Latest

ఆర్టీసీలో మరో డ్రైవర్ ఆత్మహత్యా యత్నం !
ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాలుస్తోంది. తాజాగా భూపాలపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన రవీందర్ అనే డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేశాడు.పురుగు మందు తాగిన అతడిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. దీనితో ఇప్పటి వరకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్టీసీ కార్మికుల సంఖ్య నలుగురికి చేరుకుంది.

ఎండల ఎఫెక్ట్... గ్రిడ్ లపై తీవ్రమైన స్ట్రెస్
ఈఏడాది కరెంట్ వాడకం సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తోంది.. సమ్మర్ లో ప్రతీ ఏటా విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతుంది. మే 2024లో నమోదైన 250 GW దేశ చరిత్రలోనే ఆల్-టైమ్ రికార్డు. కానీ ఈ ఏడాది ఏప్రిల్ లోనే రికార్డు స్థాయిలో 240 GW కి చేరుకుంది. సమ్మర్ హీట్ వేవ్ తీవ్రంగా ఉండటం వల్ల ఆ డిమాండ్ 270 GW కి చేరుకోవచ్చని విద్యుత్ శాఖ అంచనా. కరెంటును పొదుపుగా వాడాలని, మిస్ యూజ్ చేయద్దని విద్యుత్ శాఖ ఇప్పటికే పిలుపునిచ్చింది.

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు !
భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) ఏప్రిల్ 24, 2026 నుండి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (PPBL) లైసెన్స్‌ను రద్దు చేసింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కింద తీసుకున్న ఈ చర్యతో, పేటీఎం ఇకపై దేశంలో బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించలేదు. బ్యాంకును పూర్తిగా మూసివేసే ప్రక్రియ కోసం ఆర్బీఐ త్వరలో హైకోర్టుకి వెళ్లనుంది. అటు డిపాజిటర్లకు, ఇటు బ్యాంకుకు ఏ విధమైన సేఫ్టీ లేకుండానే బ్యాంకు నిర్వహణ బీ ఆర్క్ట్ యాక్ట్ ను ఉల్లంఘించడమేనని ఆర్ బీఐ ప్రకటించింది.

రాజ్యసభలో అతిపెద్ద కూటమిగా ఎన్డీఏ !!
ఆప్‌కు చెందిన ఏడుగురు ఎంపీలు బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించడంతో రాజ్య సభలో ఎన్డీఏ అతిపెద్ద కూటమిగా నిలిచింది. రాజ్యసభలో మొత్తం 245 సీట్లకు గాను రాష్ట్రాలనుంచి 233 మంది ఎంపీలు ఉన్నారు. ఇందులో బీజేపికి 106 సీట్లుఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఏడుగురు ఆప్ ఎంపీల చేరికతో ఈ నెంబర్ 113కు పెరిగింది. మిత్రపక్ష ఎంపీలతో కలసి బీజేపికి ఇప్పుడు 125 సీట్లు ఉన్నాయి.

ఇండియాను వణికిస్తున్న జోంబీ డ్రగ్స్ ఫీవర్ !!
దేశంలో 'జోంబీ డ్రగ్' వ్యాప్తి చెందుతోందనే వార్తలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. చండీగఢ్, లూథియానా, కర్ణాటక, మహారాష్ట్ర, యూపీ, బీహార్లలో యువత వింతగా, కదలకుండా నిలబడి ఉన్న వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే, దీనికి జైలజైన్ (Xylazine) కారణమని ప్రచారం జరుగుతున్నా, అధికారులు దీనిని ఇంకా ధృవీకరించలేదు. పాత డ్రగ్స్ వాడకం లేదా మానసిక సమస్యల వల్ల ఇలా జరిగి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ డ్రగ్ తీసుకున్నవారు గంటల తరబడి ఒకే పొజిషన్ లో కదలకుండా ఉండిపోతారు. సాధారణంగా జంతువులకు సర్జరీలు చేసేటప్పుడు ఈ మందు వాడతారు.

అప్పు ఇస్తున్నారా? ఈ చిన్న పేపర్ లేకపోతే మీ మనీకి రిస్క్ బాస్!
మీ ఫ్రెండ్ కో లేదా తెలిసిన వారికో అప్పు ఇచ్చేటప్పుడు కేవలం మాట మీద నమ్మకంతో కాకుండా ప్రామిసరీ నోట్ రాయించుకోవడం చాలా ముఖ్యం. ఇందులో 1. అప్పు తీసుకునే వ్యక్తి వివరాలు 2. తీసుకున్న అమౌంట్ 3. వడ్డీ రేటు 4. తిరిగి ఇచ్చే డేట్ స్పష్టంగా అంకెల్లోనూ, అక్షరాల్లోనూ రాయాలి. ముఖ్యంగా నోటుపై రెవెన్యూ స్టాంప్ అంటించి సంతకం చేయించుకోవాలి. అలాగే ఇద్దరితో సాక్షి సంతకాలు తప్పనిసరి. ఇలా లీగల్ గైడ్‌లైన్స్ ఫాలో అయితే మీరు అప్పిచ్చే డబ్బుకు పూర్తి భరోసా ఉంటుంది.

రాఘవ్ చడ్డా రిసైన్ పై.. అరవింద్ కేజ్రీవాల్ ఫస్ట్ రియాక్షన్!
ఆమ్ ఆద్మీ పార్టీ కి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఎంపీ రాఘవ్ చడ్డాతో సహా ఏడుగురు ఎంపీలు పార్టీకి రిసైన్ చేసి BJPలో జాయిన్ ఔతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. దీనిపై అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. బీజేపీ పంజాబీలను మోసం చేసిందని ఎక్స్ లో పోస్టు చేశారు. Operation Lotus లో భాగంగానే ED, CBI లతో భయపెట్టి తమ లీడర్ లను లాక్కుంటున్నారని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ చర్య ఇప్పుడు నేషనల్ పోలిటిక్స్ లో హాట్ టాపిక్‌గా మారింది.

ఫిరాయింపు గురించి కేజ్రీవాల్ కు ముందే తెలుసా?
ఏడుగురు ఆప్ ఎంపీల ఎగ్జిట్ గురించి కేజ్రీవాల్ కు ముందే తెలిసినట్లుంది. రాఘవ్ చద్దా అనౌన్స్ మెంట్ కు కొన్ని గంటల ముందే కేజ్రీవాల్ తాను ప్రభుత్వం కేటాయించిన గవర్నమెంట్ బంగ్లాకు మారినట్లు ఎక్స్ లో పోస్ట్ చేశారు. కేజ్రీవాల్ ఇప్పటి వరకూ ఎంపీ అశోక్ మిట్టల్ కు ఫిరోజ్ షా మార్గ్ లో కేటాయించిన బంగ్లాలో ఉంటూ వచ్చారు. అయితే ఫిరాయింపు విషయం ముందే లీక్ అయి ఉండొచ్చని అందుకే తాను బంగ్లా ఖాళీ చేసినట్లు కేజ్రీవాల్ ప్రకటించారని అంటున్నారు.అశోక్ మిట్టల్ రాఘవ్ చద్దా వెంట బీజేపి లోకి ఫిరాయించారు.

'ఘోస్ట్ సైకిల్' చూశారా ఎప్పుడైనా !
గుజరాత్‌కు చెందిన శివమ్ మౌర్య అనే వ్యక్తి 'ఘోస్ట్ సైకిల్'ను తయారు చేసి అందరినీ షాక్ చేశాడు. ఓన్లీ 35 వేల ఖర్చుతో AI టెక్నాలజీని వాడి దీనిని తయారు చేశాడు. ఈ సైకిల్ తనంతట తానుగా బ్యాలెన్స్ చేసుకుంటూ, అడ్డంకులను గుర్తిస్తూ ముందుకు వెళ్తుంది. దీనిని smartphone లేదా Remote తో కూడా కంట్రోల్ చేయవచ్చు. సైకిల్ వెళ్తుంటే ఎవరో అదృశ్య వ్యక్తి తొక్కుతున్నట్లుగా కనిపించడం దీని స్పెషాలిటీ.

