Latest

పిల్లలు యాక్టివ్ గా, బలంగా ఎదగాలంటే !
Health· 29 Jun 2026

పిల్లలు యాక్టివ్ గా, బలంగా ఎదగాలంటే !

పిల్లలు శారీరకంగా, మానసికంగా బలంగా ఎదగడానికి కేవలం మంచి ఆహారం మాత్రమే సరిపోదని తాజా హెల్త్ రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి. చిన్నతనం నుంచే వారిలో రోగనిరోధక శక్తి పెంచే పోషకాలు అందించడంతో పాటు, శారీరక శ్రమ (Physical activity) ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా స్క్రీన్ టైమ్‌ను తగ్గించి, అవుట్‌డోర్ గేమ్స్ ఆడేలా ప్రోత్సహించడం వల్ల వారి ఎముకలు, కండరాలు దృఢంగా తయారవుతాయి. దీంతో పాటు పిల్లలకు కనీసం 8-10 గంటల గాఢ నిద్ర, మానసిక ప్రశాంతత లభించినప్పుడే వారు యాక్టివ్‌గా, బలంగా ఎదుగుతారని నిపుణులు సూచిస్తున్నారు.

మష్రూమ్స్ మ్యాజిక్ - డిప్రెషన్‌కు సరికొత్త చికిత్స!
News· 29 Jun 2026

మష్రూమ్స్ మ్యాజిక్ - డిప్రెషన్‌కు సరికొత్త చికిత్స!

మ్యాజిక్ మష్రూమ్స్ (పుట్టగొడుగులు) మానసిక ఆరోగ్య చికిత్సలో అద్భుతంగా పనిచేస్తున్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడించాయి. తీవ్రమైన డిప్రెషన్, యాంగ్జైటీతో బాధపడేవారికి ఈ పుట్టగొడుగులలోని ‘సిలోసిబిన్’ అనే రసాయనం ఒక వరంలా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా దీనిపై మెడికల్ ట్రయల్స్ సక్సెస్ కావడంతో.. వీటిని లీగలైజ్ చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. కేవలం మూడ్ మార్చడమే కాకుండా, బ్రెయిన్ సెల్స్ రీ-కనెక్ట్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుందని సైంటిస్టులు కనుగొన్నారు. సరైన మెడికల్ గైడెన్స్‌తో వాడితే.. మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్‌కు ఇది బెస్ట్ సొల్యూషన్ కానుంది.

టాలెంట్ ఉంటేనే ఇండస్ట్రీలో రాణించేది- మధుబాల
Cinema· 29 Jun 2026

టాలెంట్ ఉంటేనే ఇండస్ట్రీలో రాణించేది- మధుబాల

టాలీవుడ్ సీనియర్ నటి మధు బాల (రోజా ఫేమ్) తన లేటెస్ట్ ప్రాజెక్ట్స్‌పై ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.. ప్రస్తుతం డిఫరెంట్ క్యారెక్టర్స్, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్నట్లు తెలిపారు. నటిగా సెకండ్ ఇన్నింగ్స్‌లో వస్తున్న రోల్స్ తనకు ఎంతో తృప్తినిస్తు న్నాయని, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వల్ల నటీనటులకు అద్భుతమైన అవకాశాలు దొరుకుతున్నాయని చెప్పారు.అలాగే లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ కెమెరా ముందుకు రావడం ఒక ఛాలెంజ్‌గా అనిపించిందని, కానీ ప్రేక్షకుల ప్రేమే తనను ముందుకు నడిపిస్తోందని మధు చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో నెపోటిజం పై స్పందిస్తూ టాలెంట్ ఉంటేనే ఎవరైనా రాణిస్తారని అన్నారు.

