Latest

పిల్లలు మొండిగా ప్రవర్తిస్తున్నారా? ఈ సింపుల్ ట్రిక్ వాడండి!
ఈ రోజుల్లో పిల్లలు మాట వినకపోతే వెంటనే కొట్టడం లేదా తిట్టడం చేస్తున్నారా? దీనివల్ల వాళ్లలో పట్టుదల మరింత పెరుగుతుంది. పిల్లలను మార్చడానికి సైకాలజిస్టులు 'పాజిటివ్ రీఇన్‌ఫోర్స్‌మెంట్' అనే ట్రిక్ చెబుతున్నారు. అంటే పిల్లలు తప్పు చేసినప్పుడు తిట్టడం కంటే, వాళ్లు ఏదైనా మంచి పని చేసినప్పుడు వెంటనే మెచ్చుకోవడం లేదా చిన్న గిఫ్ట్ ఇవ్వడం చేయాలి. ఇలా చేస్తే వాళ్లు మెప్పు కోసం మంచి పనులు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు.

గ్రూప్-1 పై అసెంబ్లీలో బాబు షాకింగ్ కామెంట్స్!
AP: గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్-1 పరీక్షలపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో గ్రూప్-1 లాంటి స్కామ్‌ను చూడలేదని అన్నారు. గత ప్రభుత్వ విధానాలతో ఎంతోమంది మెరిట్ విద్యార్థులు నష్టపోయారని పేర్కొన్నారు. 2019-2024 మధ్య ఒక్క టీచర్ నియామకం కూడా చేపట్టలేదని విమర్శించారు. YSRCP హయాంలో ఇంగ్లిష్ మీడియం పేరుతో ఎక్కువగా ప్రచారం చేసుకున్నారని, తన హయాంలోనే ఎక్కువగా టీచర్ నియామకాలు జరిగాయని చంద్రబాబు అన్నారు.
ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
TG: నిజామాబాద్ జిల్లా నందిపేట్‌లో సోమవారం నిర్వహించిన మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. MPDO కార్యాలయంలో MPDO బి.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజలు తమ సమస్యలపై అధికారులకు వినతులు అందజేశారు. భూ, రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్య, వ్యవసాయం, వైద్యం, గృహ నిర్మాణం, సంక్షేమం తదితర అంశాలపై ఫిర్యాదులు స్వీకరించారు. డిప్యూటీ తహసీల్దార్ అనంత లక్ష్మణ్‌తో పాటు వివిధ శాఖల అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.

పక్షుల సౌండ్స్ మనకు ఎందుకు నచ్చుతాయి?
జంతువులకు, పక్షులకు నచ్చే సౌండ్సే మనుషులకు కూడా బాగా నచ్చుతాయని సైన్స్ జర్నల్ కొత్త రీసెర్చ్ లో తేలింది. క్సాస్ టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన రిసెర్చర్ లోగన్ ఎస్ జేమ్స్ దాదాపు 4,000 మందిపై ఒక ఆన్‌లైన్ ప్రయోగం చేశారు.<br>కప్పలు, పక్షులు, కీటకాలు చేసే రకరకాల సౌండ్స్‌లో జంతువులకు ఏవైతే నచ్చుతాయో... మనుషులు కూడా 54శాతం టైమ్ అవే శబ్దాలను సెలెక్ట్ చేసుకుంటున్నారని తేలింది. జీవుల నర్వస్ సిస్టమ్‌లో (నాడీ వ్యవస్థలో) ఉన్న పోలికల వల్లే మనకు కూడా ఆ సౌండ్స్ నచ్చుతున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు
బిర్యానీ కోసం వచ్చి.. రెస్టారెంట్‌లో ఫర్నీచర్ ధ్వంసం
TG: వరంగల్ జిల్లా నర్సంపేటలో బిర్యానీ విషయంలో తలెత్తిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మద్యం మత్తులో MFC రెస్టారెంట్‌కు వచ్చిన ఆరుగురు యువకులు బిర్యానీ కావాలని కోరగా, అది అందుబాటులో లేదని యజమాని కుమారుడు చెప్పడంతో వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడ్డారు. రెస్టారెంట్‌లోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు క్యాష్ కౌంటర్‌లో ఉన్న కంప్యూటర్‌ను పగులగొట్టారు. వాటర్ బాటిళ్లతో సిబ్బందిపై దాడి చేయడంతో అక్కడ ఉన్న కస్టమర్లు భయంతో పరుగులు తీశారు. యజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