భార్య టార్చర్ ను సీక్రెట్ గా రికార్డ్ చేసిన బాధితుడు!
భార్యలని హింసించే భర్తలని చూశాం. కానీ ఓ భార్య తన భర్తను రెండేళ్లుగా హింసిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ భార్యా బాధితుడు తాను అనుభవిస్తున్న టార్చర్ ను తన లాప్ టాప్ లో సీక్రెట్ గా రికార్డు చేయడంతో ఇది బయటపడింది. అందులో భార్య అతడిని కొట్టడం, తిట్టడం, కాలితో తన్నడం లాంటి విజువల్స్ ఉన్నాయి. కానీ ఈ వీడియో ఎక్కడది? ఇందులో ఉన్న వారెవరు అన్న డిటైల్స్ మాత్రం లేవు. విశాల్ మాల్వి అనే వ్యక్తి షేర్ చేసినట్లుగా ఉంది. అందుకే పెళ్లికి ముందు రెండుసార్లు ఆలోచించుకోండి బ్రో అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ట్రైన్ మిస్ అయితే అదే టికెట్‌తో మరో ట్రైన్లో వెళ్లొచ్చా?
చాలామందికి ఉండే డౌట్ ఇది. రైల్వే రూల్స్ ప్రకారం, మీరు ఒకసారి రిసర్వ్డ్ టికెట్ తీసుకున్నాక ట్రైన్ మిస్ అయితే, అదే టికెట్‌తో మరో ట్రైన్లో జర్నీ చేయడానికి ఛాన్స్ ఉండదు. అలా చేస్తే టికెట్ చెకింగ్ సిబ్బంది మీకు భారీగా ఫైన్ వేస్తారు. ఓన్లీ జనరల్ టికెట్ విషయంలో మాత్రమే కొన్ని Restrictions ఉంటాయి. కాబట్టి, ట్రైన్ మిస్ అయితే కొత్త టికెట్ తీసుకోవడం లేదా చట్టపరమైన ఇబ్బందులు కలగకుండా చూసుకోవడం మంచిది.

బెంగాల్, తమిళనాడులపై ఇంటర్నేషనల్ బెట్టింగ్ !!
2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై అంతర్జాతీయంగా బెట్టింగ్ జోరందుకుంది. అమెరికాకు చెందిన 'పాలీమార్కెట్' వేదికగా ఇప్పటికే 2 మిలియన్ డాలర్ల పైగా పందాలు కాశారు. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం బీజేపీకి 52%, టీఎంసీకి 47% గెలుపు అవకాశాలు ఉన్నట్లు పందెం రాయుళ్లు అంచనా వేస్తున్నారు. భారతీయ చట్టాల ప్రకారం ఈ సైట్లు నిషిద్ధమైనప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఈ ఎన్నికల ఫలితాలపై భారీగా పెట్టుబడులు రావడం విశేషం

నార్వేలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ !
పదహారేళ్ల లోపు పిల్లల్ని సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని నార్వే ప్రభుత్వం నిర్ణయించింది. సోషల్ మీడియాలో వారు పార్టిసిపేట్ చేయకుండా ఏజ్ లిమిట్ వెరిఫికేషన్ చేసే అవకాశాన్ని పరిశీలించమని టెక్ కంపెనీలను కోరింది. ఆస్ట్రేలియాను చూసి స్ఫూర్తి పొందిన నార్వే పీఎం స్టోరే పిల్లలను డిజిటల్ మీడియాకు దూరంగా ఉంచి స్క్రీన్ ఫ్రీ బాల్యం వారికి అందించాలని ఆలోచిస్తున్నారు. టిక్ టాక్, ఇన్ స్టా గ్రామ్ లను కూడా ఈ బ్యాన్డ్ లిస్టులో చేరుస్తున్నారు. దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు.

