Latest

తమిళనాడులో కాంగ్రెస్  మంత్రి ప్రమాణ స్వీకారంలో రాహుల్ నినాదాలు
Politics· 21 May 2026

తమిళనాడులో కాంగ్రెస్ మంత్రి ప్రమాణ స్వీకారంలో రాహుల్ నినాదాలు

తమిళనాడులో కాంగ్రెస్ ఎమ్మెల్యే మంత్రిగా ప్రమాణం కాంట్రవర్సీకి దారి తీసింది. కొత్త మంత్రిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా కిలియూర్ ఎమ్మెల్యే ఎస్. రాజేష్ కుమార్ వివాదంలో చిక్కుకున్నారు. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణం చేస్తూ ఆయన కామరాజ్, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీలకు అనుకూలంగా నినాదాలు చేశారు. దీనిపై గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, అది ప్రమాణ స్వీకారంలో భాగం కాదని సున్నితంగా మందలించారు.60 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అక్కడ భాగస్వామిగా మారింది.

 ఇండియా- ఆఫ్రికా ఫోరమ్ కు  ఎబోలా వైరస్ దెబ్బ !
World· 21 May 2026

ఇండియా- ఆఫ్రికా ఫోరమ్ కు ఎబోలా వైరస్ దెబ్బ !

ఇండియా-ఆఫ్రికన్ యూనియన్ మధ్య జరగాల్సిన 4వ ఇండియా-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్ వాయిదా పడింది. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా కాంగోలో ఎబోలా వైరస్ కేసులు పెరుగుతుండటమే దీనికి కారణం. మే 28 నుంచి ఢిల్లీలో జరగాల్సిన ఈ సమ్మిట్ ను ప్రజల ఆరోగ్యం మరియు భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇరుపక్షాలు పరస్పర అంగీకారంతో పోస్ట్‌పోన్ చేశాయి. హెల్త్ ఎమర్జెన్సీపై కలిసి పోరాడతామని చెబుతూనే, సమ్మిట్ కొత్త డేట్స్‌ను త్వరలోనే అనౌన్స్ చేస్తామని గవర్నమెంట్ స్పష్టం చేసింది.

బండి భగీరథ్ సరెండర్ అవ్వలేదు!▶
Politics· 21 May 2026

బండి భగీరథ్ సరెండర్ అవ్వలేదు!

బండి భగీరథ్‌ను సరెండర్ చేశానంటూ బండి సంజయ్ అబద్ధాలు చెప్తున్నారని CM క్లారిటీ ఇచ్చారు. పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆయన్ను అరెస్ట్ చేశామని క్లియర్‌గా చెప్పిందని, తాను పోలీసుల మాటలనే నమ్ముతానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కిడ్నాప్ అండ్ అరెస్ట్ మ్యాటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న Cockroach Revolution!▶
Politics· 21 May 2026

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న Cockroach Revolution!

Cockroach Revolution ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. యూత్ ఇండియాను ఒక బెటర్ కంట్రీగా మార్చడం కోసం సొల్యూషన్స్ వెతకడానికి ఇదొక మంచి ప్లాట్‌ఫామ్‌గా మారిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దేశం గురించి ఆలోచించే యూత్ అంతా ఇప్పుడు ఈ ట్రెండ్‌ వైపు అట్రాక్ట్ అవుతున్నారు.

'బొద్దింక జనతా పార్టీ' బ్యాన్
Politics· 21 May 2026

'బొద్దింక జనతా పార్టీ' బ్యాన్

రీసెంట్‌గా సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసిన 'బొద్దింకలా జనతా పార్టీ' (CJP) అకౌంట్‌ను బ్యాన్ చేశారు. మే 16న స్టార్ట్ అయిన ఈ అకౌంట్, జస్ట్ 4 డేస్ లోనే 200K కంటే ఎక్కువ ఫాలోవర్స్ తెచ్చుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. అంత తక్కువ టైమ్‌లో అంత ఎక్కువ ఫాలోవర్స్ రావడంతోనే ఆ అకౌంట్‌ను బ్యాన్ చేశారు అని నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు.

