Latest

మైసూరు దసరా.. రాజసం అదుర్స్
Current Affairs· 1d ago

మైసూరు దసరా.. రాజసం అదుర్స్

కర్ణాటక సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మైసూరు దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 11 నుంచి 21 వరకు నిర్వహించే ఈ వేడుకలు అందరినీ.. ఆకట్టుకుంటున్నాయి. వేలాది విద్యుద్దీపాలతో మెరిసే మైసూరు రాజభవనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దసరా రోజున జరిగే జంబూ సవారీ ఈ ఉత్సవాల్లో ప్రధానం. అలంకరించిన ఏనుగుపై బంగారు అంబారీని ఉంచి, అందులో చాముండేశ్వరి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగిస్తారు. ఇక్కడ ఏనుగులు, గుర్రాలు, జానపద ప్రదర్శనలతో పాటు బన్నిమంటప్‌ టార్చ్‌లైట్‌ పరేడ్‌ అందరిని ఆకట్టుకుంటుంది.

జాతీయ అథ్లెటిక్స్‌లో సూర్యాపేట విద్యార్థిని సత్తా
Local· 1d ago

జాతీయ అథ్లెటిక్స్‌లో సూర్యాపేట విద్యార్థిని సత్తా

పంజాబ్ రాష్ట్రం పాటియాలాలోని సుశీలాదేవి పబ్లిక్ స్కూల్‌లో అక్టోబర్ 15 నుంచి 20 వరకు జరుగుతున్న జాతీయ నేషనల్ BCSE అథ్లెటిక్ మీట్–2026లో సూర్యాపేటకు చెందిన బి. సాత్విక సత్తా చాటింది. అండర్-14 బాలికల 600 మీటర్ల పరుగు పందెంలో మొదటి స్థానం సాధించి గోల్డ్ మెడల్ గెలుచుకుంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని MSR Central Schoolలో 6వ తరగతి చదువుతున్న సాత్విక సాధించిన విజయంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.

జెడ్పీటీసీ బరిలో మెట్టుకూరి శిరీషారెడ్డి
Local· 1d ago

జెడ్పీటీసీ బరిలో మెట్టుకూరి శిరీషారెడ్డి

నెల్లూరు జిల్లా కలిగిరి మండల టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా మాజీ ఎంపీపీ మెట్టుకూరి శిరీషారెడ్డిని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఖరారు చేశారు. మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుకూరి చిరంజీవిరెడ్డి సతీమణి అయిన శిరీషారెడ్డి ఎంపికపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కలిగిరి మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, మెట్టుకూరి నాయకత్వంలో 12 ఎంపీటీసీ స్థానాలతో పాటు జెడ్పీటీసీ స్థానాన్ని గెలుచుకుని పార్టీకి కానుకగా అందిస్తామని హామీ ఇచ్చారు.

పూర్వ విద్యార్థుల విజయాలకు ప్రత్యేక గుర్తింపు
Local· 1d ago

పూర్వ విద్యార్థుల విజయాలకు ప్రత్యేక గుర్తింపు

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడు గ్రామంలో భీమిరెడ్డి పుల్లారెడ్డి అధ్యక్షతన ‘జయహో మర్లపాడు’ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సింగరేణి జీఎం వెంకటాచారి, తహసీల్దార్ మాణికరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వివిధ రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకున్న 25 మంది పూర్వ విద్యార్థులను సన్మానించారు. గ్రామ అభివృద్ధికి భీమిరెడ్డి పుల్లారెడ్డి చేసిన సేవలను పలువురు కొనియాడారు. మర్లపాడు గ్రామ చరిత్ర, పాఠశాల ఘనతను వివరించారు.

44 వార్డులూ మనవే : జయనాగేశ్వర రెడ్డి
Local· 1d ago

44 వార్డులూ మనవే : జయనాగేశ్వర రెడ్డి

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ TDP చైర్మన్ క్యాండిడేట్ మాచాని సునీత నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి పాల్గొన్నారు. రెండేళ్ల కూటమి పాలనలో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సమస్యలను పరిష్కరించామని చెప్పారు. ఈ అభివృద్ధిని చూసి తట్టుకోలేకే YCP గొడవలు చేస్తోందని, ప్రజలు విధ్వంసకర పార్టీలను పక్కన పెట్టాలని పిలుపునిచ్చారు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పనిచేసి 44 వార్డులూ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

చిత్తూరులో నామినేషన్ల జోరు
Local· 1d ago

చిత్తూరులో నామినేషన్ల జోరు

చిత్తూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో నామినేషన్ల జోరు కొనసాగింది. మేయర్ పదవి, 60 వార్డులకు మొత్తం 620 నామినేషన్లు దాఖలయ్యాయి. మేయర్ పదవికి 14, వార్డు సభ్యుల స్థానాలకు 606 నామినేషన్లు వచ్చాయి. మేయర్ పదవికి టీడీపీ నుంచి 6, వైఎస్సార్‌సీపీ నుంచి 3, కాంగ్రెస్ నుంచి 1, స్వతంత్రుల నుంచి 4 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డులకు టీడీపీ 271, వైఎస్సార్‌సీపీ 177, జనసేన 37, బీజేపీ 19, ఇతర పార్టీలు, స్వతంత్రుల నుంచి 102 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

చిత్తూరులో ఎన్నికల సన్నద్ధతపై అధికారుల సమీక్ష▶
Local· 1d ago

చిత్తూరులో ఎన్నికల సన్నద్ధతపై అధికారుల సమీక్ష

చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అబ్జర్వర్ ఎల్. శివ శంకర్ సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడి, జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్‌తో పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన అంశాలపై సమీక్ష కొనసాగింది.