అహంకారంపై పూరి జగన్నాథ్ హాట్ కామెంట్స్!
డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన Puri Musings లో 'అహంకారం' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. సక్సెస్ రాగానే హ్యూమన్ బిహేవియర్ చేంజ్ ఔతుందని, అది అహంకారమని చుట్టూ ఉన్న వాళ్లకు తెలుస్తుంది కానీ చేసేవాడికి మాత్రం అది Self-Confidence లా అనిపిస్తుందని అన్నారు. అహంకారం వల్ల రిలేషన్షిప్స్ దెబ్బతింటాయని, ఎదగాలంటే Humble గా ఉండటం ఇంపార్టెంట్ అని చెప్పారు. అహంకారి పక్కన ఉండేవారు ఫేస్ మీదే తిట్టకపోయినా, వారు నాశనం అవ్వాలని కోరుకుంటారని పూరి హెచ్చరించారు.

బీజెపిలోకి AAP ఫిరాయింపు దార్లు వీరే !!
ఆప్ నుంచి ఏడుగురు ఎంపీలు బీజేపిలో చేరుతున్నారు. వారెవరెవరంటే రాఘవ్ చద్దా, హర్భజన్ సింగ్, రాజీందర్ గుప్తా, విక్రమ్ సహనీ,స్వాతీ మలివాల్, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్. వీరంతా ఆప్ ఎంపీలే.. పార్టీ ఫిరాయింపు చట్టం వర్తించకుండా ఉండాలంటే మూడింటా రెండొంతుల మంది పార్టీ మారాలి. ఆప్ కు రాజ్యసభలో పది మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో ఏడుగురు పంజాబ్ నుంచి కాగా ముగ్గురు ఢిల్లీ నుంచి ఎంపికయ్యారు. ఇక సంత్ బల్ బీర్ సింగ్ సీచేవాల్, సంజయ్ సింగ్, ఎన్ డి గుప్తా మాత్రమే ఆప్ కు మిగిలిన రాజ్య సభ ఎంపీలు

పంజాబ్ ను బీజేపి మోసగించింది-అరవింద్
ఆప్ ఎంపీల ఫిరాయింపుపై ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. బీజేపి మళ్లీ పంజాబ్ ప్రజలను మోసం చేసిందని అన్నారు. వాస్తవానికి రాఘవ్ చద్దా కొంత కాలంగా ప్రధాని మోడీని గానీ, బీజేపిని గానీ విమర్శించడం మానేశారు. సొంత పార్టీ నేతలు ఈ విషయంలో అనేక సార్లు రాఘవ్ చద్దాను తప్పుబట్టారు. కేంద్ర మంత్రి పదవి కోసమే చద్దా బీజేపి పట్ల మెతక వైఖరితో ఉంటున్నారని విమర్శించారు. ఇప్పుడు ఏకంగా ఏడుగురు ఎంపీలతో కలిసి పార్టీ మారడం ఆమ్ ఆద్మీ పార్టీకి ఊహించని షాక్.

రంగు తగ్గుతోందనే గోల్ఫ్ మానేశా ః రకుల్
నటి రకుల్ ప్రీత్ సింగ్ ఓ ఇంట్రెస్టింగ్ మేటర్ షేర్ చేశారు. చిన్నప్పటినుంచి తనకు గోల్ఫ్ ఆడటం ఇష్టమని, కానీ ఎండలో గంటల తరబడి ఆడటం వల్ల తన శరీరం రంగు కోల్పోతోందని అందువల్ల ఆడటం మానేశాననీ తెలిపారు. రకుల్ తన10వ ఏట నుంచే గోల్ఫ్ ఆడుతోంది. ఈమధ్యనే పెళ్లి అయ్యాక సినిమాల జోరు తగ్గించిన ఈ నటిఎక్కువ బాలీవుడ్ మూవీస్ నే ఎంచుకుంటోంది.