గ్లోబల్ పవర్ ప్లే గా మారిన ఫిఫా  ఫీవర్
News· 28 Jun 2026

గ్లోబల్ పవర్ ప్లే గా మారిన ఫిఫా ఫీవర్

ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఇష్టపడే ఫుట్‌బాల్ గేమ్ కేవలం ఒక ఆట మాత్రమే కాదు.. దాని వెనుక భారీ బిజినెస్, గ్లోబల్ పాలిటిక్స్ ఉన్నాయని ‘ది షార్టెస్ట్ హిస్టరీ ఆఫ్ ఫుట్‌బాల్’ బుక్ విశ్లేషించింది. పూర్వకాలం నుండి నేటి మెస్సి జనరేషన్ వరకు ఈ ఆట ఎలా ఎదిగిందో ఇందులో వివరించారు. హిట్లర్, ముస్సోలిని కాలం నుండి మొన్నటి ఖతార్, రాబోయే సౌదీ వరల్డ్ కప్స్ వరకు.. లీడర్స్ తమ పొలిటికల్ మైలేజ్ కోసం, ఇమేజ్ బిల్డింగ్ కోసం ఫుట్‌బాల్‌ను ఎలా వాడుకుంటున్నారో ఈ బుక్ రివ్యూ కళ్ళకు కట్టింది. బుక్ లవర్స్, సాకర్ లవర్స్ కి బాగా నచ్చే బుక్ ఇది..

అమెరికా , ఇరాన్ మధ్య మళ్లీ డేంజరస్ వార్
News· 28 Jun 2026

అమెరికా , ఇరాన్ మధ్య మళ్లీ డేంజరస్ వార్

యుద్ధం ముగిసిందంటూ యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అనౌన్స్ చేసి 48 గంటలు గడవకుండానే మళ్లీ అమెరికా, ఇరాన్ భీకర దాడులు చేసుకుంటు న్నాయి. రెండు దేశాలు పరస్పర దాడులతో విరుచుకుపడుతున్నాయి. అమెరికా దాడులకు ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. ఈసారి అమెరికా సైనిక స్థావరాలు ఇరాన్ టార్గెట్ చేసింది. అమెరికా మిత్రదేశాలైన కువైట్, బహ్రెయిన్ లను కూడా ఇరాన్ వదలడం లేదు. దీనికి కౌంటర్ గా అమెరికా ఇరాన్ మిసైల్స్ ని, డ్రోన్ స్టోరేజీ స్థావరాలను పేల్చేస్తోంది. అమెరికా ఎయిర్ అటాక్స్ కు మండిపడిన ఇరాన్ ఈ ప్రతిదాడి మొదలు పెట్టింది.

ఫ్రాన్స్‌లో ఎండదెబ్బకు 1,000 మంది మృతి
News· 28 Jun 2026

ఫ్రాన్స్‌లో ఎండదెబ్బకు 1,000 మంది మృతి

ఐరోపా ఖండాన్ని వణికిస్తున్న రికార్డు స్థాయి హీట్‌వేవ్ (ఎండతీవ్రత) కారణంగా ఫ్రాన్స్‌లో గత కొన్ని రోజులుగా ఏకంగా 1,000 మందికి పైగా అదనపు మరణాలు నమోదైనట్లు అక్కడి ప్రజారోగ్య సంస్థ నేడు (జూన్ 28న) వెల్లడించింది. దేశంలోని చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్ దాటడంతో ఈ దారుణ పరిస్థితి ఏర్పడింది. మరణించిన వారిలో 85 శాతం మంది 65 ఏళ్లు పైబడిన వృద్ధులే ఉన్నారని అధికారులు తెలిపారు. వాతావరణ మార్పుల వల్లే ఈ తీవ్రమైన పరిస్థితి తలెత్తిందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

పర్యావరణంలో మార్పులు -డేంజర్ లో చింకారాలు
General· 28 Jun 2026

పర్యావరణంలో మార్పులు -డేంజర్ లో చింకారాలు

వాతావరణంలో వస్తున్న వేగవంతమైన మార్పుల వల్ల దేశంలో అరుదైన 'చింకారా' (జింకల జాతి) జాతి అంతరించిపోయే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడం, వర్షపాతంలో మార్పుల వల్ల ఇవి నివసించే అటవీ, పొడి ప్రాంతాలు దెబ్బతింటున్నాయని పరిశోధకులు వెల్లడించారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఈ మూగజీవుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని, వీటి రక్షణకు తక్షణమే ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

జెండర్ పెయిన్ గ్యాపే మహిళల ఆరోగ్యానికి అసలు సమస్య !
Health· 28 Jun 2026

జెండర్ పెయిన్ గ్యాపే మహిళల ఆరోగ్యానికి అసలు సమస్య !

