Latest

రెండోసారి MLAగా మాజీ క్రికెటర్!
పశ్చిమ బెంగాల్ ఎలెక్షన్స్ లో BJP భారీ విజయం సాధించగా, టీమిండియా మాజీ క్రికెటర్ అశోక్ దిండా మోయ్నా constituency నుండి వరుసగా 2nd టైమ్ MLA గా గెలిచారు. తన ప్రత్యర్థిపై 14 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచారు. 2021లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చి పాలిటిక్స్‌లోకి వచ్చిన అశోక్ దిండా, ఈసారి బెంగాల్ BJP గవర్నమెంట్ లో Minister అయ్యే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. IPL lo కోల్‌కతా (KKR) తరఫున ఆడిన దిండాకు ఫ్యాన్స్ congratulation చెబుతున్నారు

మమతా బెనర్జీ- 'ఇండి' కూటమిలో కొనసాగుత!
బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ కుట్రలతోనే గెలిచిందని మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు. ఈసీ (EC) బీజేపీకి ఏజెంట్‌గా మారిందని, 100 పైగా సీట్లను లూటీ చేశారని ఆరోపించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని, తనను ప్లాన్ ప్రకారం ఓడించారని మండిపడ్డారు. తను ఓడిపోలేదని, అందుకే Resignation చేసే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చారు. 'ఇండి' కూటమి నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తనతో మాట్లాడారని, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, హేమంత్ సోరెన్ తనకు సపోర్ట్‌గా ఉన్నారని, 'ఇండి' కూటమిలోనే తాను కొనసాగుతానని కూడా స్పష్టం చేశారు.
రోడ్డు లేక దారిలోనే మహిళ ప్రసవం!
శ్రీకాకుళం జిల్లా హీరమండలం మండలంలో దారుణం జరిగింది. లింగాపురం గ్రామానికి చెందిన సునీత అనే గిరిజన మహిళకు పురిటి నొప్పులు రావడంతో, సరైన రోడ్డు సౌకర్యం లేక గ్రామస్థులు ఆమెను 2 కిలోమీటర్స్ వరకు Doli లో మోసుకెళ్లారు. ఆ తర్వాత ఆటోలో పాతపట్నం హాస్పిటల్‌కు తీసుకెళ్తుండగా, ఆమె ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇప్పటికీ గిరిజన గ్రామాల్లో సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంపై జనం ఫైర్ అవుతున్నారు.

గవర్నర్ ను కలసిన విజయ్... రెండు వారాల గడువు కోరిన తలపతి
తమిళనాడు గవర్నర్ ను టీవీకే పార్టీ అధినేత విజయ్ మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సుముఖంగా ఉన్నానని, రెండు వారాల గడువు కావాలని కోరారు. ఇప్పటికే కాంగ్రెస్ విజయ్ తో టచ్ లోకి వచ్చింది. డీఎంకె నేతలు కూడా కొందరు విజయ్ వైపు మొగ్గేందుకు సుముఖంగా ఉన్నారు. ఇవాళ పార్టీ అంతర్గత సమావేశం ఏర్పాటు చేసినా కొందరు ఎమ్మెల్యేలు మీటింగ్ కు దూరంగా ఉన్నారు. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ కు ప్రభుత్వ ఏర్పాటుకు పది సీట్లు అవసరమవుతాయి.
కొత్త ఎమ్మెల్యేలతో విజయ్ మాటా మంతి..
టీవీకే కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను కలుసుకుని విజయ్ అభింనందనలు చెబుతున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో అదే..

దక్షిణాది మొత్తం మహిళలకు ఫ్రీ బస్సులే !!
దక్షిణాది రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఇప్పుడు అతిపెద్ద పొలిటికల్ అస్త్రంగా మారిపోయింది. కర్ణాటకలో శక్తి, తెలంగాణలో మహాలక్ష్మి, ఏపీలో స్త్రీ శక్తి పేరుతో ఈ స్కీమ్స్ రన్ అవుతున్నాయి. తాజాగాకేరళలో కాంగ్రెస్ ఇందిర గ్యారంటీ పేరుతో తమిళనాడులో వెట్రి పయనం పేరుతో టీవీకే పార్టీ ఉచిత బస్సు ప్రయాణం హామీలిచ్చారు. ఇప్పుడు అక్కడ కూడా స్కీములు అమలవడం మొదలైతే సౌత్ స్టేట్స్ కి ఉచిత బస్సు ప్రయాణం అనేది ఇక భవిష్యత్తులో కూడా అస్త్రంగా మిగిలిపోతుందా?

