Latest

దాచేపల్లిలో పవన్ బర్త్డే సందడి!
పల్నాడు జిల్లా దాచేపల్లిలో జనసేన శ్రేణులు ఉత్సాహంగా పవన్ కళ్యాణ్ బర్త్డే జరుపుకున్నారు. నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని కేక్ కట్ చేశారు. బంగ్లా సెంటర్, జమ్మిశెట్టి సెంటర్, మునగ బజార్, లైబ్రరీ సెంటర్.. ఇలా అన్ని ప్రాంతాల్లో వేడుకలు జరిగాయి. డీజే శబ్దాలు, బాణాసంచా సందడి మధ్య ర్యాలీలు నిర్వహించారు. పవన్ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు.

గద్వాల పోలీస్ అసోసియేషన్.. నూతన కార్యవర్గం ఎన్నిక!
జోగులాంబ గద్వాల జిల్లా పోలీస్ అసోసియేషన్ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంది. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పోలీస్ కార్యాలయంలో జరిగాయి. జిల్లా ఎస్పీ టి.శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఈ ప్రక్రియ సక్రమంగా పూర్తయింది. అధ్యక్షుడిగా బి.రఘుపతి నాయుడు, కార్యదర్శిగా టి.శేఖర్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా వి.ప్రదీప్, బి.చంద్రకాంత్, జాయింట్ సెక్రటరీగా ఎ.వై.ప్రసాద్, ట్రెజరర్‌గా శివకుమార్ ఎన్నికయ్యారు. ఆర్గనైజింగ్ సెక్రటరీగా బి.భీమేష్, సభ్యులుగా యమ్మన్న, హనుమంతు, దివ్యవాణి, నాగమణి, గజేంద్ర, అంజనేయులు ఎన్నికయ్యారు.

కొబ్బరే కల్పవృక్షం.. కొత్తపేటలో అవగాహన!
కోనసీమ జిల్లా కొత్తపేటలో ఓ ఆసక్తికరమైన ఈవెంట్ జరిగింది. అంతర్జాతీయ కొబ్బరి దినోత్సవాన్ని వేమన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ కె.పి.రాజు మాట్లాడుతూ.. కొబ్బరి చెట్టును భూలోక కల్పవృక్షంగా అభివర్ణించారు. ’’ఏడాదికి ఎన్ని రోజులో.. అన్ని ప్రయోజనాలూ ఇందులో ఉన్నాయి. ఆహారం, ఆయుర్వేదం.. ఎక్కడ చూసినా కొబ్బరిదే సత్తా. నూనెలో ఔషధ గుణాలు.. కొబ్బరిలో వ్యర్థం అంటూ ఏదీ లేద’’ని ఆయన అన్నారు.. ఈ సందర్భంగా అధ్యాపకులు టి.రమాదేవి, జి.శ్రీనివాసులు, బి.విజయకుమార్, హేమలత పాల్గొన్నారు.

1000 రోజుల కాంగ్రెస్.. గద్వాలలో బీఆర్ఎస్ ధర్నా!
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ భారీ నిరసన చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో విఫలమైందని ఆరోపిస్తూ.. పార్టీ ఇన్‌చార్జి బాసు హనుమంతు నాయుడు ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. కృష్ణారెడ్డి బంగ్లా నుంచి మొదలైన ఈ ర్యాలీ.. 420 అడుగుల ఫ్లెక్సీతో కృష్ణవేణి చౌక్ వరకు సాగింది. కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేస్తూ ధర్నా చేశారు. కాంగ్రెస్ హామీలన్నీ అబద్ధాల పూత అని నిరసన తెలిపారు.

డ్రాయింగ్ పోటీ.. నిర్మల్లో క్రమశిక్షణ పిలుపు!
నిర్మల్ జిల్లా నర్సాపూర్‌లో డ్రాయింగ్ పోటీల సందడి! ఏకలవ్య ఫౌండేషన్, స్వప్న హాస్పిటల్ సౌజన్యంతో జెడ్పీహెస్ పాఠశాలలో ఈ ఈవెంట్ నిర్వహించారు. హెచ్ఎం రవీంద్ర కుమార్, ఫౌండేషన్ జిల్లా బాధ్యులు దిగంబరు స్టూడెంట్స్‌కి క్రమశిక్షణపై క్లాస్ ఇచ్చారు. విజేతలకు బహుమతులు కూడా అందించారు. భూమేశ్వరు, చైతన్య, ఎస్ఓ వీణ, చిన్నయ్య స్టాఫ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీ స్కూల్‌లో ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయా? జరుగుతున్నాయా? మాకు ఫొటో, వీడియో, వార్త పంపండి. మన ఈ యాప్ ద్వారా అందరికీ చెబుదాం.

