Latest

CSK ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. కెప్టెన్ అవుట్!
ముంబై ఇండియన్స్ పై గ్రాండ్ విక్టరీ కొట్టిన CSKకి బిగ్ షాక్. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఫ్యామిలీ ఎమర్జెన్సీ రీసన్ తో సడన్‌గా టీమ్‌ను విడిచి పుణే వెళ్లారు. దీంతో సండే Gujarat Titansతో జరిగే మ్యాచ్‌లో ఆయన ఆడటం అనుమానంగా మారింది. ఒకవేళ రుతురాజ్ రాకపోతే, MS ధోనీ మళ్ళీ కెప్టెన్సీ చేసే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి.

బాయ్ ఫ్రెండ్ ఇంటికెళ్లి భార్య, బిడ్డను చంపేసింది!
ఛత్తీస్‌గఢ్‌లో దారుణం జరిగింది. బాయ్ ఫ్రెండ్ లలితేశ్ ఇంటికి వెళ్లిన సరోజిని అనే యువతి, అతని వైఫ్ రీనా, సన్ ఆదిత్యపై నైఫ్ తో ఎటాక్ చేసింది. ఈ ఎటాక్ లో వారిద్దరూ చనిపోయారు. తన డాటర్స్ ని కాపాడుకోవడానికి రీనా ప్రాణాలకు తెగించి పోరాడింది. టీవీ సౌండ్ పెంచి ఈ ఎటాక్ చేసింది సరోజి. విషయం తెల్సుకున్న పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

రాఘవ చద్దా డెసిషన్ జెన్ జీ కి నచ్చలేదా?
రాఘవ చద్దా బీజేపిలో చేరడాన్ని జెన్ జీ యువత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లుంది. ఆయన బీజేపి లో చేరిన మరుక్షణమే ఆయన ఇన్ స్టా గ్రామ్ ఫాలోయర్లు పది లక్షల మంది తగ్గిపోయారు. ఆయనకు ఇన్ స్టాలో 14.6 మిలియన్ల ఫాలోయర్లు ఉండగా, నిన్నటికి ఇవాల్టికి ఆ సంఖ్య 13.5 మిలియన్లకు పడిపోయింది. పార్లమెంటులో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రశ్నలు వేసే రాఘవ్ చద్దాకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. అయితే ఈమధ్య ఆయన బీజేపిని ఎక్కువగా తిట్టడం లేదు.

కేజ్రీవాల్‌పై స్వాతి మాలివాల్ ఫైర్.. నన్ను రౌడీలతో కొట్టించారు!
ఆమ్ ఆద్మీ పార్టీని వొదిలి BJPలో చేరిన ఎంపీ స్వాతి మాలివాల్, కేజ్రీవాల్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. తన సొంత ఇంట్లోనే తనను ఒక రౌడీ లతో కొట్టించారని, ఆ కంప్లయింట్ వెనక్కి తీసుకోవాలని స్ట్రెస్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ ఉమెన్ వ్యతిరేకి అని విమర్శిస్తూ.. prime minister మోదీ లీడర్షిప్ పై నమ్మకంతోనే బీజేపీలో చేరానని ఆమె స్పష్టం చేశారు.

రోహిత్ శర్మ కమ్ బ్యాక్: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు పండగే!
ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ మళ్ళీ గ్రౌండ్లోకి అడుగుపెట్టబోతున్నాడు. muscle injure కారణంగా గత కొన్ని మ్యాచులకు దూరమైన రోహిత్, ఏప్రిల్ 29న SRHతో జరిగే మ్యాచ్‌లో ఆడనున్నాడు. వరుస ఓటములతో సతమతమవుతున్న MI టీమ్‌కు రోహిత్ ఎంట్రీ బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. రోహిత్ ఎంట్రీతో ముంబై ఇండియన్స్ మళ్ళీ గెలిచే అవకాశాలు ఉండొచ్చు అని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

సమ్మర్లో వికారం, వాంతులా? ఇలా చేయండి!
ఎండల వల్ల Dehydration, వికారం, నీరసం వంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇలాంటప్పుడు ఒకేసారి ఎక్కువ వాటర్ తాగకుండా, కొద్దికొద్దిగా తాగుతూ బాడీని Hydrate చేయాలి. Coconut Water లేదా ORS తీసుకోవడం వల్ల బాడీకి ఎనర్జీ అందుతుంది. మసాలా ఫుడ్స్ కి దూరంగా ఉండి, గంజి లేదా అరటిపండు లాంటి నార్మల్ ఫుడ్ తీసుకోవాలి. ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకపోతే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి!

