Latest

గల్ఫ్ లో మళ్లీ మిస్సైల్ మోత..!
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరాయి. ఇరాన్‌కు చెందిన Qeshm దీవిలోని సైనిక కేంద్రాలపై అమెరికా దాడులు చేయగా, ప్రతీకారంగా ఇరాన్ కువైట్, బహ్రెయిన్ పై మిస్సైళ్లు, డ్రోన్లు ప్రయోగించింది. వాటిలో చాలావాటిని గల్ఫ్ దేశాల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అడ్డుకున్నాయి. శాంతి చర్చలు కొనసాగుతున్న వేళ ఈ పరిణామాలు మరింత ఆందోళన పెంచుతున్నాయి.

పవన్ కళ్యాణ్ పాకిస్తాన్లో ఉండాల్సిన వ్యక్తి: జగదీష్ రెడ్డి
TG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాకిస్తాన్లో ఉండాల్సిన వ్యక్తి అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సన్సెషనల్ కామెంట్ చేశారు. హైదరాబాద్‌లో జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి, పవన్ కల్యాణ్ మ్యాచ్ ఫిక్సింగ్‌తో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఉన్న సమస్యలను పక్కదారి పట్టించేందుకు పవన్ వివాదాన్ని రేవంత్ రెడ్డి వాడుకుంటున్నారని ఫైరయ్యారు. కాంగ్రెస్ పార్టీ, పవన్ కల్యాణ్ కలిసి ప్రజా సమస్యలను పక్కదారి పట్టించి తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు ఆడుతున్న డ్రామా తప్ప ఇంకోటి కాదన్నారు.

భార్యాభర్తల బంధాన్ని గెలిపించే '1-1-1-1'
చిన్నచిన్న గొడవలతో విడిపోయే ఈ కాలపు జంటల కోసం నిపుణులు '1-1-1-1 రూల్' సూచిస్తున్నారు. దీని ప్రకారం.. ఏడాదికోసారి ఇద్దరే కలిసి వారం రోజుల పాటు వెకేషన్ వెళ్లాలి. వారానికి ఒకసారి డేట్ నైట్ ప్లాన్ చేసుకోవాలి. అలాగే, వారంలో కనీసం ఒక్క రోజైనా శృంగారానికి ప్రాధాన్యమివ్వాలి. ప్రతి రాత్రీ గ్యాడ్జెట్స్ పక్కన పెట్టి డిజిటల్ డీటాక్స్ పాటిస్తూ కాసేపైనా మనసు విప్పి మాట్లాడుకోవాలి. ఈ నాలుగు సూత్రాలు దంపతుల మధ్య బంధాన్ని మరింత దృఢంగా మారుస్తాయి.

తెలంగాణ బరాబర్ మా అయ్య జాగీరే-పవన్ కు పొన్నం కౌంటర్
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ బరాబర్ మా అయ్య జాగీరే, ఈ ప్రాంతం మా తండ్రి, తాతల జాగీరే అని నొక్కి చెప్పారు. పవన్ మరోసారి అహంకారం ప్రదర్శించారన్నారు. తనకు ఏపీలోనే దిక్కు లేదని పవన్ అంగీకరించారని , తెలంగాణకు పవన్ ఏనాడూ మద్దతు ఇవ్వలేదని అన్నారు పొన్నం. తెలంగాణపై అక్కసు వెళ్ల గక్కారని, అమర వీరులకు అండగా నిలిచిన పాపాన పోలేదని విమర్శించారు.

2029లో తెలంగాణలో కచ్చితంగా పోటీ చేస్తాం..-పవన్
2029ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీచేస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు.అప్పుడు ఎవరు కలిసివస్తారో ఇప్పుడు తెలియదు తెలంగాణలో నేను పోటీ చేయను..మా వాళ్లు గెలిస్తే చాలు అన్నారు. GHMC ఎన్నికల్లో జనసేన సొంతంగా పోటీ చేస్తుందని ఫుల్ క్లారిటీ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం

ఐపీఎస్ సునీల్ కుమార్ పై రఘురామ ఫుల్ ఫైర్.. ఎందుకంటే...
సీఐడీ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భీమవరంలో జరిగిన ఒక సమావేశంలో సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు తక్షణమే విచారణ చేపట్టాలని అన్నారు. తానే స్వయంగా 4,000 ఎస్సీ, ఎస్టీ కేసులపై ఛార్జిషీటు వేయించానని సునీల్ కుమార్ మాట్లాడటంపై రఘురామ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీబీ సీఐడీకీ, సాధారణ ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసులకు ఎలాంటి సంబంధం ఉండదని... అత్యంత సంచలనమైన కేసులు ఉంటే తప్ప, సీఐడీ పరిధిలోకి 200 కేసులకు మించి తీసుకోవడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు.

ట్విషా శర్మ కేసులో గిరిబాల,సమర్ధ్ సింగ్ లకు జ్యుడీషియల్ కస్టడీ
భోపాల్‌కు చెందిన రిటైర్డ్ జడ్జి గిరిబాల సింగ్, ఆమె కుమారుడు సమర్థ్ సింగ్‌లకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. సంచలనం సృష్టించిన ట్విషా శర్మ మరణం కేసులో వీరిద్దరి పోలీస్ రిమాండ్ ముగియడంతో భోపాల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచారు. ట్విషా శర్మ కుటుంబ సభ్యులు వీరిపై కట్నం వేధింపుల ఆరోపణలు చేశారు. ఈ రోజు కోర్టులో జరిగిన విచారణ తీవ్ర ఉత్కంఠ రేపింది. రిటైర్డ్ జడ్జి గిరిబాల సింగ్ కోర్టులో స్వయంగా తీవ్ర ఆవేశంతో వాదనలు వినిపించడంతో, కోర్టు హాల్ నాటకీయ పరిణామాలకు, వాదోపవాదాలకు వేదికైంది.

విడిపోయిన ట్రైన్ బోగీలు.. తప్పిన పెను ప్రమాదం
AP: యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లాలోని గుత్తి రైల్వేస్టేషన్లో జాయింట్ కప్లింగ్ ఊడి ఎస్ 6, ఎస్ 7 బోగీలు ట్రైన్ నుంచి ఒక్కసారిగా విడిపోయాయి. గుత్తి రైల్వేస్టేషన్లో 1వ నంబర్ ప్లాట్‌ఫాంపైకి వస్తున్న టైమ్‌లో వెనక బోగీలు విడిపోవడాన్ని గమనించిన లోకోపైలట్ ఆ బోగీలు ఇంజిన్‌ను ఢీకొట్టకుండా స్లోగా బ్రేక్ వేసుకుంటూ ముందుకు తీసుకెళ్లారు. దీంతో ఆ వెనుక బోగీలు ఇంజిన్ వైపు భాగాన్ని ఆనుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో ప్రయాణికులు టెన్షన్ పడ్డారు.

తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతిస్తే ఊరుకోం: మందుల సామెల్
TG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ ఫైర్ అయ్యారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఎవరైనా బ్రతకొచ్చు, అన్నదమ్ముల్లా కలిసే ఉందాం, కానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతిస్తే ఊరుకునేది లేదని మందుల సామెల్ హెచ్చరించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 11రోజులు తాను పస్తులు ఉన్నానని పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. పవన్ మాటలు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానీకంపై విషం కక్కేలా ఉన్నాయన్నారు. తెలంగాణ స్టేట్ ఏర్పడడం ఇష్టం లేకనే పవన్ కళ్యాణ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని హాట్ కామెంట్ చేశారు.
MLA అనిరుధ్ రెడ్డి: పవన్ కంటే నాకే ఎక్కువ అర్హతలు ఉన్నాయి!
పవన్ కళ్యాణ్‌పై కాంగ్రెస్ MLA అనిరుధ్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత నాకు లేదని కొందరు అంటున్నారు. కానీ నేను ఫస్ట్ టైమ్ MLAగా పోటీ చేసి గెలిచాను. పవన్ కళ్యాణ్‌లాగా పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోలేదు, అంటూ ఆయన కౌంటర్ ఇచ్చారు. ఈ లెక్కన పవన్ కంటే తనకే ఎక్కువ అర్హతలు ఉన్నాయంటూ అనిరుధ్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

ముంబైలో తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్!
ముంబై ఖార్ నాకా దగ్గర తెలంగాణ 12వ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరిగాయి. ఈ ప్రోగ్రామ్‌లో ముంబై కురుమ సంఘం ప్రెసిడెంట్ జూకంటి రామచందర్, లీడర్ లక్ష్మణ్ మహరాజ్ మాట్లాడారు. తెలంగాణ కోసం జరిగిన పోరాటంలో ముంబైలో ఉన్న వాళ్ల రోల్ కూడా చాలా ఉందని, అందుకే కేకే కమిటీ ముంబైకర్లను కూడా గుర్తించి సపోర్ట్ చేయాలని కోరారు. ముంబైలో ఉన్న నిజమైన ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మంచి గుర్తింపు, గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సెలబ్రేషన్స్ లో చాలా మంది తెలంగాణ సంఘాల లీడర్స్ పార్టిసిపేట్ అయ్యారు.
పవన్ కళ్యాణ్ Vs పొన్నం ప్రభాకర్
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్‌పై తెలంగాణ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. "yes తెలంగాణ మా అయ్యా జాగీరే, మా తెలంగాణ 4 కోట్ల ప్రజల అయ్య జాగీరే, నీ అయ్య జాగీరు కాదు" ఫస్ట్ ఇధి గుర్తుపెట్టుకో అంటూ సీరియస్ గా పవన్ కి కౌంటర్ ఇచ్చారు. మినిస్టర్ పొన్నం ప్రభాకర్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్: 11 రోజులు అన్నం తినకపోవడానికి అసలు రీజన్ ఇదే!
తెలంగాణ విడిపోవడంపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆ టైంలో తాను 11 రోజులు అన్నం తినకుండా ఉన్న విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. నేను 11 రోజులు ఉపవాసం ఉన్నది తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకు కాదు. ఆ విభజన చేసిన పద్ధతి నచ్చకే అని పవన్ చెప్పారు. దీన్ని ఎవరు ఎలా అర్థం చేసుకున్నా నాకు అనవసరం, అంటూ పవన్ చాలా ఓపెన్‌గా మాట్లాడారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్: రేవంత్ రెడ్డి అంటే నాకు ఇష్టం!
చెరువు ఆక్రమణ టాపిక్‌పై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఓపెన్ అయ్యారు. "నాకు రేవంత్ రెడ్డి అంటే ఇష్టం. అని చెప్తూనే, ఒకవేళ నేను నిజంగానే చెరువును ఆక్రమించి ఉంటే, దాన్ని నేనే డైరెక్ట్‌గా తెలంగాణ గవర్నమెంట్‌కు రాసి ఇచ్చేస్తా అంటూ పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. పవన్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్: ఆంధ్రాలోనే నాకు దిక్కు లేదు!
తనపై వస్తున్న కామెంట్స్ కి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. "నాకు ఆంధ్రాలోనే దిక్కు లేదు. ఇక తెలంగాణలో నేను CM అవుతానా?" అంటూ పవన్ కళ్యాణ్ చేసిన ఈ సెల్ఫ్-సెటైరిక్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్: తెలంగాణలో జనసేన పోటీ!
తెలంగాణ పాలిటిక్స్ పై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఒక బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. "ఇప్పటివరకు నేను దీనిపై ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు.. కానీ ఇప్పుడు చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఖచ్చితంగా ఉంటుంది" అని ఆయన అనౌన్స్ చేశారు. త్వరలోనే తెలంగాణ అంతా తిరుగుతానని, ఇక్కడ జరిగే ఎలక్షన్స్ లో కూడా పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేశారు. పవన్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

యూకేలో 'గ్రూమింగ్ గ్యాంగ్స్' కలకలం: ఎంపీ రూపెర్ట్ లోవ్ సంచలన వ్యాఖ్యలు
యూకేలో సంచలనం సృష్టిస్తున్న 'గ్రూమింగ్ గ్యాంగ్స్' (బాలికలపై లైంగిక దోపిడీ ముఠాలు) దారుణాలు మళ్లీ తెరపైకి వచ్చాయి.బ్రిటన్ పార్లమెంట్లో ఎంపీ రూపెర్ట్ లోవ్ చేసిన ప్రసంగం లో వీటి వివరాలు తెలిపారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ మంది పాకిస్తానీ సంతతికి చెందిన టాక్సీ డ్రైవర్లు, మార్కెట్ వ్యాపారులే ఉన్నట్లు ప్రభుత్వ విచారణలో తేలిందని ఆయన పేర్కొన్నారు. బాధితుల నుంచి సేకరించిన గ్రాఫిక్ సాక్ష్యాలను లోవ్ పార్లమెంట్లో చదివి వినిపించారు. చిన్న వయసులోనే అమ్మాయిలను టార్గెట్ చేయడం, బలవంతపు గర్భాలు, బెదిరింపులు, మరియు ఈ ఘోరాలపై స్పందించడంలో పోలీసుల వైఫల్యాలను ఆయన ఎండగట్టారు.

రోడ్ యాక్సిడెంట్లో ఒకరు స్పాట్‌డెడ్
TG: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం గుర్జకుంట గ్రామ శివారులో రోడ్ యాక్సిడెంట్ జరిగింది. రెండు బైక్‌లు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గుర్జకుంట విలేజ్‌కు చెందిన ఎర్ర నర్సింహులు (34) బైక్‌పై గ్రామం నుంచి నేషనల్ హైవే వైపు వస్తుండగా ఎదురుగా మరో బైక్ వచ్చి ఢీకొట్టింది. నంగి రాజు, బండారి రమేష్ బైక్ ఎదురుగా వచ్చి ఢీకొనడంతో నర్సింహులు స్పాట్లోనే చనిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ రాజు, రమేష్‌లను చేర్యాల గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.

CBSE పోర్టల్‌పై సైబర్ దాడి: 2 నిమిషాల్లో 1.5 మిలియన్ల హిట్స్!
CBSE రీ-ఇవాల్యుయేషన్ పోర్టల్ ప్రారంభమైన మొదటి రోజే భారీ సైబర్ అటాక్ జరిగింది. సర్వీసులను నిలిపివేయడమే లక్ష్యంగా హ్యాకర్లు కేవలం రెండు నిమిషాల్లో 1.5 మిలియన్ల (15 లక్షలు) రిక్వెస్ట్‌లతో ‘డినైల్ ఆఫ్ సర్వీస్’ (DoS) దాడికి పాల్పడ్డారు. అంతేకాదు, ఫైల్స్‌ను దొంగిలించడానికి లక్షకు పైగా అనధికారిక ప్రయత్నాలు జరిగాయి. అయినప్పటికీ, భద్రతా వ్యవస్థల వల్ల పోర్టల్ ఎలాంటి అంతరాయం లేకుండా విజయవంతంగా పనిచేసిందని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని CBSE బోర్డు ‘X’ వేదికగా స్పష్టం చేసింది.

అభివృద్ధి పథంలో తెలంగాణ : సుదర్శన్‌రెడ్డి
TG: అమరవీరుల త్యాగాల పునాదులపై, పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ స్టేట్ ఫార్మెషన్ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో అమలు చేస్తున్న డెవలప్మెంట్ ప్రొగ్రామ్స్, సాధించిన ప్రగతి గురించి వివరించారు. స్టేట్ ఫార్మెషన్ డే వేడుకల స్పూర్తితో తెలంగాణ ప్రగతిలో అన్ని వర్గాల ప్రజలు మమేకం కావాలని పిలుపునిచ్చారు.

ఆమె గోల్డ్ డిగ్గర్ కాదు.. నేనే డైమండ్ డిగ్గర్ నిః లలిత్ మోడీ
ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ, బాలీవుడ్ నటి సుస్మితా సేన్ల రిలేషన్షిప్ గతంలో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ సమయంలో సుస్మితా సేన్‌ను ‘గోల్డ్ డిగ్గర్’ (డబ్బు కోసం ప్రేమించే వ్యక్తి) అంటూ నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. నాలుగేళ్ల తర్వాత ఈ ట్రోల్స్‌పై లలిత్ మోదీ ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఆమెకు మద్దతుగా నిలిచారు. "సుస్మితా సేన్ గోల్డ్ డిగ్గర్ కాదు, నేనే డైమండ్ డిగ్గర్. ఆమె ఒక అద్భుతమైన డైమండ్" అంటూ లలిత్ మోదీ 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.