సమ్మర్‌లో మొక్కలకి ఎప్పుడు నీళ్లు పోయాలి?

సమ్మర్‌లో మొక్కలకి ఎప్పుడు పడితే అప్పుడు వాటర్ పోయకూడదు. ఎర్లీ మార్నింగ్ వాటర్ పోయడం చాలా మంచిది. అప్పుడు ఎండ తక్కువగా ఉంటుంది కాబట్టి వేర్లు వాటర్ ని బాగా పీల్చుకుంటాయి. సాయంత్రం పోస్తే రాత్రంతా ఆ తడి వల్ల మొక్కలకి ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరీ మట్టి ఎండిపోతే తప్ప సాయంత్రం పోయకండి. మీ మొక్కలు పచ్చగా ఉండాలంటే ఈ టిప్ ఫాలో అవ్వండి!