ఆమ్ ఆద్మీ పార్టీని BJPలో కలిపేసిన రాఘవ్ చెద్దా
ఆమ్ ఆద్మీ పార్టీకి ఎంపీ రాఘవ చద్దా షాకిచ్చారు. చెద్దా సహా ఏడుగురు ఎంపీలు కలిసి రాజ్యసభలో ఆప్ ని బీజేపీలో మర్జ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మధ్యే ఆప్ ఆయన్ను RS డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా తొలగించాక చద్దా తిరుగుబాటు చేస్తూ వస్తున్నారు. రాజ్యసభలో ఆప్ 2/3 ఎంపీలు బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నాం, RSలో ఆప్ ని బీజేపీలో విలీనం చేస్తున్నాం అని ప్రకటించారు. Chairmen కి లెటర్ ఇచ్చారు. 15 ఏళ్ల పాటు తాను ఆమ్ ఆద్మీ పార్టీ కోసం కష్టపడ్డాననీ, పార్టీ అసలు ఆశయాలకు దూరం జరిగిపోవడంతో ఇకపై మోదీ, అమిత్ షాలతో కలిసి పని చేస్తా అని ప్రెస్ మీట్లో చెద్దా చెప్పారు.
ఎస్సీ ఎమ్మెల్యేలను తొక్కేస్తున్నారు: TDP MLA!
గంగాధర నెల్లూరు constituency TDP MLA థామస్ తమ సొంత పార్టీ నాయకత్వం పైనే హాట్ కామెంట్స్ చేశారు. SC MLAలను కొందరు టార్గెట్ చేస్తున్నారని, వారిపై వివక్ష చూపిస్తున్నారని ఫైర్ అయ్యాడు. గెలిపించేటప్పుడు SCలు కావాలి కానీ, రూలింగ్ లో ఉండకూడదా? మేము బానిసలుగా ఉండాలా? అంటూ నిలదీశారు. SC MLAలను తొక్కేయాలని చూడటం కరెక్ట్ కాదని, ఇలాంటి పద్ధతి మార్చుకోవాలని పార్టీ నాయకత్వాన్ని నిలదీశాడు. ఈ స్పీచ్ ఇప్పుడు ఏపీ పోలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఏపీలో మండుతున్న ఎండలు. పలు చోట్ల 45 డిగ్రీలు !
ఏపీలో ఎండలు దంచేస్తున్నాయి. పలుజిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి కొనసాగుతున్నాయి. పగటి పూట ఉదయం ఏడు గంటల నుంచే ఎండ ధాటి తీవ్రంగా ఉంటోంది. రాష్ట్రంలోని 151 మండలాలలొ ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. 62 మండలాల్లో తీవ్రమైన, 89 మండలాల్లో సాధారణ ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో అత్యధికంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ సూచిస్తోంది.

ఇష్టం లేని గర్భాన్ని బలవంతం చేయలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
15 ఏళ్ల బాలిక గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇష్టం లేకపోయినా గర్భాన్ని కొనసాగించాలని ఏ మహిళను బలవంతం చేయలేమని కోర్టు స్పష్టం చేసింది. ఇది మహిళల మెంటల్ హెల్త్ మరియు రాజ్యాంగ హక్కులకు సంబంధించిందని పేర్కొంది. నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ మహిళలకే ఉంటుందని, బలవంతం చేస్తే వారు ప్రాణాపాయం ఉన్నా సరే చట్టవిరుద్ధమైన అబార్షన్ సెంటర్స్ కు వెళ్లే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు హెచ్చరించింది.