ఇద్దరిని గన్‌తో కాల్చి చంపిన బాలకృష్ణ?▶
Politics· 21 May 2026

ఇద్దరిని గన్‌తో కాల్చి చంపిన బాలకృష్ణ?

గతంలో బాలకృష్ణ గతంలో గన్‌తో ఇద్దరిని కాల్చి చంపిన మ్యాటర్‌ను వైఎస్ జగన్ మళ్లీ గుర్తు చేశారు. ఆ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని రోజులకే, సాక్షులు ఎవరూ లేకుండా చేయడం కోసం వాళ్ల ఇంటి వాచ్‌మన్‌ను బండరాయితో కొట్టి చంపేశారని జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అప్పట్లో చంద్రబాబు తన పవర్‌తోనే ఈ కేసును కవర్ చేశారంటూ జగన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

ట్రెండింగ్‌లో 'బొద్దింకలా జనతా పార్టీ' సాంగ్!▶
Politics· 21 May 2026

ట్రెండింగ్‌లో 'బొద్దింకలా జనతా పార్టీ' సాంగ్!

'బొద్దింకలా జనతా పార్టీ' (CJP) రిలీజ్ చేసిన ఒక పార్టీ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతోంది. ఈ సాంగ్ వినడానికి చాలా బాగుందని, ముఖ్యంగా GenZ యూత్ ని ఫుల్లుగా అట్రాక్ట్ చేసేలా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

AI రోబో బార్బర్స్ వచ్చేశాయి!▶
Politics· 21 May 2026

AI రోబో బార్బర్స్ వచ్చేశాయి!

చైనాలో ఇప్పుడు AI రోబో బార్బర్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఈ రోబోలు కస్టమర్స్‌ని ఫస్ట్ 3Dలో స్కాన్ చేసుకుంటాయి. ఆ తర్వాత ఎలాంటి మిస్టేక్ లేకుండా, చాలా పర్‌ఫెక్ట్‌గా హెయిర్ కట్ చేసేస్తున్నాయి. సెలూన్‌కి వెళ్లి వెయిట్ చేసే పనిలేకుండా, లేటెస్ట్ AI టెక్నాలజీతో ఈ రోబోలు చేస్తున్న హెయిర్‌కట్ వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నమ్మకం లేదు.. నైతికత లేదు .. పాక్ పై UNSCలో భారత్ ఫైర్
World· 21 May 2026

నమ్మకం లేదు.. నైతికత లేదు .. పాక్ పై UNSCలో భారత్ ఫైర్

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) వేదికగా పాకిస్తాన్‌పై భారత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. పాక్ ప్రతినిధి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడానికి ప్రయత్నించగా.. భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. పొరుగు దేశంలో మైనారిటీలపై జరుగుతున్న దాడులు, బలవంతపు మతమార్పిడులను ప్రస్తావిస్తూ మారణహోమానికి పాల్పడుతున్న దేశం భారత్ కు నీతులు చెప్పడం హాస్యాస్పదమని భారత్ శాశ్వత రాయబారి హరీశ్ పర్వతనేని విరుచుకుపడ్డారు. ఉగ్రవాదానికి అడ్డాగా మారిన పాక్ కు చట్టాలన్నా, నైతికతన్నా అస్సలు గౌరవం లేదన్నారు.

Instaలో‌ బీజేపీని దాటేసిన కాక్రోచ్ పార్టీ
Politics· 21 May 2026

Instaలో‌ బీజేపీని దాటేసిన కాక్రోచ్ పార్టీ

Cockroach Janta Party (CJP) సోషల్ మీడియాలో మరో రికార్డ్ క్రియేట్ చేసింది. Instagramలో ఈ పార్టీ అకౌంట్ ఫాలోవర్ల విషయంలో అధికార బీజేపీని దాటేసింది. ఇప్పుడు సీజేపీకి 10.1 మిలియన్ ఫాలోవర్లు ఉంటే, బీజేపీకి 8.7 మిలియన్ ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన Abhijeet Dipke “Don’t underestimate the power of youth” అంటూ పోస్టు చేయగా, సోషల్ మీడియాలో భారీగా షేర్అ వుతోంది. నిరుద్యోగం, పరీక్షల లీకులు, రాజకీయ వ్యవస్థపై యువత అసంతృప్తిని మీమ్స్, సెటైర్ల రూపంలో చూపిస్తూ CJP వేగంగా పాపులర్ అయింది.

