Latest
మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఎల్ అండ్ టీ ఆఫీస్ లో అగ్నిప్రమాదం
మేడిగడ్డ బ్యారేజీ దగ్గరున్న ఎల్ అండ్ టీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన కీలక డాక్యుమెంట్లు కాలి బూడిదైనట్లు సమాచారం. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.సమీపంలోని వ్యవసాయ పొలాల్లో ఎండిన గడ్డికి లేదా చెత్తకు పెట్టిన నిప్పు, గాలి వేగానికి ఎల్ అండ్ టీ తాత్కాలిక క్యాంప్ కార్యాలయానికి (అంబటిపల్లి వద్ద) వ్యాపించిందని అక్కడి సిబ్బంది ప్రాథమికంగా చెబుతున్నారు.

డిప్యూటీ సీఎం కొడుకైతే మాత్రం... స్పెషల్ ట్రీట్ మెంటా?
కాకినాడ విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కుమారుడు అకీరా నందన్ ఈరోజు మధ్యాహ్నం 2:25 ని.లకి కాకినాడ సమీపంలోని కోరింగ అభయారణ్యం మడ్ పార్క్ ని సందర్శించి బోట్ లో షికారు చేశారు. MLA స్టికర్ ఉన్న కాన్వాయిలో లోపల బోటింగ్ వరకు అనుమతి లేనప్పటికీ అన్ని కార్ లను ఎలా అనుమతించారని విచ్చేసిన సందర్శకులు విస్మయం వ్యక్తం చేశారు. తాము భగ భగ మండే ఎండలో కిలోమీటర్ నడిచి వస్తుంటే వారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వచ్చిన సందర్శకులను పక్కన ఆపేసి రాచమర్యాదలు పొందారని వాపోయారు.

హైదరాబాద్ లో పేషెంట్... చైనా నుంచి రోబో ఆపరేషన్ !
చైనాలోని వూహాన్లో ఉన్న భారతీయ యూరాలజిస్ట్ డాక్టర్ సయ్యద్ మహమ్మద్ గౌస్, 3,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్‌లోని ఒక రోగికి రోబో సహాయంతో విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. చైనా అభివృద్ధి చేసిన రోబోటిక్ టెక్నాలజీ, అత్యంత వేగవంతమైన 5G ఇంటర్నెట్ సహాయంతో ఈ బ్లాడర్ రీకనెక్షన్ సర్జరీ సాధ్యమైంది. ఆసుపత్రి, హైదరాబాద్ వైద్య బృందం సమన్వయంతో సుమారు 90 నిమిషాల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. వైద్యరంగంలో సరిహద్దులు దాటి సాధించిన ఈ చారిత్రాత్మక మైలురాయిని భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యు జింగ్ ఎక్స్ (X) ద్వారా కొనియాడారు. సాంకేతికత ప్రాణాలను రక్షించడంలో ఎలా ఉపయోగపడుతుందో ఈ ఘటన నిరూపించింది

ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడి..హైపర్ సానిక్ వెపన్ ప్రయోగం
రష్యా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై భారీ వైమానిక దాడి చేసింది. సుమారు 600 డ్రోన్లు, 90 క్షిపణులతో విరుచుకుపడటంతో నలుగురు మరణించగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. లుకియానివ్స్కా మెట్రో స్టేషన్ సమీపంలోని వ్యాపార కేంద్రం, మార్కెట్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. గతంలో ఆరుసార్లు దాడికి గురై, తిరిగి తెరిచిన ఒక చిన్న కేఫ్ కూడా ఈ దాడిలో పూర్తిగా రూపం కోల్పోయింది. ఈ దాడిలో రష్యా అత్యంత శక్తివంతమైన 'ఓరేష్నిక్' హైపర్సోనిక్ క్షిపణిని ఉపయోగించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. కేవలం సైనిక స్థావరాలను కాకుండా, సామాన్య ప్రజలపైనా దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది.

కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ పేరెంట్స్ కు పోలీస్ సేఫ్టీ
ఇన్‌స్టాగ్రామ్‌లో 20 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో సంచలనం సృష్టించిన వ్యంగ్య ఉద్యమం 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తల్లిదండ్రుల ఇంటికి మహారాష్ట్ర పోలీసులు 24 గంటల రక్షణ కల్పించారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండటంతో జనాలు గుమిగూడకుండా ఈ చర్యలు తీసుకున్నారు. తమ ఖాతాలు హ్యాక్ అయ్యాయని, తమకు బెదిరింపులు వస్తున్నాయని అమెరికాలో చదువుకుంటున్న దిప్కే ఆరోపించారు.