కాంగ్రెస్ నేతలపై రాహుల్ గాంధీ ఫైర్!
పశ్చిమ బెంగాల్‌లో TMC ఓడిపోయిందని కాంగ్రెస్ నేతలు celebrate చేసుకోవడం పై రాహుల్ గాంధీకి serious అయ్యారు. ఇది TMC ఓటమి కాదు, BJP దేశ Democracyని పాడు చేస్తోందని ఆయన Serious అయ్యారు. మనలో మనకి గొడవలు ఉంటే అది బీజేపీకే Advantage అవుతుందని రాహుల్ హెచ్చరించారు. అందరూ కలిసి దేశాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.
వికెట్ తీసి "జై శ్రీరామ్" పేపర్ చూపించిన ముంబై బౌలర్!
లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్ రఘు శర్మ తన First IPL Wicket తీసి చాలా ఎమోషనల్ అయ్యాడు. వికెట్ తీశాక జేబులోంచి ఒక పేపర్ తీసి.. “రాధే రాధే.. గత 15 ఏళ్ల డ్రీం ఈరోజు నెరవేరింది. థాంక్యూ ముంబై ఇండియన్స్.. జై శ్రీరామ్” అని రాసి ఉన్న పేపర్ ని చూపించాడు. 33 ఏళ్ల వయసులో రఘుకు ఈ Chance దక్కింది. రఘు చేసిన ఈ Emotional Celebration వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ Viral అవుతోంది.
కోహ్లీ.. నాకు కాల్ చెయ్! యూట్యూబర్ ఐషోస్పీడ్ క్రేజీ ఛాలెంజ్!
వరల్డ్ ఫేమస్ యూట్యూబర్ ఐషోస్పీడ్ మరోసారి ఇంటర్నెట్‌లో సందడి చేశాడు. విరాట్ కోహ్లీకి వీరాభిమాని అయిన ఇతడు, రీసెంట్‌గా కరేబియన్ దీవుల్లో క్రికెట్ ఆడుతూ ఒక విచిత్రమైన బౌలింగ్ యాక్షన్‌తో వికెట్ పడగొట్టాడు. ఆ ఆనందంలో నేరుగా కోహ్లీకే సవాల్ విసిరాడు. "కోహ్లీ.. నాకు కాల్ చెయ్! ఐసీసీ, ముంబై ఇండియన్స్ కూడా నాకు కాల్ చేయాల్సిందే" అంటూ హల్చల్ చేశాడు. ప్రస్తుతం ఈ Funny వీడియో సోషల్ మీడియాలో ఫుల్ Viral అవుతోంది.

ఒకే ఒక్క ఓటు డీఎంకే మంత్రి కొంపముంచింది
మనం ఓటు వెయ్యకపోతే ఏమైందిలే ఒక్క ఓటే కదా అని అనుకోవడానికి లేదు. ఆ ఒక్క ఓటు తమిళనాడు మంత్రిని ఎన్నికల్లో ఓటమి పాలు చేసింది. తిరప్పత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన డీఎంకే మంత్రి కేఆర్ పెరియకరుప్పన్ కేవలం ఒక్క ఓటు తేడాతో అనూహ్యంగా పరాజయం పాలయ్యారు. ఆయనపై నటుడు విజయ్ స్థాపించినTVK అభ్యర్థి ఆర్. సీనివాస సేతుపతి ఈ చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నారు. సేతుపతికి 83,375 ఓట్లు వస్తే పెరియకరుప్పన్ కి ఒక్క ఓటు తక్కువగా 83,374 ఓట్లు పోలయ్యాయి.
మోదీ Teleprompter రికార్డు... బీజేపీ కార్యకర్తపై వేటు
ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల టైమ్ లో ఒక సభలో ప్రధాని మోదీ Tele prompter చూస్తూ ప్రసంగించడం కనిపిస్తుంది. అప్పుడే అక్కడే ఉన్న బీజేపీ కార్యకర్త ఒకరు మోదీని వీడియో తీస్తుంటే పొరపాటున Teleprompter కూడా రికార్డు అయింది. ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆ కార్యకర్తని పార్టీ సస్పెండ్ చేసింది. ఇది ఎక్కడ జరిగిందో ఇంకా తెలీలేదు. ప్రపంచ దేశాల నాయకులంతా కూడా టెలిప్రాంప్టర్ చూసే ప్రసంగాలు చేస్తారని, అందులో తప్పేముందని బీజేపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.

