Latest

నటుడు ప్రకాశ్ రాజ్ కు నాన్ బెయిలబుల్  అరెస్ట్ వారెంట్ జారీ
News· 23 Jun 2026

నటుడు ప్రకాశ్ రాజ్ కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ

నటుడు ప్రకాశ్ రాజ్ కు ఒకటి కంటే ఎక్కువ ఓటరు గుర్తింపు కార్డులున్నాయన్న ఆరోపణల కేసులో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. 2019లో దిలీప్ కుమార్ అనే లాయర్ ప్రకాశ్ రాజ్ కు నాలుగు ఓటర్ ఐడీ కార్డులున్నాయని కేసు పెట్టారు. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఏపీలలో ఓటు హక్కు ఉందని ఆయన ఫిర్యాదు చేశారు.ఈ విషయంపై బెంగళూరు మున్సిపాలిటీకి కూడా కంప్లయింట్ చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆ లాయర్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు అనేక మార్లు విచారణకు రావాలని పిలిచినా ప్రకాశ్ రాజ్ స్పందించలేదు. దాంతో బెంగళూరు హై కోర్టు ఆయనకు అరెస్టు వారెంట్లు జారీ చేసింది.

శ్రీశైలం హైవేపై దారుణం.. 3 పరిస్థితి సీరియస్!▶
News· 23 Jun 2026

శ్రీశైలం హైవేపై దారుణం.. 3 పరిస్థితి సీరియస్!

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ వద్ద హైదరాబాద్-శ్రీశైలం మెయిన్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ జీపు కంట్రోల్ తప్పి ఏకంగా 100 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. అమ్రాబాద్ నుండి గవర్నమెంట్ టీచర్స్, చిన్నపిల్లలతో అచ్చంపేట వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలు కాగా, ముగ్గురి పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉంది. ప్రస్తుతం బాధితులందరినీ ట్రీట్‌మెంట్ కోసం అచ్చంపేట ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. ఈ యాక్సిడెంట్ న్యూస్ లోకల్‌గా తీవ్ర కలకలం రేపుతోంది.

ప్రీ-వెడ్డింగ్ షూట్‌లో దారుణం.. కాబోయే భర్తను చంపేసిన యువతి!
Crime· 23 Jun 2026

ప్రీ-వెడ్డింగ్ షూట్‌లో దారుణం.. కాబోయే భర్తను చంపేసిన యువతి!

పుణెలో జరిగిన కేతన్ విశాల్ డెత్ కేస్‌లో షాకింగ్ ట్విస్ట్ బయటపడింది. కొండ పైన ప్రీ-వెడ్డింగ్ షూట్ చేస్తూ కేతన్ ప్రమాదవశాత్తు లోయలో పడిపోయాడని అంతా అనుకున్నారు. కానీ, ఇదొక ప్లాన్డ్ మర్డర్ అని పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. కేతన్ కాబోయే భార్య, తన లవర్ చేతన్ చౌదరితో కలిసి ఈ మర్డర్ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు చేస్తున్నారు. ఈ ఇయర్ నవంబర్‌లో వీరికి జైపూర్‌లో గ్రాండ్ గా వెడ్డింగ్ ప్లాన్ చేశారు. ఇంతలోనే లవర్‌తో కలిసి కాబోయే భర్తను కొండపై నుండి నెట్టేసింది.

మురళీ మోహన్‌కు ‘పద్మశ్రీ’.. టాలీవుడ్‌లో ప్రౌడ్ మూమెంట్!▶
Cinema· 23 Jun 2026

మురళీ మోహన్‌కు ‘పద్మశ్రీ’.. టాలీవుడ్‌లో ప్రౌడ్ మూమెంట్!