నీట్2026 రద్దయిందని నిరాశతో విద్యార్ధిని ఆత్మహత్య
కర్ణాటకలోని కలబురగి జిల్లాకు చెందిన 18 ఏళ్ల విద్యార్థిని భాగ్యశ్రీ, నీట్ పరీక్ష రాసిన తర్వాత ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు పీయూసీ (PUC) బోర్డు పరీక్షల్లో 92 శాతం మార్కులు వచ్చాయి. మే 2న ఆమె నీట్ పరీక్షకు హాజరైంది. తన అపార్ట్మెంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆమె మరణించినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు, దీనిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇటీవల నీట్-యుజి 2026 పరీక్ష రద్దు కావడం వల్ల దేశంలో ఇలాంటి విద్యార్థుల ఆత్మహత్యలు మరికొన్ని కూడా వెలుగులోకి వచ్చాయి.

ఎర్రకోట కారు పేలుడు కేసులో కీలక ఆధారాలు.. నిందితుడు ఇలా చేశాడు!
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో గత ఏడాది నవంబర్ 10న జరిగిన కారు పేలుడు కేసులో నిందితుడు బాంబుల తయారీ కోసం చాట్‌జీపీటీ (ChatGPT), యూట్యూబ్‌లను ఉపయోగించాడని NIA తెలిపింది.. అల్-ఖైదా అనుబంధ సంస్థకు చెందిన ఈ నిందితుడు రాకెట్ ఐఈడీలను తయారు చేసి జమ్మూ కాశ్మీర్ అడవులలో పరీక్షించాడు. మే 14న ఎన్ఐఏ( నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) కోర్టులో దాఖలు చేసిన 7,500 పేజీల చార్జ్‌షీట్‌లో ఈ వివరాలను వెల్లడించింది.

వైట్ హౌస్ కాల్పులు .. నేనే జీసస్ నని చెప్పుకున్న నిందితుడు
వైట్‌హౌస్ సెక్యూరిటీ ఎదురు కాల్పుల్లో మరణించిన నిందితుడిని నసీర్ బెస్ట్ గా భద్రతా బలగాలు గుర్తించాయి. అతని మానసిక స్థితి సరిగా లేకపోవడంతో నేనే జీసస్ ని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు. నసీర్ బెస్ట్‌కు పాత క్రిమినల్ రికార్డు ఉంది. ఇతడు జూలై 2025లోనే వైట్‌హౌస్ సెక్యూరిటీ జోన్లోకి అక్రమంగా దూసుకెళ్లడానికి ప్రయత్నించి సీక్రెట్ సర్వీస్ చేతికి చిక్కి అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత కోర్టు వైట్ హౌస్ పరిసరాలకి రాకూడదంటూ 'స్టే అవే' ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు దానిని ఉల్లంఘించి తుపాకీతో వచ్చి కాల్పులు జరిపాడు. భద్రతా బలగాల చేతిలో హతమయ్యాడు.

వైట్‌హౌస్ వద్ద మళ్లీ కాల్పుల కలకలం.. ట్రంప్ సేఫ్
అమెరికా వైట్‌హౌస్ పరిసరాల్లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఒక వ్యక్తి వైట్ హౌస్ లోకి దూరడానికి ప్రయత్నించి భద్రతా సిబ్బందిపై కాల్పులకు దిగాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు వైట్ హౌస్ ని పూర్తిగా మూసివేశాయి. ఎదురు కాల్పుల్లో ఆ నిందితుడు మరణించాడు. మరొకరికి గాయాలయ్యాయి. ఇటీవల కాలంలో ట్రంప్ ను టార్గెట్ గా కాల్పులు జరపడం ఇది రెండోసారి

తెలుగు రాష్ట్రాల్లో గాలివాన బీభత్సం... ముగ్గురి మృతి
శనివారం తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ గాలివాన బీభత్సం సృష్టించింది. ఏపీలోని అనకాపల్లి, కాకినాడ, తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాల్లో గాలితో కూడిన వర్షం అల్లకల్లోలం సృష్టించింది. గాలివాన బీభత్సం కారణంగా ఏపీలో ఇద్దరు, తెలంగాణలో ఒకరు మృత్యువాత పడ్డారు. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.అనకాపల్లి జిల్లా నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లో దాదాపు అరగంట పాటు గాలి, వాన రావడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి.