SIRపై నిరసన.. ప్రకాశ్ రాజ్ అదుపులోకి!
బెంగళూరులో నటుడు ప్రకాశ్ రాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓటర్ల జాబితాలో జరుగుతున్న SIR ప్రక్రియకు వ్యతిరేకంగా ఫ్రీడమ్ పార్క్ నుంచి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం వరకు ‘ఎలక్షన్ కమిషన్ చలో’ పేరుతో మార్చ్ చేపట్టారు. ఈ నిరసనలో ప్రకాశ్ రాజ్‌తో పాటు నటుడు కిషోర్, పలు పౌర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. SIRలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రక్రియను రద్దు చేయాలని, ఓటర్ల జాబితాపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు

మల్లేశ్వరస్వామి చోరీ కేసు సాల్వ్!
గుంటూరు జిల్లా పెదకాకాని మల్లేశ్వరస్వామి ఆలయంలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. బంగారు ఆభరణాలు దొంగిలించిన నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆయన వద్ద నుంచి 68 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అందులో 50 గ్రాముల నాగాభరణం, రెండు మంగళసూత్రాలు, బంగారు గుత్తి ఉన్నాయి. క్రైం నంబర్ 448/2026 కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన సిబ్బందిని అధికారులు అభినందించారు.
వైఎస్ సేవలకు.. నందిపేట నివాళి!
నిజామాబాద్ జిల్లా నందిపేటలో వైఎస్ వర్ధంతి ఘనంగా జరిగింది. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దూడ వెంకటేష్ వైెఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. వైఎస్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ’’ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్మెంట్, ఇందిరమ్మ ఇళ్లు.. ఇవన్నీ పేదల కోసమే! లక్షలాది కుటుంబాల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయి. ఇంతటి సంక్షేమ పథకాలు అమలు చేసిన మహానేతను మర్చిపోవడం సాధ్యమా? వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉంద’’ని అన్నారు.

రాహుల్ కేసుపై మణుగూరులో యూత్ కాంగ్రెస్ భారీ నిరసన!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు హెడ్‌క్వార్టర్స్‌లో యూత్ కాంగ్రెస్ భారీ నిరసన ర్యాలీ చేసింది. చీకటి కార్తీక్ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన నిర్వహించారు. హల్ద్వానీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ వేదికను బీజేపీ మతోన్మాదులు గంగాజలంతో "శుద్ధీకరణ" చేశారు. రాహుల్ గాంధీ దాన్ని దళితుల అవమానంగా ఖండించారు. ఆందోళనగా ఆయనపై రివర్స్ కేసు పెట్టడం జరిగింది! దీన్ని నిరసిస్తూ యువజన కాంగ్రెస్ అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేసింది. "రాహుల్ పై కేసులు రద్దు చేయాలి" అని డిమాండ్ చేశారు.

కుల వివక్షపై రాష్ట్రపతికి మల్లు రవి లేఖ!
నాగర్కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కీలక లేఖ రాశారు. కుల వివక్ష, అంటరానితనం వంటి రాజ్యాంగ విరుద్ధ చర్యలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పర్యటన అనంతరం ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో జరిగిన “శుద్ధీకరణ” ఘటనపై స్పందించారు. ఆ ఘటనపై రాజ్యాంగపరమైన జోక్యం చేసుకోవాలని, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. సెప్టెంబర్ 8న రాష్ట్రపతిని కలిసేందుకు అపాయింట్‌మెంట్ కూడా కోరారు.

సైబర్ మోసాలపై మంచిర్యాలలో అవగాహన!
మంచిర్యాల జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో సైబర్ మోసాలపై ప్రత్యేక సెషన్ జరిగింది. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాల నేపథ్యంలో డీసీపీ ఎ. భాస్కర్ మాట్లాడారు. తెలియని లింకులపై క్లిక్ చేయొద్దని, ఓటీపీ, పిన్, పాస్వర్డ్ ఎవరికీ చెప్పొద్దని హెచ్చరించారు. ఆన్‌లైన్ విరాళాలు, నకిలీ లింకులు, ఫేక్ ఖాతాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. మోసం జరిగితే వెంటనే 1930కి ఫోన్ చేయాలని చెప్పారు.

