Latest

20కే బట్టతల.. పెళ్లి కష్టమేనా?
Viral· 15 Jul 2026

20కే బట్టతల.. పెళ్లి కష్టమేనా?

ఇప్పుడు చాలా మంది అబ్బాయిలకు 20–25 ఏళ్లకే జుట్టు బాగా ఊడిపోతోంది. దాంతో చిన్న వయసులోనే బట్టతల కనిపిస్తోంది. ఇది లుక్‌కే కాదు... పెళ్లి సంబంధాల మీద కూడా ప్రభావం చూపుతోందని అంటున్నారు. జుట్టు తగ్గిందని కొందరిని తిరస్కరిస్తుండటంతో, చాలామంది హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్, హెయిర్ ప్యాచ్‌ల వైపు వెళ్తున్నారు. కానీ నిపుణులు మాత్రం... జుట్టు విషయం దాచిపెట్టకుండా ముందే చెప్పడం మంచిదని, అదే నమ్మకమైన బంధానికి బాట వేస్తుందని సజెస్ట్ చేస్తున్నారు.

హీరోయిన్ సమంత సీమంతం సెలబ్రేషన్స్!
Entertainment· 15 Jul 2026

హీరోయిన్ సమంత సీమంతం సెలబ్రేషన్స్!

హీరోయిన్ సమంత త్వరలోనే తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. మంగళవారం ఆమె ఇంట్లో 'సీమంతం' వేడుక ఎంతో గ్రాండ్‌గా జరిగింది. ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ ఫ్రెండ్స్ మధ్యలో సాంప్రదాయబద్ధంగా ఈ ఫంక్షన్‌ను సెలబ్రేట్ చేశారు. ఈ బ్యూటిఫుల్ మూమెంట్స్‌కి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సమంత కొత్త జర్నీ స్టార్ట్ అవుతుండడంతో ఫ్యాన్స్, సెలబ్రిటీలు కంగ్రాట్స్ చెప్తున్నారు.

CM రేవంత్‌ రెడ్డికి పవన్ కళ్యాణ్ లేఖ!
Politics· 15 Jul 2026

CM రేవంత్‌ రెడ్డికి పవన్ కళ్యాణ్ లేఖ!

చిల్డ్రన్ సేఫ్టీ, జస్టిస్ కోసం AP డిప్యూటీ CM పవన్ కళ్యాణ్, తెలంగాణ CM రేవంత్ రెడ్డికి ఒక లెటర్ రాశారు. తెలంగాణలో POCSO యాక్ట్‌ను మరింత స్ట్రాంగ్‌గా అమలు చేయాలని కోరారు. ముఖ్యంగా పోక్సో కేసుల ఇన్వెస్టిగేషన్‌ను 60 నుండి 90 రోజుల్లోనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు 24 గంటల్లో మెడికల్ టెస్ట్‌లు చేయాలని, నిందితుల బెయిల్‌ను గట్టిగా వ్యతిరేకించాలని సూచించారు. ప్రతి జిల్లాలో 'Special Monitoring Cell' ఏర్పాటు చేసి, నిర్లక్ష్యం వహించే అధికారులపై యాక్షన్ తీసుకోవాలని ఈ లెటర్ లో రేవంత్‌ను పవన్ కల్యాణ్ కోరారు.

స్టూడెంట్స్ బీ అలర్ట్!
Education· 15 Jul 2026

స్టూడెంట్స్ బీ అలర్ట్!

తెలంగాణలోని విద్యాసంస్థల్లో డ్రగ్స్‌ను పూర్తిగా అరికట్టేందుకు DGP C.V. ఆనంద్ 'ఈగల్' అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. క్యాంపస్‌లలో 'Zero Tolerance' పాలసీని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి కాలేజ్, స్కూల్‌లో 'Anti-Drugs and Safety Committees' తో పాటు ఒక 'Safety Coordinator'ని తప్పనిసరిగా నియమించాలి. రూల్స్ బ్రేక్ చేసే కాలేజీల గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించారు. త్వరలోనే డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం 'SOPs' రిలీజ్ చేయనున్నారు. స్టూడెంట్స్ కోసం సైకాలజిస్ట్‌లు, కౌన్సెలర్స్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.

