Latest
కొండగట్టు దగ్గర ఘోర ప్రమాదం.. 20 మందికి తీవ్ర గాయాలు!
జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి, అందులో 5 మంది పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. ఇక లారీ డ్రైవర్ క్యాబిన్‌లోనే చిక్కుకుపోగా, లోకల్స్ చాలా కష్టపడి బయటకు తీశారు. గాయపడిన వారిని వెంటనే దగ్గరలోని హాస్పిటల్‌కి తరలించారు.

Gen Zకి పెళ్లిపై ఎందుకు ఇంట్రెస్ట్ తగ్గుతోంది?
“ముందు పెళ్లి.. తర్వాత మిగతావన్నీ” అనే ఆలోచన కంటే.. “ముందు కెరీర్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, మన పీస్” అంటోంది Gen Z! 😌💍 2025లో ఇండియన్ జర్నల్ ఆఫ్ పాజిటివ్ సైకాలజీలో వచ్చిన ఓ స్టడీ.. 100 మంది అవివాహిత మిలీనియల్స్, Gen Z అభిప్రాయాలను పరిశీలించింది. ఇందులో Gen Z సొసైటీ ప్రెజర్ కంటే ఎమోషనల్ రెడీనెస్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తేలింది. అంటే పెళ్లిని పూర్తిగా వద్దనడం కంటే.. ముందు లైఫ్‌లో స్థిరపడాలి, తర్వాత పెళ్లి గురించి ఆలోచించాలి అనే ఆలోచన కనిపిస్తోంది.

ఫోన్‌లోనే పర్ఫెక్ట్ పెట్ ఫోటోస్
పెట్స్‌ని పర్ఫెక్ట్‌గా ఫోటోలు తీయడానికి కొన్ని ఈజీ టిప్స్ ఇక్కడ ఉన్నాయి. ఫోన్ కెమెరా సరిపోతుంది. మంచి లైటింగ్ కోసం సాఫ్ట్‌బాక్స్ వాడితే ఇండోర్ ఫోటోస్ నేచురల్‌గా వస్తాయి. మూవింగ్ పెట్స్ బ్లర్ అవ్వకుండా స్పోర్ట్స్ లేదా బర్స్ట్ మోడ్ వాడండి. బ్లర్ బ్యాక్‌గ్రౌండ్ కోసం f/4-f/5.6 అపెర్చర్ లేదా టెలిఫోటో లెన్స్ బెటర్. నిలబడి కాకుండా పెట్ ఐ లెవెల్‌కి తగ్గి తీస్తే ఫోటోలు క్యూట్‌గా వస్తాయి. టాయ్స్, ట్రీట్స్‌తో అటెన్షన్ గ్రాబ్ చేయవచ్చు. పెట్స్ హ్యాబిట్స్ బట్టి ఫోటోస్ ప్లాన్ చేసుకుంటే గ్రేట్ షాట్స్ వస్తాయి.

యాంగ్జైటీ, స్ట్రెస్‌ని ఎలా కంట్రోల్ చేయాలి?
టిబెటన్ బౌద్ధ గురువు మింగ్యూర్ రిన్‌పోచే సూచనలు: జీవితంలో తుఫాన్లు వచ్చినా ఆకాశం మారదు; కష్టాలు కూడా తాత్కాలికమే. భయపడకుండా శ్వాస, శరీర అనుభూతులపై ఫోకస్ చేయాలి. బౌద్ధంలోని మూడు స్తంభాలు—వ్యూ, మెడిటేషన్, అప్లికేషన్—ప్రాక్టీస్ చేయాలి. చిన్న విషయాలకూ కృతజ్ఞత చెప్పాలి. హ్యాపీనెస్‌ను వెంటాడితే అది మరింత దూరమవుతుంది. కోపాన్ని వెంటనే రియాక్ట్ కాకుండా గమనించాలి. ఇతరులకు సాయం చేస్తే ఐస్‌క్రీమ్ లేదా కాఫీ ఇచ్చే ఆనందం కంటే భిన్నమైన, లోతైన సంతోషం లభిస్తుందని ఆయన చెబుతున్నారు