కవిత కొత్త పార్టీపై ఎంపీ అర్వింద్ షాకింగ్ కామెంట్స్!
కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై ఎంపీ ధర్మపురి అర్వింద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కవితకు BJP ఇప్పటికే రాజకీయ సమాధి కట్టిందని అంటూ. పిట్టల దొరను చూశాం, ఇప్పుడు ఈ "పిట్టల దొరసాని"ని చూస్తున్నామంటూ వెటకారంగా స్పందించారు. తెలంగాణ కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేశారని గుర్తు చేస్తూ, BRS లీడర్స్ పై హాట్ కామెంట్స్ చేశారు. ఈ పొలిటికల్ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Sugarcane Juice: ఈ 3 రకాల వ్యక్తులు అస్సలు తాగొద్దు!
సమ్మర్లో Sugarcane Juice తాగడం మంచిదే, కానీ అందరికీ కాదు! ఇందులో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉండటం వల్ల Diabetes ఉన్నవారు దూరంగా ఉండాలి. అలాగే weight loss అవ్వాలనుకునేవారు, digestion problems ఉన్నవారు కూడా జాగ్రత్త పడాలి. ఎనీ టైమ్ ఓన్లీ ఫ్రెష్ జ్యూస్ మాత్రమే తాగండి, emty stomachతో అస్సలు తాగకండి. ఓవర్ గా తాగితే హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు.

కవిత పార్టీ పేరుపై BRS షాకింగ్ పోస్ట్!
కవిత తన కొత్త పార్టీ పేరు ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS) అని అనౌన్స్ చేయగానే BRS పార్టీ నుంచి Response వచ్చింది. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అంటూ తన ఎక్స్ (X) అకౌంటు లో ఒక పవర్ ఫుల్ల్ పోస్ట్ పెట్టింది. కవిత పాత పార్టీ పేరునే కొంచెం అటు ఇటుగా వాడటంపై BRS ఇలా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఈ సోషల్ మీడియా వార్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

ఉప్పు ఎక్కువ తింటున్నారా? అయితే జాగ్రత్త!
ఫుడ్ లో సాల్ట్ ఎక్కువైతే బాడీలోని Calcium యూరిన్ ద్వారా బయటకు పోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల మీ Bones వీక్ అయ్యి, టీత్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. WHO ప్రకారం రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ సాల్ట్ తీసుకోవడమే హెల్తీ. అందుకే సాల్ట్ తగ్గించి.. మిల్క్, కర్ద్ వంటి Calcium Rich Food ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది.

ఈ దేశంలో ప్రతి నలుగురిలో ఒకరికి HIV!
దక్షిణాఫ్రికాలోని Eswatini అనే చిన్న దేశంలో HIV చాలా స్పీడ్ గా స్ప్రెడ్ ఔతుంది. అక్కడ ఉన్న ప్రతి నలుగురిలో ఒకరికి ఈ వైరస్ స్ప్రెడ్ అవ్వడం భయాందోళన కలిగిస్తోంది. మొత్తం 12 లక్షల పాపులేషన్ లో దాదాపు 3 లక్షల మంది దీని బారిన పడ్డారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఎయిడ్స్ కేసులు ఉన్న దేశంగా Eswatini నిలిచింది. ఈ Shocking న్యూస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది.