ఇరాన్‌కు ట్రంప్ బిగ్ షాక్!
World· 15 Jul 2026

ఇరాన్‌కు ట్రంప్ బిగ్ షాక్!

అమెరికా-ఇరాన్ మధ్య వార్ ముదురుతోంది. శాంతి చర్చలకి ఇరాన్ సహకరించకపోతే, వచ్చే వారం నుండి మిలిటరీ అటాక్స్ మరింత తీవ్రం చేస్తామని అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఈ స్టేట్‌మెంట్ వచ్చిన కొద్దిసేపటికే, US సెంట్రల్ కమాండ్ ఇరాన్‌పై డ్రోన్లతో మరో విడత దాడులు స్టార్ట్ చేసింది. సాధారణంగా రాత్రిపూట దాడులు చేసే అమెరికా, ఈసారి పగటిపూటే ఇరాన్ రక్షణ, క్షిపణి స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడటం గమనార్హం. ఇరాన్ సైనిక సామర్థ్యాలను దెబ్బతీయడమే తమ టార్గెట్ అని అమెరికా ప్రకటించింది.

జంతర్ మంతర్ చేరిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్!
Politics· 15 Jul 2026

జంతర్ మంతర్ చేరిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్!

UP నగీనా MP, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఢిల్లీలోని జంతర్ మంతర్ ప్రోటెస్ట్‌లో జాయిన్ అయ్యారు. 18 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్చుక్‌కు, అలాగే కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేస్తున్న నిరసనకు ఆయన తన పూర్తి సపోర్ట్ ప్రకటించారు. నిరసనకారులతో కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. చంద్రశేఖర్ ఆజాద్ స్వయంగా వచ్చి సంఘీభావం తెలపడంతో ఈ ప్రోటెస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

అధికారులపై చీపుర్లతో దాడి చేసిన రైతులు!▶
News· 15 Jul 2026

అధికారులపై చీపుర్లతో దాడి చేసిన రైతులు!

కర్ణాటకలోని బీదడి గ్రామంలో టౌన్‌షిప్ కట్టేందుకు 508 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే, ల్యాండ్ సర్వే కోసం వచ్చిన ప్రభుత్వ అధికారులపై స్థానిక రైతులు, ప్రజలు ఒక్కసారిగా తిరగబడ్డారు. కోపంతో అధికారులను చీపుర్లతో కొట్టి, అక్కడి నుంచి పరుగెత్తించారు. ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

బస్సులో కండక్టర్ బ్యాగ్ మిస్
India· 15 Jul 2026

బస్సులో కండక్టర్ బ్యాగ్ మిస్

బెంగళూరు నగరంలోని ఓ ఆర్టీసీ బస్సులో కండక్టర్ టికెట్ బ్యాగ్ మిస్సయ్యింది. టికెట్ బ్యాగ్ దొరకకపోతే సస్పెన్షన్‌కు గురయ్యే అవకాశం ఉందని కండక్టర్ ఆందోళనకు గురయ్యారు. బస్సును మధ్యలోనే నిలిపేసి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ప్రయాణికుల బ్యాగులు వెతకగా టికెట్ బ్యాగ్ దొరికింది. ఓ మహిళ ఆ బ్యాగ్ తీసుకున్నట్లు చూశామని ప్రయాణికులు చెప్పారు. ఆ టైంలో ఆమె వీడియోను కూడా రికార్డు చేశారు.

తిరుపతిలో ₹85 లక్షల స్కామ్!
News· 15 Jul 2026

తిరుపతిలో ₹85 లక్షల స్కామ్!

