Latest

బెంగాల్ ఐకానిక్ బాపూజీ కేక్.. దీని క్రేజ్ వెనుక సీక్రెట్ ఇదే!
India· 7 Jun 2026

బెంగాల్ ఐకానిక్ బాపూజీ కేక్.. దీని క్రేజ్ వెనుక సీక్రెట్ ఇదే!

మోడ్రన్ పేస్ట్రీలు, బేకరీ ఫుడ్స్ ఎన్ని రకాలు వచ్చినా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఐకానిక్ బాపూజీ కేక్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. 1973లో కోల్‌కతాలో ప్రారంభమైన ఈ కేక్ బ్రాండ్ మిలీనియల్స్, GenZ యూత్‌ను ఒకేలా ఆకట్టుకుంటోంది. ఇదొక బడ్జెట్ ఫ్రెండ్లీ కేక్. దీని ధర రూ.5 లేదంటే రూ.6 అంతే. నాణ్యత, నోరూరించే టేస్ట్‌ విషయంలో దశాబ్దాలుగా ఒకేలా ఉండటమే దీని సక్సెస్ సీక్రెట్. స్కూల్ రోజుల్లో ఈ కేక్ తిన్న మిలీనియల్స్‌కు ఇది ఒక ఎమోషన్ అయితే, నేటి జెన్‌జీ జనరేషన్‌కు ఇదొక బడ్జెట్ ఫ్రెండ్లీ గో-టు స్నాక్‌గా మారింది. SMలో ఈ వింటేజ్ కేక్ ఎప్పుడూ ఒక ట్రెండింగ్ టాపికే

స్పేస్ లో డేటా సెంటర్స్ - ఎలన్ మస్క్   కొత్త ప్రయోగం..
Technology· 7 Jun 2026

స్పేస్ లో డేటా సెంటర్స్ - ఎలన్ మస్క్ కొత్త ప్రయోగం..

ఎలోన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ (SpaceX) కేవలం రాకెట్లే కాకుండా, సాంకేతిక రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపింది. తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగం ద్వారా భూమిపైనే కాకుండా, అంతరిక్ష కక్ష్యలో "ఆర్బిటల్ డేటా సెంటర్లు" (Orbital Data Centers) నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం గూగుల్‌తో ఏకంగా నెలకు 920 మిలియన్ డాలర్ల క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ వినూత్న ప్రయోగం గ్లోబల్ డేటా నెట్‌వర్క్‌ను పూర్తిగా మార్చేయనుంది.

ఒకేసారి నలుగురు  లేడీ సీజేలుగా ప్రమాణం -అయినా ఇంకా వివక్షే !
India· 7 Jun 2026

ఒకేసారి నలుగురు లేడీ సీజేలుగా ప్రమాణం -అయినా ఇంకా వివక్షే !

దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఒకేసారి నలుగురు మహిళా న్యాయమూర్తులు వివిధ హైకోర్టులకు చీఫ్ జస్టిస్‌లుగా బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ మీనాక్షి మదన్ రాయ్ (పాట్నా), జస్టిస్ సునీతా అగర్వాల్ (గుజరాత్), జస్టిస్ రేఖ బోరాలా (మేఘాలయ), జస్టిస్ లీలా సేథ్ (ఆంధ్రప్రదేశ్) ఈ ఘనత సాధించారు. అయితే, ఉన్నత న్యాయస్థానాల్లో ఇప్పటికీ పురుష జడ్జీల ఆధిపత్యమే కొనసాగుతుండటంతో లింగ వివక్ష ఇంకా కంటిన్యూ అవుతోందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

దళితుడిని బావిలో తల్ల కిందులుగా వేలాడదీసి....
India· 7 Jun 2026

దళితుడిని బావిలో తల్ల కిందులుగా వేలాడదీసి....

హర్యానాలోని హిసార్ జిల్లాలో దొంగతనం నెపంతో 32 ఏళ్ల దళిత యువకుడిని గ్రామస్థులు బావిలో తలకిందులుగా వేలాడదీసి, కర్రలతో అమానుషంగా దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన అతడిని హాన్సి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘోరానికి సంబంధించి ఐదుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజికంగా తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