కేంద్రంతో భేటీకి వాంగ్ చుక్ : లద్దాఖ్ కు రాష్ట్ర హోదా అంశంపై చర్చ
India· 21 May 2026

కేంద్రంతో భేటీకి వాంగ్ చుక్ : లద్దాఖ్ కు రాష్ట్ర హోదా అంశంపై చర్చ

లద్దాఖ్ కు ప్రత్యేక ప్యాకేజీ, రాష్ట్ర హోదా కల్పించే అంశంపై కేంద్ర ప్రభుత్వంతో మే 22న ఢిల్లీలో జరగబోయే కీలక చర్చల్లో క్లైమేట్ యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్‌చుక్ పాల్గొననున్నారు. గతేడాది నిరసనల నేపథ్యంలో దాదాపు ఆరు నెలల పాటు NSA నిర్బంధంలో ఉండి, ఈ ఏడాది మార్చిలోనే విడుదలైన వాంగ్‌చుక్.. ఈ చర్చల కమిటీలో భాగమవ్వడం ఇదే మొదటిసారి. అపెక్స్ బాడీ లేహ్… ABL తరఫున వాంగ్‌చుక్‌తో పాటు మరో ఇద్దరు ప్రతినిధులు, లీగల్ అడ్వైజర్ ఈ సబ్‌కమిటీ సమావేశానికి హాజరవుతున్నారు.

బంగాళాఖాతంలో భయంకర మేఘాల దండు.. పలు రాష్ట్రాలకు  ఎలర్ట్ !
General· 21 May 2026

బంగాళాఖాతంలో భయంకర మేఘాల దండు.. పలు రాష్ట్రాలకు ఎలర్ట్ !

బంగాళాఖాతంలో ఊహించని మహా విపత్తు ముంచుకొస్తోంది! కేరళ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు వ్యాపించిన 3,000 కిలోమీటర్ల సుదీర్ఘ భయంకర మేఘాల సమూహాన్ని శాటిలైట్ గుర్తించింది. గంటకు 150 కిమీ వేగపు గాలులు, కేదార్‌నాథ్ తరహా మేఘ విస్ఫోటనాలు, నిమిషానికి వేల పిడుగులతో ఈ రాక్షస వ్యవస్థ విరుచుకుపడనుంది. కేవలం 6 గంటల్లోనే నగరాలను ముంచెత్తే ఆకస్మిక వరదలు ముప్పు పొంచి ఉండటంతో ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి అత్యంత అప్రమత్తంగా ఉండాలి! ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.

ఆ శాలువాపై చిరు, పవన్, చరణ్ డ్రాయింగ్స్!▶
Entertainment· 21 May 2026

ఆ శాలువాపై చిరు, పవన్, చరణ్ డ్రాయింగ్స్!

చిరంజీవి, డైరెక్టర్ బాబి కాంబినేషన్‌లో వస్తున్న కొత్త మూవీ పూజా కార్యక్రమం గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌కి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, నాగబాబు చీఫ్ గెస్టులుగా వచ్చారు. అయితే అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది. మూవీ టీమ్ చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను ఒక స్పెషల్ శాలువాతో సన్మానించింది. ఆ శాలువాపై చిరంజీవి, పవన్, రామ్ చరణ్‌ల ఫేసెస్ డిజైన్ చేసి ఉన్నాయి. ఆ డిజైన్ చూసి మెగా బ్రదర్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ మెగా మూమెంట్‌కి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హైదరాబాద్‌లో రౌడీలతో హాస్టల్‌పై ఎటాక్!▶
Crime· 21 May 2026

హైదరాబాద్‌లో రౌడీలతో హాస్టల్‌పై ఎటాక్!