నేలకొండపల్లి మండలంలో సద్దుల బతుకమ్మ వేడుకలు▶
Local· 1d ago

నేలకొండపల్లి మండలంలో సద్దుల బతుకమ్మ వేడుకలు

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని కొత్తకొత్తూరు, తిరుమలాపురం, బోడులబండ గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా ముగిశాయి. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, గౌరమ్మకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ బతుకమ్మల చుట్టూ తిరిగి ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నారు. మహిళల ఆటపాటలతో ఆయా గ్రామాల్లో పండుగ సందడి నెలకొంది. గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది.

మున్సిపల్ పోరుకు భారీగా నామినేషన్లు▶
Local· 1d ago

మున్సిపల్ పోరుకు భారీగా నామినేషన్లు

చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపల్ ఎన్నికలు–2026లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మూడో రోజు 85 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 36 వార్డులకు ఇప్పటివరకు 150 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. చైర్‌పర్సన్ పదవికి 7 నామినేషన్లు వచ్చాయి. వార్డుల అభ్యర్థుల్లో టీడీపీ నుంచి 69, వైఎస్సార్‌సీపీ నుంచి 62, బీజేపీ నుంచి 3, జనసేన నుంచి 6, స్వతంత్రులు 6, ఇతరులు 4 నామినేషన్లు దాఖలు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ లోకేష్ వర్మ వెల్లడించారు.

MPTC, ZPTC ఎలక్షన్ల షెడ్యూల్
Local· 1d ago

MPTC, ZPTC ఎలక్షన్ల షెడ్యూల్

విశాఖ జిల్లాలో MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ ఇవాళ రానుంది. ఆనందపురం, భీమిలి, పెందుర్తి, పద్మనాభం మండలాల్లో 4 జడ్పీటీసీ, 53 ఎంపీటీసీ స్థానాలకు ఈనెల 21 నుంచి నామినేషన్లు తీసుకుంటారు. జడ్పీ కార్యాలయంలో ZPTCలకు, మండల ఆఫీసుల్లో MPTCలకు నామినేషన్ల ఏర్పాట్లు చేశారు. పోలింగ్ వచ్చే నెల 3న ఉంటుంది. రిటర్నింగ్ ఆఫీసర్‌గా జడ్పీ CEO నారాయణమూర్తి వ్యవహరిస్తారు.

బతుకమ్మ వేడుకల్లో మంత్రి పొన్నం, ఎమ్మెల్యే గంగుల
Local· 1d ago

బతుకమ్మ వేడుకల్లో మంత్రి పొన్నం, ఎమ్మెల్యే గంగుల

కరీంనగర్‌లోని ఫెడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తదితరులు బతుకమ్మను ఎత్తుకుని మహిళలతో కలిసి ఆటపాటల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీక అని, ప్రకృతిని పూజించే గొప్ప పండుగ అని మంత్రి తెలిపారు.

దుబ్బ రాజీవ్ నగర్‌లో బతుకమ్మ వేడుకలు
Local· 1d ago

దుబ్బ రాజీవ్ నగర్‌లో బతుకమ్మ వేడుకలు

నిజామాబాద్ నగరంలోని దుబ్బ రాజీవ్ నగర్ కాలనీ 17వ డివిజన్‌లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. సమాచార హక్కు మహిళా అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా సాగిన ఈ వేడుకలతో కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది.

ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
Local· 1d ago

ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆదివారం రాత్రి సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. పెద్ద సంఖ్యలో మహిళలు బతుకమ్మలతో ఆటపాటలు ఆడుతూ సందడి చేశారు. కర్బల మైదాన్, నెక్లెస్ రోడ్‌లో జరిగిన వేడుకల్లో సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అడ్డగుట్ట పహాడీ హనుమాన్ దేవాలయం వద్ద జరిగిన వేడుకల్లో సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు పాల్గొన్నారు. అనంతరం హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేశారు.

టైగర్ ష్రాఫ్ ఘటన.. ఎవరినీ వదలం: షిండే
Crime· 1d ago

టైగర్ ష్రాఫ్ ఘటన.. ఎవరినీ వదలం: షిండే

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటన చోటుచేసుకోవడంతో నగర భద్రతపై చర్చ మొదలైంది. ఈ ఘటనపై మహారాష్ట్ర డిప్యూటీ CM ఏకనాధ్ షిండే స్పందిస్తూ.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు ముంబైని సురక్షిత నగరంగా చెబుతున్న టైంలో ఇలాంటి ఘటనలు ఎలా జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. నగరంలో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రభుత్వాన్ని నిలదీశాయి. ఈ ఘటనతో ప్రముఖుల నివాసాల వద్ద భద్రతా ఏర్పాట్లపై కూడా చర్చ జరుగుతోంది.