ప్రముఖ టాలీవుడ్ నటుడు, నిర్మాత, మాజీ ఎంపీ మాగంటి మురళీ మోహన్‌కు ప్రతిష్టాత్మక ‘పద్మశ్రీ’ పురస్కారం లభించింది. మూవీ ఇండస్ట్రి లో ఆయన అందించిన అద్భుతమైన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రెజెంట్ చేసింది. నటుడిగా ఎన్నో సూపర్ హిట్ మూవీస్ చేయడమే కాకుండా, ప్రొడ్యూసర్‌గానూ టాలీవుడ్‌లో మురళీ మోహన్ తనదైన మార్క్ క్రియేట్ చేశారు. ఈ వండర్‌ఫుల్ ఆనర్ దక్కడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు ఫ్యాన్స్ ఆయనకు సోషల్ మీడియా వేదికగా హార్ట్‌ఫుల్ కంగ్రాట్స్ చెప్తున్నారు.

యాక్టర్ మాధవన్‌కు 'పద్మశ్రీ' అవార్డు!▶
Cinema· 23 Jun 2026

యాక్టర్ మాధవన్‌కు 'పద్మశ్రీ' అవార్డు!

వర్సటైల్ యాక్టర్ మాధవన్‌కు రేర్ హానర్ దక్కింది. ఇండియన్ సినిమాలో ఆయన అందించిన వండర్‌ఫుల్ కాంట్రిబ్యూషన్‌కు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ అవార్డుతో గౌరవించింది. ఢిల్లీలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము చేతులమీదుగా మాధవన్ ఈ అవార్డు అందుకున్నారు. లవర్ బాయ్‌గా, విలన్‌గా, డైరెక్టర్‌గా ఎన్నో సూపర్ హిట్ మూవీస్ చేసిన మాధవన్‌కు ఈ హానర్ దక్కడంపై ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

రోహిత్ శర్మకు పద్మశ్రీ అవార్డు!▶
Sports· 23 Jun 2026

రోహిత్ శర్మకు పద్మశ్రీ అవార్డు!

ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్, ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మకు రేర్ హానర్ దక్కింది. దేశంలోనే వన్ ఆఫ్ ది హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు అయిన ‘పద్మశ్రీ’ని ఆయన అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అఫీషియల్ ఈవెంట్‌లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము రోహిత్‌కు ఈ అవార్డును ప్రెజెంట్ చేశారు. క్రికెట్‌లో రోహిత్ క్రియేట్ చేసిన రికార్డ్స్ కి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. ఈ ప్రౌడ్ మూమెంట్ చూసి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కంగ్రాట్స్ చెప్తున్నారు.

మమ్ముట్టికి 'పద్మభూషణ్'.. రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డు!▶
Motivational· 23 Jun 2026

మమ్ముట్టికి 'పద్మభూషణ్'.. రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డు!

మలయాళం సూపర్ స్టార్, ఇండియన్ సినిమా లెజెండ్ మమ్ముట్టి రికార్డ్ క్రియేట్ చేశారు. దేశంలోనే థర్డ్ హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు అయిన ‘పద్మభూషణ్’ను ఆయన అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము చేతులమీదుగా మమ్ముట్టి ఈ అవార్డు తీసుకున్నారు. 5 దశాబ్దాల కెరీర్‌లో 400 కి పైగా మూవీస్ చేసి ఆడియన్స్‌ను మెప్పించినందుకు ఈ హానర్ దక్కింది. ఈ స్పెషల్ మూమెంట్‌లో మమ్ముట్టితో పాటు ఆయన వైఫ్, కొడుకు దుల్కర్ సల్మాన్ కూడా ఉన్నారు. మమ్ముట్టి కి ఈ ఆనర్ దక్కడం ఫాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసు అప్డేట్!
News· 23 Jun 2026

అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసు అప్డేట్!