🤖 AIకి తప్పు సమాచారం నేర్పితే? 🤔
AIకి మనుషుల్లా సొంతంగా నిజం, అబద్ధం తెలుసుకునే సామర్థ్యం ఉండదు. దానికి ఇచ్చే డేటా, మనం అందించే సమాచారం దాని సమాధానాలను ప్రభావితం చేస్తాయి. అందులో కావాలనే తప్పుడు సమాచారాన్ని కలిపితే, AI నేర్చుకునే విధానం దెబ్బతినే అవకాశం ఉంది. దీనినే AI Data Poisoning అంటారు. ఉదాహరణకు, ఒక AIకి శిక్షణ ఇచ్చే డేటాలో తప్పు సమాచారాన్ని పెద్ద మొత్తంలో కలిపితే, అది తర్వాత ఇచ్చే సమాధానాల్లో కూడా తప్పులు రావచ్చు. అందుకే AI ఎంత తెలివిగా మారినా, దానికి అందుతున్న సమాచారం నమ్మదగినదేనా అనేది చాలా ముఖ్యం.
తుంగతుర్తిలో BRS భారీ ర్యాలీ!
కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిలిపివేయడాన్ని నిరసిస్తూ BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పిలుపు మేరకు, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఆదేశాలతో తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. నిరుపేద ఆడబిడ్డలకు భరోసానిచ్చే ఈ పథకాలను వెంటనే కొనసాగించాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారాన్ని కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన శ్రష్టి వర్మ!
డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ రాజకీయాలోకి అడుగుపెట్టారు. సోమవారం హైదరాబాద్‌లోని నాంపల్లి BJP రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ BJP అధ్యక్షుడు రామచందర్ రావు సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. 'ఢీ' షో, 'బిగ్ బాస్' కంటెస్టెంట్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రష్టి వర్మ, ఇటీవల 'పుష్ప-2'లోని 'సూసేకి' వంటి హిట్ సాంగ్స్‌కు కొరియోగ్రఫీ చేశారు. ప్రధాని మోదీ విజన్‌కు ఆకర్షితురాలై BJPలో చేరినట్లు తెలుపగా, యువత రాజకీయాలోకి రావడం శుభపరిణామమని రామచందర్ రావు ఆమెను సాదరంగా ఆహ్వానించారు.

వింత వ్యాధులను కనిపెడుతున్న AI
డాక్టర్లకు అర్థంకాని కష్టమైనా, అరుదైన రోగాలను కనిపెట్టడంలో AI ఎంతగానో సహాయపడుతోంది. డాక్టర్లు గుర్తించలేని వ్యాధుల లక్షణాలు, నివేదికలను AI చాట్‌బాట్‌లు త్వరగా విశ్లేషించి సరైన చికిత్సకు దారి చూపుతున్నాయి. మాయో క్లినిక్‌లో గుండెజబ్బుతో బాధపడుతున్న ఓ రోగికి AI సాయంతోనే అరుదైన వ్యాధిని కచ్చితంగా నిర్ధారించారు. అయితే ఏఐ సహాయకారిగా పనిచేస్తుంది కానీ డాక్టర్ల స్థానాన్ని భర్తీ చేయలేదని, కొన్నిసార్లు తప్పులు కూడా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

కేరళ ఇకపై 'కేరళం'
కేరళ రాష్ట్రం పేరును 'కేరళం'గా మారుస్తూ పార్లమెంట్ ఆమోదించిన బిల్లుకు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లోక్‌సభ, రాజ్యసభలలో ప్యాస్ అయిన 'కేరళ (పేరు మార్పు) బిల్లు-2026'పై రాష్ట్రపతి సంతకం చేయడంతో ఇది చట్టంగా మారింది. మలయాళంలో పిలిచే 'కేరళం' పేరును అఫీషియల్‌గా మార్చాలని కేరళ అసెంబ్లీ కోరడంతో కేంద్రం రాజ్యాంగంలో మార్పులు చేస్తూ ఈ హిస్టారిక్ బిల్లును అమల్లోకి తెచ్చింది.

NTPCలో 135 డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు! 💼
న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) 135 డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో ఎలక్ట్రికల్ 40, మెకానికల్ 55, సీ అండ్ ఐ లో 40 ఖాళీలు ఉన్నాయి. కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ పూర్తి చేసి, ఉద్యోగానుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంపిక విధానం ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. <a href="https://www.ntpc.co.in/">అప్లై</a> చేసుకోవడానికి ఆగస్టు 26 చివరి తేదీ.