చైనా బొగ్గు గనిలో గ్యాస్ పేలుడు-82 మంది మృతి
చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్, క్విన్యువాన్ కౌంటీలోని లియుషెన్యు బొగ్గు గనిలో శుక్రవారం రాత్రి జరిగిన గ్యాస్ పేలుడులో 82 మంది మరణించారు. మరో తొమ్మిది మంది భూగర్భంలో చిక్కుకుపోగా, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంపై స్పందించిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, సమగ్ర రక్షణ చర్యలు చేపట్టాలని , గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. పని ప్రదేశాలలో భద్రతను పటిష్టం చేయాలని అధికారులను ఆయన హెచ్చరించారు.

యాంగ్జైటీ పెరిగితే బ్లీడింగ్ జరగొచ్చంటున్న పరిశోధకులు
ఆందోళన ఎక్కువ కాలం కొనసాగితే అది మానసిక ఆరోగ్య సమస్యగా మారుతుందని, ఇది భయం, ఒత్తిడి కంటే భిన్నమైనదని అంటున్నారు అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ నిపుణులు., పరిశోధనల ప్రకారం, ఆందోళన తీవ్రమైతే శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. అరుదైన సందర్భాల్లో ఇది తాత్కాలిక రక్తస్రావానికి దారితీయడమే కాకుండా, ముక్కు నుండి రక్తం కారడం, పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం వంటి సమస్యలను కలిగిస్తుంది. ఇప్పటికే బ్లీడింగ్ డిజార్డర్స్ ఉన్నవారిలో ఇది పరిస్థితిని మరింత తీవ్రం చేస్తుంది. కాబట్టి ఏ విషయమైనా అతిగా ఆలోచించి ఆందోళన చెందవద్దు అంటున్నారు శాస్త్ర వేత్తలు.

ప్లీజ్ నన్ను అలా పిలవొద్దు.. నియంత అన్నా ఫర్వాలేదు అంటున్న ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనపై వచ్చే విమర్శలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యూయార్క్‌లో మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ... తనను "డంబ్" (తెలివితక్కువవాడు) అని పిలవడం ఇష్టంలేని అవమానమని అన్నారు. విమర్శకులను తప్పుగా నిరూపించడానికి ఒక పరీక్షను సూచించాల్సిందిగా తన వైద్యుడిని కూడా కోరినట్లు చెప్పారు. "నన్ను ఒక తెలివైన క్రూర నియంత (brilliant tyrant dictator) అని పిలిచినా నాకు అభ్యంతరం లేదు, కానీ డంబ్ అని మాత్రం అనొద్దు" అని ట్రంప్ పేర్కొన్నారు. తన మానసిక సామర్థ్యంపై వచ్చిన విమర్శల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
జాబ్స్ లేవు కానీ పిల్లల్ని కనాలా? చంద్రబాబుపై బోత్సా ఫైర్!
చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్‌పై YCP లీడర్ బోత్సా సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఉన్నవాళ్లకే ఉద్యోగాలు లేకపోతే.. ముగ్గురు, నలుగురు పిల్లల్ని కనాలని చంద్రబాబు చెప్పడం ఏంటని క్వశ్చన్ చేశాడు. అంతేకాదు, చంద్రబాబు మీలాగా 2 ఎకరాల నుంచి 20 వేల కోట్ల ఆస్తులు సంపాదించే మంత్రం అందరికీ తెలియదు కదా, అంటూ బోత్సా ఘాటుగా విమర్శించారు. ప్రెసెంట్ ఈ పొలిటికల్ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
సీసీటీవీ వీడియో వైరల్ అవ్వడంతో మహిళను వేధించిన అతను అరెస్ట్!
హైదరాబాద్ ఆల్కాపూర్ టౌన్షిప్లో ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసును నార్సింగి పోలీసులు సాల్వ్ చేశారు. చిన్న పిల్లను ఎత్తుకుని వెళ్తున్న ఒక మహిళను ఇతను హర్రాస్ చేశాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ విజువల్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. సీసీటీవీ వీడియో ఆధారంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి, ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఉమెన్ సేఫ్టీ విషయంలో పోలీసులు తీసుకున్న ఈ క్విక్ యాక్షన్‌ను అంతా అప్రిషియేట్ చేస్తున్నారు.
'పెద్ది' ప్రీ-రిలీజ్ ఈవెంట్ అప్డేట్!
రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ 'పెద్ది' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి సంబంధించి ఒక అప్డేట్ బయటకొచ్చింది. ఈ సినిమా గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌ను భోపాల్‌లో ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్‌కి హీరో రామ్ చరణ్‌తో పాటు మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ కూడా అటెండ్ కాబోతున్నారు. నార్త్ లో జరగబోయే ఈ భారీ ఈవెంట్ కోసం మెగా ఫ్యాన్స్ అంతా ప్రెసెంట్ ఫుల్ ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు.

