Latest

రాఘవేంద్రస్వామి దేవాలయాన్ని సందర్శించిన న్యాయమూర్తి
Local· 31 Aug 2026

రాఘవేంద్రస్వామి దేవాలయాన్ని సందర్శించిన న్యాయమూర్తి

జోగులాంబ గద్వాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ చక్రవర్తి గద్వాల్ భీమ్‌నగర్‌లోని రాఘవేంద్రస్వామి దేవాలయం సందర్శించి పూజలు నిర్వహించారు. మంత్రాలయం రాఘవేంద్రస్వామి 355వ ఆరాధనోత్సవాల సందర్భంగా ఉత్తరారాధన పురస్కరించుకొని న్యాయమూర్తి దేవాలయం సందర్శించుకున్నారు. కార్యక్రమంలో మన్నూరు ప్రహ్లాద చారి ప్రమోద్ ప్రసన్న, సీనియర్ న్యాయవాది భీమ్‌సేనరావు పాల్గొన్నారు.

జోగులాంబ సన్నిధిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Local· 31 Aug 2026

జోగులాంబ సన్నిధిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ దర్శించుకున్నారు. స్వామికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక కుంకుమార్చన పూజలు చేశారు. ఆలయ అర్చకులు జోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాల విశిష్టతను వివరించి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఆలయ ఆవరణలో మొక్కలు నాటి నీళ్లు పోశారు.

పేద అమ్మాయి పెళ్లికి రూ.5,000.. ఆదుకున్న పంచాయతీ కార్యదర్శి!
Local· 31 Aug 2026

పేద అమ్మాయి పెళ్లికి రూ.5,000.. ఆదుకున్న పంచాయతీ కార్యదర్శి!

జన్నారం మండలం చింతగూడలో ఓ హృదయాన్ని కదిపే ఘటన జరిగింది. నిరుపేద యువతి బిస్కుల మానస వివాహ ఖర్చుల కోసం గ్రామ పంచాయతీ కార్యదర్శి కళ్ళెం రాజన్న స్వంత డబ్బులు రూ.5,000 అందజేశారు. ఈ చొరవను స్థానిక నాయకులు మాజీ వైస్ ఎంపీపీ సుతారి వినయ్, కాంగ్రెస్ కార్యదర్శి మాణిక్యం, తాటి శ్రీనివాస్, అరె లింగమూర్తి అభినందించారు. ఇలాంటి స్ఫూర్తిదాయక పనులు నిరుపేద కుటుంబాలకు పెద్ద ఊరటగా ఉంటాయి. మీరు కూడా మీ ఊర్లో ఇలాంటి మంచి పనులు జరిగితే మాకు తెలియజేయండి.

తాగు నీటి కుళాయిలో మురుగునీరు వస్తోంది...
Local· 31 Aug 2026

తాగు నీటి కుళాయిలో మురుగునీరు వస్తోంది...

Dr.BR అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు పట్టణంలో కుళాయిల్లో దుర్వాసనతో కూడిన మురుగునీరు వస్తోంది. సుందరమ్మ చేరువుగట్టు ప్రాంతంలో 2 days కి ఒకసారి, 1/2 గంట మాత్రమే నీరు వస్తోంది. అయితే అవి తాగేందుకు పనికిరావు నీటి పైపులైన్లకు, మురుగు కాలువలకు మధ్య లీకేజీలు ఉండటమే కారణం. రిపేర్లు సరిగా చేయకపోవడంతో మురుగు నీరు తాగునీటి లైన్లలోకి కలుస్తోంది. ప్రజలు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ జిల్లాలో 30 గ్రామాలకూ తాగునీటి కష్టాలున్నాయి. జిల్లాలో 676 RO ప్లాంట్లు ఉంటే, 302 పనిచేయడం లేదు.

New Yorkలో జెండాకు అవమానం.. కిరణ్ రిజిజు వార్నింగ్!
National· 31 Aug 2026

New Yorkలో జెండాకు అవమానం.. కిరణ్ రిజిజు వార్నింగ్!

న్యూయార్క్‌లో ఇండియా జెండాను అవమానించారనే ఘటనపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను<a href="https://x.com/KirenRijiju/status/2094072645960511847"> 'ఎక్స్‌'లో</a> షేర్ చేసిన ఆయన.. దేశాన్ని, జాతీయ జెండాను అవమానిస్తే 'భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది' అంటూ వార్నింగ్ ఇచ్చారు. మోహన్ భాగవత్ పాల్గొన్న మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్ సభ సందర్భంగా ఈ ఇన్సిడెంట్ జరిగినట్లు తెలిపారు. RSS లేదా BJPని విమర్శించే హక్కు ఉందని, కానీ దేశాన్ని అవమానించొద్దని రిజిజు అన్నారు.

