Latest

నా కారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు - యాంకర్ విష్ణు ప్రియ▶
Entertainment· 22 May 2026

నా కారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు - యాంకర్ విష్ణు ప్రియ

సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేసి వేధిస్తున్నారంటూ ఓ యూట్యూబ్ ఛానెల్.పై మియాపూర్ పోలీస్ స్టేషన్ లో యాంకర్ విష్ణు ప్రియ కంప్లయింట్ చేశారు. ఒక మహిళ అయి ఉండి కూడా ఒక యూ ట్యూబర్ తనపై అసభ్యంగా కామెంట్లు చేస్తోందని, ఇష్టాను సారం వార్తలు రాస్తోందని తానపై అసభ్య కథనాలు రాస్తూ క్యారక్టర్ అసాసినేషన్ చేస్తోందని మండి పడ్డారు.ఇ కపై ఊరుకునేది లేదని అందరిపై చర్యలు తప్పవనీ హెచ్చరించింది.

RRR కొత్త పార్టీ దిశగా అడుగులు..వేగంగా కదులుతున్న పావులు
Politics· 22 May 2026

RRR కొత్త పార్టీ దిశగా అడుగులు..వేగంగా కదులుతున్న పావులు

ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం రాబోతోంది. కాంట్రవర్సీలకు పేరెన్నికగన్న త్రిబుల్ ఆర్ గా పేరు పడిన ఎమ్మెల్యే రఘు రామకృష్ణం రాజు కొత్త పార్టీ పెడుతున్నారని టాక్. కొత్త రాజకీయ వేదిక కోసం ఇండిపెండెంట్ డెమోక్రటిక్ పార్టీ పేరుతో ఒక ఫోరం ను ఆయన రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే తెలుగు వీర లేవరా అనే పేరుతో ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆర్టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దాని ద్వారా తన భావాలను, అభిప్రాయాలను పంచుకుంటానని అన్నారు. ఆ తర్వాత కార్యాచరణ ఉంటుందని తెలుస్తోంది.

 భోగాపురం ఎయిర్ పోర్ట్ జులై 8 నుంచి  అందుబాటులోకి
News· 22 May 2026

భోగాపురం ఎయిర్ పోర్ట్ జులై 8 నుంచి అందుబాటులోకి

ఏపీలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం) ఎట్టకేలకు ప్రయాణీకులకు అందుబాటులోకి రానుంది. రాబోయే జులై 8వ తేదీ నుండి ఈ కొత్త విమానాశ్రయం నుండి పూర్తి స్థాయిలో విమాన సర్వీసులు మొదలవుతాయని అఫీషియల్ సోర్సెస్ వెల్లడించాయి. జులై 5న ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈఎయిర్ పోర్ట్ ఘనంగా ప్రారంభం కానున్నట్లు సమాచారం. కొత్త విమానాశ్రయం అందుబాటులోకి వస్తుండటంతో పలు ప్రముఖ అంతర్జాతీయ, దేశీయ విమానయాన సంస్థలు తమ సర్వీసులను కూడా అక్కడికే షిఫ్ట్ చేస్తున్నాయి.

 హీట్ వేవ్స్. మంట.... ఏసీలా? కూలర్లా? ఏది బెస్ట్ ఛాయిస్?
General· 22 May 2026

హీట్ వేవ్స్. మంట.... ఏసీలా? కూలర్లా? ఏది బెస్ట్ ఛాయిస్?

