మైసూరు దసరా.. రాజసం అదుర్స్

కర్ణాటక సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మైసూరు దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 11 నుంచి 21 వరకు నిర్వహించే ఈ వేడుకలు అందరినీ.. ఆకట్టుకుంటున్నాయి. వేలాది విద్యుద్దీపాలతో మెరిసే మైసూరు రాజభవనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దసరా రోజున జరిగే జంబూ సవారీ ఈ ఉత్సవాల్లో ప్రధానం. అలంకరించిన ఏనుగుపై బంగారు అంబారీని ఉంచి, అందులో చాముండేశ్వరి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగిస్తారు. ఇక్కడ ఏనుగులు, గుర్రాలు, జానపద ప్రదర్శనలతో పాటు బన్నిమంటప్ టార్చ్‌లైట్ పరేడ్ అందరిని ఆకట్టుకుంటుంది.


