← Back to news

కాగజ్‌నగర్ ZPHSలో గ్యాస్ లీక్‌

By DK· 15 Jul 2026
కాగజ్‌నగర్ ZPHSలో గ్యాస్ లీక్‌

TG: కొమురంభీమ్ జిల్లా కాగజ్‌నగర్‌ ZPHSలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాఠశాల వంటగదిలో గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మధ్యాహ్న భోజనం కోసం వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ లీక్ అయింది. క్షణాల వ్యవధిలోనే మంటలు వంటగది మొత్తం వ్యాపించడంతో వంట సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో పాఠశాలలో దాదాపు 450 మంది విద్యార్థులు ఉన్నారు. సకాలంలో మంటలను అర్పివేయడం, సిలిండర్ పేలకుండా రక్షించడంతో ఊపిరి పీల్చుకున్నారు.

More in TG