Latest

ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై పోలీస్ కేస్!
ప్రొఫెసర్ నాగేశ్వర్‌తో పాటు ఒక టీవీ ఛానల్‌పై కాకినాడ జిల్లా ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్‌లో కేస్ ఫైల్ అయింది. ఒక TV డిబేట్ షోలో నాగేశ్వర్ మాట్లాడుతూ. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ టెంపరరీ ఫ్రెండ్స్ అని. జగన్ మాత్రమే లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అని అమిత్ షా చెప్పారు అంటూ కామెంట్స్ చేశారు. డిప్యూటీ CM పవన్ కళ్యాణ్, మినిస్టర్ నాదెండ్ల మనోహర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై ఇలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదంటూ జనసేన లీడర్స్ ఇచ్చిన కంప్లైంట్‌తో పోలీసులు ఈ కేస్ రిజిస్టర్ చేశారు.

ఎండలకు చెక్.... ఇక భారీ వర్షాలేనా?వెదర్ రిపోర్ట్ ఏం చెబుతోంది?
తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న జనానికి ఉపశమనం కలిగించే న్యూస్ ఇది. భారత వాతావరణ శాఖ (IMD) విడుదల చేసిన తాజా శాటిలైట్ చిత్రాల ప్రకారం, ఉత్తర భారతదేశం వైపు ఒక భారీ 'వెస్టర్న్ డిస్టర్బెన్స్సు దూసుకొస్తోంది. దీనివల్ల త్వరలోనే వర్షాలు కురిసి, ఎండ తీవ్రత తగ్గే అవకాశం ఉంది. మే 21న INSAT-3DS ఉపగ్రహం తీసిన చిత్రాలలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ , వాయువ్య భారత ప్రాంతాలపై దట్టమైన మేఘాలు ఆవరించి ఉన్నట్లు స్పష్టమైంది. వర్షాలే పడితే ఈ మండే ఎండలనుంచి కాస్త రిలీఫ్ పొందచ్చు..

ఉగ్రవాది హంజా బుర్హాన్ హతం
2019 పుల్వామా ఉగ్రదాడి సూత్రధారులలో ఒకడైన హంజా బుర్హాన్ (అలియాస్ అర్జుమంద్ గుల్జార్ దార్) పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని ముజఫరాబాద్‌లో గుర్తుతెలియని వ్యక్తుల కాల్పుల్లో హతమయ్యాడు. 'డాక్టర్' గా పిలవబడే ఇతడిని భారత హోంమంత్రిత్వ శాఖ 2022లో ఉగ్రవాదిగా ప్రకటించింది. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్‌లో పలువురు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఇలాగే గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హతమవ్వడం గమనార్హం.

వదల బొమ్మాళీ అంటున్న కాక్రోచ్ జనతా పార్టీ !!
మన దేశంలో బ్యాన్ చేసిన కొద్ది గంటల్లోనే 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) తన కొత్త X (ట్విట్టర్) ఖాతాను ప్రారంభించింది. ఇటీవల బిజెపి (BJP) అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్యను ఈ సెటైరికల్గ్రూ ప్ అధిగమించడంతో దీని ప్రజాదరణ బాగా పెరిగింది. తిరిగొచ్చిన గంటలోనే, విమర్శకులను హేళన చేస్తూ రెండు పోస్ట్‌లు పెట్టింది. "మమ్మల్ని వదిలించుకోగలరని అనుకున్నారా?" అని సెటైర్లు కూడా వేసింది. బిజెపితో ఫాలోవర్ల సంఖ్యను పోలుస్తూ స్క్రీన్‌షాట్‌లను షేర్ చేసింది.