హీట్ వేవ్స్ కంటిన్యూ అవుతున్న ఈ టైమ్ లో కూలర్లా? ఏసీలా ఏది బెస్ట్ అనే డౌట్ అందరికీ వస్తుంది.. అయితే ఎక్స్ పర్ట్స్ స్టడీ చేసి దేని ఇంపాక్ట్ దానిదేనంటున్నారు. కూలర్లు గొంతు, చర్మం డ్రై అవ్వకుండా నేచురల్ హ్యుమిడిటీని ఇస్తాయి. కానీ వాటర్ క్లీన్ చేయకపోతే బ్యాక్టీరియా, దోమలకి అడ్డాగా మారుతాయి. అదే ఏసీలు.. బాడీ టెంపరేచర్‌ని బ్యాలెన్స్ చేస్తూ హీట్‌స్ట్రోక్ రాకుండా కాపాడతాయి. ముఖ్యంగా వృద్ధులు, బీపీ, హార్ట్ పేషెంట్స్‌కి ఏసీలే సేఫ్ ఆప్షన్. అయితే ఏసీని 24°C - 26°C మధ్య మెయింటైన్ చేయడం హెల్త్‌కి మంచిది. డ్రై క్లైమేట్ ఉంటే కూలర్ ఓకే, కానీ విపరీతమైన ఎండలు, ఉక్కపోత ఉంటే మాత్రం ఏసీనే బెస్ట్ ఛాయిస్!

ఎబోలా వైరస్ కు వ్యాక్సిన్ తయారీలో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులు
World· 22 May 2026

ఎబోలా వైరస్ కు వ్యాక్సిన్ తయారీలో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులు

యూకే సైంటిస్టులు ‘బుందిబుగ్యో’ అనే రేర్ ఎబోలా స్ట్రెయిన్‌కి వ్యాక్సిన్ రెడీ చేస్తున్నారు. దీనికి ప్రజెంట్ ఎలాంటి ట్రీట్‌మెంట్ లేదు. కోవిడ్ వ్యాక్సిన్ అప్పుడు వాడిన చింపాంజీ కోల్డ్ వైరస్ టెక్నాలజీతోనే ఆక్స్‌ఫర్డ్ టీమ్ ఈ కొత్త వాక్సిన్ ను డెవలప్ చేస్తోంది. యానిమల్ ట్రయల్స్ సక్సెస్ అయితే 2-3 మంత్స్‌లో హ్యూమన్ ట్రయల్స్ స్టార్ట్ అవుతాయని WHO చెప్పింది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ వ్యాక్సిన్‌ను లార్జ్ స్కేల్ లో మాస్ ప్రొడక్షన్ చేయడానికి లైన్ క్లియర్ చేసుకుంది.

కొహ్లీ సైన్ చేసిన  బ్యాట్ విజయ్ చేతిలో... ఫ్యాన్స్ కి పండగే ఇక
Politics· 22 May 2026

కొహ్లీ సైన్ చేసిన బ్యాట్ విజయ్ చేతిలో... ఫ్యాన్స్ కి పండగే ఇక

తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్‌కు విరాట్ కోహ్లీ ఆటోగ్రాఫ్ చేసిన క్రికెట్ బ్యాట్‌ను MRF ఛైర్మన్ కె.ఎమ్. మామెన్ గిఫ్ట్ చేశారు. రాష్ట్రంలో ₹5,300 కోట్ల గ్రీన్‌ఫీల్డ్ తయారీ ప్లాంట్ ఏర్పాటుపై చర్చించేందుకు వచ్చిన సందర్భంగా ఈ భేటీ జరిగింది. విజయ్ చేతిలో బ్యాట్ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2008 ఐపీఎల్ తొలి సీజన్‌లో విజయ్ CSK బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరించారు. ఇది చూసిన అటు క్రికెట్ అభిమానులు, విజయ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

 త్విషా శర్మ కేసులో కస్టడీలోకి భర్త... లాప్రాక్టీస్ పై వేటు
Crime· 22 May 2026

త్విషా శర్మ కేసులో కస్టడీలోకి భర్త... లాప్రాక్టీస్ పై వేటు

త్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పరారీలో ఉన్న నిందితుడు, ఆమె భర్త సమర్థ్ సింగ్‌ను భోపాల్ పోలీసులు శుక్రవారం కస్టడీలోకి తీసుకున్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అతని న్యాయవాద వృత్తి ప్రాక్టీస్‌పై తక్షణమే నిషేధం విధించింది. మరోవైపు, ఈ కేసు దర్యాప్తును ప్రభుత్వం సీబీఐకి అప్పగించగా, మరణానికి గల అసలు కారణాలను తేల్చేందుకు ఢిల్లీ ఎయిమ్స్ (AIIMS) బృందంతో రెండవసారి పోస్ట్‌మార్టం (అటాప్సీ) నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.పెళ్లయిన రెండు నెలలకే త్విషా అనుమానాస్పద స్థితిలో చనిపోయింది.

