Latest

‘Why I Am Not a Hindu’ పుస్తకానికి 30 ఏళ్లు
దళిత-బహుజన వర్గాల గొంతుకగా ప్రొ.కంచ ఐలయ్య రాసిన ‘Why I Am Not a Hindu’ పుస్తకానికి 30 ఏళ్లు పూర్తయ్యాయి. కుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా, శ్రమను, సమానత్వాన్ని, సామూహిక జీవన విలువలను గౌరవించే దళితబహుజన సంస్కృతిని ప్రాధాన్యం ఇచ్చిన పుస్తకంగా ఈ రచన పేరు తెచ్చుకుంది. అదే స్థాయిలో వివాదాస్పదంగానూ మారింది. 18వ తేదీ మంగళవారం హైదరాబాద్ నగరంలోని లామకాన్‌లో కంచ ఐలయ్యతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. ఇందులో స్పీకర్స్‌గా ప్రొ.జ్యోతిర్మయశర్మ, గీతారామస్వామి, పల్లికొండ మణికంఠ ఉంటారు.

పాలిటిక్స్‌లోకి ధనుష్?
హీరో ధనుష్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ తమిళనాడులో పెద్ద చర్చ నడుస్తుంది. ‘ఆల్ ఇండియా ధనుష్ ఫ్యాన్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్’ కోయంబత్తూరులోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్త సంక్షేమ సంఘాలను ఏర్పాటు చేసి, సభ్యులను చేర్చుకోవాలని పిలుపునిచ్చింది. జిల్లా అధ్యక్షుడు జి. శంకర్ నాయకత్వంలో ఈ కార్యక్రమాలను వేగవంతం చేయాలని, ఆ సంఘం జాతీయ కార్యదర్శి బి. రాజా నోటీసును సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ విషయంపై ధనుష్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతుంది.
యువతిపై రేప్..క్షమాపణలు కోరిన నిందితుడు
అహ్మదాబాద్‌లో ఓ బిల్డింగ్ టెర్రస్‌పై యువతిని అత్యాచారం చేసిన సెక్యూరిటీ గార్డును పోలీసులు అరెస్టు చేశారు. అతను నాలుగు రోజుల క్రితమే ఉద్యోగంలో చేరాడు. యువతి గొంతు నొక్కి, అత్యాచారం చేసి, ఆమెను టెర్రస్‌పై లాక్ చేసి పారిపోయినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు అతణ్ని పట్టుకోగానే “ఏక్ బార్ మాఫ్ కర్ దో. ఫిర్ సే నహీం కరూంగా”(ఒక్కసారి క్షమించండి. మళ్లీ చేయను) అని క్షమాపణలు కోరుతున్న వీడియో వైరల్ అయ్యింది.

లారీ బోల్తా.. కోళ్ల కోసం ఎగబడ్డ జనాలు
AP: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్‌రోడ్డులో కోళ్ల లారీ అదుపుతప్పి బోల్తాపడింది. భాకరాపేట నుంచి తిరుపతి వైపు వెళ్తుండగా ఈ ఇన్సిడెంట్ జరిగింది. లారీ బోల్తాపడటంతో అందులోని కోళ్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో కోళ్లను ఎత్తుకెళ్లేందుకు స్థానికులు, వాహనదారులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. రోడ్డుపై పడిపోయిన కోళ్లను బస్తాల్లో నింపుకుని కొందరు తీసుకెళ్లారు. ప్రమాదంతో ఘాట్‌రోడ్డుపై కొంతసేపు రాకపోకలకు ఇబ్బందులు కలిగాయి.

ట్రంప్ హెయిర్ స్టైల్ చేంజ్?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కొత్త హెయిర్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. లాస్ వేగాస్‌లో కనిపించిన ఆయన జుట్టు మునుపటి కంటే మరింత బ్రైట్‌గా, నిండుగా కనిపించడంతో నెటిజన్స్ విపరీతంగా AI ఫోటోలు, మీమ్స్‌తో ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ట్రంప్ మాత్రం తన హెయిర్ స్టైల్‌ను ఒక 'వర్క్ ఆఫ్ ఆర్ట్' అని చెప్తూ గర్వంగా మాట్లాడారు. దశాబ్దాలుగా ఆయన హెయిర్ పొలిటికల్ కల్చర్‌లో ఒక స్పెషల్ టాపిక్‌గా నడుస్తోంది.

