Latest

చెత్తకుప్పలో బతుకమ్మ చీరలు
TG: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం మున్సిపల్ అధికారులకు సరఫరా చేసింది. అయితే, ఆ చీరలు పంపిణీ చేయకుండా మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ఓ స్టోర్‌రూమ్ పక్కన చెత్తకుప్పలో పడేయడం తీవ్ర కలకలం రేపింది. సుమారు 30వేలకుపైగా చీరలు అక్కడ ఉన్నట్లు సమాచారం. మహిళల కోసం లక్షల ప్రజాధనంతో కొనుగోలు చేసిన చీరలు మహిళలకు ఇవ్వకుండా చెత్తకుప్పలో పడేయడం పట్ల మున్సిపల్ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దినకర్మ సామాగ్రి తీసుకెళ్తుండగా ఘోర ప్రమాదం
TG: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం వడ్డేపల్లి శివారులోని కంకర క్రషర్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. గోర్గల్ గ్రామానికి చెందిన జుంజురు దినేష్(26), జుంజురు రమేష్(24) దినకర్మ సామాగ్రి తీసుకుని బైక్‌పై వెళ్తున్నారు. గుర్తుతెలియని వాహనం వేగంగా వచ్చి వీరిని బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో దినేష్ స్పాట్‌లోనే మృతి చెందగా, తీవ్రంగా గాయపడ్డ రమేష్‌ను బాన్సువాడ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అతను మృతి చెందినట్లు SI శివకుమార్ తెలిపారు.

సుప్రీంకోర్టుకు వెళ్ళిన బండ్ల గణేష్!
ఆస్తి వేలం వివాదంలో నిర్మాత బండ్ల గణేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లోన్ వ్యవహారంలో యూనియన్ బ్యాంక్ చర్యలను సవాలు చేస్తూ ఆయన పిటిషన్ వేశారు. వన్ టైమ్ సెటిల్‌మెంట్ కింద ఇప్పటికే దాదాపు ₹129.02 కోట్లు బ్యాంకు వసూలు చేసిందని, బకాయిలు తీరిపోయినా తన ఆస్తిని అన్యాయంగా వేలం వేశారని బండ్ల గణేష్ వాదిస్తున్నారు. అంతకుముందు హైకోర్టు బ్యాంక్ చర్యలను సమర్థించడంతో, ఇప్పుడు ఆయన ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

హసీనా వస్తే ఉరిశిక్ష తప్పదు: బంగ్లాదేశ్ సంచలన ప్రకటన!
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఈ ఏడాది డిసెంబర్ నాటికి స్వదేశానికి తిరిగి వచ్చి, తన 'అవామీ లీగ్' పార్టీని బలోపేతం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీనిపై బంగ్లాదేశ్ ప్రధాని అడ్వైజర్ జహీద్ ఉర్ రెహమాన్ సంచలన కామెంట్స్ చేశారు. ఆమె రాకను స్వాగతిస్తున్నామని, అయితే దేశంలోకి వస్తే ఉరిశిక్ష తప్పదని స్పష్టం చేశారు. ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్‌లో విచారణ పారదర్శకంగా ఉంటుందని, తనను తాను డిఫెండ్ చేసుకోవడానికి వరల్డ్ బెస్ట్ లాయర్లను తెచ్చుకోవచ్చని, కోర్టులో వాదనలను బట్టి తీర్పు మారే ఛాన్స్ కూడా ఉందని పేర్కొన్నారు.

కాగజ్‌నగర్ ZPHSలో గ్యాస్ లీక్
TG: కొమురంభీమ్ జిల్లా కాగజ్‌నగర్ ZPHSలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాఠశాల వంటగదిలో గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మధ్యాహ్న భోజనం కోసం వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ లీక్ అయింది. క్షణాల వ్యవధిలోనే మంటలు వంటగది మొత్తం వ్యాపించడంతో వంట సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో పాఠశాలలో దాదాపు 450 మంది విద్యార్థులు ఉన్నారు. సకాలంలో మంటలను అర్పివేయడం, సిలిండర్ పేలకుండా రక్షించడంతో ఊపిరి పీల్చుకున్నారు.