వైద్య రంగంలో మగవారితో పోలిస్తే మహిళల శారీరక నొప్పులు, ఆరోగ్య సమస్యలను తక్కువగా అంచనా వేసే ధోరణి ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. దీన్నే 'జెండర్ పెయిన్ గ్యాప్' అంటారు. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న ప్పటికీ, మహిళల సమస్యలను కేవలం మానసిక ఆందోళనగా లేదా సాధారణ విషయంగా కొట్టిపారేయడం వల్ల వారికి సరైన సమయంలో సరైన వైద్యం అందడం లేదు. ముఖ్యంగా ఎండోమెట్రియాసిస్, పీరియడ్స్ నొప్పులు సమస్యల నిర్ధారణకు ఏళ్ల తరబడి సమయం పడుతోంది. వైద్య పరిశోధనల్లో కూడా మహిళల శరీరతత్వంపై తగినంత రీసెర్చ్ జరగకపోవడం ఈ వివక్షకు ప్రధాన కారణం.వైద్య రంగంలో జెండర్ గ్యాప్ తొలగించాల్సిన అవసరముంది.

రెండు ఎయిర్ యాక్సిడెంట్స్ లో 25 మంది మృతి
News· 28 Jun 2026

రెండు ఎయిర్ యాక్సిడెంట్స్ లో 25 మంది మృతి

ఫ్రాన్స్, సౌదీ అరేబియా దేశాలలో జరిగిన రెండు వేర్వేరు విమాన ప్రమాదాల్లో మొత్తం 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈశాన్య ఫ్రాన్స్‌లో స్కైడైవింగ్ శిక్షణ విమానం కూలిపోయి 11 మంది మృతి చెందారు. అలాగే సౌదీ అరేబియాలోని రాస్ తనురా సమీపంలో అరామ్‌కో సంస్థకు చెందిన హెలికాప్టర్ కుప్పకూలడంతో 14 మంది మరణించారు. వాతావరణ పరిస్థితులు, సాంకేతిక లోపాలే ఈ ఘోర ప్రమాదాలకు కారణమని తెలుస్తోంది. ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.

ఇడుపు కాయితం అర్థం పవన్‌కళ్యాణ్‌ బాగా చెప్తాడు
Politics· 28 Jun 2026

ఇడుపు కాయితం అర్థం పవన్‌కళ్యాణ్‌ బాగా చెప్తాడు

TG: తెలంగాణ రాకుండా అడ్డుకున్న అనకొండలు, కార్పొరేట్ శక్తులకు పాలు పోసి పెంచుతున్నది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న గుంటనక్కేలేనని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఆదివారం మేడ్చల్ జిల్లా ఉప్పల్‌లో పార్టీ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతుంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు గప్ చుప్ అయ్యాయన్నారు. ఇడుపు కాయితం అర్థం పవన్ కళ్యాణ్‌ను అడిగితే బాగా చెబుతాడని ఎద్దేవా చేశారు. ఉద్యమంలో అవాకులు, చేవాకులు పేలిన వాళ్లే మళ్లీ తెలంగాణపై కుట్ర చేస్తున్నారన్నారు.

హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ కి ఈ ఐదుప్లాన్స్  కంపల్సరీ !
General· 28 Jun 2026

హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ కి ఈ ఐదుప్లాన్స్ కంపల్సరీ !

ప్రశాంతమైన రిటైర్మెంట్ కోసం ప్రతి ఒక్కరూ తెలుసు కోవాల్సిన ఆ 5 ముఖ్యమైన పాయింట్లు ఇవే: Retirement Corpus: మీ ప్రస్తుత వార్షిక ఖర్చులకు కనీసం 25 నుండి 30 రెట్లు ఎక్కువ పొదుపు మొత్తం ఉండాలి. Inflation Rate: మీ అంచనాల్లో ద్రవ్యోల్బణాన్ని (కనీసం 6-7%) లెక్కించడం మర్చిపోవద్దు. Withdrawal Rate : రిటైర్ అయ్యాక ఏటా మీ మొత్తం నిధి నుండి 4 శాతానికి మించి ఖర్చు చేయకూడదు. Life Expectancy: 85 నుండి 90 ఏళ్ల వయస్సు వరకు సరిపోయేలా ప్లాన్ చేసుకోవాలి. Health Insurance Cover: అత్యవసర వైద్య ఖర్చుల కోసం కనీసం రూ.10 నుండి 15 లక్షల హెల్త్ కవరేజ్ తప్పనిసరి. ఇలా చేస్తే రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా గడిచిపోతుంది.

