Latest

నిందితులకు శిక్ష పడేలా చేస్తాం: చంద్రబాబు
AP: విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ ఘటనలో నిందితులకు తప్పనిసరిగా శిక్ష పడేలా చేస్తామని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి CM చంద్రబాబు భరోసా ఇచ్చారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు ఆఫీస్‌లో సాయికృష్ణ తల్లి, కుటుంబసభ్యులు చంద్రబాబును కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయించి బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. సాయికృష్ణ మిస్సింగ్ ఘటన, తర్వాత జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. అన్నివిధాలా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

గడ్డి మందు నిషేధంపై హైకోర్ట్‌లో పిటిషన్
AP: పారాక్వాట్ డైక్లోరైడ్ 24% SL అనే గడ్డి మందు చాలా డేంజర్ అంటూ ఫిర్యాదులు రావడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నిషేధించిన విషయం తెలిసిందే. ఇటీవల AP రాష్ట్ర వ్యవసాయశాఖ 60రోజులపాటు గడ్డిమందును నిషేధిస్తూ జారీ చేసిన GOను సవాల్ చేస్తూ ఫెర్టిలైజర్స్, సీడ్ డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట నాగిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పారాక్వాట్ తయారీ, పంపిణీ, విక్రయానికి అనుమతిచ్చేలా ఆదేశించాలని పిటిషన్లో నాగిరెడ్డి హైకోర్టును కోరారు. గవర్నమెంట్ ముందుగా తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నిషేధం విధించిందని ఆయన పిటిషన్లో పేర్కొన్నాడు.

ట్రంప్ కు ఇచ్చి పడేసిన మెలోనీ !
జీ7 సదస్సులో ట్రంప్ తో ఫోటో కోసం పాకులాడినట్లు అమెరికా అధ్యక్షుడు చేస్తున్న ప్రకటనలపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఫైర్ అయ్యారు. తానెప్పుడు ట్రంప్ తో ఫోటో కోసం పాకులాడలేదని, బతిమాలుకోలేదని, ఆఖర్మ తనకు పట్టలేదని అన్నారు. ట్రంప్ కు ఇలా మాట్లాడటం మామూలేనని మండి పడ్డారు. తాను గానీ, తన దేశం కానీ ఎవరి ముందూ ఇలాంటి చిల్లర వ్యవహారాల కోసం తల వంచమని, ప్రాధేయపడబోమని మెలోని స్పష్టం చేశారు. ట్రంప్ కామెంట్లు తమ ప్రధాని పరువు తీసేలా ఉన్నాయంటూ ఇటలీ ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యింది.

కృష్ణలంక CI నాగరాజుపై హత్యానేరం కేసు
AP: రౌడీషీటర్ గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా CI నాగరాజుపై హత్యానేరం కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్గా పనిచేసిన విజయవాడ కృష్ణలంక PSలోనే ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో దర్యాప్తు అధికారిగా (IO) ACP దైవప్రసాద్‌ను, CP రాజశేఖరబాబు నియమించారు. వారు కృష్ణలంకలోని తల్లి విజయలక్ష్మి వాంగ్మూలం తీసుకున్నారు. సుమారుగా 2 గంటలపాటు వారి నుంచి వివరాలు సేకరించారు. అనంతరం కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని అక్కడి సిబ్బందిని విచారించారు.