నిరాహార దీక్షతో దేశాన్ని కదిలించిన నాయకులు!
మహాత్మా గాంధీ నుంచి అన్నా హజారే వరకు, నిరాహార దీక్షలు భారత రాజకీయాలను మార్చిన శక్తివంతమైన ఆయుధంగా నిలిచాయి. తెలంగాణ కోసం కె. చంద్రశేఖర్ రావు (KCR) 2009లో చేపట్టిన 11 రోజుల ఆమరణ దీక్ష ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి భారీ ఊపు ఇచ్చి, చివరికి తెలంగాణ ఆవిర్భావానికి కీలక మలుపైంది. అలాగే పొట్టి శ్రీరాములు, ఇరోమ్ షర్మిల, అన్నా హజారే దీక్షలు కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

ఎక్స్‌పైరీ ఫుడ్ కలర్స్‌తో ఐస్‌క్రీమ్
TG: HYDలోని రామంతాపూర్ లక్ష్మీనారాయణ కాలనీలో ఓ కల్తీ ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రంపై పోలీసులు దాడిచేశారు. గడువు ముగిసిన ఫుడ్ కలర్స్, వివిధ రకాల ఫ్లేవర్లను ఉపయోగించడంతో పాటు, పూర్తిగా ఫంగస్ పట్టిన ఎండు అంజీర్‌తో ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ప్రమాదకరమైన పద్ధతుల్లో ఐస్‌క్రీమ్స్ తయారు చేస్తున్నట్లు, ఎలాంటి లేబుళ్లు లేని ముడి పదార్థాలు, భారీ మొత్తంలో లూజ్ టూటీ ఫ్రూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐస్‌క్రీమ్ యూనిట్‌ను సీజ్ చేసి నిర్వాహకుడు మందుల రమేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రేమ వ్యవహారం.. యువకుడి హత్య
TG: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన భాస్కర్ (29) హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఓ హాస్టల్‌లో వంటమనిషిగా పనిచేస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్వగ్రామానికి చెందిన యువతితో పరిచయం ప్రేమగా మారింది. దీంతో కుటుంబసభ్యులు యువతికి మరో యువకుడితో వివాహం చేశారు. భార్యాభర్తలకు గొడవలు జరగడంతో విడాకులు తీసుకున్నారు. అయితే తన కూతురి విడాకులకు భాస్కర్ కారణమని ఆమె తండ్రి రాజు కక్ష పెంచుకున్నాడు. ఐదుగురు వ్యక్తులు వచ్చి కర్రలు, కత్తులతో భాస్కర్‌పై విచక్షణారహితంగా పొడిచి చంపారు.

భారీగా పెరిగిన బంగారం ధరలు!
గత మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్స్ ఈరోజు (బుధవారం) సడన్‌గా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై ₹770 పెరిగి ₹1,43,570కి చేరింది. అలాగే 22 క్యారెట్లపై ₹700 పెరిగి ₹1,31,600 వద్ద, 18 క్యారెట్లపై ₹570 పెరిగి ₹1,06,670 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ ఒడిదుడుకుల వల్ల ఈ ధరల్లో మార్పులు ఉండొచ్చు, కాబట్టి షాపింగ్‌కు వెళ్లే ముందు లైవ్ రేట్స్ చెక్ చేసుకోవడం బెటర.

కాకతీయ వైభవాన్ని గుర్తుచేసేలా ఎయిర్‌పోర్ట్
TG: దిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి ప్రెస్‌మీట్ నిర్వహించారు. వరంగల్ విమానాశ్రయ నిర్మాణానికి వేగంగా భూసేకరణ చేసిన రేవంత్‌రెడ్డిని రామ్మోహన్ నాయుడు అభినందించారు. ప్రధాన భవనాల నిర్మాణానికి నాలుగు వారాల్లో టెండర్లు పిలుస్తామని చెప్పారు. 2028 జూన్‌కల్లా నిర్మాణాలన్నీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ తనను కోరినట్టు తెలిపారు. వరంగల్ ఎయిర్ పోర్టును కాకతీయ వైభవం, సంస్కృతి ఉట్టిపడేలా నిర్మిస్తామని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.