కొత్త ట్రెండ్… డిజిటల్ డిటాక్స్ హోటల్స్
World· 7 Jun 2026

కొత్త ట్రెండ్… డిజిటల్ డిటాక్స్ హోటల్స్

ఫోన్ లేకుండా ఒక్క నిముషం కూడా మనం గడపలేం. దీంతో బుర్రంతా వేడెక్కిపోయి స్ట్రెస్ పెరిగిపోతోంది. అందుకే నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్‌ వంటి దేశాల్లో డిజిటల్ డిటాక్స్ హోటల్స్ ట్రెండ్ ఊపేస్తోంది. ఈ హోటల్స్‌లోకి అడుగుపెట్టగానే మీ స్మార్ట్‌ఫోన్, లాప్‌టాప్‌లను రిసెప్షన్‌లో లాకర్లలో పెట్టేయాలి. అక్కడ వైఫై ఉండదు, టీవీలు కూడా ఉండవు. కేవలం పుస్తకాలు చదవడం, తోటపని చేయడం, ప్రకృతిని ఆస్వాదించడం మాత్రమే చేయాలి. మొదట్లో కాస్త కష్టంగా అనిపించినా, ఇక్కడికి వచ్చి వెళ్తున్న పర్యాటకులు మానసిక ఒత్తిడి తగ్గి, ప్రశాంతంగా ఉంటోందని చెబుతున్నారు.

పెద్దికి క్లీంకార సర్ ప్రైజ్▶
Cinema· 7 Jun 2026

పెద్దికి క్లీంకార సర్ ప్రైజ్

రామ్ చరణ్ నటించిన పెద్ది సూపర్ హిట్ కావడంతో కొణిదెల, కామినేని ఫ్యామిలీలు సంబరాల్లో మునిగిపోయాయి. చంద్రుడిలో చుక్క పాటకు చరణ్ కజిన్స్ అందరూ డ్యాన్స్ చేశారు. ఆ వీడియోలో కుమార్తె క్లీంకార ముద్దు ముద్దుగా This is for you naanna love you nanna అని ఆడియో ఇచ్చింది. ఉపాసన ఈ వీడియో షేర్ చేయడంతో ఒక్కసారిగా అది వైరల్ గా మారింది.

జీతం రూ. 6 వేలు.. ఇంట్లో నగదు రూ. 2 కోట్లు
India· 7 Jun 2026

జీతం రూ. 6 వేలు.. ఇంట్లో నగదు రూ. 2 కోట్లు

ఒడిశాలో కేవలం ఆరు వేల రూపాయల స్వల్ప జీతంతో 1999లో కెరీర్ ప్రారంభించిన ఒక ప్రభుత్వ అసిస్టెంట్ ఇంజనీర్ ఆస్తుల విలువ చూసి విజిలెన్స్ అధికారులే విస్తుపోయారు. ఆదాయానికి మించి ఆస్తుల్ని కలిగి ఉన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బైకుంఠ నాథ్ బెహెరాపై విజిలెన్స్ అధికారులు జరిపిన దాడుల్లో ₹2.4 కోట్ల నగదు, 5 బహుళ అంతస్తుల భవనాలు, మొత్తం 14 స్థలాలు, 341 గ్రాముల బంగారం, ₹45 లక్షల బ్యాంక్ డిపాజిట్లు బయటపడ్డాయి. ఆయనపై విచారణ జరుగుతోంది.

రాజకీయాల్లోకి లారెన్స్... త్వరలో బిగ్ అనౌన్స్ మెంట్
Politics· 7 Jun 2026

రాజకీయాల్లోకి లారెన్స్... త్వరలో బిగ్ అనౌన్స్ మెంట్

సినీ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన ఇన్ డైరెక్ట్ గా చెప్పారు. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నికల్లో TVK తరఫున లారెన్స్ పోటీ చేయబోతున్నారనే ప్రచారంపై స్పందించారు. ప్రస్తుతం Benz సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నానని, షూటింగ్ పూర్తయ్యాక తన జీవితానికి సంబంధించిన ఓ కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. "అమ్మ ఆశీర్వాదంతో పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నా" అదేమిటో గురువారం ప్రకటిస్తానని SMలో పోస్టు పెట్టారు. సో ఆయన తిరుచ్చి నుంచి పోటీ పడడం దాదాపుగా ఖరారైనట్టే.