ఆఫ్రికాలో ఎబోలా వైరస్... ఢిల్లీ ఎయిర్ పోర్టులో హై అలెర్ట్
General· 22 May 2026

ఆఫ్రికాలో ఎబోలా వైరస్... ఢిల్లీ ఎయిర్ పోర్టులో హై అలెర్ట్

సెంట్రల్ ఆఫ్రికాలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఢిల్లీ విమానాశ్రయం అలెర్ట్ అయ్యింది. ఎబోలాకు ఎటువంటి ఆమోదిత వ్యాక్సిన్ లేదా చికిత్స లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. దీంతో విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్, టెన్సా బారికేడ్లు ఏర్పాటు చేసి నిఘా పెంచారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, సూడాన్ దేశాల నుండి వచ్చే ప్రయాణికులను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. కేరళలోని కొచ్చి ఎయిర్ పోర్టులో కూడా 24 గంటల నిఘా వ్యవస్థను షురూ చేశారు.

ఓబీసీ కుటుంబాల పిల్లలకు రిజర్వేషన్లు అవసరమా? సుప్రీం ఘాటు కామెంట్లు
Politics· 22 May 2026

ఓబీసీ కుటుంబాల పిల్లలకు రిజర్వేషన్లు అవసరమా? సుప్రీం ఘాటు కామెంట్లు

రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యా, ఆర్థికాభివృద్ధి సాధించిన వెనుకబడిన తరగతుల (OBC) కుటుంబాల పిల్లలకు రిజర్వేషన్లు కొనసాగించాలా అని ప్రశ్నించింది. ఐఏఎస్ అధికారుల పిల్లలకు మళ్లీ రిజర్వేషన్లు ఎందుకని, దీనివల్ల సామాజిక మార్పు రాదని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. కర్ణాటకలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల సంతానమైన ఒక అభ్యర్థిని 'క్రీమీలేయర్' కింద రిజర్వేషన్లకు అనర్హుడిగా ప్రకటించడాన్ని కోర్టు సమర్థించింది.ఒకే కుటుంబం తరతరాలుగా రిజర్వేషన్లు వాడుకుంటే, వెనుకబడిన వర్గాల్లోని నిజమైన పేదలకు ఎప్పటికీ న్యాయం జరగదని కోర్టు అభిప్రాయపడింది.

ఆయిల్ సప్లై బంద్.. గ్లోబల్ మార్కెట్‌కి 'రెడ్ జోన్' వార్నింగ్!
World· 22 May 2026

ఆయిల్ సప్లై బంద్.. గ్లోబల్ మార్కెట్‌కి 'రెడ్ జోన్' వార్నింగ్!

అమెరికా-ఇరాన్ యుద్ధం వల్ల గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ సప్లై దారుణంగా దెబ్బతింది. మెయిన్ రూట్ అయిన హోర్ముజ్ జలసంధి క్లోస్ అవ్వడంతో.. డైలీ 13 నుండి 14 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ సప్లై ఆగిపోయిందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (IEA) చీఫ్ ఫాతిహ్ బిరోల్ చెప్పారు. ఎమర్జెన్సీ ఆయిల్ నిల్వలు కూడా పూర్తిగా అయిపోవడంతో ఆయిల్ మార్కెట్ త్వరలోనే డేంజరస్ 'రెడ్ జోన్' లోకి వెళ్తుందని, దీనివల్ల రేట్లు విపరీతంగా పెరిగి గ్లోబల్ ఎకానమీ క్రైసిస్‌లో పడుతుందని ఆయన వార్నింగ్ ఇచ్చారు.

 ఎలన్ మస్క్ వెనక  వెయిట్రెస్  చైనా నిఘా  వర్గమా?
Politics· 22 May 2026

ఎలన్ మస్క్ వెనక వెయిట్రెస్ చైనా నిఘా వర్గమా?