డాక్టర్‌ నంటూ  స్టాక్ ట్రేడర్‌కు ₹73 లక్షల నామం!
Crime· 28 Jun 2026

డాక్టర్‌ నంటూ స్టాక్ ట్రేడర్‌కు ₹73 లక్షల నామం!

ఒక కిలాడీ లేడీ తాను పెద్ద డాక్టర్‌నంటూ నమ్మించి, ఓ స్టాక్ ట్రేడర్ (షేర్ మార్కెట్ వ్యాపారి) నుండి ఏకంగా ₹73 లక్షలు కాజేసింది. సోషల్ మీడియాలో పరిచయమైన ఆమె, హై-రిటర్న్స్ వస్తాయంటూ నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్‌తో అతడికి బురిడీ కొట్టించింది. ఆమె మాటలు నమ్మి విడతల వారీగా డబ్బులు పంపి మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదైంది.

‘ట్రామా’పై నోరు విప్పుతున్న జెన్ జీ..
Health· 28 Jun 2026

‘ట్రామా’పై నోరు విప్పుతున్న జెన్ జీ..

దేశంలో మానసిక గాయాలు (ట్రామా) ఒక నిశ్శబ్ద ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా మారుతున్నాయని రచయిత్రి నిషితా లాంబా తన డెక్కన్ హెరాల్డ్ కథనంలో విశ్లేషించారు. చాలామంది తమ అంతర్గత బాధను లోపలే దాచుకుంటారని, కానీ అది మానసిక, శారీరక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని సైకాలజిస్ట్ పల్లవి మోహన్ అభిప్రాయపడ్డారు. "ట్రామా అనేది కేవలం ఒక చేదు సంఘటన కాదు.. అది మన మనసు లోపల సృష్టించే అలజడి" అని వివరించారు. పాత తరాల వారు ఈ బాధలను దాచడానికి ప్రయత్నిస్తే, నేటి తరం యువత (Gen Z) దీనిపై ఓపెన్‌గా మాట్లాడుతోందని స్పష్టం చేశారు. ఈ అంతర్గత గాయాల నుండి కోలుకోవడానికి స్వీయ అంగీకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.

‘ఖబర్ లహరియా’   నెం.1 రూరల్ మహిళల జర్నల్
India· 28 Jun 2026

‘ఖబర్ లహరియా’ నెం.1 రూరల్ మహిళల జర్నల్

గ్రామీణ, దళిత వెనుకబడిన వర్గాల మహిళల నేతృత్వంలోయూపీ బుందేల్ ఖండ్ నుంచి నడుస్తున్న ఏకైక వార్తా సంస్థ ‘ఖబర్ లహరియా’ తమ విజయ ప్రస్థానాన్ని, పుట్టుక కథను ఆసక్తికరంగా పంచుకుంది. కేవలం ఒక చిన్న ప్రింట్ పత్రికగా ప్రారంభమై, డిజిటల్ మీడియా రంగంలో ఒక సంచలనంగా ఎలా ఎదిగిందో వివరించింది. సమాజంలో అణచివేతకు గురైన మహిళలు జర్నలిజంలోకి అడుగుపెట్టి, స్థానిక సమస్యలపై ఎలా పోరాటం చేశారో ఇందులో పేర్కొన్నారు. ఎన్నో సవాళ్లు, అడ్డంకులను దాటుకుని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం స్ఫూర్తిదాయకంగా సాగింది. గ్రామీణ జర్నలిజానికి సరికొత్త అర్థం చెప్పిన వీరి ప్రయాణం ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.