అర్హతకి మించి విద్యార్హత ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలకు పనికి రారు : సుప్రీం
General· 7 Jun 2026

అర్హతకి మించి విద్యార్హత ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలకు పనికి రారు : సుప్రీం

ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో అర్హతగా ఏం చదవాలని చెప్పారో వారినే తీసుకోవాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అంతకంటే ఎక్కువ చదువుకుంటే వారు ఆ పోస్టుకి అర్హులు కారని తీర్పు చెప్పింది. తమిళనాడు బ్యాంకులో టెంపరరీ అటెండర్ పోస్టుకు ఉద్యోగం పొందిన డిగ్రీ హోల్డర్ వ్యక్తి కేసులో సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. ఉద్యోగం నుంచి అతడిని తొలగించడాన్ని జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ ఆర్. మహదేవన్‌ల బెంచ్ సమర్థించింది. కావాల్సిన దానికంటే అధిక విద్యార్హత ఉన్నవారికి ఉద్యోగాలిస్తే తక్కువ చదువుకున్నవారు, నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని సుప్రీం వ్యాఖ్యానించింది.

లిక్కర్ షాపులే పార్టీల ATMలా మారాయా? సీఎం విజయ్ సంచలన నిర్ణయం
India· 7 Jun 2026

లిక్కర్ షాపులే పార్టీల ATMలా మారాయా? సీఎం విజయ్ సంచలన నిర్ణయం

తమిళనాడు సీఎం విజయం తన తొలి కేబినెట్ సమావేశంలోనే ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే TASMAC మద్యం దుకాణాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. TASMAC ద్వారా పొలిటికల్ పార్టీలకు అక్రమ మార్గాల్లో ఫండ్స్ వసూలు చేసే విధానానికి చెక్ పెట్టారు. ప్రభుత్వ అంచనా ప్రకారం, TASMAC వ్యవస్థలో నెలకు సుమారు ₹102 కోట్లు అనధికారికంగా పార్టీ ఫండ్ పేరుతో మళ్లుతోంది. గత 5 ఏళ్లలో దాదాపు ₹1,600 కోట్లు ప్రభుత్వ ఖజానాకు నష్టం వచ్చింది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడితే ఎలాంటి వారిని వదలవద్దని, వెంటనే అందరినీ అరెస్ట్ చేయాలని విజయ్ ఆదేశించారు.

మళ్లీ బండ పడింది… గ్యాస్ సిలండర్ పై రూ.29 పెంపు
General· 7 Jun 2026

మళ్లీ బండ పడింది… గ్యాస్ సిలండర్ పై రూ.29 పెంపు

సామాన్యుల నెత్తి మీద మళ్లీ గ్యాస్ ధరల బండ పడింది. డొమస్టిక్ LPG సిలిండర్ ధరపై రూ.29 పెరిగింది. కొత్త ధర ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది. అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి. ఈ పెంపుతో హైదరాబాద్ లో ధర దాదాపుగా వెయ్యికి చేరువలో ఉంది. ఇప్పటికే పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యు ప్రజలకి ఇది మరింత భారం కానుంది

AI  వచ్చినా భయం లేదు- రేవంత్
TG· 7 Jun 2026

AI వచ్చినా భయం లేదు- రేవంత్

ఏఐ వచ్చినా ఎవరూ భయపడాల్సిన పని లేదంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్.. వైట్ కాలర్ జాబ్స్ కు ప్రత్యామ్నాయం బ్లూ కాలర్ జాబ్స్.. దీనికి ప్రత్యామ్నాయం సృష్టించడం ఏఐ తరం కాదు అన్నారు రేవంత్. ఏఐ ఎన్ని అద్భుతాలు చేసినా రాజకీయ నాయకుడిని సృష్టించలేదని కాబట్టి పొలిటీషియన్లకు భయం లేదు. నేటితరం ప్రత్యామ్నాయ టెక్నాలజీ పై దృష్టి పెట్టాలి అని హిందూ పత్రిక ఇండియా కాంక్లేవ్ ది హిందూ హడుల్ 2026 లో ఎడిటర్ ఎన్ . రామ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

ఏపీతో కాదు.. ప్రపంచంతోనే మా పోటీ- రేవంత్
TG· 7 Jun 2026

ఏపీతో కాదు.. ప్రపంచంతోనే మా పోటీ- రేవంత్

తెలంగాణకు ప్రపంచంతోనే అసలైన పోటీ.. పొరుగు రాష్ట్రాలు లెక్క కాదు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చైనా జపాన్.సౌత్ కొరియాలతోనే మాపోటీ అన్నారాయన. తాను 15 ఏళ్ల క్రితమే చైనా విజట్ చేసినట్లు అందుకే తన నినాదం చైనాప్లస్ వన్ అని అన్నారు.చైనా యూజ్ చేసే టెక్నాలజీ తనను బాగా అట్రాక్ట్ చేస్తుందని ఇండియా కాంక్లేవ్ ది హిందూ హడుల్-2026 లో ఆ పత్రిక ఎడిటర్ ఎన్. రామ్ కిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