భూవివాదాలు లేని తెలంగాణే లక్ష్యం: పొంగులేటి
TG: భూసమస్యలు, భూవివాదాలు లేని తెలంగాణను నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సాగు భూములను రీసర్వే చేయించాలనే కీలక నిర్ణయం తీసుకుందని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రెవెన్యూ అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫెరెన్స్‌లో మంత్రి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా రీసర్వే కార్యక్రమాన్ని వచ్చే నెల నుంచి దశలవారీగా నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న 10,954 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి అంగుళం భూమికి స్పష్టమైన హద్దులు, ప్రతి సర్వే నంబరుకు భూధార్, ప్రతి రైతుకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

100 మంది అంబేడ్కర్లు రావాలి: CM రేవంత్ రెడ్డి
TG: ఆనాడు ఒక్క అంబేడ్కర్ వస్తేనే ప్రపంచానికి దిక్సూచి అయ్యారు. తెలంగాణ దళిత, గిరిజన, బలహీన వర్గాల నుంచి 100 మంది అంబేడ్కర్లు రావాలని, ఆ శక్తి మీలో ఉందని విద్యార్థులకు CM రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న 27.50 లక్షల మంది విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. కిట్ల పంపిణీని హైదరాబాద్‌లోని LB స్టేడియంలో గవర్నర్‌తో కలిసి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

ఊబకాయులకు గుడ్ న్యూస్ ఈ జ్యూస్ !
శరీరంలో వాపులు తగ్గడానికి టమాటో, సోయాబీన్ దివ్యౌ షధంగా పనిచేస్తాయని రిసెర్చ్ లు చెబుతున్నాయి. టమాటో, సోయాబీన్ జ్యూస్ ని నెల్లాళ్లపాటు తాగిన వారిని పరిశీలించినప్పుడు ఈ మార్పు బయటపడింది.టమాటోలో ఉండే లైకోపీన్ ఇందుకు కారణమని గుర్తించారు. అలాగే సోయాబీన్స్ లోని ఐసో ఫ్లేవన్స్ కూడా ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు తెలిపారు. అమెరికాలోని ఒహయో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ న్యూస్ షేర్ చేశారు. సో వాపులున్నవారు, ఊబకాయులు కూడా ఈ జ్యూస్ తాగితే మంచిది.
యోగా డే ఏర్పాట్లపై బాబా రాం దేవ్ తో చంద్రబాబు భేటీ
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని యోగా గురువు బాబా రామ్‌దేవ్ , పతంజలి అధినేత ఆచార్య బాలకృష్ణన్ మర్యాదపూర్వకంగా కలిశారు. యోగా డేలో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన బాబా రామ్‌దేవ్, బాలకృష్ణన్ సీఎం ఆహ్వానం మేరకు వారి నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా వారితో యోగా డే కార్యక్రమం నిర్వహణపై ముఖ్యమంత్రి చర్చించారు.

ఫ్రాన్స్ అధ్యక్షుడికి మోడీ కలంకారీ మహాభారత పెయింటింగ్ కానుక
భారత ప్రధాని మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడికి అందించిన ఈ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక కలంకారీ పెయింటింగ్ భారతీయ కళావైభవానికి ప్రతీక. సాంప్రదాయ పెన్ డ్రాయింగ్ పద్ధతిలో, సుమారు ఆరు నెలల పాటు శ్రమించి దీనిని రూపొందించారు. మహాభారత ఘట్టాలతో పాటు, ముఖ్యంగా అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించే దృశ్యం ఇందులో హైలైట్. నైతిక నాయకత్వం, శాంతి, మానవ గౌరవం వంటి సార్వత్రిక విలువలను చాటిచెప్పే ఈ కళాఖండం అంతర్జాతీయంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కళ్లకు పని పెట్టండి... మీ లైఫ్ బాగుటుంది
ఉరుకులు, పరుగుల డిజిటల్ యుగంలో యూత్‌కి ‘స్లో లుకింగ్’ (నిదానంగా గమనించడం) ఒక అద్భుతమైన లైఫ్ హ్యాక్‌లా పనిచేస్తుంది. ఏదైనా కళాఖండాన్ని, వస్తువును లేదా ప్రకృతిని కనీసం పది నిమిషాల పాటు ఏకాగ్రతతో నిశితంగా చూడటం వల్ల మెదడు చురుగ్గా మారుతుంది. ఇది మీలో ఒత్తిడిని తగ్గించి, సృజనాత్మకతను (Creativity), జ్ఞాపకశక్తిని మరియు ఫోకస్‌ను అద్భుతంగా పెంచుతుంది. కేవలం పైపైన చూసి దాటిపోకుండా, లోతుగా గమనించడం అలవాటు చేసుకుంటే జీవితంలో నిర్ణయాలు కూడా మెరుగవుతాయి!