చిన్నవయసులోనే గుండెపోటు..ఎందుకు?
2025 నివేదికల ప్రకారం ఇండియాలో 25 శాతం గుండెపోట్లు 40 ఏళ్లలోపు ఉన్నవారికే వస్తున్నాయి. ఇతర ఖండాలతో పోలిస్తే దక్షిణాసియా ప్రజలు దాదాపు ఒక దశాబ్దం ముందే కరోనరీ ఆర్టరీ వ్యాధి బారిన పడుతున్నారు. యువకులలో ‘సైలెంట్ హార్ట్ ఎటాక్స్’ పెరుగుతున్నాయి. ఇవి అజీర్ణం, స్వల్ప ఆయాసం లాంటి లక్షణాలతో నిశ్శబ్దంగా బయటపడతాయి. రోజూ 30 నుంచి 45 నిమిషాల పాటు శారీరక శ్రమ చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, సిగరెట్‌ను మానుకోవడం వంటివి ఈ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ఓటు హక్కును కాపాడుకోండి
TG: చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్‌రెడ్డి పత్రిక ప్రకటన ద్వారా మీ ఎన్యూమరేషన్ ఫామ్ సమర్పించి ఓటు హక్కును కాపాడుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఫారాల పంపిణీకి 10 రోజుల గడువు మాత్రమే ఉందని, ఈలోపు ఎన్యూమరేషన్ పత్రాలని సమర్పించాలని కోరారు. రాష్ట్రంలో 3,38,26,448 మంది ఓటర్లకు మంగళవారం సాయంత్రానికి 49.28 శాతం మంది ఓటర్లు వారి ఎన్యూమరేషన్ ఫామ్‌లను సమర్పించారని ప్రకటించారు. మిగతా ఓటర్లు వెంటనే పత్రాలను నింపి బీఎల్‌వోలకు అందించాలని సీఈవో ఓటర్లకు సూచించారు.

18వ రోజుకు చేరిన సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష
విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష 18వ రోజుకు చేరుకుంది. ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటంతో బలవంతంగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇప్పటివరకు ఆయన 8 కిలోలకు పైగా బరువు తగ్గినట్లు సమాచారం. మరోవైపు కొంతమంది ప్రముఖులు దీక్ష విరమించాలని కోరగా, ప్రభుత్వం చర్చలకు రావాలని వాంగ్‌చుక్ డిమాండ్ చేస్తున్నారు.

అమర చిత్రకథలోకి HAL కొత్త కామిక్ రిలీజ్
ప్రముఖ కామిక్ సిరీస్ అమర చిత్రకథ వచ్చే నెలలో 'HAL: The Force Behind the Forces' పేరుతో కొత్త కామిక్‌ను రిలీజ్ చేస్తోంది. భారత విమానయాన రంగంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL) 86 ఏళ్ల ప్రయాణం, తేజస్, ప్రచండ్, ధ్రువ్ వంటి స్వదేశీ విమానాల అభివృద్ధి, అంతరిక్ష రంగంలో సంస్థ రోల్‌ను ఇందులో వివరించనున్నారు. కొత్తతరం యువతకు భారత వైమానిక రంగ చరిత్రను చెప్పడమే ఈ కామిక్ లక్ష్యంగా పేర్కొన్నారు.

ఈ20 వివాదం..నలుగురు ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసు
ఈ20 ఇంధన విధానంపై తప్పుడు సమాచారం ప్రచారం చేశారనే ఆరోపణలతో నలుగురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసు నమోదైంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేరును ఆధారాలు లేకుండా వీడియోల్లో ఉపయోగించారని పోలీసులు తెలిపారు. యూట్యూబర్ మనీష్ కశ్యప్‌తోపాటు మరో ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ వీడియోలు ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని ఆరోపించారు. నాగ్‌పూర్ సైబర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆసుపత్రి నుంచి పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్
AP: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముంబైలోని కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రి నుంచి బుధవారం ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. ఆయన కొంతకాలంగా భుజాల నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. ఈనెల 10న ఆయన భుజానికి ఆపరేషన్ జరిగింది. నాలుగు రోజులు అక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నారు. అయితే ఇప్పట్లో పవన్ కల్యాణ్ ఇంటి నుంచి బయటికి వచ్చే అవకాశం ఉండదు. ఇంకా కొద్ది రోజుల పాటు ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాల్సిందిగా డాక్టర్స్ చెప్పారు.