రామ్ మందిర్ విరాళాల వివాదం అప్డేట్
అయోధ్య రామ్ టెంపుల్ డొనేషన్స్ దుర్వినియోగం కేసు విచారణపై సుప్రీంకోర్టు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. CJI జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ ఈ కేసులో ప్రస్తుతానికి జోక్యం చేసుకోబోమని, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ఈ ఇన్వెస్టిగేషన్‌ను లాజికల్ కన్‌క్లూజన్‌కు తీసుకువెళ్లాలని స్పష్టం చేసింది. ఒకవేళ SIT పనితీరు సరిగ్గా లేకపోతేనే తాము ఇన్వాల్వ్ అవుతామని హెచ్చరించింది. ఎవరివద్దైనా సూచనలు ఉంటే డైరెక్ట్‌గా సోలిసిటర్ జనరల్ ఆఫీస్‌ను కాంటాక్ట్ చేయవచ్చని తెలిపింది.
జార్ఖండ్‌లో మాస్ ప్రోటెస్ట్ హెచ్చరిక- దేవేంద్ర నాథ్ మహతో
జార్ఖండ్‌లో ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో పర్మనెంట్ రిఫార్మ్స్ కోసం విద్యార్థి నాయకుడు <a href="https://x.com/DevendraNathMa9/status/2089038393963626843?s=20">దేవేంద్ర నాథ్ మహతో</a> చేపట్టిన హంగర్ స్ట్రైక్ 15వ రోజుకు చేరింది. ఆయన హెల్త్ కండిషన్ చాలా క్రిటికల్‌గా మారింది. ప్రభుత్వం తమను చర్చలకు పిలిచిందని, నేడు జరగబోయే టాక్స్‌లో పాజిటివ్ అవుట్‌కమ్ వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ ఈ టాక్స్ సక్సెస్ కాకపోతే విద్యార్థులందరితో కలిసి పెద్ద ఎత్తున మాస్ మూవ్‌మెంట్ స్టార్ట్ చేస్తామని, ఎంత ఫోర్స్ ఉపయోగించినా ఈ నిరసనను ఆపలేరని ఆయన హెచ్చరించారు.

కాసేపట్లో తెలంగాణలో వర్షాలు!🌧️☔
TG : తెలంగాణలోని వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రానున్న 1-2 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. అలాగే సాయంత్రం 6 గంటల వరకు మహబూబాబాద్, ఖమ్మం, యాదాద్రి, భద్రాద్రి, జనగామ, కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లోనూ వర్షాలు పడతాయని చెబుతున్నారు. అయితే చాలా చోట్ల ఎండలు మండిపోతున్నాయని, మబ్బుల జాడ లేదని ప్రజలు అంటున్నారు.
ఆడుకుంటూ ప్రాణాలు కోల్పోయిన 10th స్టూడెంట్!
AP: మన్యం జిల్లా సాలూరు గవర్నమెంట్ హైస్కూల్‌లో తీవ్ర విషాదం జరిగింది. పాఠశాల ఆవరణలోని పాత వాచ్‌మన్ రూమ్ ప్రహరీ వాల్ అకస్మాత్తుగా కూలిపోవడంతో 10వ క్లాస్ స్టూడెంట్ అరుణ్ తేజ (15) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విద్యార్థులు ఆడుకుంటూ ఆ పాత గోడపై కూర్చోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో స్టూడెంట్‌కు తీవ్ర గాయాలు కాగా, వెంటనే ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఈ విషాద ఘటనతో స్కూల్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేగింది.

IOCLలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. అప్లై చేసుకోండి
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి <a href="https://iocl.com/admin/img/UploadedFiles/LatestJobOpening/Files/DetailedAd14082026.pdf">నోటిఫికేషన్</a> విడుదల చేసింది. ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఆగస్ట్ 14 నుంచి సెప్టెంబర్ 3, 2026 సా.5 గం. వరకు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 24న CBT నిర్వహించనున్నారు. ఎంపికలో CBTకి 85%, గ్రూప్ డిస్కషన్/టాస్క్‌కు 5%, పర్సనల్ ఇంటర్వ్యూకు 10% వెయిటేజీ ఉంటుంది. SC/ST/PwBD వారికి ఫీజు Exemption ఉండగా, ఇతరులకు రూ.1,000 + GST ఫీజు ఉంటుంది. అప్లికేషన్ కోసం <a href="https://ibpsreg.ibps.in/iocljun26/">ఇక్కడ Click</a> చేయండి.