పెట్రోల్ బాదుడుకి  చెక్... దేశంలోకి E-85 పెట్రోల్
India· 7 Jun 2026

పెట్రోల్ బాదుడుకి చెక్... దేశంలోకి E-85 పెట్రోల్

మన దేశంలోకి కొత్త రకం పెట్రోల్ అందుబాటులోకి వచ్చింది. E-85 అనే ఈ పెట్రోల్ ధర చవక.. దీని రేట్ లీటర్ రూ. 82 రూపాయలు మాత్రమే. తొలిసారిగా ఢిల్లీలో ఈ టైప్ పెట్రోల్ బంక్ ను తెరిచారు. త్వరలో అన్ని రాష్ట్రాల్లోకి కూడా అందు బాటులోకి తెస్తారు.అయితే ఈ పెట్రోల్ ఫ్లెక్స్ - ఫ్లూయల్ వెహికల్స్ కు మాత్రమే యూజ్ అవుతుంది. మామూలు పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్ ఉంటే ఈ E-85 రకంలో ఇథనాల్ చాలా ఎక్కువగా ఉంటుంది.మైలేజ్ కూడా తక్కువే. ఈ బంకుల్లో E85 డిస్పెన్సర్‌కు ప్రత్యేకంగా పర్పుల్ రంగు నాజిల్ ,బ్రాండింగ్ ఉంటుంది.

రేపు రాత్రి నుంచి  చేపమందు పంపిణీ కి సర్వం సిద్ధం
TG· 7 Jun 2026

రేపు రాత్రి నుంచి చేపమందు పంపిణీ కి సర్వం సిద్ధం

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ల్ మృగశిర కార్తె సందర్భంగా ఆస్త్మా రోగులకు చేపమందు ప్రసాదం పంపిణీకి అంతా రెడీ అయింది. రేపు రాత్రి 9 గంటలనుంచి మరుసటి రోజు రాత్రి వరకూ ఈ సప్లయ్ కంటిన్యుయస్ గా జరుగుతుంది. 179 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చేపమందు ప్రసాదం కోసం దూధ్ బౌలిలోని సొంతింట్లో బత్తిన సోదరులు ఈ ప్రసాదాన్ని తయారు చేసి పంపిణీ చేస్తారు.

స్పై మూవీస్ లోనూ లవ్ సాంగ్స్ చేయచ్చు - శాశ్వత్ సచ్ దేవ్
Cinema· 6 Jun 2026

స్పై మూవీస్ లోనూ లవ్ సాంగ్స్ చేయచ్చు - శాశ్వత్ సచ్ దేవ్

కథలో భావోద్వేగం బలంగా ఉంటే స్పై మూవీస్ లోనూ లవ్ ట్రాక్స్ పెట్టొచ్చని మ్యూజిక్ డైరెక్టర్ శాశ్వత్ సచ్‌దేవ్ అన్నారు. ఆయన మ్యూజిక్ చేసిన యాక్షన్ స్పై థ్రిల్లర్ చిత్రాలు 'ధురంధర్' 'ధురంధర్: ది రివెంజ్'ఆల్బమ్స్ ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ₹325 కోట్ల బిజినెస్ వాల్యూని జనరేట్ చేసి రికార్డు సృష్టించాయి. స్పై మూవీస్ లో ప్రేమ గీతాల ఇంపార్టెన్స్ ను ఆయన మింట్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. బెర్లిన్ సింథసైజర్ల వంటి వెస్ట్రన్ ఎలక్ట్రానిక్ సంగీతాన్ని, 70 ఏళ్ల నాటి సాంప్రదాయ ఖవ్వాలీ వంటి ఇండియన్ ఫోక్ సంగీతాన్ని మిక్స్ చేసి ఈ చిత్రాల కోసం ఎమోషనల్ లవ్ ట్రాక్స్ ను ఆయన చేశారు.

లాలూ బంగ్లాకు కర్రలతో కాపలా
India· 6 Jun 2026

లాలూ బంగ్లాకు కర్రలతో కాపలా

RJD అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, మాజీ సీఎం రబ్రీ దేవి దంపతులకు కేంద్రం Z+ కేటగిరీ భద్రతను ఉపసంహరించుకోవడం బీహార్ పాలిటిక్స్ లో కలకలం రేపుతోంది. కేంద్రం డెసిషన్ ని వ్యతిరేకిస్తూ RJD కార్యకర్తలు తమ ప్రతాపం చూపిస్తామని ముందుకొచ్చారు. తమ నేతకు తామే రక్షణగా ఉంటామని వందలాది మంది కార్యకర్తలు చేతుల్లో లాఠీలు, కర్రలతో లాలూ బంగ్లా బయట డే అండ్ నైట్ కాపలా కాస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేంద్రం భద్రతను తగ్గించిందని ఆరోపించారు. తమ నాయకుడి ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లినా మోదీ సర్కార్ దే బాధ్యతని ఆర్జేడీ కార్యకర్తలు హెచ్చరించారు.