నెటిజన్ల మనసు దోచిన స్విగ్గీ డెలివరీ బాయ్ !
"ముస్లిం డెలివరీ బాయ్‌ని పంపకండి" అంటూ జైపూర్‌లో ఓ కస్టమర్ స్విగ్గీ యాప్‌లో పెట్టిన వివక్షాపూరిత మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఈ ద్వేషాన్ని పక్కనబెట్టి.. తన రోజువారీ ప్రయాణాల్లో జైపూర్ ప్రజలు తనపై చూపిస్తున్న అపారమైన ప్రేమ, ఆదరణే నిజమైన భారతీయుల తత్వమని సదరు డెలివరీ బాయ్ అఫ్తాబ్ ఖాన్ గట్టిగా చాటిచెప్పాడు. మనుషుల మధ్య మతం కంటే మంచితనమే గొప్పదని నిరూపించిన ఈ వార్త నెటిజన్ల మనసులను గెలుచుకుంటోంది.

ఫెయిల్యూర్స్ నుంచే సక్సెస్ కు పునాదులు- ఇంద్రనూయి
విజయాల కంటే అపజయాలే వ్యాపార సామ్రాజ్యాలకు అసలైన దిక్సూచి! తప్పుల నుండి నేర్చుకుంటూ, విఫలమైన చోట నుంచే విజయ తీరాల వైపు ప్రయాణాన్ని ప్రారంభిం చడమే నిజమైన నాయకత్వ లక్షణం.ఫెయిల్ స్మార్టర్ అనే ఈ కొత్త పుస్తకం వ్యాపార ప్రపంచంలో విఫలమైన వ్యూహాలను ఎలా విజయవంత మైన అవకాశాలుగా మార్చుకోవచ్చో అద్భుతంగా విశ్లేషించింది. ఓటములను చూసి వెనకడుగు వేయరాదన్న మెసేజ్ ను ఈ బుక్ బాగా వివరిస్తోంది.పెప్సీ కంపెనీ మాజీ సీఈఓ ఇంద్రనూయీ రాసిన ఈ బుక్ ఈ తరానికి మంచి ఇన్స్ పిరేషన్ గా ఉంటుంది. సో బుక్ లవర్స్.. ఎంజాయ్ రీడింగ్ దిస్ బుక్ !

