← Back to news

"సౌరవ్, అశుతోష్ వెనక కుట్ర": రత్న సింగ్

By Lokesh· 1h ago· X

CJP టాప్ లీడర్లు సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకాను విడుదల చెయ్యకుండా కావాలనే ఆలస్యం చేస్తున్నారని CJP లీగల్ హెడ్ రత్న సింగ్ ఆరోపించారు. వారికి రిలీజ్‌కి సంబంధించి ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు విచారణ జరుగుతుందని చెప్పినా, ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ సాయంత్రం 5 గంటల వరకు కోర్టులోకి రాలేదని ఆమె అన్నారు. అన్ని వివరాల పరిశీలనా పూర్తయినా, విడుదల చేయాలా వద్దా అనే అంశంపై వాదనలు వినలేదన్నారు. ఇదంతా కావాలని చేసినట్లు కనిపిస్తోందని ఆమె ఫైర్ అయ్యారు.

More in National