‘అమ్మ’ పిలుపు కోసం: సమంత
"అమ్మ అనిపించుకోవాలని ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాను. ఫైనల్‌గా ఆ టైమ్ వచ్చింది. ఈ జర్నీలో నా బెస్ట్ ఇవ్వడానికి రెడీ" అని హీరోయిన్ సమంత తన ఆనందాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న సమంత మాతృత్వం గురించి మాట్లాడుతూ ఈ కొత్త లైఫ్ ఫేజ్‌లో ప్రతి మూమెంట్‌ను ఆస్వాదిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం ఆమె తన హెల్త్ కోసం సినిమాలకు కొద్దిరోజులు బ్రేక్ ఇచ్చారు.

AIని నమ్మితే ఇంజినీర్ల నైపుణ్యాలకు దెబ్బ
AIని నమ్మితే ఇంజినీర్ల నైపుణ్యాలకు దెబ్బ తప్పదని నాస్కామ్ సీనియర్ ప్రెసిడెంట్, చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ సంగీత గుప్తా అభిప్రాయపడ్డారు. దిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఇంజినీరింగ్ నైపుణ్యాలను పెంపొందించుకోవడంలో విద్యాసంస్థలు విఫలమైతే ఇంజీనీర్లు AIని రూపొందించేవారిగా కాకుండా, దానిపై ఆధారపడి ఉద్యోగాలు చేసే ప్రమాదం ఉందని వివరించారు. ఇప్పటికే 90 శాతం మందికి పైగా AIని వాడుతున్నారని, వారి నైపుణ్యాలు దెబ్బతినకుండా పరిశ్రమ ఆన్ బోర్డింగ్ మెంటార్షిప్లను మెరుగుపరచాలని అన్నారు.

హైదరాబాద్‌లో నెలరోజులపాటు పండగ సందడి
TG: హైదరాబాద్‌లో నెలరోజులపాటు పండగ సందడి నిండిపోనుంది. బోనాలు, శివశక్తుల పూనకాలు, పోతురాజుల వేషధారణ, ఇంటికొచ్చిన చుట్టాలతో ఈ నెలంతా మెరవబోతుంది. దాదాపు 3,500 గుడుల్లో ఉత్సవాలు చేసేందుకు ప్రభుత్వం రూ.20 కోట్లు విడుదల చేసింది. ఉత్సవాలు ఘనంగా జరిగేందుకు అన్నిశాఖలు సమన్వయంతో పని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.
హాస్టల్‌లో ఉండలేక బయటకు వచ్చిన విద్యార్థులు
మంచిర్యాల జిల్లా చెన్నూరు మహాత్మా జ్యోతిబాపూలే గురుకులంలో వసతుల సమస్యలతో ఇంటర్ సెకండియర్ విద్యార్థులు హాస్టల్ విడిచి బయటకు వచ్చారు. మంగళవారం రాత్రి 17మంది స్టూడెంట్స్ ఎమ్మెల్యే సతీమణి సురేఖను కలిసి సమస్యలను వివరించారు. సమస్యలను విన్న సురేఖ, వారిని జిల్లా కోఆపరేటివ్ అధికారి శ్రీధర్‌కు అప్పగించి, సురక్షితంగా చెన్నూరుకు తరలించేలా చర్యలు తీసుకున్నారు. గురుకులంలో వసతులను కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాల, గురుకులాల్లో వసతులు లేకపోవడం, ఫుడ్‌పాయిజన్ ఘటనలతో స్టూడెంట్స్ భయాందోళనకు గురవుతున్నారు.

చాక్లెట్ల ఆశచూపి బాలికపై అత్యాచారం
TG: హైదరాబాద్‌లోని KPHB పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ బాలిక ఇంటి ముందు ఉత్తరప్రదేశ్‌కు చెందిన రెహాన్ అనే వ్యక్తి పండ్లు అమ్ముకుంటూ ఉండేవాడు. మే నెలలో బాలికతో పరిచయం పెంచుకున్న రెహాన్ తన ఇంట్లో చాక్లెట్లు, బిస్కెట్లు ఉన్నాయని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. దీంతో ఆమె విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచింది. రెహాన్ మరోసారి ఆమెను వేధించడంతో జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.