ఏషియన్ హాస్టల్ మేనేజర్స్ దగ్గర రూ. 2 కోట్లు అడ్వాన్స్ తీసుకుని బిల్డింగ్ లీజుకిచ్చిన కాంగ్రెస్ లీడర్ బొంతు రామ్మోహన్, ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి తమపై ఎటాక్ చేస్తున్నారని హాస్టల్ ఓనర్స్ చెప్తున్నారు. బిల్డింగ్ ఖాళీ చేయాలంటూ పోలీసులు ముందే ఒక లేడీ మేనేజర్ ని జుట్టు పట్టుకుని రామ్మోహన్ అత్తగారు కొడుతు గొడవకు దిగారు. బొంతు శ్రీదేవి 30 మంది రౌడీలతో వచ్చి హాస్టల్‌లో కూర్చుని బెదిరిస్తోందని, సీఎం రేవంత్ రెడ్డి గారే తమను కాపాడాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.

స్నానం చేయమన్నారని బావిలో దూకిన ఇంటర్ స్టూడెంట్!
News· 21 May 2026

స్నానం చేయమన్నారని బావిలో దూకిన ఇంటర్ స్టూడెంట్!

ఆసిఫాబాద్‌లో ఒక ఇంటర్ అమ్మాయి ఆవేశంలో బావిలోకి దూకి సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ స్నానం చేయమని తిట్టడమే దీనికి కారణం. దాంతో బాగా హర్ట్ అయిన ఆ అమ్మాయి ఇంటి పక్కనే ఉన్న బావిలో దూకేసింది. ఆమె అరుపులు విన్న లోకల్ పీపుల్ వెంటనే అలర్ట్ అయి పోలీసులకు కాల్ చేశారు. ఫైర్ టీమ్ స్పాట్‌కి వచ్చి తాడుతో ఆ అమ్మాయిని సేఫ్‌గా బయటకు తీశారు. చిన్న దెబ్బలు తగలడంతో హాస్పిటల్‌కి షిఫ్ట్ చేశారు.

కోల్డ్ కాఫీ Vs హాట్ కాఫీ: సమ్మర్‌లో ఏది బెస్ట్?
Health· 21 May 2026

కోల్డ్ కాఫీ Vs హాట్ కాఫీ: సమ్మర్‌లో ఏది బెస్ట్?

సమ్మర్‌లో హాట్ కాఫీ కంటే కోల్డ్ కాఫీ తాగడమే బెటర్ అని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. ఎండల వల్ల బాడీకి చల్లదనం, హైడ్రేషన్ చాలా అవసరం. కోల్డ్ కాఫీ తాగడం వల్ల ఇన్స్టంట్‌గా ఎనర్జీ రావడంతో పాటు బాడీ కూల్ అవుతుంది. అయితే బయట దొరికే కోల్డ్ కాఫీలో షుగర్, కాలరీలు ఎక్కువ ఉంటాయి. అందుకే ఇంట్లోనే తక్కువ షుగర్‌తో చేసుకుని తాగడం మంచిది. అదే ఎండల్లో హాట్ కాఫీ ఎక్కువ తాగితే డీహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు.

అన్నయ్య మూవీకి క్లాప్ కొట్టిన తమ్ముడు పవన్ ▶
Cinema· 21 May 2026

అన్నయ్య మూవీకి క్లాప్ కొట్టిన తమ్ముడు పవన్

మెగాస్టార్ చిరంజీవీ నటిస్తున్న 158వ చిత్రానికి ఈ రోజు పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అన్నయ్య నటించే చిత్రానికి తమ్ముడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్లాప్ కొడితే, కుమార్తె నిర్మాత సుస్మిత కొణిదెల కెమెరా ఆన్ చేశారు. కేవీఎన్ ప్రొడక్షన్ నిర్మించే ఈ చిత్రానికి డైరెక్టర్ బాబీ . ఈ కార్యక్రమానికి నాగబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెగా బ్రదర్స్ ముగ్గురూ ఒకే కారులో రావడం హాట్ టాపిక్ గా మారింది.