నందన్ గ్రామసభలో 313 పనుల ప్లాన్ రివీల్!
నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండలం నందన్ గ్రామంలో భారీ గ్రామసభ జరిగింది. సర్పంచ్ కున హేమలత మహేష్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. పంచాయతీ సెక్రెటరీ వెంకటేష్, టీఏ రవీందర్, ఎఫ్ఏ భూమేష్ పాల్గొన్నారు. "వీబీజీ రామ్జీ" పథకంలో భాగంగా రాబోయే మూడేళ్ల అభివృద్ధి ప్రణాళికను ప్రజలకు వివరించారు. మొత్తం 313 పనుల జాబితాను గ్రామస్తుల సమక్షంలో చదివి వినిపించారు. మీ గ్రామంలో కూడా ఇలాంటి గ్రామసభలు జరుగుతున్నాయా? వాటిని వార్తలుగా పంపండి. ఫొటో కూడా జత చేయండి.

జంతువుల ఆహారం.. బాంబుగా ఎలా?
పంటలను అడవి జంతువుల నుంచి కాపాడుకోవడానికి పెట్టిన ఆహారమే.. వాటికి ప్రాణాంతక ఉచ్చుగా మారుతోంది. ‘బైట్ బాంబ్స్’గా పిలిచే ఈ ఉచ్చుల్లో పేలుడు పదార్థాన్ని ఆహారం లేదా పండులో దాచిపెడతారు. జంతువు దాన్ని సాధారణ ఆహారమని భావించి కొరికిన వెంటనే నోట్లో పేలుడు జరిగి దవడ, నాలుక తీవ్రంగా దెబ్బతింటాయి. దీంతో తినలేక ఆకలితో లేదా ఇన్ఫెక్షన్‌తో చనిపోయే ప్రమాదం ఉంటుంది. అడవి పందులను లక్ష్యంగా పెట్టిన ఈ ఉచ్చులకు ఏనుగులు, ఎద్దులు వంటి ఇతర జంతువులు కూడా బలవుతున్నాయి. ఒడిశాలో ఇటీవల ఇలాంటి ఉచ్చు ఓ ఎద్దు మృతికి కారణమైంది.

జైలు శిక్ష.. డ్రంక్ అండ్ డ్రైవ్కు భద్రాద్రిలో షాక్!
భద్రాద్రి కొత్తగూడెంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌కు కఠిన శిక్ష పడింది. ట్రాఫిక్ పోలీసులు తనిఖీల్లో ఇద్దరు మద్యం సేవించి వాహనాలు నడిపారు. వారిపై కేసులు నమోదు చేశారు. 2వ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ న్యాయమూర్తి రవికుమార్ విచారణ చేశారు. నిందితులకు రెండు రోజుల జైలు శిక్ష విధించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్హెచ్ఓ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ’’మద్యం తాగి డ్రైవ్ చేస్తే ప్రాణాపాయ ప్రమాదాలు తప్పవు. ఇలాంటి వాళ్లను ఉపేక్షించేది లేదు. తనిఖీలు మరింత విస్తృతం చేస్తామ’’న్నారు.

నల్లబెల్లిలో పోచమ్మ బోనాల సందడి!
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో పోచమ్మ తల్లి బోనాల పండుగ ఘనంగా జరిగింది. గ్రామ ప్రజలంతా భక్తి శ్రద్ధలతో బోనాలు సిద్ధం చేసి, ఆలయానికి పెద్ద సంఖ్యలో వచ్చారు. బోనాలతో గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

వైఎస్ జ్ఞాపకాలు.. మందమర్రిలో ఘన నివాళి!
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని 11వ వార్డులో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి ఘనంగా నిర్వహించారు. సొసైటీ ఉపాధ్యక్షుడు సుద్దాల ప్రభుదేవ్, జిల్లా అధ్యక్షుడు నంది పాట రాజుకుమార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్ చేసిన సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ.. ’’పావలా వడ్డీ రుణాలు, రైతులకు ఉచిత విద్యుత్ కూడా ఆయనే తీసుకొచ్చారు. నాయకులు వస్తారు.. పోతారు.. కానీ వైఎస్ జ్ఞాపకాలు మాత్రం శాశ్వతం!’’ అని ఆయన అన్నారు.