తిరుపతిలో శ్రీవారి దర్శనం, రూమ్స్, సేవా టికెట్ల పేరుతో మోసాలకు పాల్పడిన TTD మాజీ ఉద్యోగి అరుణ్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు భక్తుల నుంచి ఇతడు ₹3.20 లక్షలు వసూలు చేశాడు. నిందితుడి బ్యాంక్ అకౌంట్స్ చెక్ చేయగా.. ఏకంగా ₹85 లక్షల ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. 2023లో ఇలాంటి ఫ్రాడ్స్ చేయడంతో TTD ఇతడిని జాబ్ లోంచి తీసేసింది. అరుణ్‌కుమార్ నుంచి ₹99 వేల క్యాష్, మొబైల్, 3 బ్యాంక్ పాస్‌బుక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రభుత్వ లాంఛనాలు వద్దన్న ముద్రగడ ఫ్యామిలీ!
News· 15 Jul 2026

ప్రభుత్వ లాంఛనాలు వద్దన్న ముద్రగడ ఫ్యామిలీ!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియను ప్రభుత్వ లాంఛనాలతో జరపాలని ప్రభుత్వం భావించినప్పటికీ, ఆయన కుటుంబ సభ్యులు ఆ ప్రొటోకాల్‌ను రిజెక్ట్ చేశారు. తమకు ప్రభుత్వ లాంఛనాలు వద్దని అఫిషియల్స్‌కు స్పష్టం చేశారు. సాధారణ పద్ధతిలోనే సొంత గ్రామం అయిన కిర్లంపూడిలో అంత్యక్రియలు జరపాలని నిర్ణయించారు. ముద్రగడ చనిపోవడంతో ఆయన ఫాలోవర్స్, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

తెలంగాణ ఓటర్లకు అలర్ట్: SIR గడువును పొడిగింపు!
News· 15 Jul 2026

తెలంగాణ ఓటర్లకు అలర్ట్: SIR గడువును పొడిగింపు!

తెలంగాణ ఓటర్లకు అలర్ట్! రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) గడువును కేంద్ర ఎన్నికల సంఘం (ECI) పొడిగించింది. రీసెంట్ షెడ్యూల్ ప్రకారం, ఈ గడువును ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగిస్తూ ECI అఫీషియల్ డెసిషన్ తీసుకుంది. బీఎల్ఓ (BLO)ల డోర్-టు-డోర్ వెరిఫికేషన్ ప్రక్రియను మరింత పక్కాగా పూర్తి చేసేందుకు, ప్రజల్లో అవేర్‌నెస్ పెంచేందుకు ఈ ఎక్స్ట్రా టైమ్ ఇచ్చారు. అర్హులైన సిటిజన్స్ ఈ డెడ్‌లైన్ లోపు తమ ఓటర్ కార్డు వివరాలను చెక్ చేసుకుని, అప్‌డేట్ చేసుకోవచ్చు.

ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు: పాడె మోసిన YS జగన్!▶
News· 15 Jul 2026

ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు: పాడె మోసిన YS జగన్!

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ఆయన సొంతూరు కిర్లంపూడిలో జరిగాయి. YCP అధినేత YS జగన్ మోహన్ రెడ్డి ఈ అంతిమయాత్రకు హాజరై, ముద్రగడ మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణతో కలిసి జగన్ ముద్రగడ పాడె మోశారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో హైదరాబాద్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ముద్రగడ నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. అంత్యక్రియలు ముగిసే వరకు జగన్ అక్కడే ఉన్నారు.

'జై భారత్' రమణమూర్తి పై దాడికి నిరసనగా భారీ సభ
TG· 15 Jul 2026

'జై భారత్' రమణమూర్తి పై దాడికి నిరసనగా భారీ సభ

TG: హిందూ ధర్మాన్ని జై భారత్ మూమెంట్ ద్వారా ప్రచారం చేస్తున్న ‘విజయవిహారం’ రమణమూర్తి మీద ఒక ఛానెల్లో జరిగిన దాడిపై తీవ్ర నిరసనలు వ్యక్తమౌతున్నాయ్. హిందుత్వవాదుల దాడుల్నిని ఖండిస్తూ గురువారం (రేపు) మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమాలోచన సభ నిర్వహిస్తున్నారు. కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి (KVPS), తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం(TPSK) సంయుక్త నిర్వహణలో ఈ కార్యక్రమం జరుగుతుందని ప్రకటించారు.