అయోధ్య రామ మందిరంలో రూ. 5 కోట్ల నుండి రూ. 7.5 కోట్ల విరాళాల దొంగతనం జరిగిందంటూ UP మాజీ మంత్రి పవన్ పాండే చేసిన ఆరోపణలతో జూన్ 7న ఈ కేసు వెలుగులోకి వచ్చింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన SIT అధికారులు 150 మంది అనుమానితులను గుర్తించగా, 25 మందిపై చర్యలకు సిద్ధమయ్యారు. లవ్ కుష్, అవనీష్, అనుకల్ప్, కరుణే, తిన్ను యాదవ్‌ అనే ఐదుగురు ప్రధాన నిందితుల సమాచారంతో రూ. 2 కోట్లు రికవరీ చేశారు. జూన్ 13న తిన్ను యాదవ్ ఇంట్లో బంగారం కూడా సీజ్ చేశారు. ఓ మహిళా భక్తురాలు మందిరానికి ఇచ్చిన ఆభరణాల మాయంపై కూడా దర్యాప్తు జరుగుతోంది. ఈ బిగ్ స్కామ్ వెనుక ఉన్న పూర్తి డీటెయిల్స్ త్వరలోనే బయటకు రానున్నాయి.

కాక్రోచెస్ నిరసనలపై ఎడ్యుకేషన్ మినిస్టర్ షాకింగ్ కామెంట్స్!
Education· 23 Jun 2026

కాక్రోచెస్ నిరసనలపై ఎడ్యుకేషన్ మినిస్టర్ షాకింగ్ కామెంట్స్!

నీట్ (NEET) నిర్వహణపై రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనలపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఫస్ట్ టైమ్ స్పందించారు. స్టూడెంట్స్‌లో భయం పెంచిన రాహుల్ గాంధీ, ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాట్లాడారు. దేశాన్ని ముక్కలు చేయాలనుకునే కొందరు ఈరోజు జంతర్‌మంతర్‌లో డప్పు కొడుతూ నిరసనలు చేస్తున్నారు, కానీ 'అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న వారిలో ఒక్క స్టూడెంట్ అయినా ఉన్నాడా?' అని CJP ని ఉద్దేశించి ఆయన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడారు

తెలంగాణ అంగన్‌వాడీల్లో భారీ నోటిఫికేషన్!
Education· 23 Jun 2026

తెలంగాణ అంగన్‌వాడీల్లో భారీ నోటిఫికేషన్!

తెలంగాణ అంగన్‌వాడీ కేంద్రాల్లో 15,982 పోస్టుల భర్తీకి గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో 3,100 టీచర్లు, 12,882 సహాయకుల ఖాళీలు ఉన్నాయి. జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ నోటిఫికేషన్లు రిలీజ్ కానున్నాయి. ఈసారి అప్లై చేయడానికి 'ఇంటర్మీడియట్' క్వాలిఫికేషన్ తప్పనిసరి చేశారు. అలాగే కొత్తగా 10 మార్కులకు ఇంటర్వ్యూ విధానాన్ని కూడా తీసుకొచ్చారు. లోకల్ వార్డు లేదా గ్రామానికి చెందిన మహిళలకే ఇందులో ఛాన్స్ ఉంటుంది. ఇంటర్‌లో వచ్చిన మార్కులతో పాటు వితంతువులు, అనాథలు, దివ్యాంగులకు ప్రత్యేక వెయిటేజీ ఉంటుంది. ఖాళీల పూర్తి వివరాల కోసం మీ జిల్లా నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

తమిళనాడులో పుట్టిన ప్రతి బిడ్డకు గోల్డ్ రింగ్ ఫ్రీ!
Politics· 23 Jun 2026

తమిళనాడులో పుట్టిన ప్రతి బిడ్డకు గోల్డ్ రింగ్ ఫ్రీ!