కవిత ఇచ్చిన ఆ 5 హామీలు ఇవే
తెలంగాణ రాష్ట్ర సేన (TRS) అధికారంలోకి వస్తే అయిదు అంశాలపైనే తమ పార్టీ పని చేస్తుందని కవిత అన్నారు. ఆవిర్భావ సభలో ఆమె ఇచ్చిన హామీలు ఏంటంటే.. 1. ఉచిత విద్య .. ప్రైవేటు స్కూళ్లలో కూడా ఉచిత విద్య 2. ఉచిత వైద్యం.. అందరికీ అన్ని ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం 3. వ్యవసాయం .. రైతే రాజు అన్న నినాదాన్ని నిజం చేస్తాం. 4 ఉపాధి .. 2 లక్షల నుంచి 2 కోట్ల వరకు యువతకి రుణాలు .. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో ఒకే నోటిఫికేషన్ తో 4 లక్షల ఉద్యోగాల కల్పన 5, సామాజిక న్యాయం .. బీసీలకు 50% రిజర్వేషన్ వచ్చేలా పోరాటం. అన్ని సామాజిక వర్గాలకి సమన్యాయం అందేలా చర్యలు
ప్రజా సమస్యలపై కవిత పాంచజన్యం
ప్రజా సమస్యలపై కవిత పాంచజన్యం పూరించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని అప్పుడు అయిదు అంశాలపై దృష్టి సారిస్తామన్నారు. తెలంగాణ తల్లిగా తాను ప్రజల జేబులు చూడనని, వారి కడుపు చూస్తానని కవిత పదే పదే చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి , సామాజిక న్యాయమే తమ పార్టీ ఎజెండా అన్నారు. ఆడపిల్లల భద్రతపై కూడా తాము కచ్చితంగా దృష్టి పెడతామని అన్నారు. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మూడు పార్టీలు తమకు ప్రత్యర్థులేనని వారిపైనే యుద్ధం చేస్తామని ప్రకటించారు.
కేసీఆర్ మన మనిషి కాదు : కవిత విమర్శలు
కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన కవిత బీఆర్ఎస్ పార్టీపైన, తండ్రి కేసీఆర్ పైనా విమర్శలు గుప్పించారు. మునీరాబాద్ సభలో మాట్లాడుతూ కేసీఆర్ రాజకీయ పరిణితి కోల్పోయారని అన్నారు. కేసీఆర్ మన మనిషి కాదు. ఆత్మలేని మరబొమ్మ. అందుకే నేను యుద్ధం చేస్తున్నాను. మన కేసీఆర్ అయి ఉంటే ఆయన పాలమూరు ప్రాజెక్టు కట్టించేవారు అని అన్నారు. అవినీతి చేసిన పందికొక్కుల్ని పక్కన పెట్టుకున్నారని విమర్శించారు.
కవిత కొత్త పార్టీ పేరు TRS
కవిత కొత్త పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన.. (TRS) ఒకప్పుడు తండ్రి కేసీఆర్ పార్టీ పేరు టీఆర్ఎస్ అని వచ్చేలా పేరు పెట్టి రాజకీయంగా ఒక పెద్ద ముందడుగు వేశారు. కవిత కొత్త పార్టీ పేరు ప్రకటించగానే కార్యకర్తలందరూ గట్టిగా అరుస్తూ సందడి చేశారు. రాష్ట్రానికి కాబోయే సీఎం కవితేనంటూ సీఎం సీఎం సీఎం అని అరుస్తూ కవితలో ఉత్సాహం నింపారు.
కొత్త పార్టీ ప్రకటనకు ముందు కవిత పూజలు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇవాళ కొత్త పార్టీ ప్రకటించనున్నారు. మునీరాబాద్ లో ఆవిర్భావ సభకు వెళ్లడానికి ముందు ఆమె తన నివాసంలో భర్తతో కలిసి పూజలు చేశారు. తనను ఆశీర్వదించడానికి వచ్చిన మహిళలతో కాసేపు ఆత్మీయంగా మాట్లాడారు.

భారత్ ఖజానా ఫుల్.. $700 బిలియన్లు దాటిన ఫారెక్స్ నిల్వలు!
భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు (Forex Reserves) సరికొత్త రికార్డును సృష్టించాయి. తాజా గణాంకాల ప్రకారం 703.3 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. మన ఖజానాలో బంగారం నిల్వలు కూడా భారీగా పెరిగి 122.1 బిలియన్ డాలర్లకు చేరడం విశేషం. గ్లోబల్ మార్కెట్లో అనిశ్చితి ఉన్నప్పటికీ, రూపాయి బలపడడానికి ఈ భారీ నిల్వలు ఆర్బీఐ (RBI)కి అతి పెద్ద ప్లస్ పాయింట్. భారత్ ఆర్థికంగా మరింత స్ట్రాంగ్‌గా మారుతుందనడానికి ఇదొక సంకేతం.