బీజింగ్‌లో జరిగిన అధికారిక విందులో ఎలన్ మస్క్ వెనుక నిలబడిన సర్వర్ (వెయిట్రెస్), చైనా మిలిటరీకి చెందిన ఒక ఉన్నతాధికారి అని స్వతంత్ర బ్లాగర్ జెన్నిఫర్ జెంగ్ ఆరోపించారు. అమెరికా ప్రతినిధి బృందంపై నిఘా ఉంచేందుకు చైనా ఈ వ్యూహం పన్నిందని ఆమె పేర్కొన్నారు. గతంలో కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక కూడా చైనా ప్రమేయం ఉందంటూ జెంగ్ వివాదాస్పద ఆరోపణలు చేశారు.

అమ్మాయిని వెనక నుండి సీక్రెట్‌గా ఫోటోలు తీస్తూ దొరికాడు!▶
News· 22 May 2026

అమ్మాయిని వెనక నుండి సీక్రెట్‌గా ఫోటోలు తీస్తూ దొరికాడు!

ఒక రైల్వే స్టేషన్‌లో shocking ఇన్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయి నిల్చొని ఉండగా.. వెనక నుండి ఆమెకు తెలియకుండా ఒక ఓల్డ్ పర్సన్ మొబైల్‌లో తప్పుగా ఫోటోలు తీస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఆ విషయం కనిపెట్టిన ఆ అమ్మాయి.. వెంటనే అతడిని గట్టిగా నిలదీసి అందరి ముందు కొట్టింది. స్పాట్‌లో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ కూడా అక్కడికి వచ్చి, ఆ ఓల్డ్ పర్సన్ చేసిన పనికి అందరి ముందే కొట్టింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ అతని ఏజ్ ఏంటి అతను చేసే పని ఏంటి అంటూ సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు.

మున్సిపల్ ఆఫీస్‌ లో ప్రొటెస్ట్ చేసిన బొద్దింక!▶
Politics· 22 May 2026

మున్సిపల్ ఆఫీస్‌ లో ప్రొటెస్ట్ చేసిన బొద్దింక!

సోషల్ మీడియాలో ఒక హిలేరియస్ వీడియో వైరల్ అవుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్‌కి ఒక పర్సన్ Cockroach గెటప్ తో వచ్చి అందరినీ షాక్‌ చేశాడు. అక్కడ యమునా నదిలోకి డర్టీ డ్రైనేజీ వాటర్ కలవడంపై. ఆ పర్సన్ ఇలా వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నాడు. ఆఫీస్‌లో అతను బొద్దింక గెటప్ లో తిరుగుతుంటే అక్కడున్న వాళ్లంతా చూసి నవ్వుకుంటూ స్టన్ అయిపోయారు. ప్రెసెంట్ ఈ వీడియో ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

BJP, congress లను దాటేసిన 'కాక్‌రోచ్ పార్టీ'!
Politics· 22 May 2026

BJP, congress లను దాటేసిన 'కాక్‌రోచ్ పార్టీ'!

సోషల్ మీడియాలో ఒక మైండ్ బ్లోయింగ్ రికార్డ్ క్రియేట్ అయింది. నిరుద్యోగులపై సుప్రీం కోర్ట్ సీజేఐ (CJI) చేసిన కామెంట్స్‌కి కౌంటర్‌గా అభిజిత్ అనే వ్యక్తి స్టార్ట్ చేసిన satirical పేజ్ 'కాక్‌రోచ్ జనతా పార్టీ' (CJParty) ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో రికార్డు క్రియేట్ చేసింది. జస్ట్ 4 డేస్ లోనే ఈ పేజ్ 20M కి పైగా ఫాలోవర్స్‌ని సంపాదించింది. ప్రెసెంట్ BJP బిజెపికి 8.7M, కాంగ్రెస్‌కి 13.3M ఫాలోవర్స్ ఉంటే.. ఈ పేజ్ ఆ పార్టీస్ ని దాటేసి టాప్‌లోకి వెళ్ళింది.