లావైనా లైట్ తీసుకుంటున్నా
40 ఏళ్లు దాటాక అందం కంటే జీవితంలో చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయని నటి లక్ష్మీ మంచు అన్నారు. తనకు లవ్ సీన్లు, రొమాంటిక్ పాత్రలు ఇవ్వకుండా ఎప్పుడూ జనాలను కొట్టే, భయపెట్టే రోల్సే ఇస్తున్నారని నవ్వుతూ చెప్పారు. పదేళ్ల క్రితం శరీరం, బరువు గురించి ఎక్కువగా పట్టించుకునేదాన్నని, ఇప్పుడు అలాంటి పట్టింపులేమీ లేవని చెప్పారు. రూపం కంటే ఆరోగ్యంగా ఉండటం, పనిచేయడమే ముఖ్యమని, కెమెరా ముందు ఉండటమే తనకు ఇష్టమైన విషయమని తెలిపారు.

సినిమాల్లో అలాంటి ఆడవాళ్లే కావాలంటున్న లక్ష్మీ మంచు!
నటి లక్ష్మీ మంచు సినిమా కథలో కొత్తదనం ఉండి, దర్శకుడి విజన్ నచ్చితే ఏ ప్రాజెక్ట్ అయినా ఒప్పుకుంటానన్నారు. పాత్ర ఎంతసేపు ఉందన్నది కాకుండా, కథ బాగుందో లేదో చూడటమే తనకు ముఖ్యమని అన్నారు. వెండితెరపై తమకంటూ ఒక ఆలోచన ఉండి, ధైర్యంగా మాట్లాడే బలమైన మహిళా పాత్రలు ఇంకా ఎక్కువ రావాలని ఆమె కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె నటించిన రెండు తెలుగు కామెడీ సినిమాలు, ఒక తమిళ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు ఒక కొత్త షో షూటింగ్ కూడా త్వరలోనే మొదలుకాబోతుంది.

రైల్వేలో 734 అప్రెంటిస్ పోస్టులు.. సెప్టెంబర్ 5 వరకే
రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపుర్తలా (RCF) 2026లో 734 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్ట్ 7 నుంచి అప్లికేషన్లు స్టార్ట్ అయ్యాయి. సెప్టెంబర్ 5, 2026 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, పెయింటర్, కార్పెంటర్ వంటి ట్రేడుల్లో వేకెన్సీస్ ఉన్నాయి. 10వ తరగతిలో మినిమం 50 శాతం మార్కులతో పాటు సంబంధిత ITI/NCT అర్హత ఉండాలి. ఏజ్ 15–24 ఏళ్లు ఉండాలి. 10వ తరగతి, ఐటీఐ మార్కుల మెరిట్ ఆధారంగా సెలెక్షన్ జరుగుతుంది. అప్లికేషన్‌కు రూ. 100 ఫీజు చెల్లించాలి.

అటెండర్ సెలవు.. ప్రభుత్వ ఆఫీస్‌కు తాళం
TG: ఖమ్మం జిల్లా తూనికలు కొలతల శాఖ కార్యాలయంలో అటెండర్ సెలవులో ఉండటంతో కార్యాలయాన్ని మూసివేశారు. దీంతో తమ సమస్యలు, ఫిర్యాదులతో వచ్చిన ప్రజలు నిరాశగా వెనుదిరిగారు. ఇప్పటికే సిబ్బంది కొరతతో శాఖ ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, తాజాగా కార్యాలయానికి తాళం వేయడం చర్చనీయాంశంగా మారింది. శాఖ పనితీరుపై గతంలోనూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ ఘటన వాటికి మరింత బలం చేకూర్చింది. ఒక ఉద్యోగి సెలవులో ఉన్నంత మాత్రాన కార్యాలయ కార్యకలాపాలు నిలిచిపోవడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

CMC ఆఫీస్ ముట్టడి.. హైటెన్షన్
TG: హైదరాబాద్‌లోని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(CMC) కార్యాలయం వద్ద చెత్తసేకరణ కార్మికుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణ స్వచ్ఛ ఆటో, రిక్షా కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో సుమారు వెయ్యిమంది కార్మికులు CMC ఆఫీస్‌ను ముట్టడించారు. వారిని పోలీసులు ప్రధాన గేటు వద్ద అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పాత విధానంలోనే పారిశుద్ధ్య పనులు కొనసాగించాలని, ఆస్తిపన్నుతో కలిపి చెత్త పన్ను వసూలుచేసే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ-ఆటోల పేరుతో కొత్త వాహనాలను తీసుకొచ్చి ఉపాధిని దెబ్బతీయవద్దని కోరారు.