ఐదు దేశాలకు ఇండియన్ ట్రెడిషన్ ఉట్టిపడేలా ప్రధాని కానుకలు
ప్రధాని నరేంద్ర మోదీ తన అయిదు దేశాల (ఇటలీ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, యూఏఈ) పర్యటనలో భాగంగా ప్రపంచ దేశాల అధినేతలకు భారతీయ సంస్కృతి ప్రతిబింబించే బహుమతులు అందజేశారు. ఇటలీ ప్రధాని మెలోనికి అసోం ముగా సిల్క్ శాలువా, యూఏఈ అధ్యక్షుడికి కేసర్ మామిడి పండ్లు, నెదర్లాండ్స్ రాజుకు రాజస్థాన్ బ్లూ పాటరీ, నార్వే ప్రధానికి సిక్కిం ఆర్కిడ్ పెయింటింగ్స్, స్వీడన్ ప్రధానికి లడఖ్ పష్మినా శాలువాను ప్రధాని మోదీ గిఫ్ట్ చేశారు.
బొద్దింకల జనతా పార్టీ క్యాంపెయిన్ చూశారా?
ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న 'బొద్దింకల జనతా పార్టీ' (CJP) క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. ఒక బ్లింకిట్ డెలివరీ బాయ్ ఈ పార్టీ కోసం క్యాంపెయిన్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఇది చూసిన పబ్లిక్ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అయితే ఇండియాలో జరిగే ప్రతి ఎలక్షన్‌లోనూ ఈ 'బొద్దింకల జనతా పార్టీ'నే గెలుస్తుందంటూ కామెంట్స్ పెడుతున్నారు.

తమిళనాడులో కాంగ్రెస్ మంత్రి ప్రమాణ స్వీకారంలో రాహుల్ నినాదాలు
తమిళనాడులో కాంగ్రెస్ ఎమ్మెల్యే మంత్రిగా ప్రమాణం కాంట్రవర్సీకి దారి తీసింది. కొత్త మంత్రిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా కిలియూర్ ఎమ్మెల్యే ఎస్. రాజేష్ కుమార్ వివాదంలో చిక్కుకున్నారు. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణం చేస్తూ ఆయన కామరాజ్, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీలకు అనుకూలంగా నినాదాలు చేశారు. దీనిపై గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, అది ప్రమాణ స్వీకారంలో భాగం కాదని సున్నితంగా మందలించారు.60 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అక్కడ భాగస్వామిగా మారింది.

ఇండియా- ఆఫ్రికా ఫోరమ్ కు ఎబోలా వైరస్ దెబ్బ !
ఇండియా-ఆఫ్రికన్ యూనియన్ మధ్య జరగాల్సిన 4వ ఇండియా-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్ వాయిదా పడింది. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా కాంగోలో ఎబోలా వైరస్ కేసులు పెరుగుతుండటమే దీనికి కారణం. మే 28 నుంచి ఢిల్లీలో జరగాల్సిన ఈ సమ్మిట్ ను ప్రజల ఆరోగ్యం మరియు భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇరుపక్షాలు పరస్పర అంగీకారంతో పోస్ట్‌పోన్ చేశాయి. హెల్త్ ఎమర్జెన్సీపై కలిసి పోరాడతామని చెబుతూనే, సమ్మిట్ కొత్త డేట్స్‌ను త్వరలోనే అనౌన్స్ చేస్తామని గవర్నమెంట్ స్పష్టం చేసింది.
బండి భగీరథ్ సరెండర్ అవ్వలేదు!
బండి భగీరథ్‌ను సరెండర్ చేశానంటూ బండి సంజయ్ అబద్ధాలు చెప్తున్నారని CM క్లారిటీ ఇచ్చారు. పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆయన్ను అరెస్ట్ చేశామని క్లియర్‌గా చెప్పిందని, తాను పోలీసుల మాటలనే నమ్ముతానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కిడ్నాప్ అండ్ అరెస్ట్ మ్యాటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న Cockroach Revolution!
Cockroach Revolution ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. యూత్ ఇండియాను ఒక బెటర్ కంట్రీగా మార్చడం కోసం సొల్యూషన్స్ వెతకడానికి ఇదొక మంచి ప్లాట్‌ఫామ్‌గా మారిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దేశం గురించి ఆలోచించే యూత్ అంతా ఇప్పుడు ఈ ట్రెండ్ వైపు అట్రాక్ట్ అవుతున్నారు.

