రోడ్డు మీద కారు డోర్ తీసేటప్పుడు జాగ్రత్త!
చాలామంది రోడ్డు మీద కారు ఆపేసి, టక్కున డోర్ తెరుస్తుంటారు. దీని వల్ల రోడ్డు మీద వెళ్తున్న బండ్లకు తగిలి, దాని మీదున్న వాళ్లు కిందపడిపోతారు. కొన్నిసార్లు ఇలాంటి ప్రమాదాల్లో ప్రాణాలు కూడా పోతుంటాయి. అందుకే రోడ్డు మీద కారు డోర్ తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, రోడ్డు వైపు కాకుండా మరో వైపు డోర్ తీయాలని HYD ట్రాఫిక్ పోలీసులు తమ ఎక్స్ అకౌంట్ ద్వారా సూచించారు. గతంలో జరిగిన ప్రమాదం వీడియోను పోస్ట్ చేసి, అలా జరగకుండా జాగ్రత్త పడాలని వివరించారు. పోలీసుల సజెషన్ తప్పకుండా పాటిస్తారు కదూ!