నామినేషన్స్ వేళ ఊహించని ట్విస్టులు!
Local· 1d ago

నామినేషన్స్ వేళ ఊహించని ట్విస్టులు!

మార్కాపురం జిల్లాలోని దర్శి, గిద్దలూరు మున్సిపాలిటీల్లో నామినేషన్ల వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. దర్శిలో పోలీసులు, వైసీపీ శ్రేణుల మధ్య గొడవ జరగడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. అక్కడ వైసీపీ అభ్యర్థి నామినేషన్ కూడా వేయలేకపోయారు. ఇక గిద్దలూరులో బీజేపీకి సీటు కేటాయిస్తే, ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి సోదరుడితో పాటు మరో టీడీపీ నేత పోటీకి దిగి నామినేషన్లు వేశారు. అయినా కూడా ఎమ్మెల్యే మాత్రం బీజేపీ క్యాండిడేట్ నామినేషన్‌కే అటెండ్ అవ్వడం విశేషం.

కాకరవాయిలో కనులపండువగా సద్దుల బతుకమ్మ
Local· 1d ago

కాకరవాయిలో కనులపండువగా సద్దుల బతుకమ్మ

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామంలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ గూడూరు ఉపేందర్, పాలకవర్గం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ ఆటపాటలు, కోలాటాలతో సందడి చేశారు. బతుకమ్మ పాటలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పూల పండుగను గ్రామస్తులంతా ఐక్యంగా జరుపుకున్నారు. ఆడపడుచుల ఆనందోత్సాహాల మధ్య వేడుకలు కనులపండువగా సాగాయి.

పెద్దమ్మతల్లి ఆలయంలో భక్తిశ్రద్ధలతో దీపారాధన
Local· 1d ago

పెద్దమ్మతల్లి ఆలయంలో భక్తిశ్రద్ధలతో దీపారాధన

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయంలో దీపారాధన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని గ్రామంలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, గ్రామ పెద్దలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ వేడుకలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

మందమర్రిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Local· 1d ago

మందమర్రిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

మంచిర్యాల జిల్లా మందమర్రిలో సద్దుల బతుకమ్మ వేడుకలను మహిళలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. 11వ వార్డు మూడవ జోన్ ఏరియాలో మహిళలంతా రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి, సంప్రదాయ పాటలు పాడుతూ సంబరాల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ప్రకృతి ఆరాధనతో పాటు మహిళల ఐక్యతను చాటిచెబుతుందని పేర్కొన్నారు. భావితరాలకు తెలంగాణ సంప్రదాయాలను అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు.

తెలంగాణ భవన్‌లో సద్దుల బతుకమ్మ సంబరాలు
Local· 1d ago

తెలంగాణ భవన్‌లో సద్దుల బతుకమ్మ సంబరాలు

ఖమ్మం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి కుటుంబసమేతంగా హాజరయ్యారు. ఆయన సతీమణి విజయమ్మ, కుమార్తె దీప్తితో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అగ్రశ్రేణి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆదివాసీ హక్కుల కోసం పోరాడుతా: పోడియం రామకృష్ణ
Local· 1d ago

ఆదివాసీ హక్కుల కోసం పోరాడుతా: పోడియం రామకృష్ణ

పోలవరం జిల్లా చింతూరు మండలం చట్టి ఎంపీటీసీ ఎన్నికల్లో ఆదివాసీ హక్కులు, గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతానని అభ్యర్థి పోడియం రామకృష్ణ తెలిపారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ మద్దతు ప్రకటించింది. చట్టి ఎంపీటీసీ పరిధిలో విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్య సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు. గిరిజనుల భూమి హక్కుల పరిరక్షణ, 1/70, పీసా చట్టాల అమలు, అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు.

గ్లోబల్ టెర్రరిస్ట్ మృతి.. మసీదు మెట్లపై నుంచి జారిపడి!
International· 1d ago

గ్లోబల్ టెర్రరిస్ట్ మృతి.. మసీదు మెట్లపై నుంచి జారిపడి!

పాకిస్థాన్‌లోని లాహోర్‌లో లష్కరే తోయిబా (LeT) ఫౌండింగ్ మెంబర్ చౌదరి మహమ్మద్ సర్వార్ అలియాస్ అబూ హషీమ్ చనిపోయాడు. మసీదు మెట్లు ఎక్కుతుండగా జారి పడటంతో తలకు గాయాలై చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఆ సంస్థ ఫైనాన్స్ విభాగంలో కీలకంగా పనిచేసిన సర్వార్, భారత్‌పై దాడులకు పాల్పడే లష్కరే కార్యకలాపాలకు డబ్బులు సమకూర్చడంలో పాత్ర పోషించాడు. 2008లో వ్యాపారుల నుంచి విరాళాలు సేకరించే టీమ్‌లకు నాయకత్వం వహించినట్లు అమెరికా ట్రెజరీ శాఖ తెలిపింది.