హైదరాబాద్ ORR పై మంచు
హైదరాబాద్‌లో వర్షం తో పాటు పెద్ద వడగళ్ల వాన కురిసింది. దీంతో రోడ్లు అన్నీ తెల్ల మంచు లా కనిపించాయి. జనాలు ఇది చూసి చాలా ఆశ్చర్యపోయారు. శంషాబాద్ లాంటి ప్రాంతాల్లో రోడ్ల మీద మంచు పెరిగింది. ఇది నిజమైన స్నో ఫాల్ కాదు, కానీ చూడడానికి మాత్రం కాశ్మీర్ లా ఉంది. ఈ మంచు ముక్కల వల్ల చల్లటి గాలి వీచింది.