BJP నేషనల్ టీమ్‌లో పురందేశ్వరి.. తెలంగాణకు నో ఛాన్స్!
BJP నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీని పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. నేషనల్ వైస్ ప్రెసిడెంట్‌గా 13 మందిని నియమించగా.. ఆ లిస్ట్‌లో APకి చెందిన దగ్గుబాటి పురందేశ్వరి చోటు దక్కించుకున్నారు. నేషనల్ జనరల్ సెక్రటరీగా స్మృతి ఇరానీని నియమించారు. పార్టీ జాయింట్ కోఆర్డినేటర్‌గా విష్ణువర్ధన్‌రెడ్డికి అవకాశం కల్పించారు. తెలంగాణకు నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో చోటు దక్కకపోగా.. నేషనల్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న డీకే అరుణను తప్పించారు.

ఫ్లైట్స్ భోగాపురానికి.. కార్మికులు రోడ్డుపైకి!
AP: విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ఔట్‌సోర్సింగ్ కార్మికులు ఆందోళనకు దిగారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు నేటి నుంచి విమాన సర్వీసులు తరలిపోవడంతో తమ ఉపాధి కోల్పోయామని పోర్టర్లు, శానిటేషన్ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. 20 నుంచి 30 ఏళ్లుగా విశాఖ ఎయిర్‌పోర్టులో పనిచేస్తున్న తమను ఇప్పుడు కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదని కన్నీరు పెట్టుకున్నారు. ఎయిర్ పోర్టు మూసివేతతో రోడ్డున పడ్డ తమకు ప్రభుత్వమే ఉపాధి కల్పించి ఆదుకోవాలని కార్మికులు కోరారు.

ఈ ఉద్యోగం కంటే చావే మేలు
TG : పక్షవాతంతో, యూరినల్ బ్యాగ్‌తో రోజూ పనికి వెళ్తున్న సింగరేణి కార్మికుడు రామ్ నివాస్ చాలా బాధపడుతున్నారు. పనివేళల్లో మలవిసర్జన వస్తే కుటుంబసభ్యులు వచ్చి తీసుకెళ్లే వరకు నరకం అనుభవిస్తున్నానని, ఈ నరకం కంటే చావే మేలని కన్నీరు పెట్టుకున్నారు. ఆయనకు తక్షణమే రీ-మెడికల్ పరీక్షలు నిర్వహించి, మెడికల్ ఇన్వాలిడేషన్ కింద కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం ఇవ్వాలని, యాజమాన్యం మానవత్వంతో స్పందించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

పక్షవాతం వచ్చినా డ్యూటీకి రావాలా?
TG : కొత్తగూడెం ఏరియాకి చెందిన రామ్ నివాస్ అనే కార్మికుడు తీవ్రమైన పక్షవాతం, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఎడమ చేయి, కాలు పనిచేయక యూరినల్ బ్యాగ్ సహాయంతో జీవిస్తున్న అతనికి మెడికల్ బోర్డు డ్యూటీ కేటాయించింది. కనీసం నడవలేని, సొంతంగా పనులు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నా ఆయనను ‘ఫిట్ ఫర్ సర్ఫేస్ డ్యూటీ’ అని తెలిపింది. దీంతో ఆయన రుద్రంపూర్ డిస్పెన్సరీలో విధులు కేటాయించడంలో ఇబ్బందులు పడుతుండగా, ఈ నిర్ణయంపై ఇతర కార్మికులు మండిపడుతున్నారు.

షాప్ బోర్డు పెడుతుండగా షాకింగ్ ఘటన
TG: హైదరాబాద్ బాలానగర్‌లో షాప్ బోర్డు ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ తీగలు తగలడంతో సంజు చౌదరి(26) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. బాలానగర్ PS పరిధిలోని గురుకృప ప్లైవుడ్ అండ్ హార్డ్‌వేర్ షాప్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. బోర్డు ఏర్పాటు చేస్తుండగా పైనున్న కరెంట్ వైర్లు సంజు చౌదరికి తగలడంతో షాక్ వచ్చింది. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

IT ఆఫీసులో ఒక్కసారిగా మంటలు.. 12 ఫైర్ ఇంజిన్లు!
ముంబైలోని చర్చ్‌గేట్ ప్రాంతంలో ఉన్న ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీస్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భవనం నుంచి పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగ ఎగసిపడటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి 12 ఫైర్ ఇంజిన్లను వాడుతున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు, ప్రాణ, ఆస్తి నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.