50 ఏళ్లుగా జనాదరణ పొందుతున్న నవల

కన్నడ రచయిత శివరామ కారంత్ రాసిన 1941లో రాసిన ‘మరళి మన్నిగె’ నవలను తెలుగు సాహితీవేత్త తిరుమల రామచంద్ర ‘మరల సేద్యానికి’ పేరుతో 1977లో తెలుగులోకి అనువదించారు. ఇందులోని కథ, కథనం, పాత్రల వల్ల 50 ఏళ్లుగా ఈ నవల జనాదరణ పొందుతోంది. పర్యావరణం, ప్రకృతి పరిరక్షణ, అర్థిక స్వావలంబన సాధించడం అవసరమని ఈ నవల చెప్తుంది. వ్యవసాయం వృథా అనే అభిప్రాయం పెరుగుతున్న కాలంలో 'మళ్లీ సేద్యానికి' తిరిగి వెళ్లమని చెప్తుంది ఈ నవల. దీని ధర 350 రూపాయలు. కొనే <a href="https://hyderabadbooktrust.com/products/marala-sedyaniki-sivaram-karanth?srsltid=AU7gw4X-p-p6OopKUoD_NYLVnmQk0JhxqsdjgeZqfdMpkcvzeiA_b3N7&sku_id=61266373">లింక్</a>.



