← Back to news

రూ.18 బాటిల్ 25కు అమ్మాడు.. 7 లక్షల జరిమానా

By DK· 2h ago
రూ.18 బాటిల్ 25కు అమ్మాడు.. 7 లక్షల జరిమానా

AP: కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో వాటర్ బాటిల్‌ను MRP కంటే అధికధరకు విక్రయించిన దుకాణదారుడికి జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ రూ.7లక్షల జరిమానా విధించింది. ఫిబ్రవరి 22న పిఠాపురానికి చెందిన వెంకటేశ్వరరావు అన్నవరంలోని సత్యగిరిపై వాటర్‌బాటిల్ కొన్నాడు. రూ.18 MRP ఉండగా రూ.25కు విక్రయించడంతో ఆయన కమిషన్‌ను ఆశ్రయించారు. విచారణ అనంతరం అదనంగా వసూలుచేసిన రూ.7తోపాటు రూ.10వేల పరిహారం, రూ.5వేల కేసు ఖర్చులు, రూ.7 లక్షలు వినియోగదారుల సంక్షేమ నిధికి చెల్లించాలని కమిషన్ ఆదేశించింది.

More in AP