'బొద్దింక జనతా పార్టీ' బ్యాన్
రీసెంట్‌గా సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసిన 'బొద్దింకలా జనతా పార్టీ' (CJP) అకౌంట్‌ను బ్యాన్ చేశారు. మే 16న స్టార్ట్ అయిన ఈ అకౌంట్, జస్ట్ 4 డేస్ లోనే 200K కంటే ఎక్కువ ఫాలోవర్స్ తెచ్చుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. అంత తక్కువ టైమ్‌లో అంత ఎక్కువ ఫాలోవర్స్ రావడంతోనే ఆ అకౌంట్‌ను బ్యాన్ చేశారు అని నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు.
ఇద్దరిని గన్‌తో కాల్చి చంపిన బాలకృష్ణ?
గతంలో బాలకృష్ణ గతంలో గన్‌తో ఇద్దరిని కాల్చి చంపిన మ్యాటర్‌ను వైఎస్ జగన్ మళ్లీ గుర్తు చేశారు. ఆ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని రోజులకే, సాక్షులు ఎవరూ లేకుండా చేయడం కోసం వాళ్ల ఇంటి వాచ్‌మన్‌ను బండరాయితో కొట్టి చంపేశారని జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అప్పట్లో చంద్రబాబు తన పవర్‌తోనే ఈ కేసును కవర్ చేశారంటూ జగన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
ట్రెండింగ్‌లో 'బొద్దింకలా జనతా పార్టీ' సాంగ్!
'బొద్దింకలా జనతా పార్టీ' (CJP) రిలీజ్ చేసిన ఒక పార్టీ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతోంది. ఈ సాంగ్ వినడానికి చాలా బాగుందని, ముఖ్యంగా GenZ యూత్ ని ఫుల్లుగా అట్రాక్ట్ చేసేలా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
AI రోబో బార్బర్స్ వచ్చేశాయి!
చైనాలో ఇప్పుడు AI రోబో బార్బర్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఈ రోబోలు కస్టమర్స్‌ని ఫస్ట్ 3Dలో స్కాన్ చేసుకుంటాయి. ఆ తర్వాత ఎలాంటి మిస్టేక్ లేకుండా, చాలా పర్‌ఫెక్ట్‌గా హెయిర్ కట్ చేసేస్తున్నాయి. సెలూన్‌కి వెళ్లి వెయిట్ చేసే పనిలేకుండా, లేటెస్ట్ AI టెక్నాలజీతో ఈ రోబోలు చేస్తున్న హెయిర్‌కట్ వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నమ్మకం లేదు.. నైతికత లేదు .. పాక్ పై UNSCలో భారత్ ఫైర్
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) వేదికగా పాకిస్తాన్‌పై భారత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. పాక్ ప్రతినిధి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడానికి ప్రయత్నించగా.. భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. పొరుగు దేశంలో మైనారిటీలపై జరుగుతున్న దాడులు, బలవంతపు మతమార్పిడులను ప్రస్తావిస్తూ మారణహోమానికి పాల్పడుతున్న దేశం భారత్ కు నీతులు చెప్పడం హాస్యాస్పదమని భారత్ శాశ్వత రాయబారి హరీశ్ పర్వతనేని విరుచుకుపడ్డారు. ఉగ్రవాదానికి అడ్డాగా మారిన పాక్ కు చట్టాలన్నా, నైతికతన్నా అస్సలు గౌరవం లేదన్నారు.

Instaలో బీజేపీని దాటేసిన కాక్రోచ్ పార్టీ
Cockroach Janta Party (CJP) సోషల్ మీడియాలో మరో రికార్డ్ క్రియేట్ చేసింది. Instagramలో ఈ పార్టీ అకౌంట్ ఫాలోవర్ల విషయంలో అధికార బీజేపీని దాటేసింది. ఇప్పుడు సీజేపీకి 10.1 మిలియన్ ఫాలోవర్లు ఉంటే, బీజేపీకి 8.7 మిలియన్ ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన Abhijeet Dipke “Don’t underestimate the power of youth” అంటూ పోస్టు చేయగా, సోషల్ మీడియాలో భారీగా షేర్అ వుతోంది. నిరుద్యోగం, పరీక్షల లీకులు, రాజకీయ వ్యవస్థపై యువత అసంతృప్తిని మీమ్స్, సెటైర్ల రూపంలో చూపిస్తూ CJP వేగంగా పాపులర్ అయింది.

