Viral· 29 Apr 2026
పోలీస్ స్టేషన్ లో కన్న పిల్లలను వదిలేసి పారిపోయిన పేరెంట్స్!
కరీంనగర్లో ఒక దారుణం జరిగింది. భర్త తాగుడు విషయంపై కౌన్సెలింగ్ జరుగుతుండగా భార్యాభర్తలు గొడవ పడ్డారు. ఆ కోపంలో భార్య తన మంగళసూత్రాన్ని తీసేసింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి తమ ఇద్దరు చిన్న కుమార్తెలను అక్కడే వదిలేసి పారిపోయారు.. ఏడుస్తున్న ఆ పిల్లలను పోలీసులు ఓదార్చి, వారి తాతయ్య, నానమ్మలకు అప్పగించారు. కన్నబిడ్డల పట్ల ఆ పేరెంట్స్ ఇంత దారుణంగా ప్రవర్తించడం అందరినీ షాక్కు గురిచేస్తోంది