బ్లింకిట్ ఆర్డర్స్ జాగ్రత్త.. కుళ్ళిన సరుకులు, బొద్దింకలు!
ముంబైలోని ఒక బ్లింకిట్ స్టోర్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు సడన్‌గా చెకింగ్స్ చేశారు. అక్కడి ఫ్రూట్స్, వెజిటబుల్స్‌పై బొద్దింకలు తిరగడం, తిండి వస్తువులను కింద పడేయడం చూసి అధికారులు షాక్ అయ్యారు. అంతేకాకుండా ఎక్స్‌పైర్ అయిపోయిన సరుకులను కస్టమర్లకు అమ్ముతున్నట్టు పట్టుకున్నారు. రూల్స్ బ్రేక్ చేయడంతో ఆ బ్లింకిట్ స్టోర్ ఫుడ్ లైసెన్స్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. నీట్‌గా లేని ఇలాంటి ఫుడ్ స్టోర్స్‌పై పబ్లిక్ కూడా కంప్లైంట్ చేయవచ్చని చెప్పారు.

జార్ఖండ్ అసెంబ్లీ ముట్టడికి ABVP.. కార్యకర్తలు అరెస్ట్
జార్ఖండ్ రాంచీలో రిక్రూట్మెంట్ పరీక్షల్లో అవకతవకలను నిరసిస్తూ ప్రొటెస్ట్లు చేస్తున్న స్టూడెంట్స్‌పై పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ABVP కార్యకర్తలు ఈరోజు అసెంబ్లీ ముట్టడికి ర్యాలీ చేపట్టారు. రాంచీలోని పాత విధానసభ ప్రాంతం నుంచి ర్యాలీ ప్రారంభమైన వెంటనే కొంతమంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన లాఠీచార్జిని నిరసిస్తూ ఈ మార్చ్‌కు ABVP పిలుపునిచ్చింది.

‘Go Back Marwadi’ ఉద్యమంపై రేపు రౌండ్ టేబుల్
TG: తెలంగాణలో స్థానిక వ్యాపారులకు మద్దతు అందించాలని, మర్వాడీ వ్యాపారులను నియంత్రించాలనే ఉద్దేశంతో మొదలైన ‘Go Back Marwadi’ ఉద్యమానికి ఏడాది పూర్తయింది. 2025 ఆగస్టులో ప్రారంభమైన ఈ ఉద్యమాన్ని కొన్ని సంఘాలు ముందుకు తీసుకెళ్లాయి. ఈ ఉద్యమ భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు తెలంగాణ క్రాంతి దళ్ ఆధ్వర్యంలో రేపు మధ్యాహ్నం 1 గంటకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు.

గంగూలీ దంపతులకు డెత్ థ్రెట్!
ఇండియన్ టీమ్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, ఆయన భార్య డోనాకి గత ఆరు నెలలుగా కంటిన్యూస్‌గా త్రెటెనింగ్ లెటర్స్ వస్తున్నాయి. రీసెంట్‌గా సోమవారం ఆఫీసుకి వచ్చిన రెండు లెటర్లలో ఇద్దరినీ ఎలిమినేట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో గంగూలీ పర్సనల్ సెక్రటరీ వెంటనే ఠాకూర్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఫైల్ చేశారు. కేసు నమోదు చేసిన కోల్‌కతా పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయగా, ఆ లెటర్స్ బెల్ఘరియా నుంచి కొరియర్ ద్వారా వచ్చినట్టు ట్రేస్ చేశారు. పంపిన పర్సన్ ఎవరనేది కనుక్కునేపనిలో ఉన్నారు.

ఆటో డ్రైవర్ల రణభేరి.. బిగ్ డిమాండ్స్
TG: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆటోడ్రైవర్లు జనగాం జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని, ఆటో కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రమాద బీమా పథకాన్ని పునరుద్ధరించాలని, ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ల కుటుంబాలకు రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓలా, ఉబర్, రాపిడో వంటి సంస్థలపై చర్యలు తీసుకోవాలని, ఈ-ఆటోల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. నిరసనతో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
15న ‘ఖడ్గం’ రీ-రిలీజ్.. శ్రీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కృష్ణవంశీ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఖడ్గం’ సినిమా తనకు ఎంతో స్పెషల్ అని హీరో శ్రీకాంత్ అన్నారు. ఈ మూవీ తన కెరీర్‌కు ఎంతో ప్లస్ అయిందని చెప్పారు. సినిమాలో రవితేజ, ప్రకాష్ రాజ్‌ల క్యారెక్టర్స్ అద్భుతంగా ఉంటాయని మెచ్చుకున్నారు. ‘ఖడ్గం’లోని ‘నువ్వే నువ్వే’ పాట తన ఆల్‌టైమ్ ఫేవరెట్ అని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ‘ఖడ్గం’ థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. ఆడియన్స్ సినిమాను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు.