బ్లడ్ తో ఉన్న బ్యూటీ క్వీన్ వీడియో వైరల్!▶
Politics· 22 May 2026

బ్లడ్ తో ఉన్న బ్యూటీ క్వీన్ వీడియో వైరల్!

ఫ్రాన్స్‌లో జరిగిన కేన్స్ ఫెస్టివల్ లో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. లాస్ట్ ఇయర్ మిస్ వెనెజువెలా టైటిల్ గెలిచిన ఆండ్రియా అనే మోడల్‌పై.. ఆమె పర్సనల్ స్టైలిస్ట్ లగూనా ఒక హోటల్ రూమ్‌లో దారుణంగా అటాక్ చేశాడు. ఫేస్ మొత్తం బ్లడ్ తో ఉన్న ఆండ్రియా వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఆ రూమ్‌లో సౌండ్స్ విన్న హోటల్ స్టాఫ్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంతో.. వాళ్లు వచ్చి ఆ స్టైలిస్ట్‌ను పట్టుకున్నారు. ప్రెసెంట్ ఆండ్రియా ప్రాణాలకేం ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారు.

ఢిల్లీలో బిగ్ రూల్! బక్రీద్‌కి ఆవులు, ఒంటెల బలిపై కంప్లీట్ బ్యాన్!▶
Politics· 22 May 2026

ఢిల్లీలో బిగ్ రూల్! బక్రీద్‌కి ఆవులు, ఒంటెల బలిపై కంప్లీట్ బ్యాన్!

బక్రీద్ పండగ ముందు ఢిల్లీ గవర్నమెంట్ ఒక బిగ్ డెసిషన్ తీసుకుంది. బక్రీద్ రోజు ఆవులు, దూడలు, ఒంటెలు అలాగే చట్టప్రకారం బ్యాన్ చేసిన ఏ ఆనిమల్ ని అయినా సరే బలి ఇవ్వకూడదని ఢిల్లీ మినిస్టర్ కపిల్ మిశ్రా సీరియస్ ఆర్డర్స్ ఇచ్చారు. ఈ రూల్స్ బ్రేక్ చేసి ఎవరైనా ఆనిమల్స్ ని బలి ఇస్తే. వాళ్లపై సీరియస్‌గా కేసులు పెడతామని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఈ డెసిషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో బిగ్ డిబేట్‌కి దారితీస్తోంది.

PCC ప్రెసిడెంట్‌పై 'బిగ్ టీవీ' అటాక్! వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారా?
Politics· 22 May 2026

PCC ప్రెసిడెంట్‌పై 'బిగ్ టీవీ' అటాక్! వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారా?

తెలంగాణ కాంగ్రెస్‌లో ఒక ఇంట్రెస్టింగ్ వార్ నడుస్తోంది. పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్‌ను టార్గెట్ చేస్తూ 'బిగ్ టీవీ' వరుసగా నెగెటివ్ స్టోరీలు వేయడం హాట్ టాపిక్‌గా మారింది. గాంధీ భవన్‌ని పట్టించుకోవట్లేదని, అక్కడ కుక్కలు తిరుగుతున్నాయని, కానీ మహేష్ గౌడ్ ఇల్లు మాత్రం లగ్జరీగా ఉందంటూ రిపోర్ట్స్ ఇచ్చారు. అయితే దీని వెనుక CM రేవంత్ రెడ్డి హ్యాండ్ ఉందా అని పార్టీలో డౌట్స్ వస్తున్నాయి.