చరిత్రను మార్చిన పరాజితుల చరిత్ర
అమెరికన్ రచయిత అలెక్స్ హేలీ రాసిన ‘Roots’ నవల ఆఫ్రికన్-అమెరికన్ చరిత్రను ప్రపంచం ముందు కొత్త కోణంలో నిలబెట్టింది. 1976లో వెలువడిన ఈ నవల అతని పూర్వీకుల కథను చెప్తుంది. గాంబియా నుంచి 1750లో బలవంతంగా తీసుకువచ్చిన కుంటా కింటే అనే యువకుడు బానిసగా అమెరికాకు చేరుకున్నాడు. అతని కష్టాలు, బానిసత్వం, తర్వాత స్వేచ్ఛ కోసం పోరాటం..ఇవన్నీ హేలీ కుటుంబ చరిత్రగా మారాయి. ఈ పుస్తకాన్ని తెలుగులో ‘ఏడు తరాలు’ పేరుతో సహవాసి అనువాదం చేశారు. ఇంగ్లీషు పుస్తకం కొనేందుకు <a href="https://amzn.in/d/0bzqJmC5">లింక్</a>. తెలుగు పుస్తకం కొనేందుకు <a href="https://www.telugubooks.in/products/yedu-tharaalu?srsltid=AfmBOooKUyW6q1LqNLX2pxvxXAWxzI4SJjCudbe-mt9uSxZVjl-gXCyP">లింక్</a>.

పోలీసుల కారులో గంజాయి?
AP: అద్దంకి సమీపంలో బల్లికురవ ఎస్సై నాగరాజు, సంతమాగులూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు ప్రయాణిస్తున్న పోలీసుల కారు ఆటోను ఢీకొట్టింది. పోలీసుల కారులోని డిక్కీలో గంజాయి ఉన్నట్లు స్థానికులు గుర్తించినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అద్దంకి సీఐ ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానికులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్త నెలకొంది.

శాఖల నిర్లక్ష్యంతో ప్రజల ఇబ్బందులు
AP: గుడివాడ పట్టణం నుండి విజయవాడ వెళ్లే రోడ్డు మార్గంలో ఉన్న కల్వర్టు కూలిపోయి ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. 15 రోజుల క్రితం కూలిపోయిన కల్వర్టు తమ పరిధి కాదని ఆర్అండ్‌బి, తమ పరిధిలో లేదంటూ మునిసిపాలిటీ..ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డు మార్గం పూర్తిగా ఆగిపోయింది. నిత్యం గుడివాడ విజయవాడ నాన్ స్టాప్ బస్సులు, పలు గ్రామాలకు వెళ్లాల్సినటువంటి పల్లె వెలుగు బస్సులు పట్టణమంతా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో అక్రమాలపై సంతకాల సేకరణ
TG: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో జరిగిన అక్రమాలు, అర్హతలేని వ్యక్తులకు ఇళ్ల కేటాయింపుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మండల ప్రజలు సంతకాల సేకరణ చేపట్టారు. అనర్హులకు ఇళ్లు కేటాయించారనే ఆరోపణలపై విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని ప్రజలు కోరుతున్నారు. సేకరించిన సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు సమర్పించారు.