ట్రంప్‌కు కూడా ఫిర్యాదు చేయి.. కేశినేని చిన్ని సెటైర్
Politics· 28 Jun 2026

ట్రంప్‌కు కూడా ఫిర్యాదు చేయి.. కేశినేని చిన్ని సెటైర్

AP: బెజవాడ బ్రదర్స్ మాజీ MP కేశినేని నాని వర్సెస్ MP కేశినేని చిన్ని మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. HYDలోని కూకట్‌పల్లి మండలం శంషీగూడలో ప్రభుత్వభూమిని MP చిన్ని కుటుంబానికి చెందిన బినామీ సంస్థ ఆక్రమిస్తోంని CM రేవంత్ రెడ్డికి మాజీ MP నాని ఫిర్యాదు చేశారు. దీనిపై చిన్ని స్పందిస్తూ కౌంటరిచ్చారు. ఈర్ష్య, ద్వేషం, కసి, పగతో నిత్యం రగిలిపోతున్న రెట్టల నాని.. ఇంతకుమించి దిగజారవు అనుకున్న ప్రతిసారి ఇంకా ఇంకా దిగజారుతూనే ఉన్నావని ఫైరయ్యారు. ప్రధానికి, రాష్ట్రపతికి ఇరువురు CMలకు ఫిర్యాదు చేశావ్.. ఇక మిగిలింది ట్రంప్, పుతిన్, కిమ్, KAపాల్ మాత్రమేనన్నారు.

ఆల్ వర్క్ నోప్లే -కంపెనీలపై  హైదరాబాద్ టెకీ ఫైర్
News· 28 Jun 2026

ఆల్ వర్క్ నోప్లే -కంపెనీలపై హైదరాబాద్ టెకీ ఫైర్

హైదరాబాద్‌కు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఆవేదన ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. "అంతా పనే.. అసలు విరామమే లేదు"అంటూ కార్పొరేట్ కంపెనీల పని కల్చర్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. వీకెండ్స్‌లో కూడా రెస్ట్ లేకుండా ప్రాజెక్ట్ డెడ్‌లైన్స్‌తో జీవితం యాంత్రికంగా మారిపో యిందని, వ్యక్తిగత జీవితానికి సమయం దొరకడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ పోస్ట్‌కు వేలాది మంది ఐటీ ఉద్యోగులు మద్దతుగా , తమకు కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయని కామెంట్లు పెడుతున్నారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కరువైందంటూ సాగుతున్న ఈ చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

నాగాలాండ్ ‘బేబీ లీగ్’ చిన్నారులకు మోడీ ప్రశంస
News· 28 Jun 2026

నాగాలాండ్ ‘బేబీ లీగ్’ చిన్నారులకు మోడీ ప్రశంస

నాగాలాండ్‌లో క్షేత్రస్థాయిలో సాగుతున్న ఫుట్‌బాల్ క్రీడా వికాసాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. తన 135వ 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నాగాలాండ్ ‘బేబీ లీగ్’, ‘వుమెన్స్ ఫుట్సల్ లీగ్’లు దేశంలోనే ఎంతో ఆదర్శవంతమైనవని ప్రశంసించారు. ముఖ్యంగా 5 నుండి 12 ఏళ్ల చిన్నారుల కోసం నిర్వహిస్తున్న బేబీ లీగ్, వారిలోని ప్రతిభను, వేగాన్ని వెలికితీస్తూ ఒక గుర్తింపును ఇస్తోందని అభినందించారు. దేశంలో క్రీడలను కెరీర్‌గా ఎంచుకునే యువత సంఖ్య పెరుగుతోందని, ఆడేవారే రాణిస్తారని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. నాగాలాండ్ చేస్తున్న ఈ కృషి మిగతా రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకమని ప్రధాని కొనియాడారు.

రెడ్ శారీలో మెస్మరైజ్ చేస్తున్న మీనాక్షీ చౌదరి.. పిక్స్ వైరల్!
Cinema· 28 Jun 2026

రెడ్ శారీలో మెస్మరైజ్ చేస్తున్న మీనాక్షీ చౌదరి.. పిక్స్ వైరల్!