డొమస్టిక్ హెల్పర్ నుంచి అసెంబ్లీ వరకు..
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఒక అద్భుతం జరిగింది. ఒకప్పుడు నలుగురి ఇళ్లల్లో అంట్లు తోమి, బట్టలుతుకి జీవనం సాగించిన కలితా మాఝీ ఎన్నికల్లో గెలుపొందారు. Ausgram నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె తన ప్రత్యర్థి టీఎంసీ అభ్యర్థి శ్యామ్ ప్రసన్న లోహార్ పై 12 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బెంగాల్ ప్రజలు మార్పు కోరుకున్నారని చెప్పడానికి ఈమె గెలుపే నిదర్శనం.
ట్రైన్‌లో వేధింపులు.. వీడియో తీస్తుంటే అమ్మాయిపై దాడి!
ట్రైన్ లో జర్నీ చేస్తున్న ఒక అమ్మాయి పట్ల ఒక వ్యక్తి చాలా అసభ్యకరమైన సైగలతో వేధించాడు. ఆ అమ్మాయి ధైర్యంగా అతని behavior ని తన Phone లో record చేయడం స్టార్ట్ చేసింది. దాంతో అతను రెచ్చిపోయి ఆమెపై దాడి చేసి కొట్టడం స్టార్ట్ చేశాడు. ఈ షాకింగ్ incident కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో Viral అవుతోంది. women safetyపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విజయ్ వీడియో వైరల్- 234 సీట్లలో నేనే క్యాండిడేట్!
తమిళనాడు పాలిటిక్స్‌లో దళపతి విజయ్ ఒక Massive Record క్రియేట్ చేశారు. మొత్తం 234 నియోజకవర్గాల్లోనూ వేరే వాళ్ల పేర్లు కాకుండా, అన్ని చోట్లా తానే స్వయంగా అభ్యర్థిగా తన పేరును ప్రకటించుకుని అందరినీ Surprise చేశారు. పార్టీ గెలవడంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ Viral అవుతోంది.
బీజేపీ కార్యకర్తకు చుక్కలు చూపించిన అమ్మాయి!
వెస్ట్ బెంగాల్‌లో ఒక అమ్మాయి "BJPకి ఓటు వేయొద్దు" అని Facebook లో పోస్ట్ పెడితే, ఒక బీజేపీ కార్యకర్త ఆమెను Rape చేస్తానని బెదిరించాడు. అయితే ఆ అమ్మాయి అస్సలు Panic అవ్వకుండా, డైరెక్ట్‌గా అతని ఇంటికే వెళ్లి "ఏం చేస్తావో చెయ్ చూద్దాం" అంటూ Challenge చేసింది. ఆమెను ఇంటిముందు చూసి షాక్ అయిన ఆ వ్యక్తి, వెంటనే అందరి ముందు సారీ చెప్పాడు.

విజయ్ ముందున్న సవాళ్ళు ఇవే!
విజయ్ elections టైమ్ లో మేనిఫెస్టోలో ప్రకటించిన ఆ అదిరిపోయే పథకాలు ఇవే చూడండి.