కేంద్రంతో భేటీకి వాంగ్ చుక్ : లద్దాఖ్ కు రాష్ట్ర హోదా అంశంపై చర్చ
లద్దాఖ్ కు ప్రత్యేక ప్యాకేజీ, రాష్ట్ర హోదా కల్పించే అంశంపై కేంద్ర ప్రభుత్వంతో మే 22న ఢిల్లీలో జరగబోయే కీలక చర్చల్లో క్లైమేట్ యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్‌చుక్ పాల్గొననున్నారు. గతేడాది నిరసనల నేపథ్యంలో దాదాపు ఆరు నెలల పాటు NSA నిర్బంధంలో ఉండి, ఈ ఏడాది మార్చిలోనే విడుదలైన వాంగ్‌చుక్.. ఈ చర్చల కమిటీలో భాగమవ్వడం ఇదే మొదటిసారి. అపెక్స్ బాడీ లేహ్… ABL తరఫున వాంగ్‌చుక్‌తో పాటు మరో ఇద్దరు ప్రతినిధులు, లీగల్ అడ్వైజర్ ఈ సబ్‌కమిటీ సమావేశానికి హాజరవుతున్నారు.

బంగాళాఖాతంలో భయంకర మేఘాల దండు.. పలు రాష్ట్రాలకు ఎలర్ట్ !
బంగాళాఖాతంలో ఊహించని మహా విపత్తు ముంచుకొస్తోంది! కేరళ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు వ్యాపించిన 3,000 కిలోమీటర్ల సుదీర్ఘ భయంకర మేఘాల సమూహాన్ని శాటిలైట్ గుర్తించింది. గంటకు 150 కిమీ వేగపు గాలులు, కేదార్‌నాథ్ తరహా మేఘ విస్ఫోటనాలు, నిమిషానికి వేల పిడుగులతో ఈ రాక్షస వ్యవస్థ విరుచుకుపడనుంది. కేవలం 6 గంటల్లోనే నగరాలను ముంచెత్తే ఆకస్మిక వరదలు ముప్పు పొంచి ఉండటంతో ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి అత్యంత అప్రమత్తంగా ఉండాలి! ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.
ఆ శాలువాపై చిరు, పవన్, చరణ్ డ్రాయింగ్స్!
చిరంజీవి, డైరెక్టర్ బాబి కాంబినేషన్‌లో వస్తున్న కొత్త మూవీ పూజా కార్యక్రమం గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌కి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, నాగబాబు చీఫ్ గెస్టులుగా వచ్చారు. అయితే అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది. మూవీ టీమ్ చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను ఒక స్పెషల్ శాలువాతో సన్మానించింది. ఆ శాలువాపై చిరంజీవి, పవన్, రామ్ చరణ్‌ల ఫేసెస్ డిజైన్ చేసి ఉన్నాయి. ఆ డిజైన్ చూసి మెగా బ్రదర్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ మెగా మూమెంట్‌కి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్‌లో రౌడీలతో హాస్టల్‌పై ఎటాక్!
ఏషియన్ హాస్టల్ మేనేజర్స్ దగ్గర రూ. 2 కోట్లు అడ్వాన్స్ తీసుకుని బిల్డింగ్ లీజుకిచ్చిన కాంగ్రెస్ లీడర్ బొంతు రామ్మోహన్, ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి తమపై ఎటాక్ చేస్తున్నారని హాస్టల్ ఓనర్స్ చెప్తున్నారు. బిల్డింగ్ ఖాళీ చేయాలంటూ పోలీసులు ముందే ఒక లేడీ మేనేజర్ ని జుట్టు పట్టుకుని రామ్మోహన్ అత్తగారు కొడుతు గొడవకు దిగారు. బొంతు శ్రీదేవి 30 మంది రౌడీలతో వచ్చి హాస్టల్‌లో కూర్చుని బెదిరిస్తోందని, సీఎం రేవంత్ రెడ్డి గారే తమను కాపాడాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.

స్నానం చేయమన్నారని బావిలో దూకిన ఇంటర్ స్టూడెంట్!
ఆసిఫాబాద్‌లో ఒక ఇంటర్ అమ్మాయి ఆవేశంలో బావిలోకి దూకి సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ స్నానం చేయమని తిట్టడమే దీనికి కారణం. దాంతో బాగా హర్ట్ అయిన ఆ అమ్మాయి ఇంటి పక్కనే ఉన్న బావిలో దూకేసింది. ఆమె అరుపులు విన్న లోకల్ పీపుల్ వెంటనే అలర్ట్ అయి పోలీసులకు కాల్ చేశారు. ఫైర్ టీమ్ స్పాట్‌కి వచ్చి తాడుతో ఆ అమ్మాయిని సేఫ్‌గా బయటకు తీశారు. చిన్న దెబ్బలు తగలడంతో హాస్పిటల్‌కి షిఫ్ట్ చేశారు.