యూఎస్ ఆధ్వర్యంలో 30 దేశాల్లో వందల్లో బయో ల్యాబ్స్ !
ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా దేశాల్లో ప్రమాదకర వ్యాధికారక క్రిములపై పరిశోధనలు సాగిస్తున్న 120 కంటే ఎక్కువ బయోల్యాబ్లకు అమెరికా దీర్ఘకాలంగా నిధులు సమకూరుస్తోందని యూఎస్ నేషనల్ ఇంటెలిజెన్స్ (DNI) సంచలన ఆధారాలు బయటపెట్టింది. ముఖ్యంగా ఉక్రెయిన్‌లోని ల్యాబ్‌లు రష్యా యుద్ధం వల్ల ముప్పులో ఉన్నాయని, రష్యా చేతికి చిక్కితే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఉక్రెయిన్, అమెరికా చాలా కాలం క్రితమే ఈ జాయింట్ రిసెర్చ్ మొదలు పెట్టినట్లు అయితే అవి మానవాళి ప్రయోజనాలకోసమే ఉద్దేశించినవనీ ఉక్రెయిన్ గతంలో చెప్పుకుంది,
ఇటలీ PM మెలోని నాతో ఫోటో కోసం బేగ్ చేసింది: ట్రంప్
అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్, ఇటలీ PM జార్జియా మెలోని మధ్య స్టేట్మెంట్స్ వార్ పీక్స్‌కు చేరింది. "మెలోని నా దగ్గరకు వచ్చి ఒక ఫోటో కోసం బతిమిలాడింది (beg చేసింది)" అంటూ ట్రంప్ చేసిన కామెంట్స్‌పై ఇటలీ PM ఫుల్ సీరియస్ అయ్యారు. ట్రంప్ వ్యాఖ్యలు అన్నీ అబద్ధాలని, USA ప్రెసిడెంట్ తన మిత్రదేశాల పట్ల ఇలా ప్రవర్తించడం విచారకరమని మండిపడ్డారు. శత్రువుల దగ్గర సాఫ్ట్‌గా ఉండే ట్రంప్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలని. "నేను కానీ, నా ఇటలీ దేశం కానీ ఎవరినీ బతిమిలాడవు" అంటూ మెలోని స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు.
మెడల్ తగిలించడానికి ట్రంప్ తిప్పలు? నవ్వు ఆపుకోలేకపోయిన ఆర్మీ ఆఫీసర్!
అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ అధికారిక కార్యక్రమంలో ఒక ఆసక్తికరమైన ఫన్నీ ఘటన చోటుచేసుకుంది. వైట్ హౌస్‌లో జరిగిన ఓ ప్రోగ్రామ్‌లో ఆర్మీ మేజర్ నికోలస్ డోకరీకి ప్రెసిడెంట్ ట్రంప్ అత్యున్నత 'మెడల్ ఆఫ్ ఆనర్' బహుకరించారు. అయితే, ఆ మెడల్‌ను ఆఫీసర్ కోటుకు తగిలించే క్రమంలో ట్రంప్ కాస్త ఇబ్బంది పడటంతో హాల్లోని వారంతా ఒక్కసారిగా నవ్వేశారు. దీనిపై ట్రంప్ కూడా కూల్‌గా స్పందిస్తూ.. "నేను దీన్ని కాస్త డిఫరెంట్‌గా, ఇంకాస్త నీట్‌గా తగిలిస్తాను, ఇది ఇక అస్సలు ఊడిపోదు" అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు. ప్రెసిడెంట్ ట్రంప్‌కు సంబంధించిన ఈ క్రేజీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.
జంతువుల బాడిని క్లీన్ చేసే పక్షులు!
ఆక్స్పెక్కర్ అనే పక్షులు జంతువుల శరీరంపై వాలి, వాటి చర్మానికి హాని కలిగించే కీటకాలు, పేలు మరియు పరాన్నజీవులను ఏరి తింటూ ఆ జంతువుల బాడీని క్లీన్ చేస్తాయి. ఇలా ఇవి పురుగులను తినడం వల్ల ఆయా జంతువులకు ఎంతో మేలు జరుగుతుంది. కానీ, కొన్నిసార్లు ఈ పక్షులు ఆ పురుగులను గట్టిగా పొడిచి తినే క్రమంలో.. జంతువుల చర్మానికి గాయాలు అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ బ్యూటిఫుల్ వీడియొ మీరు ఇక్కడ చూడవచ్చు.

కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ సొంత ఊర్లో!
కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే రేపు ఢిల్లీలో జరగబోయే పీస్ఫుల్ ప్రొటెస్ట్‌లో పాల్గొనడానికి వెళ్తున్నారు. అయితే ఈ ప్రొటెస్ట్‌కి బయలుదేరే ముందే, ఆయన తన సొంత ఊరికి వెళ్లి అక్కడి వాళ్లను కలిసి వచ్చారు. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

కోర్టుకు అల్లు అర్జున్ స్వయంగా వెళ్ళాల్సిందే?
హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు గట్టి షాక్ తగిలింది. ఈ కేసును విచారిస్తున్న నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌తో పాటు మరో 19 మందికి సడన్‌గా కోర్టు నోటీసులు పంపించింది. ఈ కేసులో అల్లు అర్జున్ను 11వ నిందితుడిగా చేర్చిన పోలీసులు, ఇప్పటికే మొత్తం 23 మందిపై ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు. ఈ క్రమంలోనే సోమవారం (june 22) రోజు అల్లు అర్జున్ స్వయంగా కోర్టుకు వచ్చి హాజరుకావాలని ఆర్డర్ వేశారు. పుష్పా 2 ప్రీమియర్ షో టైమ్‌లో జరిగిన ఈ ఇన్సిడెంట్ కేసు ఇప్పుడు ఈ కోర్టు నోటీసులతో మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.
తెలంగాణలో జనసేన ఆఫీస్ ఓపెన్ చేసిన పవన్ కళ్యాణ్?
తెలంగాణలో జనసేన పార్టీ తన యాక్టివిటీస్‌ను మరింత స్పీడ్ అప్ చేసింది. ఇందులో భాగంగానే తెలంగాణ స్టేట్ కొత్త జనసేన ఆఫీస్‌ను ఆ పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు గ్రాండ్‌గా ప్రారంభించారు. ఈ ఆఫీస్ ఓపెనింగ్ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్వయంగా జనసేన జెండాను ఎగరేసి ఆఫీస్‌ను ఇన్యాగ్యురేట్ చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీని మరింత స్ట్రాంగ్‌గా బిల్డ్ చేయడానికి, కార్యకర్తలందరికీ అందుబాటులో ఉండేలా ఈ కొత్త ఆఫీస్‌ను స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఆఫీస్ ఓపెనింగ్ విజువల్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మనుషులు 150 ఏళ్లు బతుకుతారా? సైన్స్ ఏం చెప్తోంది!
మనుషులు 150 ఏళ్లు బతకడం సాధ్యమేనా! ఈ రీసెర్చ్‌పై కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిశాయి. యాంటీ ఏజింగ్ టెక్నాలజీ, మంచి జీన్స్, హెల్తీ ఫుడ్, డైలీ ఎక్సర్సైజ్ అండ్ మెడికల్ అప్డేట్స్ వల్ల ఫ్యూచర్లో ఇది పాజిబుల్ కావచ్చని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఓన్లీ ఎక్కువ కాలం బతకడం కాదు, ఎవరిమీద ఆధారపడకుండా బతకడం ముఖ్యం. ముసలితనంలో కూడా ఫుల్ ఎనర్జీతో, మైండ్ షార్ప్‌గా ఉంటేనే దానికి వాల్యూ ఉంటుంది. ఈ 150 ఏళ్ల అంచనా ఇప్పుడున్న వాళ్లకు సెట్ అవ్వకపోవచ్చు, ఫ్యూచర్లో పుట్టే పిల్లల లైఫ్‌కి మాత్రం సైన్స్ అడ్వాన్స్మెంట్ని బట్టి బాగా హెల్ప్ అవుతుందని రీసెర్చర్స్ చెప్తున్నారు.
బెంగాల్లో హైటెన్షన్.. ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ముట్టడి?
పశ్చిమ బెంగాల్లో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చి కోల్‌కతాలోని ఎలక్షన్ కమిషన్ (ఈసీ) ఆఫీస్‌ను చుట్టుముట్టారు. ఆఆఫీస్ చుట్టుపక్కల ఏరియా మొత్తాన్ని కాంగ్రెస్ వాళ్లు బ్లాక్ చేసి ధర్నాకు దిగడంతో అక్కడ ఫుల్ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్నికల విషయంలో తాము కంప్లైంట్ చేసినా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోవడం లేదనే కోపంతోనే కాంగ్రెస్ వాళ్లు ఈ ముట్టడి చేసినట్లు తెలుస్తోంది.