శ్రీశైలం జలాశయానికి పెరిగిన ప్రవాహం
AP: శ్రీశైలం జలాశయానికి జూరాల నుంచి 23,197 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 23,197 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 50,673 క్యూసెక్కులుగా ఉంది. జలాశయ నీటిమట్టం 876.50 అడుగులు కాగా, నీటి నిల్వ 170.6640 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

కల్యాణలక్ష్మి కేసుపై తప్పు ఎవరిదో తేలుస్తామన్న మంత్రి పొన్నం
TG : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. దీనికి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్, కల్యాణలక్ష్మి విషయంలో నాలుగైదు సార్లు అవకాశమిచ్చినా కౌంటర్ ఫైల్ చేయకపోవడంపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. ఇందులో అధికారుల తప్పా లేక న్యాయవాదుల తప్పా అని తేలాక చర్యలు తీసుకుంటామన్నారు.

పాడి రైతులకు అండగా 25 ఏళ్ల సేవలు
TG: హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ మహిళా డెయిరీ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రజతోత్సవ వేడుకలను నిర్వహించారు. 25 ఏళ్ల డెయిరీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అధ్యక్షురాలు బుర్ర ధనశ్రీ, మేనేజర్ భాస్కర్ రెడ్డి, డెయిరీ సిబ్బంది, మహిళా సభ్యులు, పాడి రైతులు పాల్గొన్నారు. భవిష్యత్‌లో పాల సేకరణను విస్తరించడం, డెయిరీని మరింత అభివృద్ధి చేయడం వంటి అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు.

షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి నిధులు వెంటనే విడుదల చేయాలి
TG: పేద కుటుంబాలకు అండగా నిలిచే షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాల నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా నందిపేట్‌లో బీఆర్‌ఎస్ నాయకులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ముచ్చర్ల సాగర్ మాట్లాడుతూ షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాల లబ్ధిదారులకు నిధులు అందకపోవడంతో పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. అర్హులైనవారి ఖాతాలో నిధులు జమ చేయాలని డిమాండ్ చేశారు.

సెలబ్రిటీ ప్రమోషన్స్‌పై FDA యాక్షన్!
విమల్ ఎలాచీ యాడ్ ద్వారా నిషేధిత పాన్ మసాలాను పరోక్షంగా ప్రమోట్ చేస్తున్నారంటూ బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర FDA షోకాజ్ నోటీసులు ఇచ్చింది. వీరికి ఫుడ్ సేఫ్టీ, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్‌ల కింద రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు పెనాల్టీ పడే ఛాన్స్ ఉంది. నటులు నేరుగా రానవసరం లేదు, 15 రోజుల్లోగా వారి లీగల్ టీమ్ ద్వారా రిప్లై ఇవ్వొచ్చు. కమిషనర్ తుకారామ్ ముండే ఈ సెలబ్రిటీ యాడ్స్‌పై ఫుల్ ఫోకస్ పెట్టారు.
శుభ్‌మన్ గిల్ సూపర్ క్యాచ్!
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నారు. కుల్దీప్ బౌలింగ్‌లో శ్రీలంక బ్యాటర్ కమిందు మెండిస్ (14) ముందుకు వచ్చి షాట్ కొట్టగా, గిల్ ఎడమవైపుకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ పట్టుకున్నారు. ఆశ్చర్యపోయిన బ్యాటర్ క్రీజు వదిలి వెళ్లక తప్పలేదు. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక జట్టు లంచ్ సమయానికి 5 వికెట్ల నష్టానికి 99 రన్స్ చేసింది.
ప్రజావాణిలో వినతుల వెల్లువ.. సమస్యలను పరిష్కరించాలి
TG: రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని MPDO కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి 20 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీవో రమేష్ తెలిపారు. వివిధ సమస్యలపై ప్రజలు సమర్పించిన ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు. ఆయా దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని ఆయన సూచించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. విధుల నిర్వహణలో సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు.

సోషల్ మీడియాపై సుప్రీంకోర్టు సీరియస్!
కోర్టులో జడ్జీలు మాట్లాడే మాటలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రచారం చేయడంపై సుప్రీంకోర్టు ఫోకస్ పెట్టింది. తీర్పులపై విమర్శలు ఓకే కానీ, చెప్పని మాటలను క్రియేట్ చేసి ప్రచారం చేస్తే న్యాయ వ్యవస్థ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని అడ్వకేట్ రాజా చౌదరి కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై CJI సూర్యకాంత్ రియాక్ట్ అవుతూ ఈ విషయంలో జడ్జీలు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తోందని చెప్పారు. ఈ సోషల్ మీడియా ఫేక్ ట్రోలింగ్ అంశంపై పూర్తి విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు సిద్ధమైంది.

ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసా ఇవ్వాలని ధర్నా
TG: రాష్ట్రంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల పునరుద్ధరణ కోసం బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు వికారాబాద్‌లో ఆందోళన చేపట్టారు. పథకాలను వెంటనే అమలు చేయాలని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలకు ఆర్థికభరోసా కల్పించేందుకు KCR ప్రభుత్వం ఈ పథకాలను తీసుకొచ్చిందని నాయకులు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అర్హులైన లబ్ధిదారులకు వెంటనే ఆర్థికసాయం అందించాలని అధికారులకు వినతిపత్రం అందజేశారు.

బొత్స వర్సెస్ అచ్చెన్న.. ‘దద్దమ్మ’ పదంతో వేడెక్కిన మండలి
AP: DSC అంశంపై శాసనమండలిలో మంత్రి అచ్చెన్నాయుడు, YSRCP నేత బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం జరిగింది. అచ్చెన్నాయుడు ‘దద్దమ్మ’ అంటూ చేసిన వ్యాఖ్యలపై బొత్స అభ్యంతరం వ్యక్తం చేశారు. “మనిషి పెరిగితే సరిపోదు.. భాష కూడా బాగుండాలి” అని బొత్స అన్నారు. దీనికి అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. చేతగాని వాళ్లను ‘దద్దమ్మ’ అంటారని, అది అన్ పార్లమెంటరీ పదం కాదని తిరిగి సమాధానమిచ్చారు. దీంతో DSC అంశంపై మాటల తూటాలు పేలడంతో ఏపీ శాసనమండలిలో గందరగోళం నెలకొంది.

కొరియన్ నూడుల్స్‌కి మన ఊరి తడ్కా భలే రుచి!
విదేశీ కొరియన్ రామెన్ నూడుల్స్ ఇప్పుడు మన ఇండియన్ టేస్ట్‌తో కొత్తగా తయారవుతున్నాయి. మనవాళ్లు ఈ నూడుల్స్‌లో వెల్లుల్లి చట్నీ, కొత్తిమీర, తడ్కా, మహారాష్ట్ర స్పెషల్ ‘తేచా’ (పచ్చిమిర్చి-వెల్లుల్లి కారం) కలిపి వెరైటీ డిషెస్ ట్రై చేస్తున్నారు. ఉల్లిపాయలు, టమాటోలు, గరం మసాలా, పసుపు వేసి దేనికదే క్రేజీ టేస్ట్‌తో ఈ నూడుల్స్ వండేస్తున్నారు. విదేశీ వంటకమే అయినా మన ఊరి దేశీ మసాలాలు తోడయ్యేసరికి ఫుడీస్ వీటిని చాలా ఇష్టంగా తింటున్నారు.

ఇవాళ విలియం కేరీ జయంతి
భారతదేశంలో ఆధునిక విద్య, పత్రికారంగం, సామాజిక సంస్కరణల విస్తరణలో కీలక పాత్ర పోషించిన విలియం కేరీ జయంతి ఇవాళ. ఆగస్టు 17, 1761 న ఇంగ్లాండ్ లో జన్మించారు. 1793లో భారతదేశానికి వచ్చి శ్రీరాంపుర్ కేంద్రంగా తన సేవలను ప్రారంభించారు. కోల్‌కతాలోని ఫోర్ట్ విలియం కళాశాలలో బెంగాలీ, సంస్కృత లెక్చరర్‌గా పనిచేశారు. 1818లో శ్రీరాంపుర్ కాలేజీని స్థాపించారు. జూన్ 9, 1834న మరణించారు. సతీ సహగమన దురాచార నిర్మూలనలో, బహుభాషా డిక్షనరీల తయారీలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం.