← Back to news

విడిపోయిన ట్రైన్ బోగీలు.. తప్పిన పెను ప్రమాదం

By dk yamjala· 2 Jun 2026· Eenadu· అనంతపురం జిల్లా
విడిపోయిన ట్రైన్ బోగీలు.. తప్పిన పెను ప్రమాదం

AP: యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లాలోని గుత్తి రైల్వేస్టేషన్‌లో జాయింట్ కప్లింగ్ ఊడి ఎస్ 6, ఎస్ 7 బోగీలు ట్రైన్ నుంచి ఒక్కసారిగా విడిపోయాయి. గుత్తి రైల్వేస్టేషన్‌లో 1వ నంబర్ ప్లాట్‌ఫాంపైకి వస్తున్న టైమ్‌లో వెనక బోగీలు విడిపోవడాన్ని గమనించిన లోకోపైలట్ ఆ బోగీలు ఇంజిన్‌ను ఢీకొట్టకుండా స్లోగా బ్రేక్ వేసుకుంటూ ముందుకు తీసుకెళ్లారు. దీంతో ఆ వెనుక బోగీలు ఇంజిన్ వైపు భాగాన్ని ఆనుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో ప్రయాణికులు టెన్షన్ పడ్డారు.

More in News