దసరాకు పల్లెబాట పట్టిన హైదరాబాదీలు

దసరా పండుగ కోసం హైదరాబాద్‌లో ఉంటున్న ప్రజలు సొంతూళ్లకు బయలుదేరడంతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, నేషనల్ హైవేస్ రద్దీగా మారాయి. ముఖ్యంగా హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్‌గేట్ వద్ద సాధారణంగా రోజుకు 38 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా, నిన్న ఈ సంఖ్య 51 వేలు దాటింది. రద్దీతో వెయ్యికి పైగా ప్రత్యేక బస్సులు నడిపినా, పల్లెలకు సరిపడా బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.