రికార్డ్స్ బద్దలు కొడుతున్న NTR డ్రాగన్ మూవీ గ్లింప్స్
Cinema· 21 May 2026

రికార్డ్స్ బద్దలు కొడుతున్న NTR డ్రాగన్ మూవీ గ్లింప్స్

జూనియర్ ఎన్డీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ డ్రాగన్. నిన్న ఎన్డీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేస్తే కేవలం 24 గంటల్లోనే 6.4 కోట్ల వ్యూస్ ని సొంతం చేసుకుంది. 4 నిముషాలున్న ఈ వీడియోని చూసి ఫ్యాన్స్ వెర్రెక్కిపోతున్నారు. ఇప్పటివరకు మరే మూవీకి ఈ స్థాయిలో వ్యూస్ రాలేదు. వచ్చే ఏడాది జూన్ 11న వరల్డ్ వైడ్ గా డ్రాగన్ మూవీ రిలీజ్ కానుంది.

అమెరికా చదువు.. ఆప్ క్యాంపెయిన్.. ఇప్పుడు కాక్రోచ్ పార్టీ కింగ్
Viral· 21 May 2026

అమెరికా చదువు.. ఆప్ క్యాంపెయిన్.. ఇప్పుడు కాక్రోచ్ పార్టీ కింగ్

ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వెనుక ఉన్న మాస్టర్ బ్రెయిన్ అభిజిత్ దీప్కే (30). మహారాష్ట్రకు చెందిన ఆయన బేసికల్ గా జర్నలిస్టు. బోస్టన్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేశారు. పొలిటికల్ డిజిటల్ స్ట్రాటజిస్ట్ గా పని చేస్తున్నారు. 2020 ఢిల్లీ ఎన్నికల్లో AAP సోషల్ మీడియా క్యాంపెయిన్ సక్సెస్ వెనుక ఆయనే ఉన్నారు. నిరుద్యోగులపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కామెంట్‌కు నిరసనగా ఇతను వ్యంగ్యంగా మొదలు పెట్టిన CJP ఒక జెన్ జీ ఉద్యమంగా మారింది. దీంతో దీనిని ఒక ఉద్యమ పార్టీగా ముందుకు తీసుకువెళ్లాలన్న ఆలోచనలో అభిజిత్ ఉన్నారు.

కుర్చీ తాత మృతి
TG· 21 May 2026

కుర్చీ తాత మృతి

కుర్చీ మడతపెట్టి సాంగ్ ఫేమ్ తాత మహమ్మద్ పాషా మృతి చెందారు. హైదరాబాద్ కృష్ణా నగర్ లో నివాసం ఉంటున్న ఆయన నిన్న కృష్ణకాంత్ పార్క్ లో వాకింగ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తీసుకుని వెళ్లేసరికి ఆయన మరణించారు. వడదెబ్బ తగలడంతో ఆయన మృతి చెందినట్టు సన్నిహితులు చెబుతున్నారు. ఆ కుర్చీని మడత పెట్టి అన్న డైలాగ్ తో SMలో ఫేమస్ అయిన పాషా గుంటూరు కారం మూవీలో మహేష్ తో కలిసి స్టెప్పులేశారు.

60 రోజుల్లో ఉద్యోగం వెతుక్కోండి.. లేదంటే అమెరికా వదిలిపోండి!
General· 21 May 2026

60 రోజుల్లో ఉద్యోగం వెతుక్కోండి.. లేదంటే అమెరికా వదిలిపోండి!

మెటా, అమెజాన్, ఒరాకిల్ వంటి టెక్ దిగ్గజాలలో జరుగుతున్న లేఆఫ్స్ అమెరికాలోని భారతీయ ఐటీ ఉద్యోగులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. H-1B వీసా నిబంధనల ప్రకారం, ఉద్యోగం కోల్పోయిన విదేశీయులు కేవలం 60 రోజుల్లోగా కొత్త కంపెనీలో వీసా స్పాన్సర్‌షిప్ సాధించాలి, లేదంటే దేశం విడిచి వెళ్ళక తప్పదు. ఈ ఏడాది ఇప్పటికే 1.1 లక్షల మందికి పైగా టెక్ ఉద్యోగాలు కోల్పోగా, అందులో అత్యధికులు భారతీయులే. దశాబ్దాలుగా అక్కడే ఇళ్లు కొని, పిల్లలను చదివిస్తూ గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. ఇప్పుడు వారంతా కెనడా, యూరప్ వైపు చూస్తున్నారు.