట్ ఆదేశించింది.

నర్సు మృతి ఘటనపై సమగ్ర విచారణ జరపాలి
Local· 31 Aug 2026

నర్సు మృతి ఘటనపై సమగ్ర విచారణ జరపాలి

హైదరాబాద్ లో నర్సును దారుణంగా హత్య పైన పెద్ద ఎత్తున ఆందోళనలు మొదలయ్యాయి. నిందితుడు సనాఉల్లాను కఠినంగా శిక్షించాలని భద్రాద్రి కొత్తగూడెం ఆదివాసీ JAC కమిటీతో పాటు తిమ్మంపేట JAC నాయకులు డిమాండ్ చేశారు. యువతిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులు విచారణ జరిపి నిజానిజాలను వెలికితీయాలని కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. బీహార్ వ్యక్తి సనావుల్లా ఆగస్ట్ 28న నర్సు రూంలోకి వెళ్లి రేప్ అటెమ్ట్ చేసి, హత్య చేశాడు.

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులపై విచారణ అవసరం
Local· 31 Aug 2026

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులపై విచారణ అవసరం

మందమర్రి మండలంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుల కోసం నిర్వహించిన లక్కీ డ్రా ప్రక్రియపై సమగ్ర విచారణ జరిపి, అర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ డిమాండ్ చేసింది. సొసైటీ ఉపాధ్యక్షుడు సుద్దాల ప్రభుదేవ్మం, చిర్యాల జిల్లా అధ్యక్షుడు నందిపాట రాజ్ కుమార్ మాట్లాడుతూ జాబితాలో అనర్హులు ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. జాబితాలో మొదట 447 ఇళ్ల వివరాలు ఉండగా, ఒక్కరోజులోనే అర్హుల సంఖ్య 491కి పెరగడంపై స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

ఇథనాల్ శాతం బిల్లుపై చూపించాలి.. సుప్రీంకోర్టులో PIL!
National· 31 Aug 2026

ఇథనాల్ శాతం బిల్లుపై చూపించాలి.. సుప్రీంకోర్టులో PIL!

పెట్రోల్‌లో కలిపిన ఇథనాల్ శాతాన్ని బంకుల్లో క్లియర్‌గా చూపించాలని PIL ఫైల్ చేశారు. డిస్పెన్సింగ్ నాజిల్స్‌తో పాటు పెట్రోల్ బిల్లులు, రిసీట్‌పై కూడా ఇథనాల్ శాతాన్ని ప్రింట్ చేయాలని పిటిషనర్ కోరారు. తాము కొన్న ఫ్యూయల్‌లో ఏం ఉందో తెలుసుకునే హక్కు కస్టమర్లకు ఉందని వాదించారు. అయితే ఈ PILను హియరింగ్‌కు తీసుకోవడానికి సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది. ఈ అంశంపై హైకోర్టును లేదా సంబంధిత అధికారిని అప్రోచ్ అవ్వొచ్చని సూచించింది. ఈ20 పాలసీని వ్యతిరేకించడం తమ ఉద్దేశం కాదని తెలిపింది.

మస్టర్లు వేయలేదంటూ కూలీల ఆందోళన
Local· 31 Aug 2026

మస్టర్లు వేయలేదంటూ కూలీల ఆందోళన

నెల్లూరు జిల్లా కలిగిరి మండలం నర్సారెడ్డి పాలెంలోని ఉపాధి కూలీలు ఆందోళన చెందుతున్నారు. పనిచేస్తున్నప్పటికీ మాస్టర్లు వేయడం లేదని అంటున్నారు. రాజకీయ ఉద్దేశంతో కూలీలను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరో తెలియక తికమకి పడిపోతున్నామని చెబుతున్నారు. రోజుకొకరు వచ్చి అటెండెన్స్ తీసుకోవడంతో ఎప్పుడు వస్తారో తెలియక కందరగోళంగా ఉందని అంటున్నారు. పై అధికారులు స్పందించి చర్యలు తీసుకొని కూలీలకు న్యాయం జరిగేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

పార్కు నిర్మాణానికి శ్రీకారం
Local· 31 Aug 2026

పార్కు నిర్మాణానికి శ్రీకారం

AP: తాడేపల్లి మండలం రాధారంగనగర్‌లో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఆరోగ్యకరమైన జీవనానికి పార్కు కీలకంగా మారనుంది. ఆంజనేయస్వామి విగ్రహం పక్కన ఉన్న స్థలంలో రూ.83 లక్షలతో చేపట్టనున్న పార్కు నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ పనులకు శ్రీకారం చుట్టారు.

బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి
Local· 31 Aug 2026

బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి

తెలంగాణలో 30 లక్షల మంది విద్యార్థులకి సంబంధించిన రూ.14 వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని DSP ధర్మ సమాజ్ పార్టీ & BC, SC, ST -JAC సంయుక్త ఆధ్వర్యంలో జగిత్యాల కలెక్టర్‌కి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు దువ్వాక శివ మహారాజ్, BC, SC, ST-JAC జిల్లా అధ్యక్షుడు మనాల కిషన్, ప్రధాన కార్యదర్శి జితేందర్, సహాయ కార్యదర్శి గుమ్ముల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

కదిలే బస్సులో దారుణం.. మైనర్ పై గ్యాంగ్ రేప్!
Crime· 31 Aug 2026

కదిలే బస్సులో దారుణం.. మైనర్ పై గ్యాంగ్ రేప్!

ఢిల్లీలో దారుణం జరిగింది. ఉత్తరప్రదేశ్ కి చెందిన 16 ఏళ్ల బాలిక కుటుంబంతో గొడవపడి నోయిడా వెళ్లే ప్రైవేట్ స్లీపర్ బస్సు ఎక్కింది. బస్సులో ఎవరూ లేకపోవడం చూసి డ్రైవర్ కుల్దీప్, కండక్టర్ సందీప్ ఆమెపై గ్యాంగ్ రేప్‌ చేశారు. 45Min బస్సును తిప్పుతూ అఘాయిత్యం చేసి, కశ్మీరీ గేట్ వద్ద దింపి పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆగస్టు 4న జరిగిన ఈ ఇన్సిడెంట్ ఆలస్యంగా బయటకు వచ్చింది.

సీతారామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టలో ఎమ్మెల్యే
Local· 31 Aug 2026

సీతారామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టలో ఎమ్మెల్యే

నాగర్‌కర్నూలు జిల్లా పదర మండలం మాడుగు గ్రామంలో సీతారామాంజనేయ స్వామి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

రోడ్డు మీద కారు డోర్ తీసేటప్పుడు జాగ్రత్త!
Infotainment· 31 Aug 2026

రోడ్డు మీద కారు డోర్ తీసేటప్పుడు జాగ్రత్త!

చాలామంది రోడ్డు మీద కారు ఆపేసి, టక్కున డోర్ తెరుస్తుంటారు. దీని వల్ల రోడ్డు మీద వెళ్తున్న బండ్లకు తగిలి, దాని మీదున్న వాళ్లు కిందపడిపోతారు. కొన్నిసార్లు ఇలాంటి ప్రమాదాల్లో ప్రాణాలు కూడా పోతుంటాయి. అందుకే రోడ్డు మీద కారు డోర్ తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, రోడ్డు వైపు కాకుండా మరో వైపు డోర్ తీయాలని HYD ట్రాఫిక్ పోలీసులు తమ ఎక్స్ అకౌంట్ ద్వారా సూచించారు. గతంలో జరిగిన ప్రమాదం వీడియోను పోస్ట్ చేసి, అలా జరగకుండా జాగ్రత్త పడాలని వివరించారు. పోలీసుల సజెషన్ తప్పకుండా పాటిస్తారు కదూ!

‘Toxic’పై రాజాసింగ్ రివ్యూ.. షాకింగ్ రియాక్షన్!
Viral· 31 Aug 2026

‘Toxic’పై రాజాసింగ్ రివ్యూ.. షాకింగ్ రియాక్షన్!

యశ్ నటించిన ‘టాక్సిక్’ మూవీపై గోషామహల్ MLA రాజాసింగ్ కామెంట్స్ చేశారు. ఫ్రెండ్స్‌తో కలిసి మల్టీప్లెక్స్‌లో సినిమా చూసిన ఆయన.. సినిమాలోని వల్గారిటీ, వైలెన్స్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మధ్యలోనే బయటకు వచ్చేశారు. డ్రగ్స్, మర్డర్స్, మహిళలను అబ్సీన్‌గా చూపించే సీన్స్ ఉన్నాయని విమర్శించారు. సినిమాలు కేవలం ఎంటర్‌టైన్‌మెంట్, బిజినెస్‌కే పరిమితం కాకూడదని అన్నారు. రవితేజ 'ఇరుముడి' లాంటి ధర్మం కోసం, భక్తి, సమాజానికి మెసేజ్ ఇచ్చే సినిమాలు తీయాలని చెప్పారు. ఇలాంటి మూవీస్ ఫ్యామిలీతో కలిసి చూడొద్దని అన్నారు.

30 ఏళ్ల కల సాకారం.. కృష్ణమ్మ పరుగులు పెట్టింది!
Local· 31 Aug 2026

30 ఏళ్ల కల సాకారం.. కృష్ణమ్మ పరుగులు పెట్టింది!

30 ఏళ్ల కల సాకారమైంది. ప్రకాశం జిల్లా దోర్నాల వద్ద సోమవారం సీఎం చంద్రబాబు పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ తొలి దశను ప్రారంభించారు. కృష్ణా జలాలు సొరంగాల ద్వారా నల్లమల సాగర్ కు చేరాయి. తొలి దశలోనే 10.70 టీఎంసీల నీటిని విడుదల చేశారు. ఇప్పటికే 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతుంది. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 30 మండలాలకు ఈ ప్రాజెక్ట్ వరం. ప్రకాశం జిల్లాలోనే 3.36 లక్షల ఎకరాలు, నెల్లూరులో 84,000 ఎకరాలు, కడపలో 27,200 ఎకరాలు సాగవుతాయి.

ఆ ఫిర్యాదులకు సత్వర పరిష్కారం
Local· 31 Aug 2026

ఆ ఫిర్యాదులకు సత్వర పరిష్కారం

జగిత్యాలలో సోమవారం ప్రజావాణి జరిగింది. ప్రజల నుంచి 53 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్.లత అధికారులకు క్లియర్ ఆదేశాలు ఇచ్చారు: "ఫిర్యాదులను సమగ్రంగా విచారించి, సత్వరమే పరిష్కరించండి. అర్జీలు పెండింగ్‌లో పడేయొద్దు'' అని. పెండింగ్ దరఖాస్తులపై వచ్చే ప్రజావాణి లోగా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక, ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 25 వరకు 41వ నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.

ఈ ‘దారి’ద్రం తీరేదాకా..నిరసన తప్పదు
Current Affairs· 31 Aug 2026

ఈ ‘దారి’ద్రం తీరేదాకా..నిరసన తప్పదు

హైదరాబాద్‌లోని ఇమ్లిబన్–పుట్లిబౌలి అధ్వాన రోడ్డు పరిస్థితికి నిరసనగా ఓ వ్యక్తి చిత్రమైన ఆందోళన చేశాడు. ఈ రహదారిలో పెద్ద గుంతలో పడుకొని తన నిరసన తెలిపాడు. ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి కోటి, చాదర్‌ఘాట్ వైపు వెళ్లే ఈ రహదారి ఎప్పుడూ భారీ ట్రాఫిక్‌తో నిండి ఉంటుంది. ప్రమాదకరమైన గుంతలు, దెబ్బతిన్న రహదారి ఉపరితలం కారణంగా ప్రజలు చాలా కాలంగా కంప్లైంట్లు చేస్తున్నారు. అతను చేసిన ఈ నిరసన కారణంగా కొద్దిసేపు బండ్లు ఆగిపోయాయి. పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుని ఆ వ్యక్తిని అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లారు.

భువనగిరిలో యూత్ కాంగ్రెస్  బ్రెయిన్‌స్టార్మింగ్!
Local· 31 Aug 2026

భువనగిరిలో యూత్ కాంగ్రెస్ బ్రెయిన్‌స్టార్మింగ్!

భువనగిరిలో జిల్లా యూత్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించింది. అధ్యక్షులు మంగ ప్రవీణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మీటింగ్‌లో యువతను పార్టీతో కనెక్ట్ చేసేందుకు, క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను బలోపేతం చేసేందుకు వ్యూహాలను రూపొందించారు. రాబోయే ఎన్నికల్లో యువ ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యం. సోషల్ మీడియా క్యాంపెయిన్‌లు, క్యాంపస్‌లలో యూత్ కనెక్ట్ ప్రోగ్రామ్‌లు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. "రాబోయే రోజుల్లో యూత్ కాంగ్రెస్ మరింత యాక్టివ్ గా కనిపిస్తుంది" అని నాయకులు అంటున్నారు.

సెప్టెంబర్ 1న జగిత్యాల జిల్లాకు ఎస్సీ, ఎస్టీ కమిషన్
Local· 31 Aug 2026

సెప్టెంబర్ 1న జగిత్యాల జిల్లాకు ఎస్సీ, ఎస్టీ కమిషన్

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో పాటు ఐదుగురు సభ్యులు సెప్టెంబర్ 1న జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. చైర్మన్‌తో పాటు సభ్యులు కుస్రం నీలాదేవి, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణికుంట్ల ప్రవీణ్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయానికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

స్మార్ట్ కార్డ్ పంపిణీ.. ఎమ్మెల్యే హామీ!
Local· 31 Aug 2026

స్మార్ట్ కార్డ్ పంపిణీ.. ఎమ్మెల్యే హామీ!