రేపు ఆకాశంలో అద్భుతం
రేపు సూర్యోదయానికి ముందు ఆకాశంలో ఆరు గ్రహాలు వరుసగా కనిపించనున్నాయి. బృహస్పతి, బుధుడు, అంగారకుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ తూర్పు నుంచి పడమర వైపు వరుసగా కనిపిస్తాయి. అంగారకుడు, శని గ్రహాలను సాధారణ కంటితోనే గుర్తించే అవకాశం ఉంటుంది. యురేనస్, నెప్ట్యూన్ వంటి గ్రహాలను చూడటానికి మాత్రం టెలిస్కోప్ అవసరమవుతుంది. రేపు సంపూర్ణ సూర్యగ్రహణం కూడా ఏర్పడనుంది. అయితే గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, స్పెయిన్, యూరప్, ఆఫ్రికా, ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాల నుంచి మాత్రమే ఈ సూర్యగ్రహణాన్ని చూడొచ్చు.
ప్రకృతి అద్భుతం.. కప్పల జీవచక్రం
ఆడ కప్పలు నీటిలో వేలాది గుడ్లను జెల్లీని పోలిన పొడవైన గొలుసు ఆకారంలో పెడతాయి. ఒక్క ఆడ కప్ప ఒకేసారి సుమారు 8 వేల నుంచి 30 వేల వరకు గుడ్లు పెట్టగలదు. అయితే వాటిలో చాలా వరకు వివిధ కారణాలతో నశిస్తాయి. కొద్దిమాత్రమే గుడ్ల నుంచి పిల్ల కప్పలు (టాడ్‌పోల్స్) బయటకు వచ్చి, క్రమంగా శరీరంలో మార్పులు చెంది పూర్తిస్థాయి కప్పలుగా ఎదుగుతాయి. ఇలా గుడ్డు నుంచి కప్పగా మారే జీవచక్రం ప్రకృతి సృష్టిలోని అద్భుతాల్లో ఒకటి.

భారీగా పెరిగిన బంగారం ధరలు!
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్‌పై ఏకంగా ₹3,160 పెరగడంతో ధర ₹1,55,130 కి చేరింది. అలాగే ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ₹2,900 పెరిగి ₹1,42,200 వద్ద ట్రేడ్ అవుతుండగా, 18 క్యారెట్ల బంగారం ధర ₹2,370 పెరిగి ₹1,16,350 కి చేరింది. మార్కెట్ ట్రెండ్స్ బట్టి ఈ ప్రైసెస్ ఎప్పటికప్పుడు చేంజ్ అయ్యే ఛాన్స్ ఉన్నందున గోల్డ్ ఆర్నమెంట్స్ కొనే ముందు లేటెస్ట్ రేట్స్ చెక్ చేసుకోవడం బెటర్.

హైవేపై గంజాయి రవాణా
AP: అనకాపల్లి జిల్లా కసింకోట వద్ద నేషనల్ హైవేపై పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. HOP హోటల్ సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన ఆటోను తనిఖీ చేయగా అందులో 60 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.30 లక్షలు ఉంటుందని తెలిపారు. గంజాయి తరలిస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు. ఆటోను సీజ్ చేసి, రెండు బైకులు, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాపై జిల్లాలో తనిఖీలను మరింత ముమ్మరం చేసినట్లు DSP మోహన్ పేర్కొన్నారు.

AI కంటెంట్‌కు ఇన్‌విజిబుల్ వాటర్‌మార్క్.. ఎందుకంటే?
సోషల్ మీడియాలో AI కంటెంట్ పెరుగుతున్న టైమ్‌లో, మనుషులు డిజైన్ చేసిన కంటెంట్‌కు, AI కంటెంట్‌కు మధ్య తేడాను ఐడెంటిఫై చేయడానికి ఆంథ్రోపిక్ ఇన్‌విజిబుల్ వాటర్‌మార్క్ సిస్టమ్‌ను తీసుకొచ్చింది. క్లాడ్ AI మోడల్స్‌తో డిజైన్ చేసిన టెక్స్ట్, చిత్రాలకు ఈ వాటర్‌మార్క్ జత చేయనుంది. కాపీ, పేస్ట్ లేదా కొంత ఎడిటింగ్ చేసినా ఇది తొలగిపోకుండా డిజైన్ చేశారు. యూరోపియన్ AI యాక్ట్‌కు అనుగుణంగా ఈ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయనున్నారు.