తమిళనాడులో CM విజయ్ గవర్నమెంట్ 'వెట్రి తమిళగం విజన్'లో భాగంగా మేనమామ బంగారు ఉంగరం పథకం అనే స్కీమ్‌ను అనౌన్స్ చేసింది. ఈ స్కీమ్ కింద తమిళనాడులో ఎలిజిబుల్ ఫ్యామిలీస్‌కి చెందిన మహిళలు గవర్నమెంట్ హాస్పిటల్‌లో డెలివరీ అయితే, పుట్టిన ప్రతి బిడ్డకు 1 గ్రాము బంగారు ఉంగరాన్ని గిఫ్ట్‌గా ఇస్తారు. జూన్ 22, 2026 తర్వాత పుట్టిన పిల్లలందరూ దీనికి ఎలిజిబుల్. సెప్టెంబర్ 15, 2026న ఈ స్కీమ్‌ను అఫీషియల్‌గా స్టార్ట్ చేయనున్నారు. ఇందుకోసం గవర్నమెంట్ ఏటా రూ.755.83 కోట్లు ఖర్చు చేయనుంది. విజయ్ తీసుకొచ్చిన ఈ స్కీమ్‌ గురుంచి మీ అభిప్రాయం కామెంట్ చెయ్యండి.

మూడు అడుగుల కోడిని చూశారా!▶
Viral· 23 Jun 2026

మూడు అడుగుల కోడిని చూశారా!

బ్రెజిల్‌కు చెందిన 'ఇండియో జిగాంటే' అనే కోడి జాతి ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత పొడవైన కోడిగా ఫుల్ ఫేమస్ అయింది. ఈ కోడి సాధారణంగా మూడు అడుగుల కంటే ఎక్కువ ఎత్తు పెరుగుతుంది. దీని కాళ్లు చాలా పొడవుగా, సన్నగా ఉండడం వల్ల చూడటానికి వింతగా అనిపిస్తుంది. దీని గంభీరమైన నడక, రాజసమైన రూపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు నవ్వుతూ దీనికి "KFC ఫైనల్ బాస్!" అని కామెంట్స్ చేస్తున్నారు.

ఒకే ఫ్యామిలీలో ముగ్గురు మర్డర్.. కూతురే విలన్?
Crime· 23 Jun 2026

ఒకే ఫ్యామిలీలో ముగ్గురు మర్డర్.. కూతురే విలన్?

బెంగళూరులోని ఒక అపార్ట్‌మెంట్‌లో సోమసుందర్, ముత్తులక్ష్మి దంపతులతో పాటు వారి చిన్న కూతురు సుప్రియ దారుణంగా హత్యకు గురయ్యారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో పెద్ద కూతురు శ్వేత, ఆమె బాయ్‌ఫ్రెండ్ కెన్నెత్ కలిసి ఈ హత్యలు చేసినట్లు డౌట్ పడుతున్నారు. శ్వేత చేసిన అప్పులు, కెన్నెత్‌తో కలిసి ఉండడం పేరెంట్స్‌కి నచ్చకపోవడంతో ఇంట్లో గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే ప్లాన్ ప్రకారం ముగ్గురిని కత్తితో పొడిచి చంపేసి, ఆ ఇద్దరూ పారిపోయారు. ప్రస్తుతం పోలీసులు వాళ్ల కోసం వెతుకుతున్నారు.

జగన్‌కు పరామర్శించడానికి కూడా తీరిక లేదా?
Politics· 23 Jun 2026

జగన్‌కు పరామర్శించడానికి కూడా తీరిక లేదా?

AP: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కొద్దిరోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ముద్రగడ పద్మనాభం ఆరోగ్యంపై ఆయన కుమార్తె క్రాంతి స్పందించారు. ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారని చెప్పారు. YS జగన్ YSR CPలో రౌడీలకు, గంజాయ్ బ్యాచ్‌లకు ఇచ్చిన విలువ.. జగన్ కోసం తన పేరును సైతం మార్చుకున్న తన తండ్రికి ఇవ్వకపోవడం బాధాకరం అన్నారు. గత 10 రోజులుగా తన తండ్రి ముద్రగడ పద్మనాభం వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతుంటే.. కనీసం పరామర్శించడానికి కూడా జగన్‌కు తీరిక లేదా? అంటూ ప్రశ్నించారు.