అంతా మోదీమయం
పశ్చిమ బెంగాల్ లో విజయం దిశగా దూసుకుపోతున్న బీజేపీ దేశమంతా మోదీమయంగా మారిందని సంబరాలు చేసుకుంటోంది. దేశం ఎలా కాషాయం రంగులోకి మారిందో తన ఎక్స్ అకౌంట్ లో ఒక మ్యాప్ రిలీజ్ చేసింది. నార్త్ నుంచి నార్త్ ఈస్ట్ వరకు కాషాయం పార్టీదే హవా అని చెప్పింది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా పని చేస్తామని చెప్పుకుంది.
ఒంటరిగా పోటీ చేస్తే విజయ్ కింగ్ .. PK జోస్యం వీడియో వైరల్!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (PK) గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. నటుడు విజయ్ ఒంటరిగా పోటీ చేస్తే ఆయన గెలవడానికి ఛాన్స్ లు చాలా ఎక్కువని పీకే ఇక ఇంటర్వ్యూలో చెప్పారు. ఏ విధంగా అలా చెప్పగలరు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఈ వీడియో దాచి ఉంచండి. టీవీకే ఒంటరిగా బరిలో దిగితే రిజల్ల్ట్ ఎలా ఉంటుందో మీరే చూడండి అని చెప్పారు. ఇప్పుడు ఫలితాలు అదే విధంగా రావడంతో పీకే వీడియో SMలో వైరల్ అవుతోంది.

కొళత్తూరులో సీఎం స్టాలిన్ ఓటమి
తమిళనాడు సీఎం స్టాలిన్ కు తగిలింది. కొళత్తూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆయన TVK అభ్యర్థి V.S.బాబు చేతిలో ఓడిపోయారు. డీఎంకే పార్టీకి నిజంగా ఇది పెద్ద షాక్. మూడో స్థానంలోకి పడిపోయిన ఆ పార్టీ ప్రతిపక్ష హోదాలో కూడా లేదు. ఇప్పుడు స్టాలిన్ కూడా ఓడిపోయారు. చెపాక్ నుంచి పోటీ పడిన ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ విజయం దోబూచులాడుతోంది.

తమిళనాడులో TVK విజయం వెనుక VMI రోల్
TVK విజయానికి ముందే తమిళనాడులో విజయ్ ఫ్యాన్ క్లబ్ విజయ్ మక్కల్ ఇయక్కమ్ (VMI) జనానికి దగ్గరైంది. 2009లో స్టార్ట్ అయిన ఫ్యాన్ క్లబ్ కి లక్ష బ్రాంచీలున్నాయి. పార్టీ పెట్టక ముందే ప్రకృతి విపత్తుల సమయంలో VMI కార్యకర్తలు సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. జల్లికట్టుని బ్యాన్ చేయాలనే ఉద్యమాన్నే తెర వెనకుండి నడిపించారు ఎడ్యుకేషన్ అవార్డ్స్, నిరుపేద విద్యార్థులకు చదువు, ఇతర సంక్షేమ కార్యక్రమాలెన్నో VMIతో చేయించి కష్టాల్లో ఉన్నప్పుడు విజయ్ తోడుగా ఉంటాడన్న నమ్మకాన్ని కలిగించారు. 2021 లోకల్ బాడీ ఎన్నికల్లో VMI బలపరిచిన అభ్యర్థులు 169 సీట్లలో పోటీ చేసి 127 సీట్లు గెలిచారంటే విజయ్ పవరేంటో తెలుస్తుంది.
విజయ్ ను చూసి కార్యకర్తల కేరింతలు !
విజయ్ఇంటి ముందు సంబరాలు మొదలైపోయాయి.టీవీకే కార్యకర్తల సంతోషం పీక్స్ లో ఉంది. కార్యకర్తలంతా ఉత్సాహంగా కేరింతలు కొడుతుంటే.. నినాదాలు చేస్తుంటే ఎట్టకేలకు తలపతి బయటకు వచ్చాడు.. ఉత్సాహంగా అందరికీ నమస్కరించి హాయ్ చెప్పాడు.. దాంతో ఆ ప్రాంతం అరుపులు, నినాదాలతో మార్మోగింది.