రోడ్డు లేక దారిలోనే మహిళ ప్రసవం!
శ్రీకాకుళం జిల్లా హీరమండలం మండలంలో దారుణం జరిగింది. లింగాపురం గ్రామానికి చెందిన సునీత అనే గిరిజన మహిళకు పురిటి నొప్పులు రావడంతో, సరైన రోడ్డు సౌకర్యం లేక గ్రామస్థులు ఆమెను 2 కిలోమీటర్స్ వరకు Doli లో మోసుకెళ్లారు. ఆ తర్వాత ఆటోలో పాతపట్నం హాస్పిటల్‌కు తీసుకెళ్తుండగా, ఆమె ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇప్పటికీ గిరిజన గ్రామాల్లో సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంపై జనం ఫైర్ అవుతున్నారు.