నాగర్ కర్నూల్ లింగాల మండలంలో సోమవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. అచ్చంపేట MLA డా. చిక్కుడు వంశీకృష్ణ ఈ వేడుకలో పాల్గొన్నారు. "నేను MLAగా మాత్రమే కాదు, మీ ఇంటి బిడ్డగా మీకు అందుబాటులో ఉంటా" అని ప్రజలకు హామీనిచ్చారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూజారి ఈశ్వరమ్మ బుడ్డయ్య, నాగేశ్వరరావు, MRO వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే స్మార్ట్ కార్డుల్లో ఉన్న సాంకేతిక సమస్యల వల్ల చాలామంది రేషన్ సరుకులు అందుకోలేకపోతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

అధ్యక్ష పదవి కోసం పోటాపోటీ
Local· 31 Aug 2026

అధ్యక్ష పదవి కోసం పోటాపోటీ

పెద్దపెల్లి జిల్లా రామగుండం అధికార కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్ష పదవి కాలం ముగియడంతో కొత్తగా అధ్యక్ష పదవి పోటీకి సీనియర్ జూనియర్ నాయకులు పోటాపోటీగా దరఖాస్తులు సమర్పించటం పారిశ్రామిక ప్రాంతంలో చర్చగా మారింది. దరఖాస్తుల స్వీకరించిన ఏఐసీసీ నాయకులు వాటిని పరిశీలించి అందరి నేతల సలహాలు సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కొంతమంది సీనియర్ నాయకుల మధ్య విభేదాలు తలెత్తాయి అని పారిశ్రామిక ప్రాంతంలో జోరుగా ప్రచారం జరుగుతుంది.

20 ఏళ్ల పోరాటానికి ఎమ్మెల్సీ అభ్యర్థి మద్దతు!
Local· 31 Aug 2026

20 ఏళ్ల పోరాటానికి ఎమ్మెల్సీ అభ్యర్థి మద్దతు!

కాట్రేనికోన మండలం గెద్దనపల్లి పంచాయతీ పరిధిలోని పోరపేటలో ప్రజలు 20 ఏళ్లుగా రోడ్డు కోసం పోరాడుతున్నారు. వారి ఆందోళనకు ఇప్పుడు MLC అభ్యర్థి GV సుందర్ మద్దతు ప్రకటించారు. ఆదివారం ఆ గ్రామంలో గ్రామస్తులతో ఆయన ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. "మీరు చేస్తున్న ఈ పోరాటంలో నేను కూడా పాల్గొంటాను. రోడ్డు వేసే వరకు నేను పోరపేటలోనే బస చేస్తా" అని ప్రకటించారు. వానొస్తే నడక మార్గం కూడా పాడైపోతున్నదని, వైద్య అత్యవసరాలు, పిల్లల స్కూల్ రాకపోకలు, పంటల రవాణా – వీటన్నింటకీ కష్టంగా ఉందని గ్రామస్థులు చెబుతున్నారు.

తమ్ముడి భుజాలపై చెల్లెలు.. నేపాల్ కన్నీటి కథ!
International· 31 Aug 2026

తమ్ముడి భుజాలపై చెల్లెలు.. నేపాల్ కన్నీటి కథ!

నేపాల్‌లో ప్రకృతి విపత్తు సృష్టించిన దృశ్యం.. ఓ చిన్నారి తన చెల్లెల్ని భుజాలపై ఎత్తుకుని తల్లిదండ్రుల కోసం వెతుకుతున్నాడు. ఆగస్టు 26న ఉత్తర, మధ్య నేపాల్లో వరదల వల్లఇప్పటివరకు 900 మందికి పైగా మృతి చెందగా, వేల మంది ఇంకా గల్లంతయ్యారు. గుర్తుపట్టలేని మృతదేహాలను సామూహికంగా ఖననం చేస్తున్నారు. X (ట్విట్టర్)లో షేర్ చేసిన ఈ వీడియోలో ఇద్దరి ముఖాల్లో గాయాలు, చేతుల్లో గీతలు. పెద్దవాడి ముఖంలో భయం, చెల్లెలి కళ్లలో ఆశ. వారు తమ తల్లిదండ్రుల కోసం వెతుకుతున్నారు. ఇది చూసి నెటిజన్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

కాలేజీకి కాంపౌండ్ వాల్ లేదు.. భద్రత సంగతి?
Local· 31 Aug 2026

కాలేజీకి కాంపౌండ్ వాల్ లేదు.. భద్రత సంగతి?

నిర్మల్ జిల్లా ముధోల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కాంపౌండ్ వాల్ లేదు. దీంతో బయటి వ్యక్తులు కాలేజీ ఆవరణలోకి స్వేచ్ఛగా వస్తున్నారు. విద్యార్థినులు భద్రత లేకుండా ఉండటంతో పాటు, విద్యా వాతావరణం కూడా దెబ్బతింటోంది. దీనిపై AIPSU (ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్) నిర్మల్ జిల్లా కమిటీ సహకారంతో బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ (IAS)కి కంప్లయింట్ ఇచ్చారు. "వెంటనే నిధులు మంజూరు చేసి, కాంపౌండ్ వాల్ నిర్మించాలి" అని జిల్లా కార్యదర్శి గడపాలి పరమేష్ డిమాండ్ చేశారు.