← Back to news

ప్లీజ్ నన్ను అలా పిలవొద్దు.. నియంత అన్నా ఫర్వాలేదు అంటున్న ట్రంప్

By DS· 23 May 2026· Ndtv· US
ప్లీజ్ నన్ను  అలా పిలవొద్దు.. నియంత అన్నా ఫర్వాలేదు అంటున్న ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనపై వచ్చే విమర్శలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యూయార్క్‌లో మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ... తనను "డంబ్" (తెలివితక్కువవాడు) అని పిలవడం ఇష్టంలేని అవమానమని అన్నారు. విమర్శకులను తప్పుగా నిరూపించడానికి ఒక పరీక్షను సూచించాల్సిందిగా తన వైద్యుడిని కూడా కోరినట్లు చెప్పారు. "నన్ను ఒక తెలివైన క్రూర నియంత (brilliant tyrant dictator) అని పిలిచినా నాకు అభ్యంతరం లేదు, కానీ డంబ్ అని మాత్రం అనొద్దు" అని ట్రంప్ పేర్కొన్నారు. తన మానసిక సామర్థ్యంపై వచ్చిన విమర్శల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

More in World