అర్ధరాత్రి హాస్టల్‌లో అమ్మాయిలపై అటాక్!▶
Crime· 22 May 2026

అర్ధరాత్రి హాస్టల్‌లో అమ్మాయిలపై అటాక్!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక గర్ల్స్ హాస్టల్‌లో ఉండే ఇద్దరు అమ్మాయిలను శుభమ్ అనే పర్సన్ టార్చర్ పెట్టడంతో. వాళ్లు పోలీసులకు కంప్లైంట్ చేసి అరెస్ట్ చేయించారు. దాంతో కక్ష పెంచుకున్న శుభమ్.. మే 17న బెయిల్‌పై బయటకు వచ్చాడు. అదే రోజు నైట్ ఫుల్‌గా ఆల్కహాల్ తాగి, ఆ అమ్మాయిల హాస్టల్ రూమ్‌లోకి వెళ్ళి దారుణంగా కొట్టాడు. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్‌కి వచ్చి అతడిని మళ్లీ అరెస్ట్ చేశారు.

లోన్ రికవరీ ఏజెంట్ల టార్చర్‌కి RBI చెక్!
Politics· 22 May 2026

లోన్ రికవరీ ఏజెంట్ల టార్చర్‌కి RBI చెక్!

రికవరీ ఏజెంట్ల వేధింపులకు ఎండ్ కార్డ్ వేస్తూ RBI కొన్ని రూల్స్ తెచ్చింది. ఇకపై సర్టిఫైడ్ ఏజెంట్లు మాత్రమే రికవరీకి రావాలి. అది కూడా మార్నింగ్ 8 నుండి ఈవెనింగ్ 7 లోపే కాల్స్ లేదా విజిట్స్ చేయాలి. కస్టమర్ ఇంటికెళ్లే వన్ డే ముందే ఇన్ఫార్మ్ చేయాలి. ఫోన్ లోని పర్సనల్ డేటా, ఫోటోలు యాక్సెస్ చేయడం, రిలేటివ్స్‌ని ఇబ్బంది పెట్టడం కంప్లీట్‌గా బ్యాన్. రూల్స్ బ్రేక్ చేసి ఫోన్ లాక్ చేస్తే.. గంటకు 250 రూపాయలు బ్యాంకే కస్టమర్‌కి ఫైన్ కట్టాలి. అంటే ఏజెంట్ తప్పు చేస్తే బ్యాంకే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది.

స్టూడెంట్ ఫేస్ పై 20,000 తేనెటీగలు!
Viral· 22 May 2026

స్టూడెంట్ ఫేస్ పై 20,000 తేనెటీగలు!

వరల్డ్ బీ డే సందర్భంగా కోయంబత్తూర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఒక మైండ్ బ్లోయింగ్ సీన్ కనిపించింది. భాగ్యలక్ష్మి అనే స్టూడెంట్. ఏకంగా 20 వేల భారతీయ తేనెటీగలతో తన ఫేస్ పై గడ్డంలా సెట్ చేసుకుని అందరినీ షాక్ కి గురిచేసింది. తేనెటీగలను చూసి భయపడాల్సిన అవసరం లేదని, వాటిని అర్థం చేసుకుంటే చాలని అవగాహన కల్పించడానికి ఈ డేర్ చేసినట్లు ఆమె చెప్పింది. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

బొద్దింకల జనతా పార్టీ ఫౌండర్ ని చంపేస్తామంటూ వార్నింగ్స్!
Politics· 22 May 2026

బొద్దింకల జనతా పార్టీ ఫౌండర్ ని చంపేస్తామంటూ వార్నింగ్స్!

బొద్దింకల జనతా పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే చేసిన ఒక లేటెస్ట్ పోస్ట్ నెట్టింట తీవ్ర కలకలం రేపుతోంది. "నాకు ఇప్పుడు చంపేస్తామంటూ బెదిరింపులు (Death Threats) వస్తున్నాయి" అంటూ ఆయన తన ఎక్స్ అకౌంట్‌లో ఒక వాట్సాప్ చాట్ స్క్రీన్‌షాట్‌ని షేర్ చేశారు.. సోషల్, పొలిటికల్ టాపిక్స్ పై వాయిస్ వినిపించే అభిజీత్‌కి ఇలాంటి threats రావడంపై నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ వాట్సాప్ లో ఉన్న నెంబర్ పై పోలీసులు యాక్షన్ తీసుకోవాలంటూ పబ్లీక్ నుండి డిమాండ్స్ పెరుగుతున్నాయి.