టాలీవుడ్ యంగ్ బ్యూటీ మీనాక్షీ చౌదరి సరికొత్త ఫోటోషూట్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్రీజీ రెడ్ కలర్ శారీలో దేవకన్యలా మెరిసిపోయింది. స్లీవ్‌లెస్ బ్లౌజ్, సింపుల్ మేకప్, లూజ్ హెయిర్‌తో ఎర్ర కలువ పువ్వులా వయ్యారాలు ఒలకబోస్తూ దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ట్రెడిషనల్ అండ్ గ్లామరస్ లుక్‌కు నెటిజన్లు క్లీన్ బౌల్డ్ అవుతున్నారు. 'లక్కీ భాస్కర్', 'ది గోట్' సినిమాలతో మెప్పించిన ఈ క్రేజీ హీరోయిన్, ప్రస్తుతం చేతినిండా స్టార్ హీరోల ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఈ తాజా పిక్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ట్రంప్ ఒక గ్రీక్ గాడ్- ఫాలోయర్ల ప్రశంసలు !
Politics· 28 Jun 2026

ట్రంప్ ఒక గ్రీక్ గాడ్- ఫాలోయర్ల ప్రశంసలు !

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ చుట్టూ పరిణామాలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. గతంలో ఆయనపై వచ్చిన అనేక కోర్టు కేసులు, లీగల్ ఇబ్బందుల తర్వాత కూడా ఆయన మళ్లీ పుంజుకున్న తీరును చూసి మద్దతుదారులు సర్ ప్రైజ్ అవుతున్నారు.ఈ క్రమం లోనే ఆయన ఫాలోవర్స్ , అంత ర్జాతీయ విశ్లేషకులు "ఈ రోజుల్లో జీసస్ క్రైస్ట్ తర్వాత మళ్లీ అంతటి ప్రజాదరణ దక్కించుకుం టున్న వ్యక్తి ట్రంప్ మాత్రమేనని, ఆయన్ను ఒక గ్రీక్ గాడ్ లా చూస్తున్నారని" సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కేసులు , రాజకీయ గండాల న్నింటినీ దాటుకుని ఆయన సక్సెస్ అయ్యారనే ఉద్దేశంతో ఈ కామెంట్స్ వైరల్వు అతున్నాయి.

సందడి మాటున బంగారు గొడుగు ఎత్తుకెళ్లిన దొంగలు
Crime· 28 Jun 2026

సందడి మాటున బంగారు గొడుగు ఎత్తుకెళ్లిన దొంగలు

AP: నంద్యాల జిల్లా ఔకు మండల కేంద్రంలో మౌలాలి స్వామి పీరుకు అలంకరించిన బంగారు గొడుగును దొంగలు అపహరించారు. సుమారు రూ.2 లక్షల విలువైన 13 గ్రాముల బంగారు గొడుగును గుట్టుచప్పుడు కాకుండా చోరీ చేశారు. నైలాన్ ధారంతో కట్టిన బంగారు గొడుగును బ్లేడుతో కత్తిరించి కొట్టేశారు. మౌలాలి స్వామి పీర్ల చావిడి వద్ద సందడి ముసుగులో హల్‌చల్ చేసిన ఆకతాయిలు, మందుబాబులపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మౌలాలి స్వామి పీర్ల చావిడి ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చిరుతపులి వీడియో వైరల్.. గ్రామస్తుల్లో టెన్షన్▶
Local· 28 Jun 2026

చిరుతపులి వీడియో వైరల్.. గ్రామస్తుల్లో టెన్షన్

TG: వరంగల్ జిల్లా ఖానాపురం మండలం రాగంపేట శివారులోని పామాయిల్ తోటల్లో చిరుత పులి సంచారం తీవ్ర కలకలం రేపింది. దీంతో స్థానికులు భయాందోళనలు గురవుతున్నారు. శివారులో విస్తారంగా పామాయిల్ తోటలు ఉండటంతో నక్కల వర్రే కాల్వ వెంబడి మనుబోతులగడ్డ, పోచారం అటవీ ప్రాంతాల నుంచి పులి వచ్చినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిరుత పులి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఖానాపూర్ మండల ప్రజల్లో ఆందోళన నెలకొంది.