అల్లు అర్జున్ను కలిసిన క్రికెటర్..
ఇండియన్ క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ ఈరోజు అల్లు అర్జున్ను కలిశారు. ఈ మీటింగ్ తర్వాత బన్నీ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేశారు. టాలెంటెడ్ క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ గారిని కలవడం చాలా హ్యాపీగా ఉందంటూ, అంతేకాదు, అల్లు అయాన్ కోసం వెంకటేష్ అయ్యర్ ఒక స్పెషల్ సైన్డ్ జెర్సీని గిఫ్ట్‌గా ఇచ్చారని, అందుకు థాంక్స్ చెబుతూ అతని ఫ్యూచర్‌కి బెస్ట్ విషెస్ చెప్పిన బన్నీ.

కొత్త పార్టీపై క్లారిటీ ఇచ్చిన రఘురామకృష్ణంరాజు
తాను కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు వస్తున్న వార్తలపై టీడీపీ నాయకుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పందించారు. తాను రాజకీయపార్టీ పెట్టబోతున్నా అంటూ కొందరు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ఫేక్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల వల్ల తాను ఇబ్బంది పడినట్టుగా ఇతరులు పడవద్దని కొంతమంది న్యాయవాదులతో కలిపి ఓ ఫోరమ్ ఏర్పాటు చేశానని చెప్పారు. అవసరమైన ప్రజలకు ఉచిత సలహాలు ఇచ్చేందుకే తాను 'తెలుగువీర లేవరా' అనే ఫోరమ్ ప్రారంభించానని అన్నారు. అల్లూరి సీతారామరాజు స్పూర్తితో ఫోరమ్ ఏర్పాటు చేశానని చెప్పారు.
పవన్ పక్కన బండ్ల గణేష్.. దేవుడు-భక్తుడి మధ్యలో చిరంజీవి!
మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ మూవీ పూజా ఈవెంట్లో ఒక ఫన్నీ సీన్ జరిగింది. ఈ వేడుకకు డిప్యూటీ CM పవన్ కళ్యాణ్, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ అటెండ్ అయ్యారు. అయితే వీరిద్దరూ ఫోటోలు దిగుతుండగా చిరంజీవిని కూడా ఫోటో దిగమని invite చేయగా, చిరంజీవి సరదాగా జోక్ చేశారు. "దేవుడికి, భక్తుడికి మధ్యలో నేనెందుకు అంబికా అగర్బత్తి లాగ" అంటూ కామిడీ చేశాడు. ప్రెసెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

రాజస్థాన్‌లో ఇంట్లోకి చొరబడ్డ చిరుత.. కుక్కను చంపిన వైనం
రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా రాజ్‌గఢ్‌లో చిరుత బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి ఓ ఇంటి గోడ దాటి లోపలికి వచ్చిన చిరుత, గొలుసుతో కట్టిన పెంపుడు కుక్కపై దాడి చేసింది. సుమారు 16 నిమిషాల పాటు జరిగిన పోరులో కుక్కను చంపి, శరీరాన్ని నోట పట్టుకుని అడవి వైపు పారిపోయింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డైంది. చిరుత ఇంట్లోకి రావడం పట్ల స్థానికులు భయపడుతున్నారు.
విరాట్ కోహ్లీ బిహేవియర్ పై క్రికెట్ ఫాన్స్ ఫైర్!
నిన్న జరిగిన SRH vs RCB మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ బిహేవియర్ పై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. మ్యాచ్ క్లోస్ అయిన తర్వాత తబ్రైజ్ షంసీ షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి చేయి ఇవ్వగా. కోహ్లీ అతని వైపు అసలు చూడకుండానే ముందుకు వెళ్ళిపోయాడు. ఈ ఇన్సిడెంట్ కి సంబంధించిన విజువల్స్ చూసి క్రికెట్ ఫ్యాన్స్ తీవ్రంగా డిసపాయింట్ అవుతున్నారు. గ్రౌండ్ లో ఇలాంటి బిహేవియర్ అస్సలు యాక్సెప్టబుల్ కాదంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.