ఉపాధి పనులకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన కూలీ

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం రామన్నపేటలో ఉపాధి హామీ పనులు చేస్తుండగా భగవాన్ దాస్ (52)కు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన అక్కడే కుప్పకూలిపోయాడు. ఇది చూసిన తోటి కూలీలు వెంటనే ఆయనను హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. రోజువారీ పనులకు వెళ్లిన భగవాన్ దాస్ ఇలా చనిపోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది.


