జువెలరీ షాపులో ఒక్కసారిగా మంటలు
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని విజయలక్ష్మి జువెలరీ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో షాపు చుట్టూ దట్టమైన పొగ వ్యాపించింది. సమాచారం అందగానే ఫైర్ సిబ్బంది అక్కడికి వచ్చి మంటలను ఆర్పేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. మంటలు రావడంతో చుట్టుపక్కల ఉన్నవారు ఆందోళనకు గురయ్యారు. అయితే, ఈ ప్రమాదంలో ఎంత నష్టం జరిగిందనే వివరాలు ఇంకా తెలియలేదు.