కాక్రోచెస్ ప్రొటెస్ట్ విజువల్స్ పై ధ్రువ్ రాఠీ ఇంట్రెస్టింగ్ ట్వీట్!
Politics· 6 Jun 2026

కాక్రోచెస్ ప్రొటెస్ట్ విజువల్స్ పై ధ్రువ్ రాఠీ ఇంట్రెస్టింగ్ ట్వీట్!

ఢిల్లీ జంతర్ మంతర్ లో జరుగుతున్న కాక్రోచ్ పార్టీ నిరసనలపై ఫేమస్ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. ప్రొటెస్ట్ స్పాట్ లో ఉన్న వేలాది మంది జనాన్ని చూపిస్తూ, "అక్కడ ఉన్న క్రౌడ్ ని ఒకసారి చూడండి" అంటూ ట్వీట్ చేశారు. గ్రౌండ్ ప్రొటెస్ట్ కోసం ఇచ్చిన జస్ట్ ఫస్ట్ కాల్ కే ఈ రేంజ్ లో జనాలు రావడం గ్రేట్ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ధ్రువ్ రాఠీ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతూ ఫుల్ వైరల్ గా మారింది.

కాక్రోచెస్ మూవ్‌మెంట్ కి అరవింద్ కేజ్రీవాల్ సపోర్ట్..
Politics· 6 Jun 2026

కాక్రోచెస్ మూవ్‌మెంట్ కి అరవింద్ కేజ్రీవాల్ సపోర్ట్..

జంతర్ మంతర్ లో జరుగుతున్న కాక్రోచ్ పార్టీ ప్రొటెస్ట్ కి ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సపోర్ట్ ఇచ్చారు. ఈ మూవ్‌మెంట్ దేశంలోని యూత్ కోపానికి నిదర్శనమని ఆయన ట్వీట్ చేశారు. నిరసనలు చేస్తున్న యువతను యాంటీ నేషనల్స్ అనడం ఆపి, మోదీ ప్రభుత్వం వాళ్ల ఇష్యూస్ ని సాల్వ్ చేయాలని కోరారు. ప్రైమ్ మినిస్టర్ వెంటనే విద్యాశాఖ మంత్రిని పదవి నుండి తీసేయాలన్నారు. ప్రస్తుతం కేజ్రీవాల్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

నైరుతి ఎఫెక్ట్.. 17 రాష్ట్రాల్లో వర్షాలు
Politics· 6 Jun 2026

నైరుతి ఎఫెక్ట్.. 17 రాష్ట్రాల్లో వర్షాలు

ఇన్నాళ్లూ ఎండలతో ఉక్కిరిబిక్కిరైన దేశ ప్రజలు సేద తీరుతున్నారు. నైరుతి రుతుపవనాల రాకతో దేశవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రుతుపవనాలు కేరళం నుంచి ఏపీని తాకాయి. రాబోయే 24 నుంచి 48 గంటల్లో ఏపీ, తెలంగాణతో పాటు దేశంలోని 17 రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. మైదాన ప్రాంతాలలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీచే ప్రమాదం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది.

కాక్రోచెస్ కి సపోర్ట్ గా 70 ఏళ్ల పెద్దాయన!▶
Politics· 6 Jun 2026

కాక్రోచెస్ కి సపోర్ట్ గా 70 ఏళ్ల పెద్దాయన!

కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు కేవలం జెన్ జీ కే పరిమితం కాలేదు. భయం లేని భారతదేశం కోసం యూత్ చేస్తున్న ఈ ప్రొటెస్ట్ కి సపోర్ట్ ఇవ్వడానికి 70 ఏళ్ల ఒక పెద్దాయన జంతర్ మంతర్ కి వచ్చారు. దీనిపై పీక్ టీవీతో ఆయన మాట్లాడుతూ.. యువత చేస్తున్న ఈ పోరాటానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ఈ పెద్దాయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతూ ఫుల్ వైరల్ గా మారింది.