గురుకులంలో 16 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య!
రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్‌లోని గురుకుల కళాశాలలో విషాదం చోటుచేసుకుంది. అక్కడి వసతి గృహంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న 16 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. తన చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఆ బాలిక ఉమ్మడి పాలమూరు జిల్లా జడ్చర్ల మండలం చింతపల్లి గ్రామానికి చెందినది. ఆమె మరణానికి ఖచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. ఇంత చిన్న వయసులో ఇలా ఎందుకు జరిగింది? ఇది మానసిక ఒత్తిడా.. లేక వేరే కారణమా? అనే కోణాల్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.

ఎల్నినో.. గుంటూరులో నిమ్మ రైతులకు అవగాహన!
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో ప్రత్యేక సదస్సు జరిగింది. ఎల్నినో కారణంగా వాతావరణ మార్పులపై నిమ్మ రైతులకు అవగాహన కల్పించారు. ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. నిమ్మకు ఆశించే ఎర్రనల్లి, ఎండితెగులు, బంకతెగుల నివారణ చర్యలు వివరించారు. శాస్త్రవేత్త డాక్టర్ అనిల్, తెనాలి అధికారి యు.శ్రీనిత్య హాజరయ్యారు. ‘‘వ్యాధులు అంతుచిక్కకపోతే పంటే పూర్తిగా దెబ్బతింటుంది కదా! రైతులు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి అవగాహన సదస్సులకు హాజరు కావాల’’ని వారు చెప్పారు.

కాంగ్రెస్ పాలన శాపం.. ఎంపీ వద్దిరాజు
భద్రాద్రి కొత్తగూడెంలో బీఆర్ఎస్ భారీ నిరసన ప్రదర్శన చేసింది. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 420 మీటర్ల బ్యానర్, మానవహారంతో ఆందోళన వ్యక్తం చేశారు. రూ.49 వేల కోట్ల రుణమాఫీకి బదులు రూ.18 వేల కోట్లే చేశారని మండిపడ్డారు. రైతుబంధు, రైతుబీమాను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలను దగా చేసిందన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కుట్రపన్నుతున్నాయని ఎద్దేవా చేశారు.

భూముల రీసర్వే.. 108 గ్రామాల్లో హడావిడి!
రంగారెడ్డి జిల్లాలో భూముల సర్వే పనులు ముమ్మరం. అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి తహసిల్దార్లకు క్లియర్ ఆర్డర్ ఇచ్చారు. షాద్‌నగర్ ఆర్డీవో కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలో 611 గ్రామాలకు గాను 108 గ్రామాల్లో సర్వే కొనసాగుతోంది. భూభారతి, 22ఏ విషయాల్లో బ్రోకర్లను నమ్మొద్దని రైతులకు హెచ్చరించారు. రెవెన్యూ అధికారుల సలహా తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీవో సరిత పాల్గొన్నారు.

136B డాలర్లు.. రూపాయికి అండగా ఎలా?
విదేశీ కరెన్సీ భారీగా రావడంతో రూపాయికి ఇప్పుడు కొంత ఊరట లభిస్తోంది. ఆగస్టు 31 నాటికి RBI ప్రత్యేక స్వాప్ సదుపాయం ద్వారా 136.38 బిలియన్ డాలర్ల విదేశీ నిధులు వచ్చాయి. ఇందులో 127.23 బిలియన్ డాలర్లు NRIల డిపాజిట్ల నుంచే వచ్చాయి. బ్యాంకులు ఈ డాలర్లను RBIతో స్వాప్ చేసుకోవడంతో కేంద్ర బ్యాంకు చేతిలో విదేశీ కరెన్సీ పెరుగుతుంది. అవసరమైనప్పుడు RBI మార్కెట్‌లో డాలర్లు అమ్మి రూపాయిపై ఒత్తిడిని తగ్గించగలదు. అంటే ఈ నిధులు రూపాయిని ఒక్కసారిగా బలపరచవు.. కానీ అది మరింత పడిపోకుండా RBIకి బలమైన అండగా నిలుస్తాయి.