కాంగ్రెస్ లీగల్ సెల్ లాయర్ వల్లే  నిందితుడికి బెయిల్
Politics· 15 Jul 2026

కాంగ్రెస్ లీగల్ సెల్ లాయర్ వల్లే నిందితుడికి బెయిల్

TG: కాంగ్రెస్ లీగల్ సెల్ లాయర్ వల్లే రంగారెడ్డి జిల్లా షాబాద్ పోక్సో నిందితుడు రాజ్ కుమార్‌కి బెయిల్ వచ్చిందని BRS పార్టీ జనరల్ సెక్రటరీ RS ప్రవీణ్‌ కుమార్‌ ఆరోపించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ భిక్షపతి గౌడ్ షాబాద్ పోక్సో నిందితుడు రాజ్‌కుమార్ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉన్నాడన్నారు. కాంగ్రెస్ నాయకులకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు ఇచ్చి మహిళలను రక్షించాలంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు.

చెత్తకుప్పలో బతుకమ్మ చీరలు
TG· 15 Jul 2026

చెత్తకుప్పలో బతుకమ్మ చీరలు

TG: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం మున్సిపల్ అధికారులకు సరఫరా చేసింది. అయితే, ఆ చీరలు పంపిణీ చేయకుండా మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ఓ స్టోర్‌రూమ్ పక్కన చెత్తకుప్పలో పడేయడం తీవ్ర కలకలం రేపింది. సుమారు 30వేలకుపైగా చీరలు అక్కడ ఉన్నట్లు సమాచారం. మహిళల కోసం లక్షల ప్రజాధనంతో కొనుగోలు చేసిన చీరలు మహిళలకు ఇవ్వకుండా చెత్తకుప్పలో పడేయడం పట్ల మున్సిపల్ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దినకర్మ సామాగ్రి తీసుకెళ్తుండగా ఘోర ప్రమాదం
Crime· 15 Jul 2026

దినకర్మ సామాగ్రి తీసుకెళ్తుండగా ఘోర ప్రమాదం

TG: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం వడ్డేపల్లి శివారులోని కంకర క్రషర్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. గోర్గల్ గ్రామానికి చెందిన జుంజురు దినేష్(26), జుంజురు రమేష్(24) దినకర్మ సామాగ్రి తీసుకుని బైక్‌పై వెళ్తున్నారు. గుర్తుతెలియని వాహనం వేగంగా వచ్చి వీరిని బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో దినేష్ స్పాట్‌లోనే మృతి చెందగా, తీవ్రంగా గాయపడ్డ రమేష్‌ను బాన్సువాడ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అతను మృతి చెందినట్లు SI శివకుమార్ తెలిపారు.

సుప్రీంకోర్టుకు వెళ్ళిన బండ్ల గణేష్!
News· 15 Jul 2026

సుప్రీంకోర్టుకు వెళ్ళిన బండ్ల గణేష్!

ఆస్తి వేలం వివాదంలో నిర్మాత బండ్ల గణేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లోన్ వ్యవహారంలో యూనియన్ బ్యాంక్ చర్యలను సవాలు చేస్తూ ఆయన పిటిషన్ వేశారు. వన్ టైమ్ సెటిల్‌మెంట్ కింద ఇప్పటికే దాదాపు ₹129.02 కోట్లు బ్యాంకు వసూలు చేసిందని, బకాయిలు తీరిపోయినా తన ఆస్తిని అన్యాయంగా వేలం వేశారని బండ్ల గణేష్ వాదిస్తున్నారు. అంతకుముందు హైకోర్టు బ్యాంక్ చర్యలను సమర్థించడంతో, ఇప్పుడు ఆయన ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

హసీనా వస్తే ఉరిశిక్ష తప్పదు: బంగ్లాదేశ్ సంచలన ప్రకటన!
Politics· 15 Jul 2026

హసీనా వస్తే ఉరిశిక్ష తప్పదు: బంగ్లాదేశ్ సంచలన ప్రకటన!