సాయికృష్ణ మిస్సింగ్ కేసు.. CI నాగరాజు అరెస్ట్▶
AP· 23 Jun 2026

సాయికృష్ణ మిస్సింగ్ కేసు.. CI నాగరాజు అరెస్ట్

AP: తీవ్ర సంచలనం రేపిన సాయికృష్ణ మిస్సింగ్ కేసులో CI నాగరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. మిస్సింగ్ వెనుక ఉన్న అసలు రహస్యాలను, ఆర్థిక లావాదేవీల కోణాలను రాబట్టేందుకు సిట్ అధికారులు సీఐ నాగరాజును ప్రత్యేక వాహనంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ విచారణ నిమిత్తం స్థానిక పోలీస్ గెస్ట్‌హౌజ్‌కు తరలించారు. సీఐను అరెస్ట్ చేశారనే సమాచారం బయటకు రావడంతో నాగరాజుకు మద్దతుగా ఆయన అభిమానులు, అనుచరులు, స్థానికులు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని గుమిగూడారు. దీంతో ఆయన నివాసం వద్ద ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది.

తండ్రికి ఫోన్ చేసి ప్రాణాలు వదిలిన స్టూడెంట్!💔
News· 23 Jun 2026

తండ్రికి ఫోన్ చేసి ప్రాణాలు వదిలిన స్టూడెంట్!💔

లక్నోలో జరిగిన కోచింగ్ సెంటర్‌ ప్రమాదంలో ఒక హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్ అవ్వగానే. సుఖ్మణి సింగ్ (23) అనే స్టూడెంట్ వెంటనే వాళ్ల నాన్నకు ఫోన్ చేసి, "డాడీ.. ఇక్కడ మంటలు వచ్చేసాయి, ప్లీజ్ నన్ను కాపాడండి" అని ఏడుస్తూ కాల్ చేశాడు. కానీ, వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ అక్కడికి చేరుకునే లోపే ఆ స్టూడెంట్ ప్రాణాలు కోల్పోయాడు. కొడుకు ఫోన్ కాల్ గుర్తుచేసుకుంటూ ఆ తండ్రి కన్నీరుమున్నీరుగా ఏడుస్తున్నాడు.

ఈ చేప ధర వింటే షాక్ !
AP· 23 Jun 2026

ఈ చేప ధర వింటే షాక్ !

AP: బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్‌లో అరుదైన భారీ చేప మత్స్యకారుల వలకు చిక్కింది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు 25కిలోల బరువున్న మగ కచిడి చేప చిక్కడంతో హార్బర్ వద్ద సందడి నెలకొంది. అరుదుగా లభించే ఈ చేపను హార్బర్‌లో వేలం వేయగా, పాలకొల్లుకు చెందిన ఓ వ్యాపారి రూ.2లక్షలకు కొనుగోలు చేశారు. కచిడి చేప పొట్ట భాగాన్ని ఔషధాల తయారీలో వినియోగిస్తారని, అందుకే అంతర్జాతీయ మార్కెట్‌లోనూ వీటికి మంచి డిమాండ్ ఉందని తెలిపారు.

చిరుని కలిసిన 'మా ఇంటి బంగారం' టీమ్..
Cinema· 23 Jun 2026

చిరుని కలిసిన 'మా ఇంటి బంగారం' టీమ్..