వరదల్లో 6ఏళ్ల చిన్నారి ఎలా బతికిందంటే?
International· 31 Aug 2026

వరదల్లో 6ఏళ్ల చిన్నారి ఎలా బతికిందంటే?

నేపాల్‌లో వచ్చిన భయంకరమైన ఫ్లాష్ ఫ్లడ్స్ వల్ల 650 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, రసువా డిస్ట్రిక్ట్ తిమూరేలో ఒక మిరాకిల్ జరిగింది. వరద ధాటికి కొట్టుకొచ్చిన మట్టి, డెబ్రీస్ కింద 3 రోజులుగా చిక్కుకుపోయిన ఒక 6 ఏళ్ల చిన్నారి ప్రాణాలతో బయటపడింది. ఆర్మ్‌డ్ పోలీస్ టీమ్ సెర్చ్ చేస్తున్న టైమ్‌లో మట్టి కింద నుండి ఏడుపు వినిపించడంతో వెంటనే తవ్వి పాపను కాపాడారు. కండిషన్ సీరియస్‌గా ఉండటంతో బెటర్ ట్రీట్‌మెంట్ కోసం పాపను ఖాట్మండులోని హాస్పిటల్‌కు షిఫ్ట్ చేశారు.

డాక్టర్లు సంతకాలు చేసి.. క్లినిక్కులకా? MLA షాక్!
Local· 31 Aug 2026

డాక్టర్లు సంతకాలు చేసి.. క్లినిక్కులకా? MLA షాక్!

శ్రీకాకుళం జిల్లా పలాస Govt హాస్పిటల్లో సోమవారం MLA గౌతు శిరీష సర్ప్రైజ్ చెకింగ్ చేశారు.<br>వైద్యులు సంతకాలు చేసి ప్రైవేట్ క్లినిక్‌లకు వెళ్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. కొన్ని సమయాల్లో డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం గరుడఖండి వద్ద ప్రమాదానికి గురైన 5గురు ఉపాధ్యాయులకు సకాలంలో వైద్యం అందలేదనే ఫిర్యాదులపైనా ఆరా తీశారు. ఇందుకు బాధ్యులైన వైద్యులు వివరణ ఇవ్వాలని, సోమవారం సాయంత్రం జిల్లా వైద్యాధికారులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. మరి మీఊళ్లో ఎలా ఉంది? comment please.

EMI కట్టలేకపోతే వెంటనే ఈ పని చేయండి!
Current Affairs· 31 Aug 2026

EMI కట్టలేకపోతే వెంటనే ఈ పని చేయండి!

ఇల్లు, కార్, బిజినెస్ లోన్ EMIలు టైమ్‌కి కట్టకపోతే బ్యాంకులు లేట్ ఛార్జీలు వేస్తాయి. ఒక్క EMI మిస్ అయినా మెసేజ్ ఇచ్చి అలర్ట్ చేస్తారు. 90 రోజులు దాటితే ఆ లోన్ అకౌంట్‌ను డేంజర్ జోన్ (NPA)లో పెడతారు. దీనివల్ల క్రెడిట్ స్కోర్ దెబ్బతిని భవిష్యత్తులో లోన్స్, క్రెడిట్ కార్డ్స్ రావడం కష్టమవుతుంది. అందుకే ఈ ప్రాబ్లమ్ రాకముందే బ్యాంక్‌ను విజిట్ చేసి మాట్లాడి, EMI కట్టే డేట్ మార్చుకోవాలి. కొత్త లోన్ తీసి పాత EMIలు కడితే ప్రాబ్లమ్ ఇంకా పెద్దదవుతుంది.

రహ్మత్ బేగ్ ఎపిసోడ్.. మజ్లిస్‌కు కొత్త టెన్షన్!
Crime· 31 Aug 2026

రహ్మత్ బేగ్ ఎపిసోడ్.. మజ్లిస్‌కు కొత్త టెన్షన్!

TG: మజ్లిస్ MLC రహ్మత్ బేగ్ ఇష్యూ పార్టీకి హెడ్‌ఏక్‌గా మారింది. ఓ బాలికను సెక్సువల్ అబ్యూజ్‌ చేశారనే అలిగేషన్స్‌కు పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. MLC పదవికి రిజైన్ చేయాలని ఆదేశించింది. మూడు రోజులు గడిచినా ఆయన రాజీనామా చేయలేదు. తాను 'ఎట్టి పరిస్థితుల్లోనూ రిజైన్ చేయను' అని రహ్మత్ బేగ్ అన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఆయన ప్రస్తుతం పరారీలో ఉండటంతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.

సెప్టెంబర్ మొత్తం.. పోలీస్ యాక్ట్ లో జగిత్యాల!
Local· 31 Aug 2026

సెప్టెంబర్ మొత్తం.. పోలీస్ యాక్ట్ లో జగిత్యాల!

జగిత్యాల జిల్లాలో Sept 1 నుంచి 30 వరకు పోలీస్ Act –1861 అమల్లోకి వస్తోంది. SP అశోక్ కుమార్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించకూడదు. డీజేలు వాడొద్దు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించొద్దు. ఇది బ్రిటిష్ కాలం నాటి చట్టం (Act V of 1861). నేటికీ అమల్లో ఉంది. ఇందులోని Sec-30 ప్రకారం, ప్రజా భద్రత కోసం పోలీసులు ఇలాంటి ఆంక్షలు విధించవచ్చు. అయితే ఎక్కువ సార్లు ప్రజాభద్రత పేరిట, నిరసనలను అణిచివేసేందుకు దీనిని ఉపయోగిస్తారు.

ISROలో జాబ్స్.. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు ఛాన్స్!
Jobs· 31 Aug 2026

ISROలో జాబ్స్.. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు ఛాన్స్!

ISRO-ICRB Scientist/Engineer ‘SC’ పోస్టులకు 175 వేకెన్సీలతో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. Electronics, Mechanical, Computer Science డిపార్ట్‌మెంట్స్‌లో పోస్టులున్నాయి. B.E/B.Techలో మినిమమ్ 65 శాతం మార్కులు లేదా 6.84 CGPA ఉన్నవారు అప్లై చేయొచ్చు. ఏజ్ సెప్టెంబర్ 16, 2026 నాటికి 28 ఏళ్లలోపు ఉండాలి. ఆన్‌లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయి. సెప్టెంబర్ 16, 2026తో అప్లికేషన్స్ ముగుస్తాయి . అప్లికేషన్ ఫీజు రూ.250 (ప్రాసెసింగ్ ఫీజు రూ.750 ముందుగా చెల్లించాలి). పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ <a href="https://cdn.digialm.com/EForms/configuredHtml/1258/102146/Index.html">'Click'</a> చేయండి.

ఎమ్మెల్యే సర్ప్రైజ్ చెక్.. ఆసుపత్రి అంతా OKనా?
Local· 31 Aug 2026

ఎమ్మెల్యే సర్ప్రైజ్ చెక్.. ఆసుపత్రి అంతా OKనా?

అచ్చంపేట MLA డాక్టర్ వంశీకృష్ణ సోమవారం నాడు పదర మండల ప్రభుత్వ ఆసుపత్రికి ఆకస్మిక తనిఖీకి వెళ్లారు. వార్డులు, ఔట్ పేషెంట్ విభాగం, ఫార్మసీ – అన్నీ చూశారు. మందులు ఉన్నాయా? సిబ్బంది హాజరు ఎలా ఉంది? పారిశుద్ధ్యం బాగుందా? అని అడిడి తెలుసుకున్నారు. ప్రతీ డీటెయిల్ పరిశీలించారు. పేద, సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి చెప్పారు. ఆసుపత్రికి కావాల్సిన మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మీ ఊరి ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు ఎలా ఉన్నాయి? మందులు అందుబాటులో ఉన్నాయా? కామెంట్ షేర్ చేయండి.

స్కూల్ మునిగిపోయింది... కానీ 1,643 మంది సేఫ్!
International· 31 Aug 2026

స్కూల్ మునిగిపోయింది... కానీ 1,643 మంది సేఫ్!

నేపాల్‌లోని త్రిశూలి నదిలో 30 మీటర్ల ఎత్తులో వచ్చిన భయంకరమైన ఫ్లాష్ ఫ్లడ్స్ త్రిభువన్ త్రిశూలి స్కూల్‌ను ముంచెత్తాయి. ప్రిన్సిపాల్ రాజేంద్ర దాదాబీ సమయస్ఫూర్తితో 1,643 మంది స్టూడెంట్స్ సేఫ్‌గా బయటపడ్డారు. ఊరు కొట్టుకుపోతోందని ఫ్రెండ్ నుండి అలర్ట్ రాగానే, ఆయన వెంటనే స్కూల్ బెల్ కొట్టి పిల్లలను ఎత్తైన ప్రదేశానికి పంపారు. వస్తున్న స్కూల్ బస్ డ్రైవర్లకు ఫోన్ చేయడంతో, బ్రిడ్జ్ కూలిపోయే ముందే బస్ సేఫ్‌గా క్రాస్ అయింది. దాదాబీ చూపిన సమయస్ఫూర్తిపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

దిల్లీలో షాకింగ్ ఘటన.. కదులుతున్న బస్‌లో బాలికపై దారుణం!
Crime· 31 Aug 2026

దిల్లీలో షాకింగ్ ఘటన.. కదులుతున్న బస్‌లో బాలికపై దారుణం!

UPకి చెందిన 16 ఏళ్ల బాలికపై కదులుతున్న స్లీపర్ బస్‌లో ఇద్దరు వ్యక్తులు సెక్సువల్ అబ్యూజ్‌ చేశారని పోలీసులు తెలిపారు. భారీ వర్షంలో దారి తప్పిన బాలిక.. గ్రేటర్ నోయిడాలోని పరి చౌక్ వద్ద బస్ ఎక్కినట్లు తెలుస్తోంది. 47 కి.మీ. జర్నీలో ఈ ఘటన జరిగినట్లు కేసు నమోదైంది. తరువాత కశ్మీరీ గేట్ దగ్గరలో బాలికను వదిలేసినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్, కండక్టర్‌ను అరెస్ట్ చేశారు. అధికారులు CCTV ఆధారంగా నిందితులను ట్రేస్ చేసి, బస్‌ను ఫోరెన్సిక్ టెస్ట్‌కు పంపించారు. ఈ కేసుపై ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతోంది.

వర్షం లేక.. మిర్చి, పత్తి కళ్లు తేలేస్తున్నాయ్!
Local· 31 Aug 2026

వర్షం లేక.. మిర్చి, పత్తి కళ్లు తేలేస్తున్నాయ్!

పల్నాడు దాచేపల్లి రైతులకు వర్షమే పెద్ద టెన్షన్‌గా మారింది. మిర్చి, పత్తి పంటలు ఎండిపోతున్నాయి. బోర్ల నీళ్లు కూడా అంతంతమాత్రంగా ఉండటంతో పంటలకు నీరందించడం కష్టంగా మారింది. ఇలాగే కొనసాగితే పంట నాణ్యత దెబ్బతింటుంది. మార్కెట్లో ధర కూడా రాదు. ఇది రైతులకు రెట్టింపు నష్టం! ఎపి మొత్తం ఇదే పరిస్థితి. ఆగస్టు 16 వరకు రాష్ట్రంలో 52% వర్షపాతం లోటు నమోదైంది. దేశవ్యాప్తంగా కూడా 13% లోటే. ఐఎండీ అంచనా ప్రకారం సెప్టెంబర్లోనూ వర్షాలు తగ్గే అవకాశమే ఉంది. మీ ఊళ్లో వర్షాలు, పంటల పరస్థితి ఎలా ఉంది? కామెంట్ చేయండి.

ప్రకృతి వ్యవసాయం కోసం బయల్దేరిన బస్సు!
Local· 31 Aug 2026

ప్రకృతి వ్యవసాయం కోసం బయల్దేరిన బస్సు!

అనపర్తిలో సోమవారం ఓ ప్రత్యేక బస్సు బయలుదేరింది. MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సులో 110 మంది రైతులు ఉన్నారు. వీళ్లంతా మార్టేరు పరిశోధనా కేంద్రానికి వెళ్తున్నారు. రసాయనాల వాడకం తగ్గించి, ప్రకృతి వ్యవసాయం పెంచడం ఈ యాత్ర ఉద్దేశ్యం. మార్టేరులో కొత్త వరి వంగడాలు, ఆధునిక సాగు పద్ధతులు అభివృద్ధి చేశారు. వాటిని రైతులు ప్రత్యక్షంగా చూడాలని ఈ యాత్ర ఏర్పాటు చేశారు. "ఇంతకాలం రసాయనాల ఆధారంగా సాగు చేశాం. ఇప్పుడు ప్రకృతికి దగ్గరగా ఉంటూ.. అధిక దిగుబడులు సాధించాల''ని MLA చెప్పారు.

ఉంగరాల జుట్టుపై హీరోయిన్ కామెంట్స్!
Gen Z· 31 Aug 2026

ఉంగరాల జుట్టుపై హీరోయిన్ కామెంట్స్!

ఇన్‌స్టాగ్రామ్‌తో పాపులర్ అయి 'సింగ్ గీతం' మూవీతో ఎంట్రీ ఇచ్చిన యాక్ట్రెస్ అహల్య బామ్రూ, కర్లీ హెయిర్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఉంగరాల జుట్టు మెస్సీగా ఉంటుందనే పాత ఆలోచనను తీసేయాలన్నారు. టీవీ, ఫ్యాషన్ ఇండస్ట్రీలో స్ట్రెయిట్ హెయిర్‌నే అందంగా చూపించడం వల్ల ఈ మైండ్‌సెట్ వచ్చిందని, కానీ నేచురల్ కర్ల్స్ చాలా అమేజింగ్‌గా ఉంటాయని చెప్పారు. ప్రాపర్ కేర్‌తో మీ ఓరిజినల్ హెయిర్‌ని ఫుల్ కాన్ఫిడెన్స్‌తో మైంటైన్ చేయచ్చని, దాన్ని దాచాల్సిన అవసరమే లేదని అన్నారు.

GO 97.. పాలిటెక్నిక్‌లు ప్రైవేట్ అవుతున్నాయా?
Local· 31 Aug 2026

GO 97.. పాలిటెక్నిక్‌లు ప్రైవేట్ అవుతున్నాయా?

అవుననే అంటోంది పాలిటక్నిక్ Jac. GO97 పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పాలిటెక్నిక్ కళాశాలలు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU)తో విలీనం చేసి SHAKTI శాఖ కిందకు వెళ్తాయి. ఇది PPP (public private partnership) మోడల్.<br>ప్రస్తుతం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల్లో చదువుతున్నది 90% మంది పేద, బడుగు విద్యార్థులే. వీరు ECET ద్వారా B.Tech లో లాటరల్ ఎంట్రీ పొందుతున్నారు. PPP మోడల్‌కు మారితే ఫీజులు పెరుగుతాయని, ఉన్నత విద్యకు దారులు మూసుకుపోతాయని భయపడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులూ ప్రైవేట్ వశమవుతాయని ఆందోళన.

చెత్త నుంచి డబ్బు.. NTPC చైతన్య కార్యక్రమం!
Local· 31 Aug 2026

చెత్త నుంచి డబ్బు.. NTPC చైతన్య కార్యక్రమం!

రామగుండం టౌన్‌షిప్‌లో ఓ ప్రత్యేక కార్యక్రమం జరిగింది. NTPC పర్యావరణ విభాగం ఆధ్వర్యంలో "వేస్ట్ టు వాల్యూ" – అంటే వ్యర్థాల నుంచి ఆదాయం అనే అవగాహన సెషన్ నిర్వహించారు. చెత్తను తడి, పొడి, పునర్వినియోగ వ్యర్థాలుగా వేరు చేయడం, సురక్షితంగా సేకరించడం, శాస్త్రీయంగా తరలించడం – ఇవన్నీ ఈ సెషన్ లో కవర్ చేశారు. టౌన్‌షిప్ నివాసితులు కాగితం, అట్టపెట్టెలు, ప్లాస్టిక్, ఇనుము, గాజు వంటి వాటిని తీసుకొచ్చి అందజేశారు. చెత్తలో కూడా డబ్బు ఉంటుందని, పర్యావరణానికి మేలు చేస్తూ ఆదాయం సంపాదించొచ్చని అధికారులు వివరించారు.

బొత్సపై కేఏ పాల్ సంచలన కామెంట్స్
Current Affairs· 31 Aug 2026

బొత్సపై కేఏ పాల్ సంచలన కామెంట్స్

AP: మాజీ మంత్రి బొత్సపై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ సంచలన కామెంట్స్ చేశారు. “బొత్స ఒక నత్తోడు. ఆయన ఎలా మంత్రి అయ్యారో కూడా నాకు తెలియదు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రపంచంలో యుద్ధాలను ఆపేందుకు తిరుగుతున్నానని, అలాంటి తన గురించి బొత్స మాట్లాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. “లక్షల మంది ఎదుట బొత్స నా కాళ్లు పట్టుకుని నన్ను గెలిపించమని అడగలేదా?” అంటూ ప్రశ్నించారు.

ఆ 8 కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున సాయం!
Local· 31 Aug 2026

ఆ 8 కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున సాయం!

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఆగస్టు 27న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేలూరు గ్రామానికి చెందిన 8 మంది ఆటోలో వెళ్తుండగా.. ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. 8 మంది స్పాట్ డెడ్. మరో 10 మందికి తీవ్ర గాయాలు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించింది. సీఎం చంద్రబాబు మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. గాయపడిన వారికి ఉత్తమ వైద్యం అందించాలని ఆదేశించారు. ఎపిలో ప్రతి 100 ప్రమాదాల్లో 42.7 మరణాలు సంభవిస్తున్నాయి. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ. దీన్ని తగ్గించేందుకు ఏం చేద్దాం? కామెంట్ చేయండి.