ఐదేళ్ల బాలుడి నోట్లో గుచ్చుకున్న ఇనుప రాడ్

గుజరాత్‌లోని పాటాన్ జిల్లా షమీ తాలూకా వేద్ గ్రామంలో ఊహించని ప్రమాదం జరిగింది. ఐదేళ్ల బాలుడు తన ఇంటి దగ్గర ఆడుకుంటుండగా ఉన్నట్టుండి కిందపడిపోయాడు. ఆ టైంలో అక్కడున్న ఒక ఇనుప రాడ్ నేరుగా ఆ బాలుడి నోట్లో గుచ్చుకుని బయటకు వచ్చింది. బాలుడికి బాగా రక్తం పోవడంతో చికిత్స కోసం హాస్పిటల్‌కి తరలించారు. డాక్టర్లు ఆపరేషన్ చేసి రాడ్‌ను జాగ్రత్తగా బయటకు తీశారు. బాలుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.