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఈ ఏడాది డిసెంబర్ నాటికి స్వదేశానికి తిరిగి వచ్చి, తన 'అవామీ లీగ్' పార్టీని బలోపేతం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీనిపై బంగ్లాదేశ్ ప్రధాని అడ్వైజర్ జహీద్ ఉర్ రెహమాన్ సంచలన కామెంట్స్ చేశారు. ఆమె రాకను స్వాగతిస్తున్నామని, అయితే దేశంలోకి వస్తే ఉరిశిక్ష తప్పదని స్పష్టం చేశారు. ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్‌లో విచారణ పారదర్శకంగా ఉంటుందని, తనను తాను డిఫెండ్ చేసుకోవడానికి వరల్డ్ బెస్ట్ లాయర్లను తెచ్చుకోవచ్చని, కోర్టులో వాదనలను బట్టి తీర్పు మారే ఛాన్స్ కూడా ఉందని పేర్కొన్నారు.

కాగజ్‌నగర్ ZPHSలో గ్యాస్ లీక్‌
TG· 15 Jul 2026

కాగజ్‌నగర్ ZPHSలో గ్యాస్ లీక్‌

TG: కొమురంభీమ్ జిల్లా కాగజ్‌నగర్‌ ZPHSలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాఠశాల వంటగదిలో గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మధ్యాహ్న భోజనం కోసం వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ లీక్ అయింది. క్షణాల వ్యవధిలోనే మంటలు వంటగది మొత్తం వ్యాపించడంతో వంట సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో పాఠశాలలో దాదాపు 450 మంది విద్యార్థులు ఉన్నారు. సకాలంలో మంటలను అర్పివేయడం, సిలిండర్ పేలకుండా రక్షించడంతో ఊపిరి పీల్చుకున్నారు.

నిరాహార దీక్షతో దేశాన్ని కదిలించిన నాయకులు!
Politics· 15 Jul 2026

నిరాహార దీక్షతో దేశాన్ని కదిలించిన నాయకులు!

మహాత్మా గాంధీ నుంచి అన్నా హజారే వరకు, నిరాహార దీక్షలు భారత రాజకీయాలను మార్చిన శక్తివంతమైన ఆయుధంగా నిలిచాయి. తెలంగాణ కోసం కె. చంద్రశేఖర్ రావు (KCR) 2009లో చేపట్టిన 11 రోజుల ఆమరణ దీక్ష ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి భారీ ఊపు ఇచ్చి, చివరికి తెలంగాణ ఆవిర్భావానికి కీలక మలుపైంది. అలాగే పొట్టి శ్రీరాములు, ఇరోమ్ షర్మిల, అన్నా హజారే దీక్షలు కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

ఎక్స్‌పైరీ ఫుడ్ కలర్స్‌తో ఐస్‌క్రీమ్
Crime· 15 Jul 2026

ఎక్స్‌పైరీ ఫుడ్ కలర్స్‌తో ఐస్‌క్రీమ్

TG: HYDలోని రామంతాపూర్ లక్ష్మీనారాయణ కాలనీలో ఓ కల్తీ ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రంపై పోలీసులు దాడిచేశారు. గడువు ముగిసిన ఫుడ్ కలర్స్, వివిధ రకాల ఫ్లేవర్లను ఉపయోగించడంతో పాటు, పూర్తిగా ఫంగస్ పట్టిన ఎండు అంజీర్‌తో ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ప్రమాదకరమైన పద్ధతుల్లో ఐస్‌క్రీమ్స్ తయారు చేస్తున్నట్లు, ఎలాంటి లేబుళ్లు లేని ముడి పదార్థాలు, భారీ మొత్తంలో లూజ్ టూటీ ఫ్రూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐస్‌క్రీమ్ యూనిట్‌ను సీజ్ చేసి నిర్వాహకుడు మందుల రమేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.