ACB వలలో చిక్కిన విద్యాశాఖ అధికారి

TG: ప్రైవేట్ కళాశాలకు అనుకూలంగా తనిఖీ నివేదిక ఇచ్చేందుకు రూ. 50 వేల లంచం డిమాండ్ చేసిన విద్యాశాఖ అధికారి గోవిందరామ్ ACBకి చిక్కారు. ఇప్పటికే రూ. 30 వేలు తీసుకున్న ఆయన.. మిగిలిన రూ. 20 వేల కోసం డిమాండ్ చేయడంతో బాధితులు ACBని ఆశ్రయించారు. ఇవాళ కలెక్టరేట్‌లోని ఇంటర్మీడియట్ విద్యాశాఖ కార్యాలయంలో రూ. 20 వేలు తీసుకుంటుండగా DSP సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