అమెరికాతో ఫేస్ టు ఫేస్ చర్చలుండవ్ : ఇరాన్
అమెరికాతో నేరుగా చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది. పాకిస్థాన్ ద్వారా సందేశాలు పంపాలని ఇరాన్ నిర్ణయించుకుంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఇస్లామబాద్ చేరుకున్నారు. కానీ ఆయన అమెరికా ప్రతినిధులతో ఫేస్ టు ఫేస్ చర్చించాలని అనుకోవడం లేదు. ఇరు దేశాలు పాక్ అధికారుల ద్వారా తమ సందేశాలు పంపుతారు. మరోవైపు అమెరికా తరఫున ట్రంప్ ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జేర్డ్ కుష్నర్ లు పాకిస్థాన్ కు వచ్చారు. ఈ చర్చల పురోగతిని బట్టి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వేన్స్ చర్చలకు వస్తారు.

3 ఏళ్లు H1B వీసాలకు బ్రేక్ ? వీసా విధానంలో భారీ మార్పులు
అమెరికా వెళ్లాలనుకునే ఇండియన్ టెక్కీలకు షాకింగ్ న్యూస్. ట్రంప్ సర్కార్ మూడేళ్లు H-1B వీసాల జారీని నిలిపివేసి భారీ మార్పులు చేపట్టడానికి సిద్ధమైంది. దీనికి సంబంధించి End H-1B Visa Abuse Act of 2026 రిపబ్లికన్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం మూడేళ్లు వీసాల జారీని నిలిపివేసి వీసా విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తారు. ఏడాదికి జారీ చేసే వీసాల సంఖ్యను 65,000 నుండి ఏకంగా 25,000కి తగ్గించనున్నారు. అంతేకాదు లాటరీ విధానానికి స్వస్తి పలికి ఏడాదికి కనీసం వేతనం 2 లక్షల డాలర్లు ఇచ్చే అత్యధిక కంపెనీలకే ప్రాధాన్యత ఇచ్చేలా రూల్స్ మారుస్తారు. ఈ బిల్లు చట్టమైతే తక్కువ ప్యాకేజీకి అమెరికా వెళ్లడం ఇంపాజిబుల్

ఆర్టీసీ విలీనానికి కమిటీ.. రోడ్డెక్కిన బస్సులు
ప్రయాణికుల ఇబ్బందులు తొలగిపోయాయి. ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. కార్మికుల జేఏసీతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. 11% ఫిట్ మెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై అధికారులు, కార్మిక సంఘాల నాయకులతో ఒక కమిటీ వేస్తామని అర్థరాత్రి దాటాక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. దీంతో సమ్మెకు తెరపడింది. ఇవాళ ఉదయం నుంచి యధావిధిగా బస్సులు నడుస్తున్నాయి.

ఢిల్లీ హంతకుడు ఆన్ లైన్ గేమ్స్ కి బానిస... డబ్బు కోసం హత్య !
ఢిల్లీలో ఐఆర్ఎస్ అధికారి కుమార్తెపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడికి సంబంధించి వింతైన వివరాలు వెలుగులోకి వచ్చాయి .రాహుల్ (23) 10వ తరగతిలో 73% మరియు 12వ తరగతిలో 90% మార్కులు సాధించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అతను ఆన్లైన్ గేమ్‌లకు బానిసయ్యాడని, వాటి కోసం ఇంటి సామాను అమ్మాడని వారు పేర్కొన్నారు. భారీ అప్పుల కారణంగా అతను ఢిల్లీకి వచ్చి, తన మాజీ యజమాని (IRS) కుమార్తెపై అత్యాచారం, హత్యకు పాల్పడి, నగదు, బంగారం దొంగిలించినట్లు సమాచారం..