సమంత లీడ్ రోల్‌లో వచ్చిన 'మా ఇంటి బంగారం' సినిమా టీమ్ రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఈ మూవీ చూసిన చిరు సోషల్ మీడియాలో రివ్యూ ఇచ్చారు. జాయింట్ ఫ్యామిలీ స్టోరీకి యాక్షన్, ఎమోషన్స్ కలిపి డైరెక్టర్ నందినీ రెడ్డి సినిమాను చాలా ఇంట్రెస్టింగ్‌గా తీశారని చెప్పారు. ముఖ్యంగా సమంత శారీ కట్టుకుని చేసిన యాక్షన్ సీన్స్ సూపర్ ఉన్నాయన్నారు. అలాగే లైఫ్‌లో కొత్త చాప్టర్ స్టార్ట్ చేయబోతున్న సమంత, రాజ్ కపుల్‌కి చిరు ఆల్‌ ది బెస్ట్ చెబుతూ కొన్ని ఫొటోలను తన X హ్యాండిల్‌లో షేర్ చేశారు.

మెదక్ జిల్లాలో జంట హత్యలు కలకలం
Politics· 23 Jun 2026

మెదక్ జిల్లాలో జంట హత్యలు కలకలం

మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారంలో ప్రాణ స్నేహితులైన శ్రీధర్, ప్రభు (ప్రభాకర్) మధ్య ఆర్థిక వివాదం, ఆపై కుటుంబ గొడవలు దారుణహత్యలకు దారితీశాయి. ప్రభు బంధువుల నుంచి శ్రీధర్ ఒక ఆటోను EMI పద్ధతిలో తీసుకున్నాడు. రెండునెలల EMI బకాయిల విషయంలో వీరి మధ్య గొడవ మొదలైంది. అనంతరం శ్రీధర్‌కు వరుసకు చెల్లెలు అయ్యే అమ్మాయిని ప్రభు రెండో పెళ్లి చేసుకున్నాడు. వివాహంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు, పగ తీవ్రరూపం దాల్చాయి. ప్లాన్ ప్రకారం ప్రభు తన ఫ్రెండ్స్‌తో కలిసి శ్రీధర్‌ను దారుణంగా హతమార్చారు. దీంతో శ్రీధర్ కుటుంబసభ్యులు ప్రభుపై కక్షతో అతని తండ్రి యాదగిరిని హత్యచేశారు.

పాత జ్ఞాపకాలను షేర్ చేసిన పవన్ కళ్యాణ్!
Politics· 23 Jun 2026

పాత జ్ఞాపకాలను షేర్ చేసిన పవన్ కళ్యాణ్!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఓల్డ్ ఫొటోపై డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. తన తండ్రి కొణిదెల వెంకట్రావు చనిపోయినప్పుడు. బహుజన నేత అగస్టిన్, విప్లవ గాయకుడు గద్దర్ గారు తమ ఇంటికి వచ్చినప్పటి జ్ఞాపకం ఇదని చెప్పారు. ఇది ప్రజారాజ్యం పార్టీ (PRP) పెట్టకముందు నాటి ఫొటో అని. ఆ రోజుల్లో తామంతా కలిసి తెలంగాణ ఉద్యమం, 'సామాజిక తెలంగాణ', బహుజన రాజ్యాధికారం, సామాజిక న్యాయంపై ఎన్నో చర్చలు జరిపేవారమంటూ పవన్ ఆ నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ట్వీట్ చేశారు.

అసెంబ్లీలో స్టాలిన్‌ను ఇమిటేట్ చేసిన CM విజయ్! వీడియో వైరల్!▶
Politics· 23 Jun 2026

అసెంబ్లీలో స్టాలిన్‌ను ఇమిటేట్ చేసిన CM విజయ్! వీడియో వైరల్!

తమిళనాడు అసెంబ్లీ సెషన్స్‌లో CM విజయ్‌కి సంబంధించిన ఒక క్రేజీ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్‌ అవుతోంది. CM విజయ్ తన స్పీచ్ క్లోస్ చేసేటప్పుడు. మాజీ CM, DMK అధినేత స్టాలిన్ గతంలో ఎలక్షన్ క్యాంపెయిన్‌లో చేసిన చేతి సైగ ను సేమ్ టు సేమ్ ఇమిటేట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి!